వరండాలు, చెట్ల కింద పై చదువులు • ఆరు బయట వంట • సరిపడ గదులు లేక ఇబ్బందులు..
నిజాంపేట: నేటి ధాత్రి
Principal Padma Reddy’s
ఆరు బయట చెట్ల కింద, వరండాలలో విద్యార్థుల చదువులు కొనసాగుతున్నాయి. ఈ మేరకు నిజాంపేట మండలం రాంపూర్ గ్రామంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అదనపు గదులు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. వర్షాకాలం నేపథ్యంలో ఆరు బయట చదువులు కొనసాగించలేమని విద్యార్థులు వాపోతున్నారు. సరైన గదులు లేక ఆరుబయటే వంట కూడా కొనసాగించడం జరుగుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. ఆరు బయట వంటశాలకు విష సర్పాలు వస్తున్నాయని దీనిపై అధికారులు ప్రజాప్రతినిధులు దృష్టి పెట్టి పాఠశాలకు అదనపు గదులతో పాటు కాంపౌండ్ వాల్ నిర్మించాలని వేడుకుంటున్నారు.
ప్రధానోపాధ్యాయులు పద్మా రెడ్డి వివరణ
పాఠశాలలో అదనపు గదులు లేక ఆరుబయటే చదువులు కొనసాగించడం వాస్తవమేనన్నారు. ఈ విషయాన్ని పై అధికారుల దృష్టికి కూడా తీసుకోబోయినట్లు పేర్కొన్నారు.
పారిశుద్ధ్యం పై ప్రత్యేక దృష్టి • జాగ్రత్తలు పాటించాలి • కార్యదర్శి చంద్రహాస్..
నిజాంపేట: నేటి ధాత్రి
పారిశుద్ధంపై ప్రత్యేక దృష్టి వహించాలని గ్రామ కార్యదర్శి చంద్రహాస్ అన్నారు. ఈ మేరకు మండలంలోని రాంపూర్ గ్రామంలో డ్రై డే ఫ్రైడే కార్యక్రమం లో భాగంగా గ్రామాల్లో పారిశుధ్యం పై తనిఖీలు నిర్వహించారు. ఇంటి ఆరు బయట నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీజనల్ వ్యాధుల దృశ్య ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంటి ఆరు బయట కలుపు మొక్కలు లేకుండా చూడాలన్నారు. గ్రామంలో వైద్య చికిత్స నిమిత్తం ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు.
కోహీర్,గ్రామ పంచాయతీని మున్సిపాలిటీగా ప్రకటించడంతో తమ సమస్యలు తీరుతాయని సంతోషపడిన పట్టణ ప్రజలకు నిరాశే మిగిలింది. కోహీర్ గ్రామ పంచాయతీలో 21వేలకు పైగా జనాభా ఉండడంతో ఈ సంవత్సరం జనవరి 27న మున్సిపాలిటీగా ప్రకటిం చారు. మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్, ఇతర అధి కారులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని దీంతో తమ సమస్యలు తీరుతాయని అనుకున్న ప్రజలకు ఎదురుచూపులు తప్పడం లేదు. జనవరి 28న ఉమామ హేశ్వర్రావు కోహీర్ పట్టణ తొలి మున్సి పల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరిం చారు. కానీ ఆయన ఫిబ్రవరి 16 వరకు మాత్రమే ఇక్కడ విధులు నిర్వహించా రు. పట్టణ ప్రజల సమస్యల పరిష్కారా నికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయ కపోవడంతో మున్సిపల్ అధికారులు సహితం ఇబ్బందులు పడుతున్నారు. కొత్త మున్సిపాలిటీ అయిన ఐదు నెలల్లో నలుగురు కమిషనర్లు ఇక్కడకు వచ్చి చేసే దేమీలేక తిరిగి వెళ్లారు. ఉమామహేశ్వర్ రావు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 16 వరకు కోహీర్ కమిషనర్గా విధులు నిర్వహించారు. తర్వాత వెంకట్రెడ్డి మార్చి 18వ తేదీ వరకు కార్యాలయ విధులకు హాజరయ్యారు. ఆయన బదిలీ కావడంతో మున్సిపల్ కమిషనర్ రమేశ్ కుమార్ బాధ్యతలను చేప ట్టారు. కానీ అతడు కూడా మార్చి 4వ తేదీ వరకు మా త్రమే ఇక్కడ పని చేశారు. తాండూర్ వెళ్లిపోవడంతో కొత్త కమిషనర్ గా ప్రకాశ్ విధుల్లో చేరారు. అతడిని కూడా సీడీ ఎంఏ హైదరాబాద్ హెడ్ ఆఫీస్కు బదిలీ చేస్తున్నట్లు ఉత్త ర్వులు జారీ చేశారు. కొత్త కమిషనర్ వచ్చే వరకు లోనే విధులు నిర్వహించాలని మౌకికంగా సూచించారు. కానీ ఎలాంటి ఆదేశాలు లేకపోవడంతో ఆయన మాత్రం జూన్ 4న దీర్ఘకాలిక సెలవు పెట్టి వెళ్లిపోయారు. దీంతో నెల గడిచినా కొత్త కమిషనరు నియమించలేదు. దీంతో పట్ట ణంలో ఎక్కడ చూసినా సమస్యలు దర్శనమిస్తున్నాయి. సీసీ రోడ్లపై మురుగు, రోడ్ల పక్కన చెత్త కనిపిస్తున్నది.
