బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

బి ఆర్ ఎస్ పార్టీ నాయకులపై అక్రమ కేసులా…

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి మండలంలో పలు గ్రామాల్లో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నీ. విచారణ .పేరీట వేధిస్తున్నందుకు.నిరసన వ్యక్తం చేయగా మాపై కేసులు నమోదా. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ. ఫిబ్రవరి నెల ఒకటో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసనలోభాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాలలో పార్టీ అధిష్టానం పిలుపుమేరకు ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగిందని. ఇందుకుగాను తెలంగాణ రాష్ట్ర సాధకులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నీ విచారణ పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం .కక్ష.పూరిత వైఖరితో .వేధిస్తున్నందుకు ఫిబ్రవరి ఒకటో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలో భాగంగా తంగళ్ళపల్లి మండలంలోని అన్ని గ్రామాల్లో దిష్టిబొమ్మ దహనం నిరసనలు.చేయడం జరిగిందని. అందులో తంగళ్ళపల్లి పోలీస్ స్టేషన్లో. కేసులు నమోదు చేశారని. తంగళ్ళపల్లి మండలం నుండి 18 మంది టిఆర్ఎస్ పార్టీ నాయకులపై కేసులు నమోదు చేసి ఈరోజు నోటీసులు ఇవ్వడం జరిగిందని తెలియజేస్తూ మండల బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మాట్లాడుతూ ఎటువంటి కేసులకు భయపడేది లేదని బిఆర్ఎస్. పార్టీ నాయకులు వేధిస్తే .ఊరుకునేది .లేదని మోసపూరిత హామీలు ఇచ్చి అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం. బిఆర్ఎస్ నాయకత్వాన్ని .వేధించడం మానుకొని ప్రజలకు ఇచ్చిన ఆరు .గ్యారెంటీలనుఅమలు చేయాలని. బిఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ప్రభుత్వం చేస్తున్న అణిచివేత ధోరణి ప్రజా వ్యతిరేకత విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడతామని తెలియజేస్తూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు కేటీఆర్ నాయకత్వంలో నిరసన కార్యక్రమాలు వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు ఎండ.గడతామని ఈ సందర్భంగా తెలియజేశారు. బి ఆర్ ఎస్ పార్టీ నాయకులకు మద్దతుగా. బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బోల్లిరామ్మోహన్ సంఘీభావం ప్రకటించారు అరెస్టు కేసులు నమోదైన వారిలో. బిఆర్ఎస్.పార్టీనాయకులు. మాట్లమధు.కర్నేబాలయ్య. పూర్మాని.రాజశేఖర్.రెడ్డి.శ్యాగ దేవేందర్. బండి జగన్. తిరుపతిరెడ్డి. మీసాల కృష్ణ. దొంతినేని.చందర్రావు.గుండి మహేష్.గుగ్గిళ్ళ ఆంజనేయులు. అల్వాల సాయి.సుంచులజీవన్.ఇమ్మ నేనిఅమర్రావు. పోచంపల్లి రంగయ్య. తిరుపతి రెడ్డి. తదితరులు ఉన్నారు

మహాత్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్…

మహాత్మ గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలి ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్

పరకాల,నేటిధాత్రి

పట్టణంలో మహాత్మ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని మాజీ సర్పంచ్ ఆముదాలపల్లి మల్లేష్ గౌడ్ కోరారు.దేశ స్వాతంత్ర్య సంగ్రామంలో మహాత్మ గాంధీ చేసిన త్యాగాలు,ఆయన చూపిన అహింసా మార్గం ప్రతి ఒక్కరికీ ఆదర్శంగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.పట్టణంలో గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే యువతకు చరిత్రపై అవగాహన పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.ముఖ్యంగా విద్యార్థులు,యువతలో దేశభక్తి భావనను పెంపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని అభిప్రాయపడ్డారు.ఈ మేరకు సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు స్పందించి తగిన స్థలాన్ని గుర్తించి విగ్రహం ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.పట్టణ అభివృద్ధితో పాటు చారిత్రక మహానుభావుల స్మృతులను కాపాడటం కూడా సమాజ బాధ్యత అని మల్లేష్ గౌడ్ తెలిపారు.

