సమ్మక్క తీర్థం..భూతల మహిమాన్వితం!

`మేడారం మిల మిల..కొత్త తోరణాలతో తళ తళ.

`ఆదివాసీ గిరిజన జాతర వైభవం!

`ఏడు వందల ఏళ్ల చరిత్రకు నిదర్శనం.

medaram 2026
medaram 2026

`రాజులపై సామాంతుల తొలి తిరుగుబాటు సంతకం.

`వీర వనితల పోరు చరిత్రకు సజీవ సాక్ష్యం.

`వీర వనితలు దేవతలు గా అదృష్యమైన గొప్ప వేదిక మేడారం.

`ప్రజలకు రక్షణగా నిలుస్తూ దీవెనలిస్తున్న దైవాలా గద్దెలు.

`మేడారం వ్యాప్తంగా ప్రజలను చల్లగా చూస్తున్న అమ్మల దీవెనలు.

medaram 2026

అమ్మల వేడుకకు ప్రజా ప్రభుత్వంలో సరికొత్త హంగులు!

`పతిష్టమైన అద్భుత కట్టడాలు.

`వందల ఏళ్ల దాకా చెక్కు చెదరకుండా నిర్మాణాలు.

మంత్రులు శ్రీనివాస్‌ రెడ్డి, సీతక్కల పట్టుదలకు నిదర్శనాలు.

`మంత్రులు దగ్గరుండి పనుల పర్యవేక్షణలు.. పరిశీలనలు.

`ఎప్పటికప్పుడు సమీక్షలు.. సంప్రదింపులు.

`ఆదివాసీలా సంసృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మాణ పనులు.

ఆరు నెలలుగా మంత్రులు పడుతున్న శ్రమకు నిదర్శనాలు.

`అద్భుతమైన రోడ్లు… దశబ్దాలైనా చెక్కు చెదరకుండా ప్రాంగణ పరిసరాలు.

`నిరంతరం భక్తులకు సకల సౌకర్యాలు.

`ఒకప్పుడు జాతర సమయం లోనే భక్తులు వచ్చేవారు.

`ఇప్పుడు నిరంతరం భక్తులు అమ్మవార్లను దర్శించుకుంటున్నారు.

`అమ్మవార్ల చెంత నిద్రలు చేస్తున్నారు.

`అందుకు అనువైన సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు.

ఎన్నికల ముందు సీఎం రేవంత్‌ రెడ్డి మొక్కలు కోరుకున్నాడు.

`సీఎం రేవంత్‌ మేడారం అభివృద్ధి చేస్తామని చెప్పారు.

`ఇప్పుడు మాట నిలబెట్టుకుంటున్నారు.

`ఆదివాసీల ఆత్మ గౌరవం కోసం పాటుపడుతున్నారు.

`జనమే వనమై… అమ్మలు కోలువై!

`తల్లుల దీవెనల కోసం భక్తుల ఆరాటం.

`దండుగా భక్తులు చేరుకుని అమ్మలను దర్శించునే భాగ్యం.

`రెండేళ్ల కోసారి మూడు రోజుల జనారణ్యం!

`పూజలతో పులకించే పవిత్రమైన ప్రాంతం.

`అమ్మలు నడ యాడిన విశేషమైన సుందర లోకం.

గొప్ప ఆధ్యాత్మిక ప్రపంచం…అమ్మల నామస్మరణతో మార్మోగే అరణ్యం.

 

హైదరాబాద్‌, నేటిధాత్రి:                                             