నిలిచిన ఆన్లైన్ సేవలు
కోహీర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా విధులు నిర్వ హించిన ప్రకాశ్ జూన్ 4వ తేదీన హైదరాబాద్ కార్యాల యానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి ఒక్క ఆన్లైన్ పని చేయలేని పరిస్థితి ఏర్పడింది. కొత్త కమిషనర్ వస్తేనే అతడి కీ ద్వారానే కంప్యూటరీకరణ ప్రారంభమవుతుంది. కానీ పట్టణ ప్రజలు పత్రాల కోసం నిత్యం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అక్కడ ఉన్న సిబ్బంది కూడా నిస్సా హయ స్థితిలో ఉన్నారు. వారు కేవలం పారిశుధ్యం, ఇంది
స్నేహితుల కుటుంబాలకు చేయూత అందించిన తోటి మిత్ర బృందం.
చిట్యాల, నేటిధాత్రి :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగ గ్రామానికి చెందిన మామిండ్ల రమేష్ తండి మరియు సంగ శ్రీనివాస్ తల్లి మృతి చెందిన విషయం తెలుసుకునీ1998-99 బ్యాచ్ కుచెందిన తమ స్నేహితుల కుటుంబాలకు అండగా నిలిచి ఆర్థిక సహాయం అందచేశారు ఈ కార్యక్రమం లో మిత్రబృందం పాల్గొన్నారు.
మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలంలోని 23వ వార్డులో ఆదివారం ఘనంగా పోచమ్మ తల్లి బోనాలు అమ్మవారికి సమర్పించినట్లు ఆలయ కమిటీ వారు తెలియజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేడుకలు జరపడం తృతీయ సంవత్సరమని ప్రతి సంవత్సరం అమ్మవారిని అలంకరించి బోనాలతో అమ్మవారికి మొక్కలు చెల్లిస్తామని అన్నారు.అదేవిధంగా ఈ సంవత్సరం కూడా అమ్మవారి వద్ద పెద్ద ఎత్తున బోనాల సందడి నెల కోవడం జరిగింది.నస్పూర్ లోని తెలంగాణ తల్లి విగ్రహం నుండి పోచమ్మ దేవాలయం వరకు మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో అక్కడికి చేరుకొని, భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి మొక్కులు సమర్పించుకున్నారు.డప్పు చప్పుళ్ళు తీన్మార్ దరువులతో ఆ ప్రాంతమంతా మారు మోగింది.శివ సత్తుల ఆటలతో జాతర శోభ సంతరించుకుంది.ప్రతి సంవత్సరం ఆషాడ మాసంలో అమ్మవారికి బోనాలు సమర్పించడం చాలా సంతోషంగా ఉందని,అమ్మవారి ఆశీస్సులు ప్రజల అందరిపై ఉండి సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో చల్లగా చూడాలని అమ్మవారికి ఆలయ కమిటీ వారు ప్రత్యేక పూజలు సమర్పించారు.
వర్షాలు సకాలంలో కురవాలని సంకల్ప పూజ చేసిన బిజెపి నాయకులు
భూపాలపల్లి నేటిధాత్రి
సకాలంలో వర్షాలు పడి రాష్ట్రము దేశములోని ప్రజలు పశుపక్షాధులు సమస్త జీవకోటి సంపూర్ణ ఆరోగ్యంతో జీవించాలని దొంగల రాజేందర్ అన్నారు ఈ సందర్భంగా భూపాలపల్లి సుభాష్ కాలనీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో వర్షాలు సకాలంలో కురవాలని బిజెపి పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సంకల్ప పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ పూజా కార్యక్రమంలో వరుణ దేవుని యొక్క ఆశీర్వాదం కోసం వర్షాలు కురవాలని సీతారాములకు వాసు అయ్యగారుచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి సంకల్పం నెరవేరాలని సీతారాములను ప్రార్థించడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలందరూ కూడా వర్షాల కోసం భగవంతుని మనస్ఫూర్తిగా ప్రార్థించాలని అన్నారు సమృద్ధిగా వర్షాలు పడితే రైతులు మనకోసం పండించే పంట చేతికి వస్తుందని రైతుల ఆనందంగా ఉంటేనే సమస్త జీవకోటి ఆనందంగా ఉంటుందని కావున కనీసం మనం ప్రత్యక్షంగా రైతుల కోసం ఏమి చేయలేము కనీసం వర్షాలు పడాలని భగవంతుని ప్రార్థిస్తే రైతులకు అండగా ఉన్న వాళ్ళం అవుతామని అన్నారు ప్రకృతి సస్య శ్యామలంగా ఉండడంకోసం ప్రతి ఒక్కరూ ప్రకృతికి అనకూలంగా జీవించాలని అన్నారు ప్రకృతి ఆగ్రహిస్తే ప్రజలు సంతోషంగా జీవించలేరని అన్నారు వర్షాల కోసం ప్రతి ఒక్కరు భగవంతుని ప్రార్థించి భాగస్వాములు కావాలని ప్రజలను రాజేందర్ కోరారు ఈ కార్యక్రమంలో బట్టు రవి కంబాల రాజయ్య సామల మధుసూదన్ రెడ్డి తుమ్మేటి రామ్ రెడ్డి అజ్మీర రాజు నాయక్ కరివేద మనోహర్ రెడ్డి ఊరటి మునేందర్ కoచెం నరసింహమూర్తి గుండె శీను పొన్నాల కొమురయ్య తాండ్ర హరీష్ చెక్క శంకర్ శ్రీధర్ దొంగల కుమార్ తదితరులు పాల్గొన్నారు
ఎన్.హెచ్.ఆర్.సి మంచిర్యాల జిల్లా చైర్మన్ గా శ్రీపతి రాములు గౌడ్ నియామకం
శ్రీరాంపూర్,(మంచిర్యాల)నేటి ధాత్రి:
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిటీ మంచిర్యాల జిల్లా చైర్మన్ గా నస్పూర్ పట్టణానికి చెందిన శ్రీపతి రాములు గౌడ్ ను నియమించినట్లు స్టేట్ చైర్మన్ బద్దిపడగ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం నియామక పత్రం అందజేశారు.ఈ సందర్భంగా శ్రీపతి రాములు గౌడ్ మాట్లాడుతూ,సంస్థ నియమ,నిబంధనలు పాటిస్తూ,సంస్థ లక్ష్యాల కోసం పని చేస్తానని,ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకెళ్తానని, ప్రజాధనం దుర్వినియోగం కాకుండా చూస్తానని,ప్రతి పేదవాడికి న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తానని,పేద ప్రజల అభ్యున్నతి కోసం కృషి చేస్తానని తెలిపారు.
ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల కేంద్రం లోని ఝరాసంగం తాజా మాజీ సర్పంచ్ జగదీశ్వర్ ను పరామర్శించిన తెలంగాణ ఇండస్ట్రియల్ మాజీ చైర్మన్ తన్వీర్ సర్పంచ్ అనారోగ్యం తో అస్పత్రి లో చేరి ఇటీవల తన సొంత గ్రామమైన ఝరాసంగం కి వచ్చిన సందర్భంగా ఆయనను పరామర్శించిన మహమ్మద్ తన్వీర్ ఆయనతోపాటు కక్కర్వాడ మాజీ సర్పంచ్ జగన్ ఝరాసంగం టిఆర్ఎస్ యువ నాయకులు సద్దాం తదితరులు ఉన్నారు.
నూతన జిల్లా అధ్యక్షుడుగా బాధ్యతలు చేపట్టగానే ఫోటో గ్రాఫర్ల సంక్షేమం కోసం పని చేస్తూ అందరి మన్ననలను పొందుతున్నాడు ఫోటోగ్రాఫర్ల సంఘం జిల్లా అధ్యక్షులు రఘోత్తం రెడ్డి మంగళవారం రేగొండ మండలం కొడవటంచ గ్రామ ఫోటోగ్రాఫర్ సింగరి కిరణ్ ఇటీవల బైక్ పై నుండి కిందపడి కాలు ప్యాక్చర్ కావడం జరిగింది. విషయం తెలుసుకున్న నూతన జిల్లా అధ్యక్షులు బండ రగోతంరెడ్డి ఫోటోగ్రాఫర్కు ఆపుద వస్తే నేనున్నానని భరోసానిస్తూ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఫోటోగ్రాఫర్ మండల అధ్యక్షులు జంబుల రఘు, ఫోటోగ్రాఫర్స్ జిల్లా కోశాధికారి ఎల్దండి రాకేష్, టేకుమట్ల మండల ఫోటోగ్రాఫర్స్ అధ్యక్షులు దాసారపు సదానందం, ప్రధాన కార్యదర్శి గుగులోతు రాజేందర్ నాయక్, కోశాధికారి బండి కమలాకర్,రేగొండ ఫోటోగ్రాఫర్స్ మోరే మొగిలి, మల్లె బోయిన స్వామి, సింగరి సతీష్, సామల సురేందర్ రెడ్డి, కోల రాజు,చుక్క ప్రశాంత్, పబ్బ నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
జర్నలిస్టు క్రాంతి కుమార్ కు జాతీయ మహానంది పురస్కారం
మందమర్రి నేటి ధాత్రి
తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ నేతృత్వంలో….
పలు రంగాల్లో విశేష కృషి చేసిన వారికి అవార్డుల ప్రదానోత్సవం
Journalist Kranti Kumar
అంతర్జాతీయ సేవా సంస్థ తెలుగు సంస్కృతి సాహితి సేవా ట్రస్ట్, తెలంగాణ సంస్కృతి సాహితీ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం వరంగల్ లోని రామయ్య ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఆద్యంతం వీక్షకులను విశేషంగా అలరించాయి. ఈ వేకడుకల్లో మంచిర్యాల జిల్లాకు చెందిన జర్నలిస్ట్ జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ ఆఫ్ వార్త) దేశ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై, వివిధ రంగాలకు చెందిన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ వివిధ రాష్ట్రాలకు చెందిన వారిని వివిధ పురస్కారాలతో ఘనంగా సత్కరించి, ఘనంగా సన్మానించి, జ్ఞాపికలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను విశేషంగా ఆకర్షించాయి. అనంతరం ఈ వేడుకల్లో ఉత్తమ జర్నలిస్టుల విభాగంలో జిల్లాలోని మందమర్రి పట్టణానికి చెందిన జాడ క్రాంతి కుమార్ (టైమ్స్ అఫ్ వార్త) కు జాతీయ మహానంది అవార్డు – 2025ను అందజేసి, ఘనంగా సన్మానించారు. క్రాంతి కుమార్ జాతీయ అవార్డు అందుకున్న సందర్భంగా పలువురు జర్నలిస్టులు, స్నేహితులు, స్థానిక ప్రజలు ఆయనను అభినందించారు. ఈ సందర్భంగా అవార్డు పొందిన జాడ క్రాంతి కుమార్ మాట్లాడుతూ, ఈ గౌరవం తనకు మరింత బాధ్యతను పెంచిందని తెలిపారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు అవగతం అయ్యేలా, నిజాలను వెలికి తీసేందుకు, న్యాయంగా సమాచారం ప్రజలకు, అదేవిధంగా ప్రభుత్వానికి అందించేందుకు కృషి చేస్తానన్నారు.ఈ అవార్డుతో జిల్లా జర్నలిస్టులకు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు లభించినట్లు పలువురు వ్యాఖ్యానించారు. ఈకార్యక్రమంలో ట్రస్ట్ వ్యవస్థాపక చైర్మన్ మాచవరం గౌరీశంకర్, ఆర్గనైజింగ్ కార్యదర్శి బట్టు శ్రీనివాస్ రావు లు పాల్గొన్నారు.
