అంతా మా ఇష్టం అడిగేది ఎవరు…

అంతా మా ఇష్టం అడిగేది ఎవరు?

* అధికారులు ఆదేశాలు బేఖాతరు
* అనుమతులు లేకుండానే ఫామ్ హౌస్ నిర్మాణం

చేవెళ్ల, నేటిధాత్రి:

 

 

అధికారుల తూతు మంత్రపు చర్యలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. భూమిలేని నిరుపేదలకు సాగు చేసుకుని జీవన్ సాగించేందుకు ప్రభుత్వం ఇచ్చిన అసైన్ భూములు పట్ట భూముల్లోని ఫామ్ హౌస్ లకు దారులు వేస్తున్నారు. అధికారులు హెచ్చరించిన అక్రమార్కులు మాకు ఎవరు అడ్డు అంతా మా ఇష్టం అన్న తీరుతో అధికారుల హెచ్చరికలు, ఆదేశాలను లెక్కచేయకుండా యధావిధిగా వారిపని వారు యతేచగా తీసుకుపోతున్నారు. దీనికి కారణం అధికారులు చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోకపోవడమేనని ప్రజలు విమర్శిస్తున్నారు.

 

 

కమ్మెట రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 217లోని ప్రభుత్వ అసైన్డ్ భూమిలో నుండి ఫామ్ హౌస్ కు సుమారు 20 ఫీట్ల మట్టిరోడ్డు దారివేసి వెంచర్ లో ఫామ్ హౌస్ నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ విషయం వార్త పత్రికలలో వచ్చిన కథనాలకు చివెళ్ళ మండల రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో కృష్ణయ్య ఆదేశాల మేరకు చంద్రమోహన్ చర్యలలో భాగంగా ప్రభుత్వ భూమిలో వేసిన అక్రమ రోడ్డుకు ఇరువైపులా జెసిబి తో కాలువ తవ్వి రాకపోకలకు అడ్డుకట్ట వేశారు. పి ఓ టి చట్టం ప్రకారం
అసైన్డ్ భూములను స్వాధీనం చేసుకుంటామని అన్నారు. కాని అధికారులు చర్యలు చేపట్టిన కొద్ది రోజులలోపే ఇరువైపులా తీసిన కాలువను పూడ్చి ఫామ్ హౌస్ నిర్మాణదారులు యధావిధిగా రాకపోకలు కొనసాగిస్తున్నారు. అక్రమాలపై అధికారుల ఆదేశాలు నీటి బుడగళ్ల మారాయి.

 

 

అధికారుల తూతూ మంత్రపు చర్యలతో అక్రమార్కులు మరింత రెచ్చిపోతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

* అనుమతులు లేకుండా ఫామ్ హౌస్ నిర్మాణం
ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణం కొనసాగుతుంది. చేవెళ్ల మున్సిపల్ పట్టణ ఊరెళ్ళ వార్డ్ పరిధిలోని సర్వే నెంబర్ 194లో హెచ్ఎండిఏ, మున్సిపల్ అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నిర్మాణం చేపడుతున్నారు. 15 రోజుల క్రితం మున్సిపల్ అధికారులు వచ్చి పనులను ఆపివేశారు.అనుమతులు లేకుండా నిర్మాణం చేపట్టొద్దని హెచ్చరించారు. కానీ ఫామ్ హౌస్ నిర్మాణదారుడు మునిసిపల్ ఆదేశాలను బేఖాతార్ చేసి యతేచగా చక చక ఫార్మ్ హౌస్ నిర్మాణం కొనసాగిస్తున్నారు.అక్రమ నిర్మాణాలపై మున్సిపల్ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

ఈ విషయంపై చేవెళ్ల మున్సిపల్ కమిషనర్ ను వివరణ కోరగా అధికారులను పంపించి వెంటనే పనులు ఆపుచేస్తామని తెలిపారు. గతంలోని వారికి అనుమతులు వచ్చేవరకు పనులు చేపట్టవద్దని చెప్పమని, అయినా మళ్లీ పనులు చేపట్టడంతో వారిపై చట్ట పరమ చర్యలు తీసుకుంటామని తెలిపారు.

111జీవోలో ఆగని అక్రమ నిర్మాణాలు

111జీవోలో ఆగని అక్రమ నిర్మాణాలు

•అనుమతులు నిల్..కన్స్ట్రక్షన్స్ ఫుల్
* కమ్మెట పంచాయతీ కార్యదర్శి ఫెయిల్యూర్
* పంచాయతీ కార్యదర్శి పై చర్యలేవి.
* పత్రిక కథనాలకు స్పందించని కార్యదర్శి, ఎంపీఓ
•111లో వెలుస్తున్న రోజుకొక్క అక్రమ నిర్మాణం
* పిర్యాదు చేసి 30 రోజులైనా చర్యలు శూన్యం
* నోటీసుల పేరుతో కాలయాపన చేస్తున్న పంచాయత్ రాజ్ అధికారులు