ట్రంప్ యుద్ధోన్మాదానికి మోడీ వత్తాసు–ప్రజలకు తీవ్ర నష్టం…

ట్రంప్ యుద్ధోన్మాదానికి మోడీ వత్తాసు–ప్రజలకు తీవ్ర నష్టం*

ఇరాన్–ఇజ్రాయిల్ యుద్ధాలతో ప్రపంచంలో చమురు, గ్యాస్ సంక్షోభం

ఎన్నికల హామీలను విస్మరించిన కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లు

నర్సంపేట,నేటిధాత్రి:

 

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆదిపత్య ధోరణితో యుద్ధోన్మాదాన్ని ప్రోత్సహిస్తూ దేశాల మధ్య విభేదాలు పెంచి ప్రపంచ అశాంతికి కారణమవుతున్నారని, అలాంటి విధానాలకు మోడీ ప్రభుత్వం వత్తాసు పలకడం సిగ్గుచేటని ఎంసిపిఐ(యు) రాష్ట్ర కార్యదర్శి గాదగోని రవి అన్నారు.ఎంసిపిఐ(యు) వరంగల్ జిల్లా కమిటీ సమావేశం నర్సంపేట పార్టీ కార్యాలయంలో కామ్రేడ్ సింగతి మల్లికార్జున్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన గాదగోని రవి మాట్లాడుతూ ఇరాన్–ఇజ్రాయిల్–అమెరికా యుద్ధాల వల్ల అమాయక ప్రజలు, మహిళలు, పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ యుద్ధాల ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా చమురు, గ్యాస్ కొరత ఏర్పడి ధరలు పెరుగుతున్నాయని తెలిపారు.అమెరికా సామ్రాజ్యవాద విధానాలతో అనేక దేశాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, యుద్ధాలను ప్రేరేపిస్తూ ఆయుధ వ్యాపారం కొనసాగించడం దుర్మార్గమని విమర్శించారు. ఇలాంటి పరిస్థితుల్లో యుద్ధాలను వ్యతిరేకించి ప్రపంచ శాంతికి కృషి చేయాల్సిన మోడీ ప్రభుత్వం అమెరికా విధానాలకు మద్దతు ఇవ్వడం దారుణమన్నారు. ప్రజలు యుద్ధ వ్యతిరేకంగా నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెడుతున్న బడ్జెట్లలో ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా కేటాయింపులు చేస్తున్నాయని విమర్శించారు. ప్రజా వ్యతిరేక బడ్జెట్లను వ్యతిరేకిస్తూ, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్స్ అమలును నిరసిస్తూ ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు గోనె కుమారస్వామి, కన్నం వెంకన్న, మంద రవి, జిల్లా సహాయ కార్యదర్శి నర్ర ప్రతాప్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కుసుంబ బాబురావు, నాగేళ్లి కొమురయ్య, మాలోత్ సాగర్, ముక్కెర రామస్వామి, సుంచు జగదీశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

గురుకుల ప్రవేశ ఫలితాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ జయకేతనం…

గురుకుల ప్రవేశ ఫలితాల్లో బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ జయకేతనం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలంలో గల బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ విద్యార్థులు గురుకుల విద్యాలయ సమితి విడుదల చేసిన 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఐదవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 10 సీట్లను సాధించి ప్రథమ స్థానంలో నిలిచారు.ఈ ప్రవేశ పరీక్షలో లౌక్య, శ్రేయాన్స్, సాత్విక్, సహస్ర, అరుణ్, చంద్ర అఖిల్, శరణ్య, స్నిగ్ధ శ్రీ, హర్షిత, దీపక్ అర్హత సాధించారు. అనంతరం నిర్వహించిన అభినందన కార్యక్రమంలో బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ. రాజేంద్రప్రసాద్ రెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్య మన భవిష్యత్తుకు పునాది వంటిదని, మంచి పౌరులుగా ఎదగడానికి దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి తమ పాఠశాలకు, తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆర్. జ్యోతి విద్యార్థులకు పూల బొకేలు అందజేసి అభినందించారు. విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులను ప్రశంసించారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

దుగ్గొండి ఎమ్మార్వోగా ముస్కు సమ్మక్క బాధ్యతలు…

దుగ్గొండి ఎమ్మార్వోగా ముస్కు సమ్మక్క బాధ్యతలు

దుగ్గొండి, నేటిధాత్రి:

