మహేశ్వరం రూపురేఖలు మార్పిస్తా…

మహేశ్వరం రూపురేఖలు మార్పిస్తా..

14 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి

జోరుగా ఇంటింట ప్రచారం..విద్యావంతురాలకు స్వాగతం పలికిన ప్రజలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట రూరల్ మండలం నుండి మహేశ్వరం గ్రామాన్ని నర్సంపేట మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంగా ఉన్న మహేశ్వరం రూపురేఖలకు మార్చి మోడల్ మహేశ్వరంగా అభివృద్ధి చేయిస్తానని 14 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతురాలు
గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి ఇంటింట ప్రచారం చేపట్టగా అవార్డు ప్రజలు స్వాగతాలు పలికారు. ఈ నేపథ్యంలో వార్డు ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతూ ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా భవాని మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయ కుటుంబ నేపథ్యంలో వారి సూచనలతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మహేశ్వరం గ్రామంలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధి గుజ్జుల మాధవరెడ్డి పద్మ,మధు,మాధవరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,మహిళలు,వార్డు వాసులు పాల్గొన్నారు.

చేవెళ్ల 18వ వార్డులో బీజేపీ అభ్యర్థిగా తెలుగు శిరీష

అభివృద్ధి చేస్తా ఆదరించండి

* 18వ వార్డు బీజేపీ అభ్యర్థిగా తెలుగు శిరీషశ్రీనివాస్

చేవెళ్ల, నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్ 18 వార్డు కౌన్సిలర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు తెలుగు శిరీష శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. చేవెళ్ల తొలి మున్సిపల్ ఎన్నికల్లో యువతకు అవకాశం ఇచ్చి 18వ వార్డు కౌన్సిలర్ గా పెద్ద మనసుతో ఆశీర్వదించాలని శిరీష విజ్ఞప్తి చేశారు.
తనను గెలిపిస్తే బీజేపీ కేంద్ర ప్రభుత్వ నిధులతో వార్డును ఆదర్శంగా అభివృద్ధి చేసి తీర్చి దిద్దుతానని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రచారం ముమ్మరంగా నిర్వహించారు. వార్డులో ప్రధాన వీధుల గుండా ప్రజలను కలుస్తూ, ఓట్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని, వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని, కేంద్ర ప్రభుత్వ నిధులతో మరింత అభివృద్ధి చేస్తానని పేర్కొన్నారు. వార్డులో సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తా..

ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తా

* గ్రామప్రజలకు సేవకురాలిగా పని చేస్తా
* బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి
* ఆలూరు సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

చేవెళ్ల మండం ఆలూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆలూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్పంచిగా ఆశీర్వదించి అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తానని అన్నారు. తన భర్త మంగలి వెంకటేష్ ఎటువంటి పదవి లేకున్నా గ్రామంలో సొంత నిధులతో అనేక అభివృద్ధి సేవకార్యక్రమాలు చేశారాని తెలిపారు. తనకు సర్పంచిగా అవకాశం ఇస్తే మరింత సేవచేయటానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలనుండి తమకు సానుకూల స్పందన లభిస్తుందని, గ్రామస్థుల మద్దతు తనకే ఉందని అన్నారు. సర్పంచిగా తప్పకుండ విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రచారంలో భవాని తనకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.

అభివృద్ధి చూసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే..

అభివృద్ధి చూసి ఆశీర్వదించండి ఎమ్మెల్యే

నడికూడ,నేటిధాత్రి:

 

కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించి, వెంకటేశ్వర్ల పల్లి గ్రామ అభివృద్ధికి సహకరించాలి అని పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు.
నడికూడ మండలంలోని వెంకటేశ్వర్ల పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజిరెడ్డి మరియు వార్డ్ మెంబర్ల గెలుపు కోసం పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి ఇంటింటా ప్రచారంని నిర్వహించారు. అనంతరం గ్రామ కూడలిలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వెంకటేశ్వర్ల పల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి ఎరుకల అంజి రెడ్డి ఉంగరం గుర్తు మరియు వార్డు మెంబర్లను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.ప్రజలే మా పాలకులని,ప్రజల మేరకే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ముందుకెళ్తుందని,గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు అభివృద్ధి ముసుగులో దోచుకున్నారని అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో అభివృద్ధి మరియు సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని,ప్రతి కుటుంబం ఆర్థికంగా ఎదగడమే తమ ప్రభుత్వా లక్ష్యం అన్నారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలన్నారు.గెలిచి వచ్చిన వారి గ్రామాల అభివృద్ధికి అధిక నిధులు ఇచ్చే బాధ్యత తనదనీ అన్నారు.సోనియా గాంధీ,రాహుల్ గాంధీ, మల్లిఖార్జున ఖర్గే నాయకత్వంలో సీఎం రేవంత్ రెడ్డి అమలు చేస్తున్న పథకాలు,మహిళలకు ఉచిత బస్సు,500లకే గ్యాస్,సన్న బియ్యం,ఇందిరమ్మ ఇళ్లు, రెండు లక్షల రుణ మాఫీ, వరికి రూ.500 బోనస్, రేషన్ కార్డులు,200 యూనిట్ల ఉచిత కరెంట్ వంటి పథకాలు చెప్పి ప్రజలను ఓట్లు అడగాలన్నారు.పార్టీలకు అధికంగా సంక్షేమ పథకాలు అందిస్తున్నామని,గత బిఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు ధనిక రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version