పరకాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది.మొత్తం 22 వార్డులలో జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 13 కౌన్సిలర్ స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది.దీంతో పరకాల మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం అయింది.ఎన్నికల ఫలితాల ప్రకారం 22 స్థానాల్లో 13 సీట్లు దక్కించుకోవడంతో కాంగ్రెస్‌కు పూర్తి ఆధిక్యం లభించింది. మేజిక్ ఫిగర్ 12 కాగా,కాంగ్రెస్ దానికంటే ఒక సీటు ఎక్కువ సాధించింది.ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. ఫలితాలు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నాయకులు,కార్యకర్తలు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు.పట్టణంలోని పలు ప్రాంతాల్లో సంబరాలు కనిపించాయి.బీఆర్‌ఎస్ పార్టీ 6 స్థానాలతో రెండో స్థానంలో నిలిచింది.బీజేపీ 3 సీట్లు సాధించి తమ ఉనికిని చాటుకుంది.మున్సిపల్ పాలనలో ఇకపై కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనుంది.
కోహిర్ : సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం చాటుకుంది. మొత్తం 16 వార్డుల్లో 8 సీట్లు గెలుచుకొని మెజారిటీ సాధించింది. బీఆర్ఎస్ 5 సీట్లు దక్కించుకోగా, ఎంఐఎం 1 సీటు, ఒక బీజేపీ 1, స్వతంత్ర అభ్యర్థి 1 సీటు, గెలుపొందినట్లు సమాచారం. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ.
భూపాలపల్లి నేటిధాత్రి
భూపాలపల్లి మున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగుతున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి రాహుల్ శర్మ తెలిపారు. బుధవారం జడ్పి ఉన్నత పాఠశాల, హనుమాన్ నగర్‌లోని మాస్టర్ మైండ్ పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో మొత్తం 52,726 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించు కోనున్నారని తెలిపారు. వీరిలో 26,786 మంది పురుషులు, 25,936 మంది మహిళలు, ఇతరులు 4 మంది ఉన్నారని పేర్కొన్నారు. మొత్తం 30 వార్డులకు 86 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నికల నిర్వహణ కోసం 104 మంది ప్రెసైడింగ్ అధికారులు, 104 మంది అసిస్టెంట్ ప్రెసైడింగ్ అధికారులు, 312 మంది ఇతర పోలింగ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారని వివరించారు.
అనంతరం ఐడిఓసి కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు. 86 పోలింగ్ కేంద్రాల్లో 149 వెబ్‌కాస్టింగ్ యూనిట్ల ద్వారా ప్రత్యక్ష పర్యవేక్షణ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని కేంద్రాల్లో లోపల మరియు బయట రెండు చోట్లా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ హరికృష్ణ, తహసీల్దార్ శ్రీనివాసు, ఈడీఎం శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే
◆-::జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య
జహీరాబాద్ నేటి ధాత్రి:
సంగారెడ్డి జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, ఆందోల్–జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా, సంబంధిత మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు మరియు వ్యాపార సంస్థల్లో (ఫర్ములు) పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, 1881 ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపుకు ముందు రోజు ఫిబ్రవరి 12 (గురువారం) మరియు లెక్కింపు రోజు ఫిబ్రవరి 13 (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కోరారు.
మున్సిపల్ ఎన్నికలు.. తెలంగాణలోని ఆ ప్రాంతాల్లో వైన్స్ బంద్
◆-: రేపు సాయంత్రం వరకు ఆంక్షలు
◆-: ఓట్ల లెక్కింపు రోజైన 13న కూడా మద్యం అమ్మకాలపై నిషేధం
◆-: నిబంధనలు మీరితే లైసెన్సులు రద్దు చేస్తామని అధికారుల హెచ్చరిక
◆-: 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎల్లుండి పోలింగ్
జహీరాబాద్ నేటి ధాత్రి:
తెలంగాణలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అధికార యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు వీలుగా పోలింగ్ జరిగే ప్రాంతాల్లో రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు, బార్లను మూసివేయాలని ఆదేశాలు జారీ చేసింది. శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు స్పష్టం చేశారు.
ఎన్నికల ప్రచారం ముగిసే సమయమైన ఇవాళ సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే ఫిబ్రవరి 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మద్యం అమ్మకాలపై పూర్తి నిషేధం విధిస్తున్నట్లు ఎన్నికల, ఎక్సైజ్ శాఖ అధికారులు ప్రకటించారు. అంతేకాకుండా ఓట్ల లెక్కింపు జరిగే ఈ నెల 13వ తేదీన కూడా పూర్తిస్థాయిలో వైన్స్, బార్లను మూసివేయాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఈ నిబంధనలను అతిక్రమించి ఎవరైనా మద్యం విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు లైసెన్సులను రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభపెట్టకుండా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా నివారించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ ఆంక్షలు కేవలం ఎన్నికలు జరిగే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలోనే అమల్లో ఉంటాయని, రాష్ట్రవ్యాప్తంగా వర్తించవని స్పష్టం చేశారు.