దుగ్గొండి మండలం ఎమ్మార్వోగా మూసుకు సమ్మక్క బాధ్యతలు చేపట్టారు.
ఆమె గతంలో హనుమకొండ కలెక్టరేట్ లో విధులు నిర్వహిస్తున్నది.కాగా ఇటీవల జరిగిన తాహసిల్దార్ ల బదిలీల నేపథ్యంలో దుగ్గొండి మండల తహసిల్దార్ నియమితులయ్యారు. బుధవారం ఎమ్మార్వో కార్యాలయంలో బాధ్యతలు చేపట్టగా కార్యాలయ సిబ్బంది ఘనంగా స్వాగతించారు. ఈ సందర్భంగా స్థానిక జర్నలిస్టులు, వివిధ రాజకీయ నాయకులు ప్రజా సంఘాలు నాయకులు ఆమెను కలిసి అభినందించారు.

ప్రైవేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు..

ప్రైవేట్ కి ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

టేకుమట్ల మండలం సోమనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు బీసీ వెల్ఫేర్ లో సీటు సాధించారు
ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులు సీట్లు రాక రోజుకొకటి చొప్పున మూత పడుతున్న ప్రభుత్వ పాఠశాలలు కానీ సోమనపల్లి గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు శనిగరం రాజు ఉపాధ్యాలురాలు మనసా ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మారేపల్లి రోహన్ జీడి దీపిక బీసీ వెల్ఫేర్ లో సీటు సాధించడానికి కృషి చేశారు అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొని విద్యార్థులను అభినందించిన సోమనపల్లి గ్రామ సర్పంచ్ రామ ఉమ దేవేందర్ గ్రామ పెద్దలు విద్యార్థుకి శుభాకాంక్షలు తెలిపారు అనంతరం పాఠశాల ఉపాధ్యాయులకు కృతజ్ఞతలు తెలిపారు.

దళితుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు-అశోక్….

దళితుల హక్కులను కాలరాస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వలు-అశోక్

కరీంనగర్, నేటిధాత్రి:

దళిత హక్కుల పోరాట సమితి డిహెచ్పిఎస్ జగిత్యాల జిల్లా రెండో మహాసభలో ఏఐడిఆర్ఎమ్ జాతీయ కౌన్సిల్ సభ్యులు బోయిని అశోక్ మాట్లాడుతూ దేశానికి స్వతంత్రం వచ్చి 77 ఏళ్లు గడుస్తున్నా అట్టడుగు వర్గాలైన దళితులు అభ్యున్నతి కోసం భారత రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కులు నేటికీ దళితులకు దరిచేరడం లేదు. భారత రాజ్యాంగం ప్రతి మనిషికి ఓటు హక్కు కల్పించడం జరిగినది, తరతరాలుగా అణిచివేత, అంటరానితనం, వివక్ష, దోపిడి పీడనాల కింద నలిగిపోతున్న వర్గాలు దళితులు అభివృద్ధి లక్ష్యంగా దేశవ్యాప్తంగా దళిత సామాజిక న్యాయం కోసం విద్య, వైద్య, వ్యాపారాలని రద్దు చేయాలని, ఉపాధి అవకాశాల కోశం దేశ సంపదలో దళితుల వాటా కోసం సమర శంఖం పూరించడానికి 2026 ఏప్రిల్ 17,18న వరంగల్ లో జరిగే రాష్ట్ర రెండో మహాసభలకు జగిత్యాల జిల్లా నుండి అధిక సంఖ్యలో ప్రతినిధులు హాజరుకావాలని కోరారు. అనంతరం డిహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లపల్లి లక్ష్మణ్ మాట్లాడుతూ దళితులను ఆర్థికంగా ఆర్థికంగా రాజకీయ సామాజిక హక్కుల పరిరక్షణ కోసం, కుల వివక్షత కుల నిర్మూలన కోసం ఎస్సీ సబ్ ప్లాన్ ను అమలు చేయాలని నిధులు కేటాయించాలని స్వయం ఉపాధి పథకాలను అమలు చేయాలని కోరారు. ఈసందర్బంగా రెండో మహాసభలో నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది. అధ్యక్షులుగా మునుగూరి హనుమంతు, ప్రధాన కార్యదర్శిగా ఇరుగురాల భూమేశ్వర్, ఉపాధ్యక్షులుగా సురేష్, సహాయ కార్యదర్శిగా ప్రవీణ్, కోశాధికారిగా రాజయ్య, చిలుముల మైసయ్య, జుట్టు శేఖర్, మచ్చ అంజయ్య, గుండు నారాయణ, మునుగురి గంగనర్సయ్య, తాటికొండ నరేందర్, మోదుగుపెల్లి మల్లయ్య, బొమ్మన పురుషోత్తం, మల్లార్పు నర్షయ్యలను ఎన్నుకోవడం జరిగింది. మరో పదమూడు మందిని కార్యవర్గ కౌన్సిల్ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