 మేడారం అంటే ఓ గుడారం కాదు. ఓ కుగ్రామం అసలే కాదు. ఆదివాసీల ప్రజల రాజ్యం. పగిడిద్ద రాజు సంస్ధానం. ఆ రాజ్యాన్ని కాపాడిన దైవాంశ సంబూతురాలు సమ్మక్క. ఒక రకంగా చెప్పాలంటే ఆ ప్రాంతానికి దేవుడిచ్చిన వరం. సమ్మక్క దేవతా రూపం. ఇప్పటికీ మేడారాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న దేవతా మూర్తి సమ్మక్క. ఆ ప్రాంతానికి ఇలవేల్పు సమ్మక్క. ఆనాటి నుంచి నేటి వరకు పాలకుల చేత పూజలందుకుంటున్న ఇష్టదై వం సమ్మక్క. ఆదిశక్తికి ప్రతిరూపం. ప్రజలను కాపాడుకుంటున్న కుల దైవం. ఇప్పటికీ కొలిచే వారందరికీ కొంగు బంగారం. అడవిలో వెలసిన ఆడబిడ్డల ప్రతిరూపం. కుంకుమ బరిణ రూపంలో దర్శనమిస్తూ రెండేళ్లకోసారి పూజలందుకుంటున్న తీర్ధం. మేడారం మహిమాన్విత ప్రాంతం. ఆత్మగౌరవ పోరాటానికి తొలి సంతకం. తొలి చైతన్యానికి నిదర్శనం. తిరుగుబాటకు సంకేతం. ఎదిరించే నిలిచే గుండె ధైర్యానికి ఆదర్శం. తరతాలకు చెరగని, తరగని గుండె నిబ్బరాన్ని నింపిన కొండంత ఆశయం. అలాంటి మేడారంలో అడుగుపెడుతుంటేనే మనసు పులకించిపోతోంది. ఏదో ఒక శక్తి ఆవహించినంత సంతోషం కలుగుతుంది. జీవితం మీద ఆశలే కాదు, ఆశయాలు, ఆరోగ్యాలు, ఆనందాలు వెల్లివిరుస్తాయి. అందుకే మేడారం అంటేనే ఒక అద్భుమైన భావన. మేడారం తీర్దమనేది గొప్ప బావన. మనసుకు అనుభూతి నింపే దీవెన. సరిగ్గా ఏడు వందల సంవత్సరాల క్రితం నాటి రాజరిక పాలనలో పీదనకు వ్యతిరేకంగా ఆదివాసీలు సాగించిన ఆత్మగౌరవం పోరాటం. రాజులకు ఎదిరించి నిలిచిన దీర వనితల ఆత్మత్యాగం. అంత గొప్పది మేడారం చరిత్ర. అరివీర భయంకరంగా ఆదిశక్తులుగా మారి తల్లి కూతుళ్లయిన సమ్మక్క..సారక్కలు సాగిస్తున్న యుద్దాన్ని తట్టుకోలేక వెన్నుపోటు పొడిచి అమ్మలను చంపాలని చూశారు. కాకతీయ కాలంలో జరిగిన ఈ యుద్దం ఆనవాలు ఇంకా సజీవంగానే వున్నాయి. ఆ యుద్దంలో ప్రత్యర్ధులకు యుద్దఖైదీలుగా చిక్కకుండా వారి చేతుల్లో ప్రాణాలు పోకుండా వుండేందుకు చిలకలగుట్టమీదకు వెళ్లి అదృష్యమైన ఆదిశక్తి రూపాల అవతారాలే సమ్మక్క సారక్కలు. మేడారం గూడెంలో దైర్యం నింపారు. వారికి రక్షణగా నిలిచారు. దేవతలుగా మారి అడవినంతా కాపాడారు. కాకతీయ రాజుల నుంచి మేడారం ప్రాంతాన్ని కాపాడుకున్నారు. ఆదివాసీల రాజ్యాన్ని కాపాడారు. నాటి నుంచి నేటి వరకు ఆదివాసీలను కంటికి రెప్పలా కాపాడుకుం టున్నారు. వాళ్లే సమ్మక్క…సారక్కలు. యుద్దంలో వెన్ను చూపని వీరవనితలు, గాయాల బారిన పడిపోయారు. వెన్ను పోటును తట్టుకొని కాకతీయులకు