వాయు కాలుష్యం జల కాలుష్యం చేస్తున్న పరిశ్రమలపై తగు చర్య తీసుకోవాలి
★పి. రాములు
జహీరాబాద్ నేటి ధాత్రి:
జహీరాబాద్ పట్టణంలో ఉన్న పరిశ్రమలు తమ పరిశ్రమల నుండి వచ్చే చెత్తను స్థానికంగా ఉన్న చెత్త వ్యాపారం చేసే వాళ్లకు ఇస్తున్నారు ఈ వ్యాపారులు చెత్తలో నుండి పునరుత్పత్తి అయ్యే వస్తువులను సేకరించి దేనికి పనికిరాని వస్తువులను అనగా ఫైబర్ రెగ్జిన్ ధర్మాకోల్ లాంటి వస్తువులు బహిరంగ ప్రదేశాలలో వేసి కాల్చి వేస్తున్నారు ఇలా కాల్చివేయడంతో భయంకరమైన వాయు కాలుష్యం ఏర్పడుతుంది అదేవిధంగా చెత్తను కాల్చివేసిన తర్వాత మిగిలిపోయిన బూడిద వర్షపు నీళ్లతో కలిసిపోయి చిన్నచిన్న కాలువల ద్వారా వాగులలోకి చెరిపోతుంది ఇలా చేరిపోయిన నీటిని తాగిన మూగజీవాలు అనేక సందర్భాలలో చనిపోతున్నాయి మరియు చెత్తను కాల్చి వేస్తుండగా ఎవరైనా ప్రశ్నిస్తే కొద్ది రోజులు మానుకొని చెత్తనంతా తీసుకెళ్లి వ్యవసాయ భూముల దగ్గర ఉన్న వ్యవసాయ బావులలో నింపి వేస్తున్నారు. వ్యవసాయ బావులలో నింపివేసిన చెత్తతో అనేక సందర్భాలలో భూగర్భ జలాలు కూడా కాలుష్యం అవుతున్నాయి ఈ విషయాలన్నింటిని కూడా కాలుష్య నియంత్రణ అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోవడం లేదు ప్రతిరోజు పరిశ్రమల నుండి పనికిరాని టన్నులకొద్ది చెత్త చెత్తలో అనేక రసాయనాలు తో కూడుకున్న వస్తువులను కూడా కాల్చి వేస్తున్నారు వ్యవసాయ భూములలో ఉన్న బావులలో నింపి వేస్తున్నారు. కావున భవిష్యత్తులో జహీరాబాద్ ప్రాంత ప్రజల మూగజీవాల ఆయురారోగ్యాలు కాపాడే విషయంలో తమ ఆదేశాలతో జిల్లా కాలుష్య నియంత్రణ అధికారులతోని కాలుష్యాన్ని పూర్తిగా అరికట్టేలా తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సలహా సభ్యుడు గా నియమితులైన సందర్బంగా తొలిసారి మందమర్రి కి విచ్చేసిన అంతడుపుల నాగరాజు గారికి కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్బంగా శాలువాతో సత్కారించి పూల బొకే అందజేశారు. అనంతరం అంతడుపుల నాగరాజు మాట్లాడుతూ నేను నా పురిటి గడ్డ అయినా మందమర్రి అంటే నాకు ఎంతో ప్రీతి నేను ఈ మందమర్రి లో పుట్టడం నా అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈ తెలంగాణ అంటే నాకు అమితమైన ప్రేమ నేను ఎన్ని మంచి అవార్డుసు అందుకున్నా మందమర్రిని మర్చిపోవడం అంటూ ఉండదు నేను చేసిన సేవలు ఎన్నో ఉన్నాయి. నా చిన్ననాటి నుంచి నేను ఒక కళాకారుడిగా ఒక మంచి ప్రావీణ్యాన్ని సంపాదించుకొని ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నందుకు నేను ఈ ఈ మందమర్రి కి రుణపడి ఉంటాను అని వ్యాఖ్యానించారు
బిఆర్ఎస్ పార్టీ పోరాట ఫలితమే వ్యవసాయ రైతులకు సాగునీరు విడుదల
బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు
నేటిధాత్రి చర్ల
