నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

నూతన పాలకవర్గాన్ని ఘనంగా సన్మానించిన బి జోన్ రజక సంఘం…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

క్యాతనపల్లి మున్సిపాలిటీకి నూతనంగా ఎన్నికైన మున్సిపాలిటీ చైర్ పర్సన్ గోడిశెల సంధ్యారాణి _రాజా రమేష్, వైస్ చైర్ పర్సన్ మిట్టపల్లి సరిత – శ్రీనివాస్, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ పార్టీ ల 22 మంది కౌన్సిలర్లను రామకృష్ణాపూర్ పట్టణ బి జోన్ రజక సంఘం ఆధ్వర్యంలో రజక సంఘం కార్యాలయంలో వారిని ఘనంగా సన్మానించారు. బీజోన్ రజక సంఘం అధ్యక్షులు నడిగోట తిరుపతి ఆధ్వర్యంలో పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్, వైస్ చైర్మన్ లు మాట్లాడారు. నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి రజక సంఘం నాయకులు సన్మానించడం సంతోషంగా ఉందని రానున్న రోజుల్లో మునిసిపాలిటీని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లేందుకు అహర్నిశలు కృషి చేస్తామని అన్నారు. అన్ని కుల సంఘాలను కలుపుకొని ముందుకెళ్తామని మునిసిపాలిటీ అభివృద్దే ధ్యేయంగా పనిచేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు రాజా రమేష్, రామిడి కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్,సంఘం గౌరవాధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, ఎస్ ఆర్ కె పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉప్పలయ్య, రజక సంఘం సభ్యులు పున్నం, కంచర్ల శ్రీనివాస్, మల్లయ్య, రాంబాబు, నాగరాజు, రాజేశ్వరి, బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో గోపతి..

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో గోపతి..?

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ తొమ్మిదో వార్డ్ బరిలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ వార్డ్ మెంబర్ గోపతి భానేష్ భార్య గోపతి కమల బరిలో ఉండబోతున్నట్లు తెలుస్తుంది. తొమ్మిదో వార్డ్ కు జనరల్ మహిళ రిజర్వేషన్ ప్రకటనతో బరిలో నిలుస్తారని తెలుస్తోంది. గోపతి భానేష్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కి అత్యంత సన్నిహితుడు కావడం,కాంగ్రెస్ పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందిస్తుండడం తో మంత్రి ఆశీస్సులు ఉన్న నేపథ్యంలో గోపతి కమలకే టికెట్ ఇచ్చే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.

కొత్త, పాత తిమ్మాపూర్, అమ్మ గార్డెన్ ఏరియాలలో గోపతి భానేష్ కు ప్రజా ఆదరణ ఉన్న నేపథ్యంలో టికెట్ వరించి గెలిస్తే చైర్పర్సన్ రేసులో సైతం నిలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం పలు వార్డులలో రిజర్వేషన్లు మార్పులు చేర్పులు చేసింది .గతంలో చైర్ పర్సన్ గా ఎస్సీ మహిళ రిజర్వేషన్ ఉండగా ప్రస్తుతం జనరల్ మహిళ గా ఖరారయింది. కాంగ్రెస్ పార్టీలో చైర్ పర్సన్ రేసులో బడా నేతలు ఉన్నట్లు సమాచారం. ఏదేమైనా రానున్న రోజుల్లో మునిసిపాలిటీలో పోరు రసవత్తరంగా ఉండబోతోంది.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం ఎవరికో….?

కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గానికే పీఠమా..?

మున్సిపల్ పీఠానికి సీపీఐ కీలకం కాబోతుందా..?

రిజర్వేషన్ అనుకూలిస్తే బడా నేతలు బరిలోకి…!

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

మున్సిపాలిటీలో జరగనున్న ఎన్నికల్లో ప్రధాన పార్టీల నుంచి పోటీ చేయాలనుకునే అభ్యర్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది.బీఆర్ఎస్, సిపిఐ, బిజెపి పార్టీల నుంచి కూడా పలువురు టికెట్ల కోసం ఆసక్తి చూపుతున్నారు. దీంతో ఎన్నికల సమయంలో టికెట్ల కేటాయింపు పార్టీ ముఖ్య నాయకులకు పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.క్యాతన్ పల్లి మున్సిపాలిటీలో 22 వార్డులు ఉండగా ఎన్నికల్లో కొత్త, పాత లొల్లిలతో ఎవరూ ఊహించని వర్గమే మున్సిపాలిటీని కైవసం చేసుకుంటుందా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.వివరాల్లోకి వెళితే..క్యాతన్ పల్లి మున్సిపాలిటీ లో బిఆర్ఎస్, బీజేపీ పార్టీల నుండి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన కొత్త నేతలకు పాత నేతలకు మధ్య సయోధ్య కుదరకపోవడమే ప్రధాన కారణం అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకరికి మించి ఒకరు టికెట్ల కోసం స్థానిక మంత్రి వద్ద అపాయింట్మెంటు లు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. పార్టీ కోసం పనిచేసిన వారికి మాత్రమే టికెట్ దక్కేలా ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నూతనంగా పార్టీలోకి వచ్చిన వారికి టికెట్టు దక్కే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటి నుండే కొత్త నేతలు అంతా కలిసి సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీలు మారిన నేతలు మళ్లీ పాత పార్టీకే వెళదామా లేదా ఇదే పార్టీలో కొనసాగుదామా అనే ఆలోచనలో పడ్డట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష బిఆర్ఎస్ పార్టీ నాయకులు సైతం పార్టీ నుండి వెళ్లిన వారిని తమ పార్టీలోకి తీసుకునే ప్రసక్తే లేదు అన్నట్లు సంకేతాలు పంపిస్తున్నప్పటికీ, బలమైన నేతలు మళ్లీ తిరిగి పార్టీలోకి వస్తే ఆహ్వానించేందుకు బిఆర్ఎస్ పార్టీ చూస్తున్నట్లు రాజకీయ వర్గాలుచెబుతున్నాయి. మున్సిపాలిటీ పీఠాన్ని మళ్లీ కైవసం చేసుకునేందుకు ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ మంత్రి ఇలాఖాలో మున్సిపాలిటీ పీఠం ఎవరు కైవసం చేసుకుంటారో అని రాష్ట్ర ప్రజానీకం,పుర ప్రజలు, నాయకులు ఎదురుచూస్తున్నారు. మున్సిపల్ పీఠానికి సిపిఐ పార్టీ కీలకం కాబోతున్నట్లు తెలుస్తోంది.

రిజర్వేషన్లపై చర్చ….

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్న అన్ని పార్టీల నాయకుల్లో రిజర్వేషన్ పై చర్చ జరుగుతుంది. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం రొటేషన్ పద్ధతిన రిజర్వేషన్ ఉంటుందని సంకేతాలు వస్తున్నా సరే రొటేషన్ లో ఏం జరుగుతుందో అనేది ఉత్కంఠగానే ఉంది.మున్సిపల్ చైర్మన్ రిజర్వేషన్ స్టేట్ ప్రాతిపాదికన జరిగే అవకాశం ఉన్నందున ఆ జాబితాను పరిశీలించిన తర్వాతే కొందరు కీలక నాయకులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై సంక్రాంతి తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version