రాష్ట్రంలోని మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎల్లుండి పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే ఈ పోలింగ్‌లో సుమారు 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ నెల 13న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు.
కాగా, రాష్ట్రంలోని 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు మహబూబ్‌నగర్, మంచిర్యాల, కొత్తగూడెం, నల్గొండ, కరీంనగర్, రామగుండం, నిజామాబాద్ కలిపి మొత్తం 123 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మెుత్తం 2,996 వార్డులకు అభ్యర్థులు బరిలో ఉన్నారు.
పట్టణంలోని మాదారం కాలనిలో నిరుపేద కుటుంబానికి చెందిన గూడెల్లి మల్లమ్మ కాన్సర్ వ్యాధితో బాధపడుతుంది.పేద కుటుంబం కావడంతో ఆసుపత్రి ఖర్చులకు కూడా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకున్న 10వార్డ్ బీఆర్ఎస్ కౌన్సిలర్ అభ్యర్థి పిట్ట స్వప్న-దేవేందర్ భాధిత కుటుంబాన్ని ఆదుకున్నారు.ఎన్నికల వేల ఓటర్లను వల వేసుకోవడానికి మధ్యం మాంసం పంపిణి చేస్తున్న నాయకులను చూసాం కానీ గెలుపోటములు లెక్క చేయకుండా పేద కుటుంబాలను ఆదుకునే మహాత్తర కార్యక్రమాలు చేస్తున్న స్వప్న -దేవేందర్ లాంటి నాయకులను చూసి ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడంటే ప్రజలకు సేవ చేసే వాడై ఉండాలని కాలనీ వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ప్రజలు మాకు అవకాశం ఇస్తే 10వార్డ్ అభివృద్ధితో పాటు, ప్రజల కష్టసుఖాల్లో పాలు పంచుకుంటానని నిత్యం ప్రజల మధ్యే ఉంటామని హామీ ఇచ్చారు.భేశాజ్వలాలకు పోకుండా కుల మతాలకు అతీతంగా ప్రజా సేవకు అంకితం అవుతామని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులు శ్యామ్,చెరుకు సుధాకర్, బుస్స చిన్న భద్రయ్య, మంద సదానందం,గూడెల్లి దశరధం,గూడెల్లి రాజా రమేష్,మంద నాగరాజు,కోగిల శ్యామ్,కాలనీ వాసులు గూడెల్లి శివకుమార్, కొమురయ్య, సరోజన తదితరులు పాల్గొన్నారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో బాగంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు పల్లె రాజు పద్దెనిమిదో వార్డులో జోరుగా ప్రచారం నిర్వహించారు. పల్లె రాజు శ్రీదేవి పద్ధెనిమిధో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని అశోక్ నగర్ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా కాంగ్రెస్ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు పద్ధెనిమిదవ వార్డ్ అభ్యర్ధి గా స్థానిక మంత్రి వివేక్ వెంకటస్వామి బల పరచారని తెలిపారు. హస్తం గుర్తు కు ఓటు వేసి బారి విజయం అందించాలని కోరారు.
మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలి
జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల,నేటి ధాత్రి:
2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా ఈ నెల 11వ తేదీన జరుగనున్న పోలింగ్ ప్రక్రియ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.బుధవారం జిల్లాలోని నస్పూర్ లో గల సమీకృత జిల్లా కార్యాలయాల భవన సమావేశ మందిరంలో మాస్టర్ ట్రైనర్ల ఆధ్వర్యంలో పి.ఓ., ఎ.పి.ఓ. లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ మాట్లాడుతూ 2వ సాధారణ మున్సిపాలిటీ/మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలలో భాగంగా పోలింగ్ ప్రక్రియ ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు.ప్రతి పోలింగ్ కేంద్రంలో 800 ఓటర్లకు మించకుండా పోలింగ్ జరిగేలా ఏర్పాట్లు చేయడం జరిగిందని, ప్రతి పోలింగ్ కేంద్రంలో కేటాయించబడిన సిబ్బందికి పోలింగ్ ప్రక్రియలోని ప్రతి అంశం తెలిసి ఉండాలని,ఓటింగ్ కంపార్ట్మెంట్ గోప్యత నిర్వహణ సక్రమంగా చేయాలని తెలిపారు.ఇతరులకు బదులుగా ఓటు వేయడం, ఒకటికి మించి ఓటు వేయడం జరగకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని,పోలింగ్ ముగిశాక తీసుకోవలసిన జాగ్రత్తలు,పాటించవలసిన నియమాలపై శిక్షణలో తెలియజేయడం జరుగుతుందని తెలిపారు.పోలింగ్ అధికారులకు కేంద్రాలలో త్రాగునీరు,మూత్రశాలలు, లైటింగ్,ఫ్యాన్ వంటి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించడం జరుగుతుందని, గర్భిణీ స్త్రీలు,బాలింతలు మినహాయింపు కోరినట్లయితే ఆమోదించడం జరుగుతుందని,మిగతా వారికి అత్యవసర ఆరోగ్య పరిస్థితులు,ఇతర ఇబ్బందులు తలెత్తితే తప్ప పోలింగ్ విధులలో మినహాయింపు ఉండదని తెలిపారు.11వ తేదీన పోలింగ్ నిర్వహించడం జరుగుతుందని,12 రీపోలింగ్ (ఏమైనా ఉన్నట్లయితే),13వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టడం జరుగుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మంచిర్యాల నగరపాలక సంస్థ కమిషనర్ అన్వేష్, మాస్టర్ ట్రైనర్ హరిప్రసాద్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
