ఘనంగా అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమం నివాళులర్పించిన టిఆర్ఎస్ నాయకులు
జహీరాబాద్ నేటి ధాత్రి:
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతిని శనివారం ఝరాసంగం మండలంలోని
హై స్కూల్ పక్కన ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
బిఆర్ఎస్ పార్టీ మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ మాజీ ఎంపీటీసీ సంతోష్ పటేల్ మాట్లాడుతూ అంబేద్కర్ అందరికీ సమాన విద్య,ఆరోగ్యం,ఉపాధి, రక్షణ, నివాసం మరియు భావ ప్రకటనకు సమ న్యాయం రాజ్యాంగంలో పొందుపరిచిన భారత పిత డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. సమ సమాజనిర్మాణంలో బాబాసాహెబ్ ను ప్రపంచ దేశాలు మరియు ఐక్యరాజ్య సమితి “సింబల్ ఆఫ్ నాలెడ్జ్”గా గుర్తించారని తెలిపారు.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా గ్రామ పుర ప్రముఖులు పెద్దలు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాల్ రాజ్ వినోద టౌన్ ప్రెసిడెంట్ ఎజాజ్ బాబా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో నివాళులర్పించారు,
