మహిళ సాధికారత లక్ష్యమే స్వస్త్ నారి స్వశక్త్ పరివార్ అభియాన్
* ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
చేవెళ్ల, నేటిధాత్రి :
ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ పుట్టిన రోజునుపురస్కరించుకొని ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు మెరుగైన ఆరోగ్య సంరక్షణ సేవల ద్వారా మహిళలు, పిల్లలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం స్వస్త్ నారి సశక్త్ పరివార్ అభియాన్ అనే కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రారంభించిందని చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని చేవెళ్ల పట్టణ కేంద్రంలో బుధవారం కేజీఆర్ కన్వెన్షన్ హాల్ లో మెగా రక్తదాన, ఉచిత వైద్య శిబిరం కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ అవకాశాన్ని మహిళలు, చిన్నపిల్లల కు డయాబెటిస్, డెంటల్, కలరా, సాదరణ ఆరోగ్య వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. 74 మంది యువత రక్తదానం చేశారు. అనంతరం తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా చేవెళ్లలో జెండావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ సమాజానికి తమ వంతు సహకారం అందించిన యువతను అభినందించారు.
కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నారని, ప్రపంచ దేశాలలో భారతదేశానికి ఎన్నడూ లేని విధంగా ప్రత్యేక గుర్తింపు గౌరవాన్ని తీసుకొచ్చారని కొనియాడారు. నరేంద్ర మోడీ జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు. నేరంద్రమోడీ పదేళ్ల పాలనలో దేశప్రగతి పురోగతి సాధించిందని అన్నారు. బిజెపి ప్రభుత్వం మహిళల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తుందన్నారు.
పార్లమెంట్ లో మహిళలకు 30 శాతం రిజర్వేషన్ కల్పించి సమున్నత స్థానాన్ని కల్పించారన్నారు.మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనన్నదే బీజేపీ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం, బిజెపి యువ నాయకులు డా. మల్గారి వైభవ్ రెడ్డి , మండల అధ్యక్షులు శ్రీకాంత్, అనంతరెడ్డి, ప్రభాకర్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, కొంచెం శ్రీనివాస్, వెంకట్ రెడ్డి, శర్వలింగం, మాణిక రెడ్డి, శర్వలింగం, రామకృష్ణారెడ్డి, ఇంద్రసేనారెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, అశోక్, గుడిపల్లి మధుసూదన్ రెడ్డి, పత్తి సత్యనారాయణ, పెద్దోళ్ల కృష్ణ, బిజెపి శ్రేణులు వైద్య అధికారులు, అంగనివాడి, ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు