ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం…

ఢిల్లీని కప్పేసిన పొగమంచు.. రైళ్లు, విమాన సర్వీసుల్లో అంతరాయం

 

న్యూఢిల్లీని పొగమంచు దుప్పటి కప్పేసింది. ఎదురుగా ఉన్నవి కనిపించనంత దట్టంగా పొగ అలుముకుంది. వాయు నాణ్యత సూచీ 439కు పెరిగింది.

ఇంటర్నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత భారీగా పడిపోయింది. ఆదివారం ఉదయం.. రాజధాని వ్యాప్తంగా దట్టమైన పొంగ మంచు పరుచుకోవడంతో ఎదురుగా ఉన్నవేవీ కానరాని పరిస్థితి వచ్చింది. దీంతో పలు రైళ్లు, విమానాల ప్రయాణాలు వాయిదాపడ్డాయి. నేటి ఉదయం 7:30 గంటల సమయంలో ఢిల్లీలో వాయునాణ్యత సూచీ ఏక్యూఐ 439కు చేరింది. కాలుష్యం కట్టడి కోసం ఢిల్లీ అధికార యంత్రాంగం జీఆర్ఏపీ-4 నిబంధనలను శనివారం నుంచి అమలు చేస్తోంది.ఢిల్లీలోని సఫ్దర్‌ గంజ్‌లో దట్టమైన పొగమంచు కారణంగా విజిబులిటీ పూర్తిగా తగ్గిపోయింది. పాలమ్ ప్రాంతంలో 100 మీటర్లకు మించి దూరంలో ఉన్నవేవీ కనిపించని పరిస్థితి నెలకొందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దట్టమైన పొగ మంచు కారణంగా ఎయిర్ ఇండియా, ఇండిగో సహా పలు ఎయిర్‌లైన్స్‌ విమాన జర్నీలను వాయిదా వేశాయి. ఈ విషయంపై కస్టమర్లను కూడా అప్రమత్తం చేశాయి. తమ విమానం ఎప్పుడు బయల్దేరుతుందనేది ఒకసారి చెక్ చేసుకుని ఎయిర్‌పోర్టులకు రావాలని సూచించాయి. ఢిల్లీ ఎయిర్‌పోర్టులో 35 శాతం విమాన ప్రయాణాలు ఆలస్యం అవుతున్నాయి.
అయితే.. ఈ పరిస్థితి ప్రస్తుతం క్రమంగా కుదురుకుంటోందని ఢిల్లీ ఎయిర్‌పోర్టు ఉదయం 8 గంటల సమయంలో సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. ఉత్తర భారతంలో ఢిల్లీతోపాటు బరేలీ, లఖ్నవూ, కుషీనగర్‌లలోనూ దృశ్య మాన్యత పూర్తిగా తగ్గిపోయింది. ఇక అమృత్‌సర్, గోరఖ్‌పూర్‌లలో 100 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించే పరిస్థితి లేదని ఐఎమ్‌డీ తెలిపింది. ప్రయాగ్‌రాజ్‌లో 200 మీటర్ల దూరంలో ఉన్నవీ కనిపించనంతగా పొగ మంచు అలుముకుందని పేర్కొంది.

పొగ మంచు కారణంగా రైళ్ల సర్వీసుల్లోనూ అంతరాయం ఏర్పడింది. రాజధాని, దురంతో, గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వంటి అనేక రైళ్లు ఆలస్యంగా బయలుదేరనున్నాయి

ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తీసేయండి: సుప్రీంకోర్టు…

ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తీసేయండి: సుప్రీంకోర్టు

 

ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు కీలక సూచనలు చేసింది. సరిహద్దుల్లోని టోల్ ప్లాజాలు ట్రాఫిక్ ఆటంకాలు, క్యూలకు దారితీసి కాలుష్యాన్ని పెంచుతున్నాయని గుర్తించింది.

న్యూఢిల్లీ, డిసెంబర్ 17: దేశ రాజధాని ఢిల్లీలో ప్రతి ఏటా శీతాకాలంలో తీవ్రస్థాయికి చేరుకుంటున్న వాయు కాలుష్య సమస్యపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంక్షోభం వార్షిక లక్షణంగా మారిందని, దీన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు దీర్ఘకాలిక ప్రణాళిక అవసరమని పేర్కొంది.
ఢిల్లీ సరిహద్దుల్లోని 9 టోల్ ప్లాజాలను తాత్కాలికంగా మార్చాలని లేదా సస్పెండ్ చేయాలని ఆదేశించింది. పీక్ వింటర్ నెలల్లో (అక్టోబర్ 1 నుంచి జనవరి 31 వరకు) టోల్ సేకరణను నిలిపివేయాలని, జనవరి 31 వరకు టోల్ ప్లాజాలు లేకుండా చూడాలని కోర్టు సూచించింది.

టోల్ ప్లాజాలను 50 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలని, ఇది ట్రాఫిక్ డైవర్ట్ చేసి కాలుష్యాన్ని తగ్గిస్తుందని పేర్కొంది. అదనంగా, కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ (CAQM) తమ దీర్ఘకాలిక చర్యల ప్రణాళికను పునఃసమీక్షించి, దశలవారీగా అమలు చేయాలని ఆదేశించింది. కాలుష్య సమస్యకు ఏకకాలిక కారణాలు లేవని, నిపుణులు మాత్రమే శాశ్వత పరిష్కారాలు సూచించగలరని న్యాయస్థానం అభిప్రాయపడింది.

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా..

లోక్‌సభ ప్రారంభం.. వెంటనే మధ్యాహ్నంకి వాయిదా

 

విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు.

 విపక్షాల ఆందోళనలతో లోక్‌సభ వాయిదా పడింది. మధ్యాహ్నం 12.00 గంటలకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సభను వాయిదా వేశారు. సోమవారం ఉదయం 11.00 గంటలకు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలోని సభ్యులు తమ ప్రతిపాదించిన అంశాలపై చర్చ జరగాలంటూ పట్టుబట్టారు. దాంతో విపక్ష ఎంపీల తీరుపై స్పీకర్ ఓంబిర్లా తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని అంశాలపై చర్చకు తాము సిద్ధమని స్పష్టం చేశారు. ప్రశ్నోత్తరాలకు విపక్షాలు సహకరించాలని సూచించారు. కానీ ముందు సమస్యలపై చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. దాంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. సభను మధ్యాహ్నాంకు స్పీకర్ వాయిదా వేశారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలో బాంబు పేలుళ్లు, ఎస్ఐఆర్ (SIR), రైతుల సమస్యలు, ఢిల్లీలో కాలుష్యంపై సభలో చర్చ జరగాలంటూ విపక్షాలు పట్టుబట్టాయి. ముందు ప్రశ్నోత్తరాలు చేపట్టాలని.. ఆ తర్వాత చర్చకు సిద్ధమంటూ స్పీకర్ స్పష్టం చేశారు. అందుకు విపక్ష సభ్యులు సమేమీరా అనడంతో సభలో గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో సభను మధ్యాహ్నాంకు వాయిదా వేశారు.

మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి బాధ నుంచి ప్రతిపక్షాలు బయటకు రాలేదంటూ ప్రధాని మోదీ చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ స్పందించారు. పార్లమెంట్‌లో ప్రజాసమస్యలు లేవనెత్తడం డ్రామా కాదని ఆమె పేర్కొన్నారు. SIRపై విమర్శకుల నోరు మూయిస్తున్నారంటూ కేంద్రంపై ప్రియాంకాగాంధీ మండిపడ్డారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version