గురుకుల్ సెట్‌లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం…

గురుకుల్ సెట్‌లో లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థుల ప్రభంజనం

35 మందిలో 29 మంది ఫస్ట్ లిస్టులో ఎంపిక

దుగ్గొండి,నేటిధాత్రి:

 

 

 

దుగ్గొండి మండలంలోని రేకంపల్లి గ్రామంలో గల లిటిల్ ఫ్లవర్ స్కూల్ విద్యార్థులు తెలంగాణ గురుకుల్ సెట్ పరీక్షలో విశేష ఫలితాలు సాధించారు. గత నెల ఫిబ్రవరి 22న నిర్వహించిన గురుకుల సెట్ పరీక్షకు పాఠశాలకు చెందిన 4వ తరగతి 35 మంది విద్యార్థులు హాజరుకాగా, అందులో 29 మంది ఫస్ట్ లిస్టులో ఎంపిక కావడం విశేషం.
ఈ సందర్భంగా లిటిల్ ఫ్లవర్ స్కూల్ కరస్పాండెంట్ గట్టి కొప్పుల విజేందర్ విద్యార్థులను అభినందించారు. నిరుపేద విద్యార్థులకు మంచి భవిష్యత్తును అందిస్తున్న ఏకైక పాఠశాల లిటిల్ ఫ్లవర్ స్కూల్ అని ఆయన తెలిపారు. గత 17 సంవత్సరాలుగా ఎంతో కష్టపడి పేద పిల్లలకు విద్యా దారి చూపిస్తున్నామని అన్నారు.విద్యార్థులు కష్టపడి ఉన్నత చదువులు చదివి తల్లిదండ్రుల ఆశయాలను, తమకు విద్య నేర్పిన గురువుల ఆశయాలను నిలబెట్టాలని సూచించారు. అలాగే పిల్లల భవిష్యత్తు కోసం లిటిల్ ఫ్లవర్ యాజమాన్యం ఎల్లప్పుడూ సేవ చేస్తూనే ఉంటుందని తెలిపారు.ఈ విజయానికి పాఠశాల ఉపాధ్యాయులు జి. అనిత, జి. రాధిక, ఎన్. సుప్రజా, ఎస్. విష్ణు, బి. సుధాకర్, డి. జీవన్, మను కృష్ణలు విశేషంగా కృషి చేశారని తెలుపుతూ వారిని అభినందించారు.

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ బిక్ష…

హనుమాన్ స్వాములకు సర్పంచి ఎండి మొయిజ్ బిక్ష

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండల కేంద్రంలో మతసామరస్యం వెల్లివిరిసింది. హనుమాన్ మాలధారణ చేసిన స్వాములకు రామడుగు గ్రామ సర్పంచ్ ఎండి మొయిజ్ సద్దాం ప్రత్యేకంగా భిక్ష (అన్నదానం) ఏర్పాటు చేశారు. భక్తి, మానవత్వం మతాల కంటే గొప్పవని ఆయన చాటిచెప్పారు. ఇలాంటి కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని, అందరూ ఐక్యంగా ఉండాలని స్వాములు ఈసందర్భంగా పిలుపునిచ్చారు. ఈకార్యక్రమంలో హనుమాన్ భక్తబృందం, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం…

బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమం

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని అన్ని గ్రామాల బూత్ లెవెల్ అధికారులకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పైన ప్రత్యేక శిక్షణా కార్యక్రమం రామడుగు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ప్రత్యేక శిక్షణ అధికారులచే నిర్వహించడం జరిగింది. ఈశిక్షణ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తహశీల్దార్ బి.రాజేశ్వరి హాజరై బూత్ లెవల్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఈకార్యక్రమంలో గిర్ధవార్లు రాజ్ కుమార్, కమలేశ్వర్, గ్రామ పాలన ఆఫీసర్లు, తదితరులు పాల్గొన్నారు.

