విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం…

విద్యార్థులకు రోడ్డు భద్రతా నిబంధనలపై అవగాహన కార్యక్రమం.

సీఐ మల్లేష్

చిట్యాల, నేటిదాత్రి :

 

‘అరైవ్ అలైవ్’ కార్యక్రమంలో భాగంగా శనివారం చిట్యాల మండలంలోని వెలుగు టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్ (పీఎం శ్రీ) పాఠశాలలో విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిట్యాల సీఐ మల్లేష్, ఎస్ఐ శ్రావణ్ కుమార్ కలిసి హాజరయ్యారు.
అరైవ్ అలైవ్’ మూడవ రోజు కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు ‘రంగోలి’ (ముగ్గుల) పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు రోడ్డు నిబంధనలను ప్రతిబింబించేలా వేసిన ముగ్గులు అందరినీ ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా సీఐ మల్లేష్ మాట్లాడుతూ:
ప్రతి విద్యార్థి ట్రాఫిక్ నిబంధనల పట్ల అవగాహన కలిగి ఉండాలని,
విద్యార్థులు కేవలం తామే కాకుండా, తమ కుటుంబ సభ్యులకు, తల్లిదండ్రులకు రోడ్డు భద్రత మరియు హెల్మెట్ ప్రాధాన్యత గురించి వివరించాలని, చిన్న వయస్సు నుంచే ఇలాంటి నిబంధనలపై అవగాహన పెంచుకోవడం ద్వారా భవిష్యత్తులో ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ భిక్షపతి, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులకు బహుమతులను అందజేశారు.

కోహీర్ పురపాలక సంఘంలో 10,859 మంది ఓటర్లు..

కోహీర్ పురపాలక సంఘంలో 10,859 మంది ఓటర్లు

◆-: మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలో నూతనంగా ఏర్పడిన కోహీర్ పురపాలక సంఘం పరిధిలో మొత్తం 10,859 మంది ఓటర్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పురపాలక సంఘం 16 వార్డులతో విస్తరించి ఉంది. ఓటర్ల సంఖ్యపై స్పష్టత రావడంతో ఎన్నికల ప్రక్రియకు మార్గం సుగమమైంది. ఈ పరిణామం స్థానిక రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కోహిర్ మున్సిపాలిటీ చైర్మన్ పీఠం ఎస్సీ జనరల్

కోహిర్ మున్సిపాలిటీ ఎన్నికలు తొలిసారి జరగనున్న నేపథ్యంలో, చైర్మన్ సీటును ఎస్సీ జనరల్ కు రిజర్వ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ నిర్ణయంతో ఆశావహుల ఆశలు వమ్మయ్యాయి. ఎస్సీ కేటగిరీకి చెందిన నాయకులు చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో, ఇక్కడ పోటీ తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version