చేవెళ్ల,నేటిధాత్రి:

111జీవో ప్రాంతంలో ప‌లువురు భవనాలు కడుతున్నారు? ఎవ‌రి అండ చూసుకుని వీరంతా రెచ్చిపోతున్నారు? హెచ్ఎండీఏ అనుమ‌తి లేకుండా అక్ర‌మంగా నిర్మాణాలు క‌డుతుంటే.. అధికారులేం చేస్తున్నారు? 111 జీవో ప్రాంతాల్లో అక్ర‌మ నిర్మాణ‌ల్ని క‌డుతున్న విష‌యం అధికారులకు తెలియ‌దా? తెలిసినా, తెలియ‌న‌ట్లు న‌టిస్తున్నారా?అక్ర‌మ నిర్మాణాల్ని కూల్చివేయ‌కుండా పంచాయతీరాజ్, హెచ్ఎండిఎ అధికారులు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు.

* అనుమతులు నిల్… కమర్షియల్ కన్స్ట్రక్షన్స్ ఫుల్.

ఈ బిల్డింగ్ నిర్మాణానికి హెచ్ఎండిఏ నుండి ఇలాంటి అనుమతులు లేవని, నిర్మాణం ఆపాలంటూ గతంలోనే 3 నోటీసులు ఇచ్చామని కమ్మెట పంచాయతీ కార్యదర్శి తెలిపారు.
ఇచ్చిన నోటీసులు బేఖాతరు చేస్తూ అనుమతులు లేకుండానే దర్జాగా జి+3 భవన నిర్మాణం చేపడుతున్నారని, నోటీసులను బేఖాతరు చేస్తూ ఈ బిల్డింగ్ నిర్మాణంలో గ్రౌండ్ ఫ్లోర్, జి ప్లస్ వన్ లో కమర్షియల్ షెటర్స్ నిర్మిస్తున్నారు. ఈ భవనాలు ఎనికెపల్లి ప్రధాన చౌరస్తా కావటంతో భారీగా అద్దె పర్పస్ కమర్షియల్ షెటర్లను నిర్మిస్తున్నారు. నిర్మాణాలకు గ్రామపంచాయతీ కార్యదర్శి అండ ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ఎప్పుడో నోటీస్ ఇచ్చామని చెబుతున్న పంచాయతీ కార్యదర్శి మళ్లీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. కమ్మెట, ఎనికేపల్లి త్రిబుల్ వన్ జీవోలోనే ఉన్నాయి. కమ్మెట గ్రామపంచాయతీ పరిధిలో నిత్యం అక్రమ నిర్మాణాల జోరు కొనసాగు తుంది. నిర్మాణాలకు అడ్డుకట్ట వేయాల్సిన పంచాయతీ కార్యదర్శి, మండలపంచాయతీ అధికారి, అక్రమ చర్యలపై చేతులేత్తేశారు.

* అక్రమాలకు ఊతమిస్తున్న అధికారులు

ముడిమ్యాల, గొల్లపల్లి, రావులపల్లి, మల్కాపూర్ గ్రామాలతో పాటు
కమ్మెట రెవెన్యూపరిధిలోని 111జీవోలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై వెలువడుతున్న వార్త పత్రిక కథనాలకు పంచాయతీరాజ్ అధికారులు స్పందించడం లేదు. గతంలో జరిగిన నిర్మాణాలు
పక్కన పెడితే, ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న బహుళ అంతస్తుల కమర్శియల్ అక్రమ నిర్మాణాలపై ఇసుమంత చర్యలు చేపట్టలేదు. అక్రమ నిర్మాణాలకు అధికారులే అక్రమ నిర్మాణాలను ప్రోత్సహి స్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్రామ పంచాయతీ కార్యదర్శి గతంలో ఎప్పుడో నోటిసులు ఇచ్చినవే తప్పితే మళ్లీ అటువైపు తొంగి చూసిన దాఖలాలు లేవు. కమ్మెట పంచాయతీ కార్యదర్శి, మండల పంచాయతీ అధికారులు ఫెయిల్యూర్ అయ్యారు.కమ్మెట పరిధిలో111జీవోలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు నిస్సహాయత తీరుపై విమర్శలకు దారితీస్తుంది. మండల ఎంపీఓ, పంచాయతీ కార్యదర్శిపై జిల్లా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

 

శ్రీనివాస్ రెడ్డి.
కమ్మెట పంచాయతీ సెక్రెటరీ

కమ్మెట రెవెన్యూ పరిధిలో111జీవోలో నిర్మిస్తున్న భవన నిర్మాణాలకు పంచాయతీ నుండి ఇలాంటి అనుమతులు, ఇంటినెంబర్ ఇవ్వబడదు. ఇప్పటికే నోటీసులు ఇచ్చాము. ఈ విషయాన్నీ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. ఉన్నత అధికారుల ఆదేశాలు ఇస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటాం.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version