బిఆర్ఎస్ పార్టీ ఉద్యమం వలన ఈరోజు రైతులకు తాలిపేరు కాలవల నుండి నీరు విడుదల చేసారు అని బిఆర్ఎస్ పార్టీ కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ ఒక ప్రకటనలో తెలిపారు జూలై 6 తేదీన డివిజన్ నాయకులు రావులపల్లి రాంప్రసాద్ మానెం రామకృష్ణ చర్ల మండల బిఆర్ యస్ పార్టీ నాయకులు కార్యకర్తలు రైతులు ప్రాజెక్ట్ నిండా నీరు ఉన్న నీరు విడుదల చేయడం లేదని రైతులు ఆందోళన చెందారు వెంటనే నీరు రైతులకు విడుదల చేయాలని డివిజన్ నాయకులు డిమాండ్ చేశారు దాని పలితమే ఈ రోజు రైతులకు నీరు విడుదల చేసారు చాలా సంతోషం అదే విధంగా కాలువలకు పడిన గండ్లను కూడ పూడ్చే కార్యక్రమాన్ని కూడ చేపడితే కింది ప్రాంత రైతుల కూడా న్యాయం జరుగుతుంది దుమ్ముగూడెం మండలంలో తూరుబాక వద్ద కల్వర్టు కృంగి పోయి ఉంటే బిఆర్ఎస్ పార్టీ డివిజన్ నాయకులు మండల నాయకులు ఉద్యమాన్ని చేపడితే వెంటనే బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించారు బిఆర్ఎస్ పార్టీ ఏప్పుడు కూడా తెలంగాణ ప్రజల కోసం రైతుల కోసం నిరంతరం పోరాటం చేస్తుందని తెలియజేసారు
ఝరాసంగం మండలం బొప్పనపల్లి గ్రామానికి చెందిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు గ్రామస్థుల ఆహ్వానం మెరకు మత సామరస్యాలకు అతీతంగా జరిగిన మొహరం ఉత్సవాల్లో జహీరాబాద్ శాసనసభ్యులు కొనింటి మాణిక్ రావు పాల్గొని దర్గాకు పూలమాలలు చాదర్ సమర్పించి నియోజకవర్గంలో ఉన్న ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం, మాజీ ఎంపీపీ సంగమేశ్వర్, మాజీ కేతాకీ సంగమేశ్వర ఆలయ చైర్మన్ నర్సింహా గౌడ్, పట్టణ అధ్యక్షులు ఏజాస్ బాబా,మాజీ సర్పంచ్ లు శ్రీనివాస్ రెడ్డి , సంగారెడ్డి, నాయకులు వెంకట్ రెడ్డి,సంతు పటేల్,నాగేందర్ పటేల్,విజయ్ పటేల్, సోహైల్,ఉల్లాస్,బొప్పానపల్లి సీఎహేచ్ నాగన్న, కి. శశివర్ధన్ రెడ్డి,సయ్యద్,గఫార్,నర్సింలు,లేయాకత్, విష్ణువర్ధన్ రెడ్డి,జి సిద్ధప్ప,దిగంబర రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి,రవి,సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.
గురుదేవ్ విద్యాలయం నందు ఐఎల్ఎమ్ బెంగళూరు టీచర్స్ చే స్పోకెన్ ఇంగ్లీష్ తరగతులు ప్రారంభం
నేటిదాత్రి చర్ల
చర్ల మండల కేంద్రంలోని ప్రముఖ ప్రైవేటు విద్యాసంస్థ అయిన గురుదేవ్ విద్యాలయంలో ఈ విద్యా సంవత్సరం నుండి విద్యార్థులలో ఆంగ్లభాష యందు చక్కని అవగాన కల్పించాలన్న సత్సంకల్పంతో ఆంగ్ల భాషలో కమ్యూనికేషన్ స్కిల్స్ పెంపొందించాలనే సదుద్దేశ్యంతో ఎంతో వ్యయంతో కూడుకున్నదే అయినా కూడా ఐఎల్ఎమ్ బెంగుళూరు వారితో ఒప్పందం కుదుర్చుకుని ఐఎల్ఎమ్ బెంగుళూరు వారి ఆధ్వర్యంలో శిక్షణా తరగతులు ప్రారంభించడమైనదని పత్రికా ప్రకటన ద్వారా విద్యార్థుల తల్లిదండ్రులకు తెలిపారు ఈ విద్యా సంవత్సరం విద్యార్థినీ విద్యార్థుల కు చక్కని శిక్షణ ఇచ్చుటకు బెంగుళూరు నుండి కుమారి సౌజన్య శిక్షకులుగా నియమించబడ్డారు ఈ రోజు ఈ కార్యక్రమం పాఠశాల ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ అకడమిక్ కోఆర్డినేటర్స్ ఎంవి సుబ్రహ్మణ్యం జి శ్రీనివాస్ మరియు ఐఎల్ఎమ్ బెంగుళూరు నుండి విచ్చేసిన సందీప్ చేతుల మీదుగా ఉపాధ్యాయినీ ఉపాధ్యాయుల సమక్షం లో లాంఛనంగా ప్రారంభించబడినది ప్రధానోపాధ్యాయులు హెచ్ జివి ప్రసాద్ మాట్లాడుతూ కమ్యూనికేషన్ స్కిల్స్ లో శిక్షణ ఇచ్చుటకు ఎంతో సుదూరాల నుండి వచ్చేసిన కుమారి సౌజన్య సందీప్ కు మరియు మన పాఠశాలకు తమ సహకారాన్ని అందిస్తున్న ఐఎల్ఎమ్ బెంగుళూరు సంస్థకు ప్రత్యేక కృతజ్ఞతలు పత్రికా ముఖంగా తెలిపారు
తెలంగాణ పిఆర్ టియు సంఘంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం
నేటిదాత్రి చర్ల
Telangana PRTU Association.