క్యాతన్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో భాగంగా బిఆర్ఎస్, సిపిఐ పార్టీ కలిసి పోటీ చేస్తున్న నేపద్యంలో ఒకటో వార్డులో సిపిఐ పార్టీ అభ్యర్థి కౌడగాని సాంబయ్య జోరుగా ప్రచారం నిర్వహించారు. ఒకటో వార్డ్ లో తనను గెలిపిస్తే నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని, తారక రామ కాలనీ, అల్లూరి సీత రామ రాజు నగర్ ల అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ప్రచారంలో భాగంగా కూటమి బలపరిచిన అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని ప్రచారం నిర్వహించారు. 40 ఏండ్లు గా సీ. పి. ఐ పార్టీ లో కార్య కర్త గా కొనసాగుతున్న తనకు ఒకటో వార్డ్ అభ్యర్ధి గా సీ.పి. ఐ& బి. ఆర్.ఎస్ లు బల పరచారని తెలిపారు. కంకి కొడవలి గుర్తు కు ఓటు వేసి బారి విజయం అందించాలని కోరారు.
జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగులు… వాళ్లే బి.ఫాంలు పంచుతున్నారు
స్పీకర్ గారు… అయినా మీ కళ్లకు కన్పించడం లేదా?
స్పీకర్ పదవికి మచ్చ తేవడం న్యాయమేనా?
ప్రజలారా…ఓట్ల కోసం వచ్చే ఫిరాయింపు ఎమ్మెల్యేలను నిలదీయండి
వాళ్లు ఏ పార్టీలో ఉన్నారు…ఎందుకు ఓటేయాలని అడగండి
మాకు భయపడి కేటీఆర్ సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నారట
కేటీఆర్…నా జోలికొస్తే నీ బతుకును రోడ్డుకీడుస్తా
నీ అరాచకాలు, నువ్వు చేసిన నీచ పనులన్నీ బయటపెడతా
కేంద్రం నిధులిస్తే…ఆ నిధులను మింగి సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో సిరిసిల్లకు నయాపైసా ఇయ్యలే
కాంగ్రెస్ వద్ద నయాపైసా లేదు… వాళ్లకు ఎందుకు ఓటేయాలి?
అందుకే 6 గ్యారంటీలను అమలు చేయలేకపోతున్నారు
మళ్లీ ఓట్ల కోసం మోసపూరిత హామీలతో మీ ముందుకొస్తున్నారు
కాంగ్రెస్ దొంగ హామీలను నమ్మి మోసపోతే 5 ఏళ్ల అరిగోస తప్పదు
సిరిసిల్ల ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ లపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్
భారీ ఎత్తున తరలివచ్చిన జనం… కార్యకర్తల జోష్ తో సిరిసిల్లలో ఎన్నికల సందడి
సిరిసిల్ల(నేటి ధాత్రి):
ఫిరాయింపుల విషయంలో కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యభిచారం చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ధ్వజమెత్తారు. ఆయా ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినట్లు ఆధారాల్లేవంటూ శాసనసభ స్పీకర్ తీర్పు ఇవ్వడం దుర్మార్గమని అన్నారు. ‘‘స్పీకర్ సార్…మీరు నిజాయితీ పరులు. మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఎందుకంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలు గాంధీభవన్ లోనే సంసారం చేస్తున్నరు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో మీటింగ్ లు పెడతారు. వాళ్ల చేతికే బి.ఫాంలు ఇస్తరు. కళ్ల ముందే ఇవన్నీ కన్పిస్తున్నా పార్టీ మారినట్లు ఆధారాల్లేవని కేసు కొట్టివేయడం దారుణం.’’అని విమర్శించారు. ఇలాంటి తీర్పులతో ప్రజాస్వామ్యం అపహాస్యమవుతోందన్నారు. రాజ్యాంగబద్దమైన స్పీకర్ పదవిపై మచ్చ పడి చరిత్ర హీనులు కావొద్దని కోరారు. ఈ సందర్భంగా ఫిరాయింపు ఎమ్మెల్యేలున్న నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి ‘‘మీ నియోజకవర్గంలో ఓట్ల కోసం వస్తున్న మీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో అడగండి. ఈ ఎన్నికల్లో ఏ పార్టీకి ఓటేయాలి? ఏ అభ్యర్ధిని గెలిపించాలని నిలదీయండి. ఒక పార్టీ నుండి గెలిచి ఇంకో పార్టీ కండువా కప్పుకుని గెలుపు కోసం ఎందుకు పనిచేస్తున్నారో అడుగడుగునా నిలదీయండి’’’అని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల కు విచ్చేసిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అంబేద్కర్ సర్కిల్ వద్ద నిర్వహించిన స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లో పాల్గొన్నారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె. సంగప్పతోపాటు పార్టీ జిల్లా నేతలు, బీజేపీ పక్షాన పోటీ చేస్తున్న అభ్యర్థులంతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడికి తరలి వచ్చిన వేలాది మంది ప్రజలను ఉద్దేశించి బండి సంజయ్ ప్రసంగించారు. ఏమన్నారంటే….