‘పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు – పెట్రోల్ పంపుల వద్ద క్యూలు…

‘పెట్రోల్, డీజిల్ కొరత వదంతులు – పెట్రోల్ పంపుల వద్ద క్యూలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

ప్రస్తుతం కొనసాగుతున్న ఇరాన్-అమెరికా-ఇజ్రాయెల్ యుద్ధం ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోంది, దీని ప్రభావం భారతదేశాన్ని కూడా ప్రభావితం చేస్తుందనే వదంతులు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇటీవల, పశ్చిమ ఆసియాలో జరుగుతున్న యుద్ధం కారణంగా పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడిందని తీవ్ర ప్రచారం జరుగుతోంది. ఫలితంగా, వినియోగదారులు పెట్రోల్ పంపుల వద్దకు పోటెత్తుతున్నారు.జహీరాబాద్ నియోజకవర్గం, ఝరసంగం, న్యాల్‌కల్, కోహిర్ మండలాలు మరియు ఇతర ప్రాంతాల్లో ప్రజలు పంపుల వద్దకు పోటెత్తుతున్నారు. వినియోగదారులు పంపుల వద్దకు చేరుకున్నప్పుడు, పెట్రోల్, డీజిల్ అందుబాటులో లేవని చెప్పడంతో, వారు ఇతర ప్రాంతాల్లోని పంపులకు వెళ్తారు. పంపు వద్దకు వినియోగదారులు అకస్మాత్తుగా ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ట్రాక్టర్లు, డబ్బాలు, సీసాలతో పోటెత్తడంతో గందరగోళం నెలకొంది. డీజిల్, పెట్రోల్ గురించి తీవ్రమైన తప్పుడు ప్రచారం జరుగుతున్నప్పటికీ అధికారులు స్పందించకపోవడంతో వాహన యజమానులు, వినియోగదారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారులు ఈ విషయంపై వీలైనంత త్వరగా స్పందిస్తే పరిస్థితిని అదుపులోకి తీసుకురావచ్చని ఝరసంగం మండల్ ఎస్ఐ క్రాంతి కుమార్ పటేల్ మరియు అధికారులు తెలిపారు.

గ్రామసభ నిర్వహణ…

గ్రామసభ నిర్వహణ

రామడుగు, నేటిధాత్రి:

 

 

 

 

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం తిర్మలాపూర్ గ్రామంలో బుధవారం స్థానిక సర్పంచ్ మోడీ రవీందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించడం జరిగింది. ఈసందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ వేసవి కాలంలో నీటి ఎద్దడి ఉన్నందున, నీటి సరఫరాపై తగు చర్యలు తీసుకుంటామని ప్రతి ఇంటికి సరిపడా నీటిని అందజేస్తామన్నారు నీటిని వృథా చేయకుండా వాడుకోవాలని సూచించారు. ఇంకా దోమల నివారణ, చర్యలు చేపడతామని తెలిపారు. గ్రామంలో అభివృద్ధి పనులు అంతర్గత సిసి రోడ్లు, కొత్త డ్రైనేజీ నిర్మాణ పనులు ప్రారంబించామని తెలిపారు. సిబ్బందితో అన్ని వార్డులలో పారిశుద్ధ్యం పనులు నిర్వహిస్తున్నామని తెలిపారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉన్న అదనంగా సిబ్బందిని పెట్టి పనులు కోన సాగిస్తున్నాం అని తెలిపారు. ఈకార్య క్రమంలో పంచాయతీ కార్యదర్శి సూర్య ప్రకాష్, ఉప సర్పంచ్ కట్ల రాములు, వార్డు సభ్యులు తడగొండ రాజు, పాదం ఉమ, పాదం రాజయ్య, పన్యాల విద్యా సాగర్, పెంచాల అంజయ్య, డా.మౌనిక, ఆశ వర్కర్లు, అంగన్వాడీ టీచర్లు, మహిళా సంఘాలు అధ్యక్షులు సులోచన, సీఏలు వనజ, రజిత, లైన్ మెన్ గాల్ రెడ్డి, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై…

గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై

జహీరాబాద్ నేటి ధాత్రి:

