అభివృద్ధి మా ధ్యేయం, ప్రజాసేవే మా లక్ష్యం
మండలంలో పర్యటిస్తున్న ఎమ్మెల్యే పాయం
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,, నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని గురువారం నాడు పలు గ్రామపంచాయతీలలో గ్రామపంచాయతీ స్థానిక ఎన్నికల నేపథ్యంలో పర్యటిస్తున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు .ఈ సందర్భంగా స్థానిక ప్రజలతో మమేకమై మాట్లాడి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు అలాగే గ్రామస్థాయి సమస్యలు పరిష్కారం పై ప్రజల అభిప్రాయాలు తెలుసుకున్నారు అనంతరం పాయం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అంటేనే ప్రజల నమ్మకం అని అభివృద్ధి ద్వేయంగా ప్రజాసేవ లక్షణంగా పనిచేస్తున్నామన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వంలో ముఖ్యమంత్రివర్యులు రేవంత్ రెడ్డి నాయకత్వం లో గ్రామాలు సమగ్ర అభివృద్ధి చెందుతాయి అన్నారు కావున కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్, వార్డు మెంబర్ అభ్యర్థులను వారికి కేటాయించిన గురుతులపై మీ అమూల్యమైన ఓటు వేసి గెలిపించుకొని గ్రామాలను మరింత అభివృద్ధి చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి సభ్యులు చంద సంతోష్ కుమార్, మండల అధ్యక్షులు సాయద్ ఇక్బాల్ హుస్సేన్, మండల నాయకులు ఎర్ర సురేష్, సాగర్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు యువకులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