మాకు భయపడి కేసీఆర్ కొడుకు సిరిసిల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10 వేలు ఇస్తున్నడట. ఆ డబ్బులు మనవే. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిపల్ ఛైర్మన్ పీఠాన్ని అప్పగించండి.
మొన్నటిదాకా సిరిసిల్ల మున్సిపల్ పీఠాన్ని బీఆర్ఎస్ కు అప్పగిస్తే… ఏం జరిగింది? వానొస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నయ్. ఆఖరికి జిల్లా కలెక్టరేట్ కూడా మునిగిపాయే. పడవల్లో, ట్రాక్టర్లలో పోవాల్సిన దుస్థితి.
మురికి నీటి శుద్ధి ప్లాంట్ పేరిట పద్మనగర్లో ఎస్ టి పి ప్లాంట్ నిర్మిస్తే ఏమైంది? మురికి కాలువ నీళ్లన్నీ ఊళ్లకు వస్తున్నయ్. తలకాయ ఉన్నోడు ఎవడైనా అట్ల చేస్తరా?
వస్త్ర పరిశ్రమ మొత్తం సిరిసిల్లలో ఉంటే… నూలు (యారన్) డిపోను వేములవాడలో పెడతారా ఎవరైనా? డిపో ఈడ పెడితే వాళ్ల కమీషన్లన్నీ తెలుస్తదని ఆడ పెట్టిర్రు. ప్రతి కిలో పై కాంగ్రెస్ నేతలు కమిషన్లు దొబ్బుతున్నారు.
కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో సిరిసిల్లలో ఒక్కటంటే అభివృద్ధి కార్యక్రమం కూడా చేయలేదు. సిమెంట్ రోడ్లు, మురికి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్ విఫలమైంది.
సుందరీ కరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువును కూడిక చేయకుండా, మధ్యలో ఐలాండ్ నిర్మించి దాని నీటిలో సామర్థ్యాన్ని గత బీఆర్ ఎస్ ప్రభుత్వం తగ్గించింది. కొత్తచెరువు నీళ్లు కొద్దిపాటి వర్షానికి ఊర్లోకి వస్తున్నాయి. ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకమే.
ఇక టెక్స్టైల్ పార్క్ పరిస్థితి దారుణంగా ఉంది. పరిశ్రమలు మూతపడ్డాయి. 220 యూనిట్లు నడవాల్సి ఉంటే ఇప్పుడు, పది షెడ్లలో పని ఉంది. 200 షెడ్లు మూతపడ్డాయి. నేత కార్మికులకు ఉపాధి కల్పించడంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయి.
సిరిసిల్ల పట్టణంలో రఘుడు, చందంపేట, ముష్టి పెళ్లి, చిన్న బోనాల, పెద్ద బోనాల, పెద్దూరు, సర్దాపూర్ వంటి ఏడు శివారు గ్రామాలను బలవంతంగా సిరిసిల్లలో కలిపి, అక్కడి ప్రజలకు ఉపాధి హామీ లేకుండా బిఆర్ఎస్ ప్రభుత్వం చేసింది.
ఈ ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం నుంచి తప్పించి మళ్లీ గ్రామ పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్ నేతలు హామీ ఇచ్చిన విస్మరించారు. పదేళ్లలో విలీన గ్రామాల్లో మురికినీటి సమస్య రోడ్ల సమస్య ఎప్పటిలాగే ఉంది. పైపెచ్చు ఇంటి పన్నులు ఇతర ట్యాక్స్ లు పెంచారు.
జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పాత బస్టాండ్లో పార్కింగ్ స్థలం లేదు. సిరిసిల్లలో ట్రాఫిక్ సమస్యలు ఎదురవుతున్నాయి. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదు. మున్సిపల్ లో కౌన్సిలర్ల అవినీతి కాంట్రాక్టర్ల అక్రమాలతో గత పాలన అవినీతిమ ఏమైంది. మరి బీజేపీ ఏం చేసిందని ఓటేయాలని మాట్లాడుతున్న వాళ్లకు నేను చెప్పే సమాధానమొక్కటే…
ఇప్పటి వరకు 14, 15వ ఆర్ధిక సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి దాదాపు 29 కోట్లు ఇచ్చినం. అమ్రుత్ పథకం ద్వారా రూ.50 కోట్లు ఇచ్చినం. మేం ఇంత పెద్ద ఎత్తున పైసలిస్తే… సక్రమంగా వినియోగించకుండా డబ్బులన్నీ వ్రుధా చేస్తున్నరు. కమీషన్లు సంపుకుంటున్నరు. పైప్ లైన్ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయినయ్.
ప్రధానమంత్రి స్వనిధి ద్వారా ఈ సిరిసిల్ల పట్టణంలోని 11 వేల 737 మందికి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేందుకు 21 కోట్ల 52 లక్షలు ఇచ్చినం. స్వచ్ఛ భారత్ ద్వారా ఈ మున్సిపాలిటీకి రూ.44 లక్షలు ఇచ్చినం. సిరిసిల్లకు వరదల లెక్క కేంద్రం నిధులు తీసుకొస్తే…సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నరు. ఇదిగో బుక్ లెట్… ఇంటింటికీ పంపిస్తున్నా..చదువుకోండి. బీజేపీ రాష్ట్రంలో, ఈ మున్సిపాలిటీలో అధికారం లేకపోయినా కేంద్రం నుండి మోదీగారిని ఒప్పించి నిధులు తీసుకొచ్చిన.
మేం అభివ్రుద్ధి మాట్లాడుతున్నం. నా కోసం ఇక్కడి కార్యకర్తలు కష్టపడి పనిచేస్తున్నరు. మీ ఇంటింటికీ తిరిగి ఓట్లు అడుగుతున్నరు. వాళ్ల కోసమే నేను వచ్చిన. పువ్వు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరుతున్నా.
మోదీ ప్రభుత్వం 2 లక్షల ఇండ్లకు పైసలిస్తే ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం సిరిసిల్లలో ఒక్కరికి ఇల్లు ఇయ్యలే. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇయ్యాలని చెబితే నాపై కేసు పెట్టి జైలుకు పంపారు. ఇదేందని అడిగిన బీజేపీ కార్యకర్తలను కొట్టి జైలుకు పంపిర్రు.
నేను కేసీఆర్ కొడుకు లెక్క అయ్య పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి రాలేదు. కార్యకర్తగా కష్టపడి మీకోసం లాఠీదెబ్బలు తిన్న. జైలుకు పోయిన.
మరి నువ్వేం(కేటీఆర్) చేసినవ్. మా కార్యకర్తలను కొట్టి జైలుకు పంపుతవా? బిడ్డా.. నీ సంగతి చూస్తా.. మళ్లీ నువ్వు ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బండారం అంతా బయటపెడతా. ప్రజలు నీ కంటే నాకు ఎక్కువ ఓట్లేసి గెలిపించారు. 2.26 లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించారు. మొన్న వానలొచ్చి పేదలు మునిగిపోతే వాళ్లను కాపాడే సోయి కేటీఆర్ కు ఉందా? నేను హెలికాప్టర్ తీసుకొచ్చి ముంపు బాధితులను కాపాడిన. నేను కేంద్రం నుండి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే…. కేటీఆర్ మాత్రం ఆ నిధులను దారి మళ్లించి కమీషన్లు దొబ్బితిన్నవ్.
బీఆర్ఎస్ కార్యకర్తలారా… మీ కష్టాలను బీఆర్ఎస్ పట్టించుకోదు. ఎన్నికల్లో మిమ్ములను ఆదుకునే పరిస్థితి లేదు. కష్టమొస్తే ఆదుకునేది బీజేపీయే. నేను అండగా ఉంటా. బీజేపీలోకి రండి.
ఇగ కాంగ్రెస్ ను అడుగుతున్నా… ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేశారా? మహిళలకు రూ.2500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా? అవ్వాతాతలకు రూ.4 వేల పెన్షన్ ఇచ్చారా?
అసలు ఇవ్వడానికి కాంగ్రెస్ దగ్గర పైసలున్నయా? నన్ను కోసినా నయాపైసా ప్రభుత్వం వద్ద లేదని సీఎం రేవంత్ రెడ్డే చెప్పిండు. మరి యాడ నుండి తీసుకొచ్చి అభివ్రుద్ది చేస్తరు? నిధులు ఇచ్చేది కేంద్రం… తెచ్చేది నేనే. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే… పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారు. ఆయన మాటగా చెబుతున్నా… మేయర్ పీఠాన్ని మాకు అప్పగించండి.
