వనపర్తి లో2024 సర్వే ఆదారంగ వార్డుల రిజర్వేషన్లు ఖరారు
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురబి
వనపర్తి నేటిదాత్రి .
, సీప్-2024 సర్వే ఆధారంగా వనపర్తి మున్సిపల్ ఎన్నికలకు వార్డులలో రిజర్వేషన్లను ఖరారు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు శనివారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధ్యక్షతన మున్సిపల్ వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను రాజకీయ పార్టీల నేతల సమక్షంలో రిజర్వేషన్ల ప్రక్రియను పూర్తి చేశారు. లాటరీ పద్ధతిలో మహిళా రిజర్వేషన్ల ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ సంస్థలు యాదయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సీప్-2024 సర్వే జనాభా ప్రతినిథ్య ప్రాతిపదికన మున్సిపల్ ఎన్నికలకు వార్డుల వారీ రిజర్వేషన్లను అత్యంత పారదర్శకంగా ఖరారు చేశామని కలెక్టర్ తెలిపారు. నిబంధనల ప్రకారం వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు, ఆత్మకూరు, అమరచింత మున్సిపాలిటీలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు జనరల్ కేటగిరీలలో మహిళలకు కేటాయించాల్సిన వార్డులను లక్కీ డ్రా సిస్టం ద్వారా ఎంపిక చేశామన్నారు . రిజర్వేషన్ల ఖరారు అనంతరం గెజిట్ విడుదల చేసి, తదుపరి జాబితా ప్రతులను కలెక్టరేట్ మున్సిపల్ కార్యాలయాల్లో నోటీసు బోర్డులపై ప్రదర్శించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో ఆర్డీవో సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్లు, వివిధ రాజకీయ పార్టీల జిల్లా అధ్యక్షులు, ప్రతినిధులు మరియు ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.
