ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు…

ఎస్సారెస్పీ భూముల పరిరక్షణలో వివక్ష వద్దు.

# కెనాల్ హద్దుల నిర్ణయంలో అధికారుల తీరు ఏకపక్షం.

#బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది.

# బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు డా. బానోతు సారంగపాణి.

​నల్లబెల్లి, నేటి ధాత్రి:

 

 

 

ఎస్సారెస్పీ డిబిఎం 38 కెనాల్ భూముల పరిరక్షణ విషయంలో ఇరిగేషన్ అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు డాక్టర్ బానోతు సారంగపాణి విమర్శించారు. శనివారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన అధికారుల తీరుపై పలు ప్రశ్నలు సంధించారు.
​గీసుకొండ నుంచి భూపాలపల్లి జిల్లా వరకు విస్తరించి ఉన్న ఈ కెనాల్‌కు సంబంధించి, అధికారులు కేవలం నల్లబెల్లి గ్రామానికే పరిమితమై హద్దులు కేటాయించడం అన్యాయమని అన్నారు. కెనాల్ ప్రారంభం నుంచి చివరి వరకు కుడి ఎడమ హద్దులను శాస్త్రీయంగా నిర్ణయించాలని డిమాండ్ చేశారు. పట్టా భూములు కలిగిన రైతులను, ఇళ్లలో నివసిస్తున్న సామాన్యులను నోటీసులతో భయభ్రాంతులకు గురిచేయడం సరికాదని హితవు పలికారు. మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగ్రామమైన నల్లబెల్లిలోనే ఈ తరహా చర్యలు చేపట్టడం వెనుక రాజకీయ కోణం ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కొంతమందిని లక్ష్యంగా చేసుకుని నోటీసులు ఇవ్వడం వెనుక ఉన్న రాజకీయ ఒత్తిళ్లపై అధికారులు సమాధానం చెప్పాలన్నారు. కాలువ భూముల పరిరక్షణకు బీఆర్ఎస్ ఎప్పుడూ కట్టుబడి ఉంటుందని, పట్ట దారుల నుండి కొనుగోలు చేసిన బాధితులకు పార్టీ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అయితే, నిబంధనల పేరుతో కేవలం ఒకే ప్రాంతాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికైనా అధికారులు తమ వైఖరి మార్చుకోకపోతే బాధితుల పక్షాన పెద్ద ఎత్తున ఆందోళనలు కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ కక్కెర్ల శ్రీనివాస్ గౌడ్, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు ఉడుగుల ప్రవీణ్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ గందె శ్రీలత శ్రీనివాస్ గుప్తా, మాజీ ఎంపీటీసీ జన్నుజయరావు, మాజీ సర్పంచ్ గుండాల కుమార స్వామి,సర్పంచ్ లు నాగెళ్ళి జ్యోతి ప్రకాష్, పులి రమేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు క్యాతం శ్రీనివాస్, ఉప సర్పంచ్ గుమ్మడి వేణు, వార్డు సభ్యులు పరికి కోర్నేలు , కనకం నవీన్, నాగేల్లి అనిల్, పిట్టల ప్రవీణ్, బూస లక్ష్మణ మూర్తి, మైలగని కుమార స్వామి, గ్రామ అభివృద్ధి కమిటీ చైర్మన్ నాగేల్లి శ్రీనివాస్, సట్ల శ్రీనివాస్ గౌడ్,గోనెల నరహరి, బత్తిని బిక్షపతి,నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version