లేనిపక్షంలో కేంద్రం ఇచ్చిన నిధులను దారి మళ్లిస్తరు. పైసలు మావి…ప్రగతి మాది… సోకులు వాళ్లవి…కమీషన్లు వాళ్లవి… మళ్లీ అట్లాంటోళ్లకు మళ్లీ ఓట్లేస్తారా? ఆలోచిస్తారా?
కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో రాజకీయ వ్యభిచారం చేస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గాంధీభవన్ లో సంసారం చేస్తున్నారు. జిల్లా కాంగ్రెస్ ఆఫీసుల్లో సంసారం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలతో మీటింగ్ లు పెడుతున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకే కాంగ్రెస్ బి.ఫాంలు ఇస్తున్నారు. వాళ్లే టిక్కెట్లు ఇస్తున్నారు.. ఇయాళ ఫిరాయింపులు స్పీకర్ గారు ఫిరాయింపు కేసును కొట్టివేయడం దుర్మార్గం. స్పీకర్ సార్… మీరు నిజాయితీపరులు. మీరున్నది రాజ్యాంగ పదవిలో. ప్రజాస్వామ్యాన్ని కాపాడే పదవిలో.. కానీ మీపై కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లు ఆధారాల్లేవని ఫిరాయింపుల కేసును కొట్టివేయడం తగదు. మీపై మచ్చ పడుతుంది. చరిత్రలో మసక బారి పోతారు. మీ తీర్పును చూసి జనం నవ్వుకుంటున్నారు.
ప్రజాలారా…. ఫిరాయింపు ఎమ్మెల్యేలు మీ వద్దకొస్తే నిలదీయండి. మీరు ఏ పార్టీ తరపున వచ్చారు? ఏ పార్టీని గెలిపించాలి? ఏ పార్టీ అభ్యర్ధికి ఓటేయాలి? అనే నిలదీయండి.
బీజేపీ మీ మాదిరిగా రాజకీయ వ్యభిచారం చేయదు. ప్రజాస్వామ్య స్పూర్తితో పనిచేస్తోంది. ఇతర పార్టీల ఎమ్మెల్యేలు మా వద్దకు రావాలంటే రాజీనామా చేయాల్సిందే. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేశాకే బీజేపీలోకి తీసుకున్నామనే విషయాన్ని గుర్తుంచుకోండి.
కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల నీచ రాజకీయాలకు బుద్ది చెప్పండి. వాళ్ల అవినీతి, అక్రమాలకు చెంపపెట్టుగా తీర్పు ఇవ్వండి. బీజేపీ అభ్యర్థుల దగ్గర పైసల్లేకపోవచ్చు. కానీ మీ కోసం కొట్లాడే దమ్ముంది? పైసలు రప్పించే తెగువ ఉంది? మేం మీ ప్రగతి గురించి, మీ బాగోగుల గురించి ఆలోచిస్తున్నారు. వాళ్లు అవినీతి, కమీషన్ల కోసం ఆలోచిస్తున్నారు. అందుకే ఆలోచించి ఓటేయండి. కమలం పువ్వు గుర్తుకు ఓటేసి సిరిసిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగించాలని కోరుతున్నా…
కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి రద్దు కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిధాత్రి .
మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందుకు కలెక్టర్ కార్యాలయం లో ప్రజావాణి కార్యక్రమం రద్దు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికలు పూర్తయి కోడ్ ముగిసే వరకు ప్రజావాణి కార్యక్రమం ఉండదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని జిల్లాలోని ప్రజావాణి దరఖాస్తు దారులు గమనించి సహకరించాలని కలెక్టర్ ఆదర్శ్ సురబి కోరారు దరఖాస్తులు ఫిర్యాదులు తీసుకుని రావొద్దని ఒక ప్రకటన లో ప్రజలను కోరారు
భూపాలపల్లి మున్సిపల్ పరిధిలోని 27వ వార్డులో కాంగ్రెస్,సిపిఐ సిపిఐఎం కూటమి అభ్యర్థి ఎర్రం అనూషను సుత్తే కొడవలి చుక్క గుర్తు పై మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజారిటీతో గెలిపించాలని సిపిఐ ఎం జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపునిచ్చారు సోమవారం జిల్లా కేంద్రంలోని 27వ వార్డు లోని హైటెక్ కాలనీ, రెవెన్యూ కాలనీ,సత్తార్ నగర్,జవహర్ నగర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా బంధు సాయిలు మాట్లాడుతూ… ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు భూపాలపల్లి మున్సిపాలిటీని అత్యాధునిక అంగులతో భవిష్యత్తు తరాలకు అనుగుణంగా భూపాలపల్లి మున్సిపాలిటీని అభివృద్ధి చేయడానికి ప్రజలు తమ వంతుగా ఓటు హక్కుతో 27వ వార్డు అభ్యర్థిని ఎర్ర ఆనుషను అధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఎర్రం సతీష్ కుమార్,ఐద్వా అధ్యక్ష కార్యదర్శులు వంగాల లక్ష్మి,సంఘం ప్రీతి, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి గుర్రం దేవేందర్,సిపిఎం నాయకులు రాజేందర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
* మునిసిపల్ ఎన్నికల సాక్షిగా కాంగ్రెస్ కు బీటలు * బిఆర్ఎస్ గూటికి 400 మంది కాంగ్రెస్, బీజేపీ నేతలు * దడ పుట్టిస్తున్న మునిసిపల్ ఎన్నికలు * ఆగమాగంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు * కండువా కప్పి ఆహ్వానించిన మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :
మోరాయిస్తున్న సీనియర్లు, బి ఫారం పంచాయతీలతో ఆ పార్టీలు ఆగమాగం అవుతున్నాయి. పార్టీ పీరా ఇంపులతో తలలు పట్టుకుంటున్నాయి. పార్టీలను విడుతున్న నేతలను బుజ్జగించడంలో గోరంగా విఫలం అవుతున్నాయి. ఇది ఎక్కడో కాదు మేడ్చల్ నియోజకవర్గం లోనే. మునిసిపల్ ఎన్నికల హడావిడి మొదలవగానే పార్టీ పీరాఇంపులు మొదలయ్యాయి. మల్లన్న దూకుడుకు కాంగ్రెస్, బీజేపీ లు కంగూటింతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ పార్టీల నుండి బిఆర్ఎస్ బాట పట్టారు. వందల సంఖ్యలో కార్యకర్తలు, ముఖ్యనేతలు బిఆర్ఎస్ లో చేరడం చర్చనియా అంశాంగా మారింది. మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ 22 వ వార్డు కొనాయిపల్లి – మైసిరెడ్డిపల్లి, ఎల్లంపేట్ మున్సిపాలిటీ సోమరం, ముడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అనంతారం, అలియాబాద్ మునిసిపల్ అలియాబాద్ నుండి సుమారు 400 మంది బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.
కొనయపల్లి లో… గ్రామ అధ్యక్షులు గుంటి దీపక్ ముదిరాజ్, గ్రామ మాజీ సర్పంచ్ గుంటి శేఖర్ ముదిరాజ్, గుంటి కుమార్ ల ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుంటి చిన్న కుమార్, గుంటి భాస్కర్, అన్నారం శ్యామ్ కుమార్, గుంటి నర్సింగరావు, సంచులింగం, జక్కుల ప్రవీణ్, జక్కుల వంశీ, బోయిని సత్యనారాయణ, అన్నారం నరసింహ, జక్కుల శోభ, బోయిని కుమార్, జక్కుల యాదగిరి, జక్కుల బిక్షపతి, జక్కుల కృష్ణ, ఉప్పరి సత్తయ్య, జక్కుల చిన్న బిక్షపతి, గుంటి మహేందర్ మరియు దాదాపు 100 మంది మహిళాలు, యువకులు.
సోమారం లో… సోమరం కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ కరుణకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ వెంకటేష్, మాజీ వార్డ్ మెంబెర్ సి హెచ్ రమేష్, మాజీ ఉప సర్పంచ్ ఆర్.కృష్ణ, ఆర్. బలరాం, బి చంద్ర శేఖర్, అశోక్ లు.
అలియాబాద్ లో… అలియాబాద్ మున్సిపాలిటీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బండి లక్ష్మి, బండి రామ్ రెడ్డి, బండి శ్రీకర్ రెడ్డి లతో పాటు 20.
ఎల్లగూడెం లో…. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎల్లం వెంకటేష్, రమేష్, సంతోష్, సాయి కిరణ్, కాంగ్రెస్, బీజేపీ నుండి 60 మంది.
ఆనంతారంలో… కాంగ్రెస్, బీజేపీ పార్టీ నాయకులు కొల్లా స్వప్న, బుద్ది నరేష్, ముద్దమ్ శ్రవణ్ రెడ్డి, మామిడాల వెంకటేష్ గౌడ్, స్వామితో పాటు 30 మంది పార్టీ లో చేరగా విరందరికి గులాబీ కండువా కప్పి పార్టీ లోకి మాజీ మంత్రి మేడ్చల్ శాసనసభ్యులు మల్లారెడ్డి ఆహ్వానించారు.