గ్రామ సర్పంచ్, పోలీస్ పటేల్ నాగేందర్, గురుకుల ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన బోరేగావ్ విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉపాధ్యాయులైన మహమ్మద్ ఇలియాస్, వై. నాగభూషణంలతో కలిసి సత్కరించారు.విద్యార్థులను కూడా ప్రశంసించారు. గురుకుల ప్రవేశ పరీక్ష రాసిన ఏడుగురు విద్యార్థులలో ఏడుగురూ ఉత్తీర్ణులై గ్రామానికి గౌరవం తెచ్చారని గమనించబడింది.
ఈ సందర్భంగా సర్పంచ్ పోలీస్ పటేల్ నాగేందర్ విద్యార్థుల కృషిని, ఉపాధ్యాయుల బోధనను, తల్లిదండ్రుల మద్దతును ప్రశంసించారు. వారు భవిష్యత్తులో మరింత విజయం సాధిస్తారని ఆయన ఆశించాడు.ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు (చి.మల్లన్న, మహ్మద్ ఖాదర్, నర్సిములు, మహ్మద్ నవాబ్, హైమావతి, లక్ష్మి, పార్వతి) గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

భూపాలపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు…

భూపాలపల్లి జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదు

ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మవద్దు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో పెట్రోల్, డీజిల్ కొరత లేదని జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, బుధవారం విడుదల చేసిన ప్రకటనలో స్పష్టం చేశారు.
సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న వదంతుల కారణంగా ప్రజలు ఆందోళనకు గురవుతూ, ఒకేసారి పెద్ద సంఖ్యలో పెట్రోల్ బంకులకు వెళ్లి వాహనాల్లో ఫుల్ ట్యాంక్ నింపించుకోవడం వల్ల అనవసర రద్దీ, అంతరాయం ఏర్పడుతున్నదని తెలిపారు.
జిల్లాలోని అన్ని పెట్రోల్ బంకుల్లో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని, సరఫరా కూడా నిరంతరంగా కొనసాగుతున్నదని పేర్కొన్నారు. ఎటువంటి కొరత పరిస్థితి లేదని, ప్రజలు అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని సూచించారు. అలా చేయడం వల్ల ఇతరులకు అసౌకర్యం కలుగుతుందని తెలిపారు.
సోషల్ మీడియాలో వచ్చే అసత్య ప్రచారాలను నమ్మకూడదని
, నిర్ధారించని సమాచారాన్ని షేర్ చేయడం ద్వారా గందరగోళం సృష్టించవద్దని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.
జిల్లాలో శాంతిభద్రతలు కాపాడేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని, వదంతులు వ్యాప్తి చేయడం లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే చర్యలు చేపడితే, సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

