జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది..

జహీరాబాద్ మున్సిపాలిటీ ఏరియా 10 వ వార్డ్ లో ఎక్కడికక్కడ మురికి నీరు నిలిచిపోయింది

జహీరాబాద్ నేటి ధాత్రి:

10 వ వార్డ్ లో నాలాల కబ్జా చేసి వెంచర్లు చేసి డబ్బులు పోగేసుకున్నారు శాశ్వతంగా మొరిల్ల నిర్మాణానికి వెంచర్ లో ప్లాట్లు ముందు మురికి కాలువ స్థలాలను ఏర్పాటు చేసిన వారికే పర్మిషన్ ఇయ్యాలి నాలా కబ్జా చేసిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ మురికి కాల్వల నిర్మాణానికి మున్సిపాలిటీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం ఇచ్చిన జహీరాబాద్ ఆర్డిఓ గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది కబ్జాకు గురైన నాలాల కబ్జా నుంచి తొలగించి శాశ్వత నిర్మాణానికి తోడ్పడాలని,,, 10 నంబర్ వార్డ్ మహమ్మద్ ఇమ్రాన్ బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ,, కావాలని సమస్యలకు పరిష్కారం చూపాలి అని నూతనంగా ఎన్నికైన చైర్మన్ గారికి మరియు మున్సిపాలిటీ అధికారులకు కోరడం జరుగుతుంది ఈ మురికి నీరు ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో కాలనీలో నివసించే ప్రజలకు అనేక వ్యాధులు వస్తున్నాయి కాబట్టి తక్షణమే మురికి కాల్వలను నిర్మాణం పూర్తి చేయాలి అలాగే ఇరిగేషన్ అధికారులతో మున్సిపాలిటీ అధికారులు సాంప్రదించి గతంలో ఉన్న నాలా నక్షలో ఉన్నట్టుగా మురికి కాలువ నిర్మాణం చేస్తే గాంధీనగర్ కాలనీ గుల్షన్ నగర్ కాలనీ సలాం నగర్ కాలనీ జమాలి కాలనీ శాశ్వత పరిష్కారం చూపేలా మున్సిపాలిటీ అధికారులు వెంటనే పనులు ప్రారంభించాలి మరియు సీసీ రోడ్ల నిర్మాణం విద్యుత్ దీపాలు తాగునీటి సమస్యకు పరిష్కారం చెప్పాలన్నారు,

గండ్ర శోభ హరీష్ రెడ్డిని గెలిపించండి గండ్ర జ్యోతి…

గండ్ర శోభ హరీష్ రెడ్డిని గెలిపించండి గండ్ర జ్యోతి

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డు పుల్లూరి రామయ్య పల్లి,గండ్రపల్లి, మంజూరునగర్ లో ప్రతి ఇంటికి తిరుగుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరచిన అభ్యర్థి గండ్ర శోభా హరీష్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటి ప్రచారం నిర్వహించిన వరంగల్ జిల్లా జడ్పీ మాజీ ఛైర్పర్సన్ & భూపాలపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు గండ్ర జ్యోతి
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేసిన అభివృద్ధి పనులను ప్రజలకు గుర్తు చేస్తూ, కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను ప్రజలకు వివరిస్తూ కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన…

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

 

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ 9 వార్డు పదో వార్డ్ కు సంబంధించిన సిసి రోడ్ శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి గారు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నాగర్ కర్నూల్ నాగర్ కర్నూలు జిల్లాకు జూనియర్ కళాశాలకు 9 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి 19వ తారీకు డిప్యూటీ సీఎం రాజనర్సిమతో కలిసి శంకుస్థాపన చేస్తున్నట్లు అదేవిధంగా కొత్త బస్టాండ్ కు 14 కోట్లు మంజూరయ్యాయని అది కూడా త్వరలో శంకుస్థాపన చేస్తామని నాగర్ కర్నూల్ జిల్లా ను ఒక ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దామని ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ రమణారావు తొమ్మిదో వార్డ్ మాజీ కౌన్సిలర్ లలిత భాస్కర్ 10 వార్డ్ మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ వార్డు సభ్యులు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version