వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు…

వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు

జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి

వనపర్తి నేటిదాత్రి .

, సీప్-2024 సర్వే ఆధారంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు వార్డులలో రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నారు . రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి జాబితా ప్రతులను కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి…

భూపాలపల్లి మున్సిపాలిటీ రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 30 వార్డులకు సంబంధించిన రిజర్వేషన్ల ప్రక్రియను శనివారం ఐడీఓసి కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ నిర్వహించారు.
ఈ సందర్భంగా
ఆయన మాట్లాడుతూ, 30 వార్డులకు గాను ఎస్టీ – 2, ఎస్సి – 6, బిసి – 7, అన్ రిజర్వ్డ్ – 15 స్థానాలు కేటాయించినట్లు తెలిపారు.
అలాగే ఎస్టీ వార్డుల్లో 1 మహిళకు,
ఎస్సి వార్డుల్లో 3 మహిళలకు,
బిసి కేటాయించిన 7 స్థానాల్లో 3 మహిళలకు,
అన్ రిజర్వ్డ్ 15 స్థానాల్లో 8 మహిళలకు రిజర్వేషన్లు కేటాయించినట్లు వివరించారు.
రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో వీడియో గ్రఫీ మధ్య లాటరీ పద్ధతిలో నిర్వహించామని, ఈ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా మరియు పారదర్శకంగా సాగిందని జిల్లా ఎన్నికల అధికారి స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ఉదయ్ కుమార్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version