గ్రామాల్లో బెల్ట్ షాపుల హవ…

గ్రామాల్లో బెల్ట్ షాపుల హవ

గ్రామాలలో ప్రధాన సమస్యగా మారుతున్న మద్యం దుకణాలు
అర్ధరాత్రి వరకు అదుబాటులో మద్యం

పరకాల,నేటిధాత్రి

మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలు రోజురోజుకు విస్తరిస్తూ సామాజిక సమస్యగా మారుతున్నాయి.అధికారిక మద్యం దుకాణాలు ఉన్నప్పటికీ,వాటిని పక్కనబెట్టి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పుట్టుకొస్తుండటం గ్రామస్తుల్లో ఆందోళన రేకెత్తిస్తోంది.నియమ నిబంధనలను పట్టించుకోకుండా కొందరు వ్యక్తులు ఇళ్లలోనే మద్యం నిల్వచేసి విక్రయాలు నిర్వహిస్తూ సులభంగా డబ్బు సంపాదనకు పాల్పడుతున్నారు.ప్రత్యేకంగా సాయంత్రం మొదలుకొని అర్ధరాత్రి వరకు ఈ బెల్ట్ షాపులు రద్దీగా కొనసాగుతున్నాయి.గ్రామాల్లో పని ముగించుకున్న తరువాత చాలా మంది ఈ ప్రాంతాలకు వెళ్లడం అలవాటుగా మారింది.యువత ఈ అలవాటుకు బానిసలవుతుండటంతో వారి భవిష్యత్తుపై ప్రభావం పడుతోందని పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.మద్యం వినియోగం పెరగడం వల్ల కుటుంబాల్లో కలహాలు,ఆర్థిక ఇబ్బందులు అధికమవుతున్నాయి.కొందరు కుటుంబాలు అప్పుల బారిన పడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి.మహిళలు,వృద్ధులు ఈ పరిస్థితుల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఇంటి శాంతి భంగం చెంది కుటుంబ వ్యవస్థలు దెబ్బతింటున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు.దీంతో సాధారణ ప్రజలు,ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలు భయాందోళనలకు గురవుతున్నారు.గ్రామ శాంతిభద్రతలకు ఈ పరిస్థితులు సవాలుగా మారుతున్నాయి.ఇలా గల్లీ గల్లీకి విస్తరిస్తున్న బెల్ట్ షాపులు గ్రామ జీవన విధానాన్ని మెల్లగా దెబ్బతీస్తున్నాయి.సమాజంలో ఆరోగ్యకరమైన వాతావరణం క్షీణించడంతో పాటు,యువతలో చెడు అలవాట్లు పెరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో పరకాల మండలంలోని పలుగ్రామాలలో అక్రమ మద్యం విక్రయాలను నియంత్రించి, బెల్ట్ షాపుల పెరుగుదలను అరికట్టేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.గ్రామాల్లో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొల్పేందుకు సమాజం మొత్తం ముందుకు రావాల్సిన అవసరం ఉందని వారు అభిప్రాయపడుతున్నారు.

డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలి…

డంపింగ్ యార్డ్‌లో చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలి

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

పాకాల రోడ్డులో డంపింగ్ యార్డ్‌ సందర్శన

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని నిర్వహిస్తున్న డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని సంబంధిత మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.నర్సంపేట పట్టణ శివారులోని మెడికల్ కాలేజ్ సమీపంలో ఉన్న డంపింగ్ యార్డ్‌ను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ప్రధాన రహదారిపైకి వచ్చిన చెత్తాచెదారాన్ని జెసిబి సహాయంతో తొలగింపజేశారు.ప్రజల రాకపోకలకు అంతరాయం కలగకుండా, దుర్వాసన మరియు అనారోగ్య సమస్యలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

డంపింగ్ యార్డ్‌లో పేరుకుపోయిన చెత్తను ఎప్పటికప్పుడు రీసైక్లింగ్ చేయాలని, పారిశుధ్య నిర్వహణను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. చెత్తను సకాలంలో తరలించి శాస్త్రీయంగా నిర్వీర్యం చేయాలని, ప్రజారోగ్యానికి ఇబ్బంది కలగకుండా డంపింగ్ యార్డ్ వద్ద సమస్యలను తక్షణమే పరిష్కరించాలని సూచించారు.పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు పారిశుధ్య కార్మికులు క్రమం తప్పకుండా విధులు నిర్వహించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు మాదాసి రవి, అయూబ్ ఖాన్, పొన్నాల మనిషా ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు కాట ప్రభాకర్, కీసర వెంకటేశ్వర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్ర కార్యవర్గంలోకి ఫోటోగ్రాఫర్ మండ కార్తీక్ గౌడ్ కు చోటు…

రాష్ట్ర కార్యవర్గంలోకి ఫోటోగ్రాఫర్ మండ కార్తీక్ గౌడ్ కు చోటు.

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ రాష్ట్ర ఫోటోగ్రాఫీ సంక్షేమ సంఘం రాష్ట్ర కమిటీ కార్యవర్గంలో నర్సంపేట డివిజన్‌కు చెందిన ఫోటోగ్రాఫర్ మండ కార్తీక్ గౌడ్‌కు చోటు దక్కింది.రాష్ట్ర కార్యవర్గ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా కమిటీ అనుమతి మేరకు రాష్ట్ర అధ్యక్షులు మరియు రాష్ట్ర కమిటీ సభ్యుల చేతుల మీదుగా మండ కార్తీక్ గౌడ్‌కు రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా నియామక పత్రాన్ని అందజేశారు.మండ కార్తీక్ గౌడ్ గతంలో చేన్నారావుపేట మండల ఫోటోగ్రాఫర్ల అసోసియేషన్ అధ్యక్షులుగా, నర్సంపేట డివిజన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, గత రెండు సంవత్సరాలుగా జిల్లా కార్యవర్గ సభ్యునిగా బాధ్యతలు నిర్వహించారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమానికి చేసిన సేవలను గుర్తించిన రాష్ట్ర సంఘం, జిల్లా సంఘం అనుమతితో రాష్ట్ర కార్యవర్గంలోకి అవకాశం కల్పించింది.ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గంలోకి చోటు కల్పించిన రాష్ట్ర, జిల్లా, డివిజన్, మండల ఫోటోగ్రాఫర్లకు మండ కార్తీక్ గౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ఫోటోగ్రాఫర్ల సంక్షేమం కోసం కృషి చేస్తానని ఆయన తెలిపారు.

