చెప్పులిప్పుతేనే ఎంట్రీ!….

చెప్పులిప్పుతేనే ఎంట్రీ!….

◆-: రెవెన్యూ ఆఫీసా.. లేక రాజదర్బారా?

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం : అదేం గుడి కాదు.. ప్రార్ధనా మందిరమూ కాదు. అయినా సరే.. అక్కడ చెప్పులు వదిలిస్తేనే లోపలికి ఎంట్రీ. రైతులు, మహిళలు, విద్యార్థులు, రియల్టర్లు.. ఇలా ఎవరైనా సరే ఈ నిబంధనను పాటించాల్సిందే. అదే సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండల తహసీ ల్దార్ కార్యాలయం. ప్రజా సేవకు డిగా ఉండాల్సిన తహసీల్దార్ ముత్యాల తిరుమలరావు కార్యాల యాన్ని వ్యక్తిగత దర్బార్లా మార్చుకుని ‘నేనింతే.. నేను చెప్పిందే వేదం’ అన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినవారు. చెప్పులను బయట వదిలి తన వద్దకు రావాలన్న అధికారి అహం కారంపై రైతులు, ప్రజలు మండిప డుతున్నారు. అయితే మిగతా అధి కారులను మాత్రం చెప్పులు, షూతో వచ్చినా అనుమతించడం విశేషం.

ఫిర్యాదు చేసినా చర్యల్లేవ్..

ఈ వ్యవహారంపై పలుమార్లు రెవెన్యూ డివిజనల్, జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి చర్యలు తీసుకోకపో వడం పలు అనుమానాలకు తావిస్తోంది. తాజాగా గత శనివారం జహీరాబాద్ సివిల్ కోర్టు న్యాయమూర్తి కవితాదేవి, జిల్లా అదనపు కలెక్టర్ మాధురి ఆకస్మిక పరిశీలన సందర్భంగా రైతులు వారికి నేరుగా ఫిర్యాదు చేశారు. ఇటీవల ఝరాసంగం మండలంలోని ఎల్గోయి. గ్రామంలో రైతులు ‘ఈ దరిద్రపు ఎమ్మార్వోను తొలగిం చండి’ అని బహిరంగంగానే అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాగా తహసీల్దార్ వ్యవహారంపై జహీరాబాద్ ఆర్డీవో దేవుజాను వివరణ కోరగా.. ఎమ్మార్వోతో మాట్లాడి సమస్య పరిష్కరిస్తా నని తెలిపారు.

టూ ది సబ్ రిజిస్టర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్టర్

టూ ది సబ్ రిజిస్టర్ ఉంటేనే రిజిస్ట్రేషన్ అంటున్న సబ్ రిజిస్టర్

మండల రెవెన్యూ సర్వేయర్ తో సర్వే చేసి ఇస్తే రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్న జిల్లా రిజిస్టర్

గంగాధర నేటిధాత్రి :

గ్రామ పంచాయతీలకు సంబదించిన రిజిస్ట్రేషన్ లు చేయడం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. ప్రజలు ఇంటి నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకొని బ్యాంకు లోన్ తీసుకుందాం అంటే రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. గత కొన్ని రోజుల క్రితం కలెక్టర్ ఇచ్చినా ఆదేశాలతో గ్రామ పంచాయతీ కార్యదర్శులు మొఖ పరిశీలన చేసి ఇంటి విస్తీర్ణం, భూమి విస్తీర్ణం మరియు హద్దులు దృవీకరణ చేసి ఇస్తున్నారు. కానీ గంగాధర సబ్ రిజిస్టర్ ఈవిధంగా ఉంటే రిజిస్ట్రేషన్ చేయను అని చెప్తున్నారు. సబ్ రిజిస్టర్ ను ఏవిదంగా ఉంటే చేస్తారని వివరణ కోరగా టూ ది సబ్ రిజిస్టర్ కు అని రాసి ఇంటి విస్తీర్ణం మరియు భూమి విస్తీర్ణం రాసి ఇస్తే చేస్తాను అని చెప్పడం జరిగింది. సబ్ రిజిస్టర్ తెలిపిన వివరాలపై జిల్లా రిజిస్టర్ ను వివరణ కోరగా మండల రెవెన్యూ సర్వేయర్ సర్వే చేసిన లెటర్ పై గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతకం చేసి ఇస్తే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు అని వివరణ ఇవ్వడం జరిగింది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version