పిఆర్ టియు రాష్ట్ర జిల్లా శాఖల పిలుపు మేరకు చర్ల మండలం లోని వివిధ పాఠశాలలు తిరిగి పిఆర్ టియు టిఎస్ సభ్యత్వాల నమోదు కార్యక్రమం జరిగినది దీనిలో చర్ల మండల సభ్యులు అందరూ సభ్యత్వం తీసుకోవటం జరిగింది ఈ కార్యక్రమం లో పిఆర్ టియు టిఎస్ చర్ల మండల అధ్యక్షులు ఎస్ఎస్ఎస్ రవికుమార్ ప్రధాన కార్యదర్శి తుర్రం వీరభద్రం పునేం వేణు శ్రీనివాస్ దారయ్య గురుమూర్తి వీరమోహన్ పోడియం నాగేశ్వరరావు కాంతారావు తదితరులు పాల్గొన్నారు మంచి స్పందన సభ్యులలో కనిపించింది సంఘం ఉపాధ్యాయులకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తుందని అని మీకు త్వరలో మంచి పి ఆర్ సి ట్రాన్స్ఫర్ తో కూడిన ప్రమోషన్స్ పెండింగ్ బకాయిలు జనగణన చేసిన డబ్బులు ఇప్పించాలని సభ్యులు తెలుపగా సమస్యలు వెంటనే తీర్చే విధంగా చర్యలు తీసుకొనేలా రాష్ట్ర శాఖకు ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి కి తెలిపి వీలైనంతవరగా సమస్యలను పరిష్కరిస్తామని పత్రిక ప్రకటన ద్వారా తెలియజేశారు
`తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మలుచుకుందాం?
`తెలంగాణలో ఆధిపత్య రాజకీయాలు సాగుతున్నాయి!
`తెలంగాణ ప్రజల దృష్టి అటువైపు వున్నప్పుడే మనం తేరుకుందాం?
`ఐక్యతగా నిలబడి సాధించుకుందాం?
`తెలంగాణలో ఏపి సెటిలర్లు 67 లక్షలున్నట్లు అంచనా!
`హైదరాబాదులో 33 లక్షలున్నట్లు తెలుస్తోంది.
`ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ, వరంగల్ లలో 34 లక్షల మంది వున్నారు.
`64 స్థానాలలో కీలక భూమిక పోషించొచ్చు.
`సమైక్య రాష్ట్రమే అవసరం లేదు.
`రెండు రాష్ట్రాలున్న ఇబ్బంది వచ్చేదేమీ లేదు.
`రెండు రాష్ట్రాలు మనవే కావాలి!
`క్రియాశీల పాత్ర పోషించే స్థాయిలో వున్నాం!
`ఇప్పటికైనా మేలుకుందాం?
`లేకుంటే ఎప్పటికైనా పరాయివాళ్లే అంటారు?
`ఇదే సరైన సమయం.. పాగా వేద్దాం?
`ఏపి రాజకీయాలనే శాసిస్తున్నాం!
`తెలంగాణ రాజకీయాలను ఎప్పటికైనా వశం చేసుకుంటాం?
`ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎక్కువ కాలం కూడా పట్టదు!
`ఏపి మీడియాను ఎగదోద్దాం?
`తెలంగాణ రాజకీయాల దృష్టి మళ్ళించి మనం బలపడదాం! తెలంగాణ ఏ రాకీయ పరిస్దితుల్లో వుందో చెప్పడానికి కమ్మ, రెడ్డి కలిసి పోదామా? అన్న చర్చలోనే తెలిపిపోతోంది. సరిగ్గా తెలంగాణలో రాజకీయ గందరగోళం సాగుతోంది. బిఆర్‌ఎస్ మీద కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దఎత్తున కేసులు నమోదు చేసింది. అందులో ఏ ఒక్క కేసులోనైనా బిఆర్‌ఎస్ నాయకులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ఆ పార్టీకి కొంత గడ్డుకాలమే. అలాంటి పరిస్దితి వస్తే మాత్రం సీమాంద్ర మీడియాకు సంక్రాంతి పెండుగే. తెలంగాణ విఫల రాష్ట్రమని ఎలా రుజువు చేయాలనేదానిపైనే ఆ ప్రాంత మీడియా కాచుకొని కూర్చున్నది. ఏపికి చెందిన రాజకీయాలపై కేసిఆర్ అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పడం చూస్తూనే వుంటాం. కళ్లు మనవే, వేలు మనదే పొడిచేది మనోడే..పొడిపించే వాడు మాత్రం పక్కొడే అంటుంటారు. ఇది కొంత కాలం పోతే నిజమయ్యే అవకాశం కళ్లముందు కనిపిస్తోంది. తెలంగాణలో ఆదిప్యత రాజకీయాలు, కేసిఆర్ కుటుంబంలో కలహాలు, బిసి రాజకీయంలో లుకలుకలు. ఇలా గందరగోళ రాజకీయాలున్న సమయంలోనే సీమాంద్రకు చెందిన ప్రజల ఆలోచనలు మార్చాలి. ఏపికి చెందిన పార్టీల వైపు వారి దృష్టి మళ్లించాలి. అప్పుడు పాగా వేయడం చాల సులువు అనే ఆలోచనకు ఏపికి చెందిన రెండు కులాల నాయకులు లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మీద మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. కాకపోతే సమైక్య వాదం పక్కన పెట్టి, రెండు రాష్ట్రాలను ఏలుదామన్న ఆలోచనలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాలను కలపడం ఇప్పట్లో సాద్యం కాదు. ఆ పని చేయాలని చూస్తే మళ్లీ తెలంగాణ వాదం తెరపైకి వస్తే తట్టుకోలేం. అందవల్ల రెండు రాష్ట్రాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటే చాలు. రెండు రాష్ట్రాలను ఏలితే మేలు అనే నిర్ణయానికి కొంత మంది సీమాంద్రకు చెందిన రెండుకులాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా కొంత మంది ముఖ్య నాయకులు, వ్యాపార వేత్తలు కలిసి సంయుక్త సమావేశం రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడా సమైక్య వాదమన్న మాట రాకుండా జాగ్రత్త పడుతూనే తెలంగాణను రాజకీయంగా వశం చేసుకోవాలన్న కుయుక్తులు పన్నుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్పగా చెప్పుకున్నా, అమరావతితోపాటు, ఏపిలో రియల్ బూమ్ కనిపించడం లేదు. అమరావతిని ఎంతగా అభివృద్ది చేయాలన్నా కాలం కలిసి రావడం