చిక్కకుండా చిలకలగుట్టకు చేరుకున్నారు. ఆ తర్వాత మాయమైపోయారు. ఇది తెలిసిన కాకతీయ రాజులు భయపడ్డారు. అప్పటి నుంచి మేడారం వైపు చూడాలంటే జడుసుకున్నారు. ఏ కాకతీయ రాజుల మూలంగా ఎలా చనిపోయారో కాకతీయ కడపటి రాజు కూడా అలాగే చనిపోవడం ఖర్మఫలితం. సంపెంగ వాగులో దూకి చనిపోయేలా జంపన్నను ఎలా చిత్రహింసలు పెట్టారో అదే తరహాలో కాకతీయ రాజుల కడపడి రాజు ప్రతాపరుద్రుడు కూడా నర్మదా నదిలో దూకి చనిపోవాల్సిన పరిస్దితి ఎదురైంది. ఇది అమ్మల ప్రతీకారమని ఇప్పటికీ చెప్పుకుంటారు. అప్పటి నుంచి రెండేళ్లకోసారి మూడు రోజుల పాటు, ఆదివాసీ సంప్రదాయాల ప్రకారం, ఆదివాసీ పూజారులు సమ్మక్క, సారలమ్మ తీర్దాన్ని నిర్వహిస్తుంటారు. కన్నె పల్లి గుట్టల నుంచి సారలమ్మను మొదటి రోజు తీసుకొచ్చి గద్దె మీద ప్రతిష్టిస్తారు. రెండో రోజు చిలకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొస్తారు. సమ్మక్కను తీసుకొచ్చేపప్పుడు ప్రభుత్వం ఎస్పీ ఆధ్వరంలో గాలిలోకి కాల్పులు కాల్పులు జరుపుకుంటూ అమ్మవారిని తీసుకొస్తారు. ఇద్దరు తల్లులు మూడో రోజు భక్తులకు దర్శనమిస్తారు. ఇలా మూడు రోజుల పాటు సమ్మక్క, సారలమ్మ జాతర జరుగుతుంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద జాతర ఒక్క మేడారంలోనే జరుగుతుంది. ఈ మూడు రోజుల పాటు సాగే జాతరకు సుమారు 10 కోట్ల మంది భక్తులు హజరౌతుంటారు. తెలంగాణ, ఆంద్రప్రదేశ్‌ నుంచే కాకుండా, కర్నాకట, మహారాష్ట్ర, చత్తీస్‌ఘడ్‌, మధ్య ప్రదేశ్‌, ఒరిస్సాల నుంచి పెద్దఎత్తున ఆదివాసీ గిరిజనునలతోపాటు, ప్రజలు కూడా హాజరౌతుంటారు. 1996లోనే సమ్మక్క జాతరను రాష్ట్ర పండుగగా అప్పటి ప్రభుత్వంగుర్తించింది. తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం అదికారికంగా మరోసారి ప్రకటించింది. కుంభమేలను తలపించేలా జనం తండోపతండాలుగా కోట్లలో హజరౌతుంటారు. అమ్మకు మొక్కులు చెల్లిస్తుంటారు. అమ్మవారికి అంత్యంత ప్రీతిపాత్రమైన బంగారాన్ని నిలువెత్తు సమర్పిస్తారు. ఆమ్మను తమ కోరికలు తీర్చమని వేడుకుంటూ నిలువెత్తు బెల్లం సమర్పిస్తామని మొక్కుకుంటే తప్పకుండా ఆ కోరిక నెరవేరుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అందుకే పేరుకు ఆదివాసీ జాతరే అయినా కోట్లాది మంది ప్రజలకు ఇలవేల్పులుగా, కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా సమ్మక్క తల్లి కొలువబడుతోంది. ప్రతి ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. 

