పోలీసులకు ఒక రూల్ సామాన్యులకు ఒక రూలా..

పోలీసులకు ఒక రూల్ సామాన్యులకు ఒక రూలా..?

నడి రోడ్డుపై కారు పార్క్ చేసిన కారు ఆ కారుపై పోలీస్ అని స్టిక్కర్ ఉండడం గమనార్హం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్,పోలీసులకు ఒక రూల్ సామాన్య ప్రజలకు మరో రూలా అంటూ స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. ఇదంతా ఎక్కడో కాదండి మన సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్ ఐస్టాండ్ సమీపంలో ఓ కారు నడిరోడ్డుపై పార్క్ చేసి పెట్టాడు. ఆ కారు ఎవ్వరిదో కాదండోయ్ ఆ కారుపై పోలీసు అని స్టిక్కర్ కూడా వేసుకున్నారు. పోలీసులమే కదా మమ్మల్ని ఎవ్వడా అడిగేది అనుకున్నాడో ఏమో కాని స్థానిక ప్రజలు మాత్రం ఫోటోలు తీసి సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదండి ఇక్కడి పోలీసుల తీరు అంటూ మరికొందరూ ఇలాంటి సమస్యలు జహీరాబాద్ పట్టణంలో ప్రతి రోజు సాయంత్రం వేళలో రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. రోడ్డు పై అడ్డదిడ్డంగా పార్క్ చేశాడు. ఆ కారు పైన పోలీస్ అని స్టిక్కర్ కూడా వేసుకున్నాడు. అదే సామాన్య ప్రజలైతే ఊరుకుంటారా వెంటనే ఫోటో కొట్టాలి ఫైన్ లు రాయాలి. మరి ఈ పోలీస్ కారు ఎవ్వరిది అతనిపై చర్యలు తీసుకుంటారా…

ట్రాఫిక్ రూల్స్ పైన అవగాహన కల్పించి ఫైన్ వేస్తారా..? అతనిపై చర్యలు తీసుకోవాలని పలువురు స్థానిక ప్రజలు డిమాండ్ చేశారు. లేక పోతే సభ్య సమాజానికి ఎం మెస్సేజ్ ఇస్తున్నట్టొ మరి అంటూ ప్రశ్నిస్తున్నారు. చర్యలు తీసుకుంటారా లేదా వేచి చూద్దాం. చట్టం ఎవ్వరికైనా చట్టమే చుట్టం కాదంటూ మండిపడుతున్నారు.

ఈ కారుపై ఛలాన్లు కూడా ఉన్నాయి…

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని వట్టినాగులపల్లి వద్ద 27వ తేది డిసెంబర్ 2023 ఓవర్ స్పీడుతో వెళ్తుంటే ఫోటోలు తీసి ఫైన్ లు కూడా వేశారు. అప్పట్నుంచి ఇప్పటి వరకు కూడా ఛలాన్ చెల్లించడం లేదు. ఛలాన్ 1035 రూపాయలు కూడా కట్టలేకుండా ఆ కారుకు పోలీసు అని స్టిక్కర్ వేసుకొని ఇష్టానుసారంగా నడిపిస్తుంటే ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా ఓవర్ స్పీడ్ లతో, నడిరోడ్లపై పార్క్ చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. అదే ఒక సామాన్యుడు 200 రూపాయలు లేదా 300 ఉంటేనే బైక్ తాళాలు తీసుకొని ఛలాన్ కట్టే వరకు వదలని పోలీసులు ఈ కారుపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో అంతుచిక్కడం లేదు. ఇప్పటికైనా పోలీస్ స్టిక్కర్ వేసుకుని నడుపుతున్న కారు వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని జహీరాబాద్ వాసులు కోరుతున్నారు.

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు….

అక్రమ నిర్మాణాలకు చేవెళ్లమున్సిపల్ అండదండలు

* చేవెళ్ల మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ స.నెం.195 లో అక్రమ ఫామ్ హౌస్ నిర్మాణం
* పంచాయతీ అనుమతులు ఉన్నాయంటా..
* నిర్మాణానికి సంబంధించి మున్సిపల్ కార్యాలయంలో పత్రాలు లేవు
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ వెంకటేశం
* పత్రికల్లో కథనాలకు స్పందించని కమిషనర్
* రెండు నెలలుగా యతేచ్చగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణం పనులు
* కనీసం నోటీసులు ఇవ్వని వైనం
* చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ పరోక్షంగా అక్రమాలకు అండగా నిలుస్తున్నారన్న విమర్శలు
* వెంటనే అక్రమ నిర్మాణాన్ని నిలిపివేసి చర్యలు తీసుకోవాలి.