సిరిసిల్ల లో 28వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం…

సిరిసిల్ల లో 28వ తేదీన జాతీయ మెగా లోక్ అదాలత్ కార్యక్రమం

పెండింగ్లో ఉన్నటువంటి కేసులు మెగా లోక్ ఆదాలత్ ద్వారా పరిష్కరించుకోండి

జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే

సిరిసిల్ల టౌన్ :(నేటిధాత్రి)

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఈనెల 28వ తేదీ శనివారం రోజున నిర్వహించబడనున్న జాతీయ మెగా లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోని రాజీ పడదగిన కేసులను పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవలని జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే సూచించారు.ఈలోక్ అదాలత్‌లో క్రిమినల్ కంపౌండబుల్ కేసులు,సివిల్ వివాదాలు,ఆస్తి విభజన కేసులు, కుటుంబ పరమైన నిర్వహణ కేసులు, వైవాహిక వివాదాలు, బ్యాంకు రికవరీ కేసులు, విద్యుత్ చౌర్యం కేసులు, చెక్ బౌన్స్ కేసులు, డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, చిన్నచిన్న పెట్టి కేసులు మరియు ఇతర రాజీ పడదగిన కేసులను సులభంగా పరిష్కరించుకునే అవకాశం ఉందని తెలిపారు.జుడీషియల్ శాఖ అందించిన ఈఅవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఇరుపక్షాలు శాంతియుత పరిష్కారం పొందాలని సూచించారు.
జిల్లా పోలీస్ అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుల్‌లు మరియు ఇతర సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి, ఇరువర్గాల వారికి కౌన్సెలింగ్ నిర్వహించి రాజీ కుదిరేలా అవగాహన కల్పిస్తారని తెలిపారు.కాబట్టి తమ కేసులను రాజీ ద్వారా పరిష్కరించుకోవాలని భావించే వారు సంబంధిత పోలీస్ అధికారులను సంప్రదించాలని, లోక్ అదాలత్ ద్వారా బాధితులకు త్వరితగతిన న్యాయం అందుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు.

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి

జైపూర్,నేటి ధాత్రి:

రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు మంచిర్యాల పోలీస్ వారు తెలిపారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జైపూర్ మండలం కాన్కూర్ గ్రామానికి చెందిన యాదన వేన తిరుపతి (42) తన భార్య శ్రీలత ఇద్దరు కుమారులతో మంచిర్యాలలో నివాసం ఉంటూ నస్పూర్ లో హమాల్ పని పని చేసుకుంటూ జీవిస్తున్నాడు. శనివారం సాయంత్రం నస్పూర్ లో పని ముగించుకుని మంచిర్యాలకు వెళుతున్న క్రమంలో రోడ్డు ప్రమాదం జరిగి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం కరీంనగర్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి డెడ్ బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పారు.మంచిర్యాల పోలీస్ వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన: ఏడీఏ బిక్షపతి..

మట్టి పరీక్షలపై రైతులకు అవగాహన: ఏడీఏ బిక్షపతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

న్యాల్కల్ మండలంలో మట్టి నమూనాల సేకరణపై బుధవారం రైతులకు అధికారులు అవగాహన కల్పించారు. జహీరాబాద్ ఏడీఏ బిక్షపతి మాట్లాడుతూ, ప్రతి రెవెన్యూ గ్రామం నుంచి 10 మట్టి నమూనాలు సేకరించి రైతులకు మట్టి ఆరోగ్య కార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ కార్డుల ద్వారా సమతుల్య ఎరువుల వినియోగం వల్ల ఖర్చులు తగ్గి దిగుబడి పెరుగుతుందని, భూసారం కాపాడబడుతుందని అధికారులు సూచించారు.

error: Content is protected !!
Exit mobile version