ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి చూపిస్తా
* గ్రామప్రజలకు సేవకురాలిగా పని చేస్తా
* బ్యాట్ గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి
* ఆలూరు సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని
చేవెళ్ల, నేటిధాత్రి:
చేవెళ్ల మండం ఆలూరులో సర్పంచ్ ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. ఆలూరు గ్రామపంచాయతీ సర్పంచ్ అభ్యర్థి మంగలి భవాని వెంకటేష్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. బుధవారం గ్రామంలో గడప గడపకు ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సర్పంచిగా ఆశీర్వదించి అవకాశం ఇస్తే గ్రామానికి సేవ చేస్తానని అన్నారు. తన భర్త మంగలి వెంకటేష్ ఎటువంటి పదవి లేకున్నా గ్రామంలో సొంత నిధులతో అనేక అభివృద్ధి సేవకార్యక్రమాలు చేశారాని తెలిపారు. తనకు సర్పంచిగా అవకాశం ఇస్తే మరింత సేవచేయటానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలనుండి తమకు సానుకూల స్పందన లభిస్తుందని, గ్రామస్థుల మద్దతు తనకే ఉందని అన్నారు. సర్పంచిగా తప్పకుండ విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా ప్రచారంలో భవాని తనకు ఓటు వేసి ఒక్క అవకాశం ఇచ్చి ఆశీర్వదించాలని ఓటర్లను కోరారు.