చేవెళ్ల,నేటిధాత్రి:

 

చేవెళ్ల మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో అక్రమ నిర్మాణాలకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. అక్రమ నిర్మాణాలను అడ్డుకోవాల్సిన అధికారులు అమ్యామ్యాలకు మరిగి ఎదో ఒక సాకు చెబుతూ అక్రమ నిర్మాణదారులకు వత్తాసు పలుకుతున్నారు. దాంతో కార్పొరేషన్‌ అదాయానికి భారీ స్థాయిలో గండిపడుతోంది. అధికారుల చేతి వాటంతోనే అక్రమ నిర్మాణాలు జోరుగా వెలుస్తున్నాయని అరోపణలు వినిపిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల పట్టణ మున్సిపల్ పరిధిలోని ఊరేళ్ళ వార్డులోని సర్వే నెంబర్ 195 లో మున్సిపల్ అనుమతులు లేకుండా 2నెలలుగా ఓ ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. ఈ అంశాన్ని నేటిధాత్రి వార్త పత్రిక కథనాన్ని వెలువరించింది. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు ఎలాంటి చర్య తీసుకోలేదు. పైగా ఈ అక్రమ నిర్మాణానికి ఎప్పుడో గతంలో 2023లో పంచాయతీ అనుమతులు తీసుకున్నారంటా అని మున్సిపల్ కమిషనర్ నిర్దారణ చేయకుండానె చెప్పారు.

2 ఏళ్ల క్రితం పంచాయతీలో తీసుకున్న అనుమతులు గడువు ముసినప్పటికీ చేవెళ్ల మున్సిపల్ గా ఏర్పడిన తర్వాత మున్సిపల్ అనుమతులు పునరుద్ధరించకుండా అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. ఈ విషయం తెలిసి కూడా మున్సిపల్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారని చేవెళ్ల మున్సిపల్ అధికారులపై స్థానిక ప్రజలు తీవ్ర విమర్శలు వ్యక్తంచేస్తున్నారు. గతంలో పంచాయతి అనుమతులు ఉన్నాయని చెపుతు, 2 నెలలుగా నిర్వీర్యామంగా కొనసాగుతున్న ఫామ్ హౌస్ నిర్మాణానికి మేము నోటీసులు ఇస్తామని ఇప్పుడు చెప్పటం గమనర్హం.

* నోటీసులు కూడా ఇవ్వడం లేదు..

ఈ అనధికారిక ఈ ఫామ్ హౌస్‌ నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు లేవని పేర్కొంటూ మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అయితే దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కనీసం నోటీసులు కూడా ఇవ్వకపోవటం అక్రమనిర్మాణాలపై మున్సిపల్ అధికారుల ఉదాసీనత కనబడుతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టినా… అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. కనీస నిర్మాణ పత్రాలు లేకుండానే విద్యుత్ సరఫరా చేస్తున్న విద్యుత్ అధికారులపై తీరుపై మండల ప్రజలు మండిపడుతున్నారు.

•అధికారుల మౌనం ఎందుకో..?

ఈ ఫామ్ హౌస్ వ్యవహారంపై అప్పటి పంచాయతీ అధికారులు, ఇప్పటి మున్సిపల్ అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ మున్సిపల్ ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే ఉపేక్షించేది లేదని చెప్పే అధికారులు ఊరేళ్ళ మున్సిపల్ పరిధిలో ఫామ్ హౌస్ కడుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా, మౌనంగా ఉండటానికి గల కారణం ఏంటో తెలియడం లేదు.ఈ విషయంలో ఇప్పటికైనా అధికారులు స్పందించి, చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

శ్రీరామ థియేటర్ ఎదురుగా లీకేజీ నీళ్ల పైపులను తనిఖీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్.

శ్రీరామ థియేటర్ ఎదురుగా లీకేజీ నీళ్ల పైపులను తనిఖీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్

నేటి ధాత్రి దినపత్రిక లో వచ్చిన కథనంపై స్పందన

వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో శ్రీరామ టాకీస్ ఎదురుగా మిషన్ భగీరథకు సంబంధించి ఇండ్ల యజమానుల నల్లాలు లీకేజ్ కావడంతో రోడ్డుపై నీరు పారడంతో మంగళవారం నాడు నేటిధాత్రి దినపత్రికలో వార్త కథనంపై మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు స్పందించారు ఈ మేరకు మున్సిపల్ కమిషనర్ మిషన్ భగీరథ కి సంబంధించి నీళ్ల పైపులను తనిఖీ చేశారు . మాజీ మున్సిపల్ చైర్మన్ లక్ష్మయ్య ఇంటి ఎదురుగా శ్రీ రామ టాకీస్ వరకు మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి దగ్గరుండి కార్మికులచే రోడ్డుపై ఉన్న మట్టిని తీసి వేయించారు ఈ మేరకు 15వ వార్డ్ మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ కల్వ భూపేష్ కుమార్ శెట్టి బండార్ రాజు ఆర్ఎంపీ డాక్టర్ దానెల్ పాపిశెట్టి శ్రీనివాసులు వార్డు ప్రజల తరుపున మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి మున్సిపల్ సిబ్బందికి నేటి దాత్రి దినపత్రి క ప్రతినిధికి కృతజ్ఞతలు తెలిపారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version