ముగ్గుల పోటీలు…
తంగళ్ళపల్లి నేటి ధాత్రి….
తంగళ్ళపల్లి మండలం పాపాయిపల్లి గ్రామంలో ముగ్గుల పోటీ నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ముగ్గుల పోటీలలో పాల్గొనడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మహిళల ఆధ్వర్యంలో ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగిందని సంక్రాంతి పండుగ పురస్కరించుకొని గ్రామంలో కులమత భేదాలకు లోను కాకుండా పార్టీలకతీతంగా ముగ్గుల పోటీల్లో పాల్గొంటూ గ్రామంలో సంక్రాంతి సంబరాలు నిర్వహించుకుంటూ ముగ్గుల పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు ఇట్టి పోటీల కార్యక్రమానికి గ్రామంలోని యువకులు యువత ప్రజలు మహిళలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