తాడ్వాయి మండలంలోని మేడారానికి వెళ్లాలంటే ఓ ముప్పై నలభై ఏళ్ల క్రితం వరకు కొంత గగనమే.. అడవిలో వున్న సమ్మక్క, సారలమ్మల దర్శనానికి భక్తులు కేవలం జాతర సమయంలోనే వెళ్లేవారు. మిగతా సమయాల్లో వెళ్లాలంటే భయపడేవారు.చుట్టూ వుండే అడవిలో క్రూరమృగాలు సంచరిస్తూ వుండేవి. సమ్మక్క , సారలమ్మ గద్దెల సమీపంలో కూడా పులులు సంచరిస్తూ వుండేవని పెద్దలు చెబుతుంటారు. పైగా అక్కడ వసతులు వుండేవి కాదు. మేడారం జాతర సమ యంలో తప్ప ప్రభుత్వ బస్సులు కూడా నడిచేవి కాదు. ప్రజలకు కూడా ఇప్పటిలాగా కార్లు అందుబాటులో లేవు. రోడ్లు కూడా సరిగ్గా వుండేవి కాదు. 1990 తర్వాత సౌకర్యాల కల్పన మొదలైంది. అయితే జాతర సమయాల్లో తాత్కాలిక సదుపాయాలు కల్పించేవారు. ఇలా ప్రతి రేండేళ్లకోసారి యుద్దప్రాతిపదికన పనులు చేపట్టేవారు. ఎందుకంటే ఆ సమయంలో మాత్రమే భక్తులు వచ్చేవారు. నాలుగో రోజు ప్రజలు అక్కడ వుండడానికి కూడా భయపడేవారు. మూడు రోజుల పాటు వనమంతా నిండిన జనం, నాలుగో రోజు మేడారం నిర్మాణుష్యమయ్యేది. ప్రభుత్వం కూడా ప్రజలను ఖాళీ చేసి వెళ్లిపొమ్మని కోరేది. కాని ఇప్పుడు శాశ్వత సౌకర్యాల కల్పన జరిగింది. మూడువందల అరవైఐదు రోజుల పాటు భక్తులు సమ్మక్క సారలమ్మలను దర్శించుకుంటున్నారు. మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మల సన్నిదిలో నిద్రలు చేస్తున్నారు. మొక్కులు తీర్చుకొని అక్కడే బస చేస్తున్నారు. ఈసారి కాంగ్రెస్‌ ప్రభుత్వం అదికారంలోకి వస్తే, సమ్మక్క, సారక్క జాతరలను నభూతోన భవిష్యతి అనేలా నిర్వహిస్తామని, మేడారాన్ని శాశ్వత నిర్మాణాలతో అభివృద్ది చేస్తామని, మేడారానికి భక్తులు రావడానికి అవసరమైన రోడ్డు రవాణా సౌకర్యాలు అద్భుతంగా కల్పిస్తామని సిఎం. రేవంత్‌ రెడ్డి మొక్కుకున్నారు. ఆ మొక్కులు తీరేలా ఆదివాసీ సంప్రదాయాలు ఉట్టిపడేలా మేడారానికి కొత్త కొత్త హంగులు తీసుకొచ్చారు. రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, మంత్రి సీతక్క, దేవాదాయ శాఖ మంత్రి సురేఖలు గత ఆరు నెలలుగా మేడారాన్ని దగ్గరుండి అభివృది చేయిస్తున్నారు. రాష్ట్ర ఫ్రభుత్వం అందుకోసం రూ.300 కోట్లు కేటాయించింది. గత రెండేళ్ల క్రితం జాతరకు వచ్చిన భక్తులు కూడా ఇప్పుడున్న మేడారం పరిసరాలను గుర్తుపట్టలేరు. కొన్ని సంవత్సరాలైనా సరే చెక్కు చెదకుండా వుండేలా రోడ్లతోపాటు, మేడారం గద్దెల ప్రాంగణాలతోపాటు, చుట్టుపక్కల పరిసరాలన్నీ పటిష్టమైన నిర్మాణాలతో తీర్చిదిద్దుతున్నారు. పైగా ఇప్పటి వరకు గద్దెల చుట్టూ ఇనుప కంచెలు వుండేవి. ఇప్పుడు గ్రానైట్‌ రాయితో కూడిన, శతాబ్దాల పాటు చెక్కుచెదరని గద్దెల నిర్మాణం చేపట్టారు. గద్దెల నుంచి మొదలు, ఆలయ ప్రాంగణమంతా గ్రానైట్‌ రాయితో ఆలయ స్వరూపం తీసుకొచ్చారు. తోరణాలను నిర్మాణం చేశారు. ఆ తోరణాలపై ఆదివాసీ సంస్కృతీ సంప్రదాయలను ఆదివాసీ బాషలో చెక్కడం జరిగింది. సమ్మక్క సారక్కల కుటుంబ చరిత్రలోపాటు, వారి వంశస్తులు, పూర్వీకుల గురించి తెలిసేలా బొమ్మల లిపిలో వుండే ఆదివాసీ బాషలో రాయిపై వాటిని చెక్కారు. శతాబ్దాలపాటు చెక్కు చెదరకుండా, భవిష్యత్తు తరాలు ఆదివాసీ చరిత్రను మర్చిపోకుండా గుర్తు చేసేలా నిక్షిప్తం చేశారు. మేడారాన్ని ఇలా తీర్చిదిద్ది సిఎం. రేవంత్‌ రెడ్డి తన మొక్కులు చెల్లించుకున్నారు. జాతర చరిత్రలోనే తొలిసారి ప్రజా ప్రభుత్వం క్యాబినేట్‌ మీటింగ్‌ కూడా ఏర్పాటు చేశారు. మేడారం రాజ్యంలో తల్లుల సన్నిధిలో తెలంగాణ ప్రభుత్వ మంత్రుల సమావేశం…అధ్భుత నిర్ణయం.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version