పరకాలలో సిపిఐ భారీ ర్యాలీ
చలో ఖమ్మం సభకు తరలి రావాలని పిలుపు
పరకాల,నేటిధాత్రి
భారత కమ్యూనిస్ట్ పార్టీ 100 సంవత్సరాల ముగింపు ఉత్సవాల సందర్బంగా డిసెంబర్ 26న ఖమ్మంలో జరిగే చలో ఖమ్మం కార్యక్రమంలో భాగంగా సీపీఐ జిల్లా కౌన్సిల్ మెంబర్ లంకదాసరి అశోక్ అధ్యక్షతన పరకాల పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ ఆవరణలో సీపీఐ రాష్ట్ర సహాయక కార్యదర్శి తక్కళ్ల పల్లి శ్రీనివాసరావు కార్మిక నాయకులతో కలిసి జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది.అనంతరం అంబేద్కర్ సెంటర్ వద్దగల అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి బస్టాండ్ కూడలి వరకు పాదయాత్రగా వెళ్లడం జరిగింది.ఈ సందర్బంగా తక్కళ్లపల్లి శ్రీనివాస్ రావు మాట్లాడుతూ భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని తొలిత గర్జించిన ఏకైక పార్టీ సిపిఐ పార్టీ అని బ్రిటిష్ వారి నుండి మన దేశ విముక్తి కొరకు ఎ
న్నో పోరాటాలు చేసిందని భూమికోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం నిజామును గద్దెదించటానికి జరిగిన మహత్కార తెలంగాణ సాయుధ పోరాటంలో నాలుగున్నర వేల మంది ప్రాణ త్యాగాలతో 3000 గ్రామాలకు విముక్తి జరిగించి పది లక్షల ఎకరాల భూమిని పంచిన ఘనత భారత కమ్యూనిస్టు పార్టీ దేనని ఆయన అన్నారు. భారత గడ్డపై సిపిఐ కి వందేళ్ల ముగింపు ఉత్సవాలు ఖమ్మంలో భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి దినమంతా ఏకమై కదిలి రావాలని కోరారు.ఈ కార్యక్రమంలో కలవెన శంకర్ సిపిఐ కార్య వర్గ సభ్యులు,మరుపాక అనిల్ కుమార్ డిహెచ్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి,దుప్పటి సాంబయ్య సీపీఐ సీనియర్ నాయకులు,సదా విజేయ లక్ష్మీ తదితర నాయకులు పాల్గొన్నారు.
