విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం.
సీఐ మల్లేష్
చిట్యాల, నేటిదాత్రి :
‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల మండలంలోని వెలుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (పీఎం శ్రీ) పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ కలిసి హాజరయ్యారు.
అరైవ్ అలైవ్’ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘రంగోలి’ (ముగ్గుల) పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ:
ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని,
విద్యార్థులు కేవలం తామే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించాలని, చిన్న వయస్సు నుంచే ఇలాంటి నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.