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియను పరిశీలించిన ఎన్నికల అబ్జార్వర్ కొర్ర
లక్ష్మీ ఐఏఎస్
మూడు చింతలపల్లి అలియాబాద్ మున్సిపాలిటీలో పర్యటన
నామినేషన్ ప్రక్రియ, స్ట్రాంగ్ రూముల పరిశీలన
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటి ధాత్రి :
మేడ్చల్ నియోజకవర్గం లో నిర్వహిస్తున్న ఎన్నికల ప్రక్రియను ఎలక్షన్ అబ్జార్వర్ కోర్ర లక్మీ ఐఏఎస్ పరిశీలించారు. మూడు చింతలపల్లి, అలియాబాద్, ఎల్లంపేటలో పర్యటించిన అధికారుల బృందం ఎన్నికల సిబ్బందికి పలు సూచనలు చేశారు. మూడు మున్సిపాలిటీలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన అనంతరం మజీద్ పూర్ లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్, కౌంటింగ్ హాల్ లను సందర్శించారు. ఎన్నికల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు ముందస్తువులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ విజయేందర్ రెడ్డి, డిఆర్డిఓ సాంబ శివ రావు, మున్సిపల్ కమిషనర్ చంద్ర శేఖర్, తహసిల్దార్ సుచరిత పాల్గొన్నారు
వనపర్తి లోమునిసిపల్ ఎన్నికల సందర్భంగా బీ ఆర్ ఎస్ బైక్ ర్యాలి
మాజీ మంత్రి శాశన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ వనపర్తి నేటిధాత్రి .
మాజీ సింగిరెడ్డి.నిరంజన్ రెడ్డి మున్సిపల్ ఎన్నికల ఇంచార్జ్ శా స న మండలి మాజీ ఛైర్మెన్ కలిసి మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ప్రచారంలో భాగంగా వనపర్తి లో అంబేద్కర్ చౌరస్తా నుండి బీ ఆర్ ఎస్ కార్యకర్తలు బైక్ ర్యాలీ ప్రారంభించారు వార్డులో పర్యటించారు బైక్ ర్యాలీలో బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారని జిల్లా మీడియా సెల్ ఇంచార్జి నంది మల్ల అశోక్ ఒక ప్రకటన లో తెలిపారు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ప్రచార రథం నుండి ప్రజలకు అభివాదం చేస్తూ పలకరించారని అశోక తెలిపారు వనపర్తి పట్టణ మహిళలు,యువకులు,కార్మికులు,రైతులు ర్యాలీ ని చూసిన వారు వనపర్తి పట్టణ అభివృద్ధి రోడ్ల విస్తరణ సి సీ రోడ్లు డ్రై నేజ్ లు చెరువుల సుందరి కరణ మిషన్ భగీరథ పైపు లై ను బి.ఆర్.ఎస్ ప్రభుత్వ హయాములో జెరిగినాయని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని అశోక్ తెలిపారు
మున్సిపాలిటీ ఎన్నికల హడావుడి నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో రాజకీయ వాతావరణం మరింత ఉత్కంఠగా మారింది. అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉండగా, ఏఐఎంఐఎం పార్టీలో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో పట్టణంలోని 25వ వార్డుకు చెందిన పలువురు యువకులు మజ్లిస్ పార్టీ సిద్ధాంతాలు, నాయకత్వం పట్ల ఆకర్షితులై ఏఐఎంఐఎం పార్టీలో చేరారు. జహీరాబాద్ నియోజకవర్గ ఏఐఎంఐఎం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ అత్తర్ అహ్మద్, జిల్లా ప్రధాన కార్యదర్శి మోహియోద్దీన్ గౌరి, పట్టణ కార్యదర్శి మొహమ్మద్ అమెర్ల సమక్షంలో 25వ వార్డుకు చెందిన ఎండి. ముజాహెద్, ఎండి. వాజిద్ తదితరులు అధికారికంగా పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఏఐఎంఐఎం అధ్యక్షుడు అత్తర్ అహ్మద్ నూతన సభ్యులకు పార్టీ కండువాలు కప్పి ఘనంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎంఐఎం సీనియర్ నాయకులు షఫియోద్దీన్, షరీఫ్ తదితరులు పాల్గొని నూతన సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మాట్లాడిన అత్తర్ అహ్మద్, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఏఐఎంఐఎం పార్టీ ఒంటరిగా పోటీ చేసి జహీరాబాద్ మున్సిపాలిటీలో మెజార్టీ సీట్లు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర్త పార్టీ కోసం సైనికుడిలా పనిచేయాలని, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు.
విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం.
సీఐ మల్లేష్
చిట్యాల, నేటిదాత్రి :
‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల మండలంలోని వెలుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (పీఎం శ్రీ) పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ కలిసి హాజరయ్యారు. అరైవ్ అలైవ్’ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘రంగోలి’ (ముగ్గుల) పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ: ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని, విద్యార్థులు కేవలం తామే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించాలని, చిన్న వయస్సు నుంచే ఇలాంటి నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కోహీర్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 10,859 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పురపాలక సంఘం 16 వార్డులతో విస్తరించి ఉంది. ఓటర్ల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
కోహిర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్
కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికలు తొలిసారి జరగనున్న నేపథ్యంలో, చైర్మన్ సీటును ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఆశావహుల ఆశలు వమ్మయ్యాయి. ఎస్సీ కేటగిరీకి చెందిన నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇక్కడ పోటీ తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.