లేదు. ఏళ్లుగా ఎదురుచూసి మొదలు పెట్టిన పోలవరం ఇంకో దశాబ్ధం గడిచినా పూర్తవుతుందన్న నమ్మకం లేదు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులేవైనా సరే తెలంగాణ నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. అందువల్ల ఏపిలో వాతావరణ అననుకూలతలే ఎక్కువ. వ్యవసాయం, మత్స్య రంగాలు తప్ప మరో పారిశ్రామిక ప్రగతి జరిగే పరిస్దితి కనిపించడం లేదు. ఐటి రంగం కూడా విస్తరించే అవకాశాలు కనిపించడంలేదు. మరో వైపు ఏసి. సిఎం. చంద్రబాబు నాయుడు కూడా ఖజానా చూస్తే భయమేస్తుందన్నాడు. సంపద సృషించాలని వుంది. ఎవరైనా సలహాలు ఇవ్వండి అని కూడా చెప్పే పరిస్దితి వచ్చింది. కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్నా నిధుల వరద పారడం లేదు. ఏ రకంగా చూసినా ఏపిలో పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో తెలంగాణలో రాజకీయాల్లోపాగా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్న భావన వారిలో కనిపిస్తోంది. ఎంత లేదన్నా తెలంగాణలో 64 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్దితిలో ఏపి నుంచి స్దిరపడిన వాళ్లు వున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంది సీమాంధ్ర మూలాలున్న వారున్నారనే లెక్కను ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ఓ సంపూర్ణ సర్వే చేసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్, రంగారెడ్డి రెండు జిల్లాల్లో సుమారు33 లక్షల మందికి పైగా సీమాంద్ర మూలాలున్న వాళ్లున్నారు. మిగత జిల్లాలైనా ఖమ్మం, నల్లగొండ, వరంగల్, నిజామాబాద్ జిల్లాలన్నింటిలో కలిపి 34లశ్రీల మంది సీమాంధ్రకు చెందిన వాళ్లున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ మంది వున్నారు. కుటుంబాల పరంగా చూసుకుంటే ఖమ్మం, నిజాబాబాద్ జిల్లాల్లో ఎక్కువగా వున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదం వున్నప్పటికీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు స్దానం కల్పించడం లేదు. సీట్లు ఇవ్వడం లేదు. గతంలో వామపక్షాలు, కాంగ్రెస్ ఎక్కువ ప్రభావం చూపేవి. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖమ్మంలో ఎక్కువగా వారి ప్రాభల్యం నడిచింది. ఇప్పుడు తెలుగు దేశం లేకపోవడంతో, కాంగ్రెస్‌కు ఆ ఓటు బ్యాంక్ షిఫ్ట అయ్యింది. మళ్లీ తెలుగుదేశం పురుడు పోసుకుంటే, ఆ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అందుకే గత రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్‌కు చెందిన శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్కో ఎక్కువగా నిర్వహిస్తూ వచ్చారు. ఎక్కడైతే ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే స్ధానాలున్న చోట అవసరమైతే ఎన్నికల బరిలోకి దిగి ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో పాగా వేయాలంటే ముందు రెండు కులాల మధ్య రాజకీయాలను పక్కన పెట్టి, పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. కేసిఆర్ వల్ల తెలంగాణకు ఎట్టిపరిస్దితుల్లో వైసిపి రాదు. జనసేనకు పెద్దగా తెలంగాణలో స్కోప్ లేదు. ఇక మిగిలింది రెండు కులాల రాజకీయం. కొంత కాలం కలిసి పనిచేస్తే చాలు తెలంగాణలో పాగా వేయడం పెద్ద సమస్య కాదన్న సమాలోచనలు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో స్దిరపడిన ఏపి మూలాలున్న వారిలో ఇప్పటికీ తెలంగాణ భావన లేదు. ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల క్రితం తెలంగాణకు వచ్చి స్ధిరపడినా, వారి కుటుంబ బందాలు, బాంద్యవ్యాలు ఏపితోనే కలిసి వున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత యువత, ఐటి రంగం విస్తరించిన తర్వాత జరిగిన వివాహాలలో రెండు ప్రాంతాల మద్య వివాహ బందాలు కొన్ని పెరిగాయి. అది 3 నుంచి 7శాతంగా గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాల మధ్య వివాహ సంబందాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఈ సమయంలో సమైక్యాంధ్ర అనే నినాదం కన్నా, రెండు రాష్ట్రాలలో పాతుకపోవడమే మేలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతోంది. గత ఎన్నికల్లో సీమాంధ్ర మూలాలున్న వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా చేశారు. మరి కొంత మంది బిఆర్‌ఎస్‌కు అనులంగా ఓట్లు వేశారు. మెజార్టీ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ను నమ్మడానికి ఆసక్తి చూపలేదు. కాని ఇక్కడ నుంచి ఏపికి వెళ్లి, రెండు చోట్ల ఓట్లు వుండడంతో తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. ఆ ఓట్లే కూటమి విజయానికి దారులువేసింది. కూటమికి ప్రతిపక్షం లేనంత మెజార్టీని కట్టబెట్టింది. తెలంగాణలో కూడా అదే జరిగితే, కాంగ్రెస్‌కు పూర్తి స్దాయి మద్దతు పలికితే బిఆర్‌ఎస్ ఉనికి లేకుండాపోయేది అన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదనుకున్నారు. కాని హైదరాబాద్ ప్రజలు బిఆర్‌ఎస్‌ను గెలిపించారు. అంటే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్ వైపు నిలుస్తారని ఏపికి చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఊహించుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం వదిలేశారు. గత ఎన్నికల్లో ఏపికి చెందిన నాయకుల అనుచరులుపెద్దఎత్తున తెలంగాణలో ప్రచారంలోపాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, నల్గొండలలో కాంగ్రెస్ నాయకులకు పనిచేశారు. కాని హైదరాబాద్‌లో అర్భన్ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపు నిలుస్తారని ఊహించలేదు. ఎక్కడైతే నెగ్గుతామనుకున్నారో అక్కడ ఓడిపోయారు. ఎక్కడైతే నెగ్గలేమనుకున్నారో అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈసారి ఎన్నికలో నిలిచే ప్రయత్నాలను వదలుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున రంగంలోకి దిగితే ఓట్ల లెక్క కూడా పక్కాగా తెలుస్తుంది. అప్పుడు చాప కిందనీరులా హైదరాబాద్, రంగారెడ్డిలలో మాత్రమే ప్రచారం మూడేళ్ల ముందు నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఖమ్మం లాంటి జిల్లాల్లో ప్రత్యేకంగా శద్ద్ర పెట్టాల్సిన అసవరం లేదని తేలింది. హైదరాబాద్‌లోనే అసలైన దృష్టి కేంద్రీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.
కబ్జాకు గురైనా చెరువు, కుంటలను ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవాలి
చెరువు, కుంటల కనుమరుగుపై సంబంధిత అధికారులను బాధ్యులను చేసి చర్యలు తీసుకోవాలి
ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య విజ్ఞప్తి
“నేటిధాత్రి”,కరీంనగర్ టౌన్:
రాష్ట్రంలో చెరువులు, కుంటల లెక్కలు తేల్చాలని, అక్రమణలకు గురికాకుండా వెంటనే హద్దులు నిర్ణయించాలని జాతీయ మానవ హక్కుల కమిటీ (ఎన్ హెచ్ ఆర్ సి) రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర కమిటీ సభ్యులు విలాసాగరం పృథ్వీరాజ్ అధ్యక్షతన జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో చాలాచోట్ల చెరువులు, కుంటలు కబ్జాకు గురయ్యాయని, అక్రమణదారులు కొంతమంది రాజకీయ నాయకులు, అధికారుల అండతో నకిలీ పేపర్లు డాక్యుమెంట్లు సృష్టించి పట్టాలు పొందారని, వాటిపై బ్యాంకు లోన్లు, రైతుబంధు, రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలను లబ్ధి పొందుతున్నారని ఆయన స్పష్టం చేశారు. ఇలా కనుమరుగైన చెరువు,కుంటల లెక్కలు తీసి సంబంధిత అధికారులను బాధ్యులుగా చేసి వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వానికి సూచించారు. చెరువులను, కుంటలను రక్షించే బాధ్యత సంబంధిత అధికారులేనని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చెరువు, కుంటలను గుర్తించి వాటికి హద్దులను నిర్ణయించాలని ఆయన కోరారు. అక్రమణలకు గురైన చెరువు కుంటలను తిరిగి స్వాధీనం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అక్రమంగా పొందిన పట్టాలను రద్దు చేయాలని, వారికి క్షేత్రస్థాయిలో సహకరించిన రెవెన్యూ శాఖ అధికారులపై, ఇరిగేషన్ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు జెల్ల చంద్రయ్య, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇమ్మడి ప్రణయ్, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు వడ్డీక అనిల్ రెడ్డి, సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తాళ్లపల్లి రవి గౌడ్, కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, కరీంనగర్ పట్టణ అధ్యక్షులు హరీష్, జిల్లా అధికార ప్రతినిధి నూనె శ్రీనివాస్, తిమ్మాపూర్ మండల అధ్యక్షులు అభిషేక్, జిల్లా నాయకులు మధుకర్, సామాజిక ఉద్యమకారులు కాట్నపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి ప్రజా భవన్ లో ప్రజల నుండి వచ్చే వనపర్తి జిల్లా ప్రజల ఫిర్యాదులను వనపర్తి అధికారులు నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ జి వెంకటేశ్వర్లు అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు యాదయ్య, ఆర్డీఓ సుబ్రమణ్యంతో కలిసి ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా ప్రజావావాణి లో స్పందిస్తూ, ఫిర్యాదుదారులకు వెంటనే సమాచారం అందించాల్సిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందన్నారు. ముఖ్యమంత్రి ప్రజావాణి, మంత్రి ద్వారా ఈ జిల్లాకు సంబంధించిన ప్రజావాణి ఫిర్యాదులు, ప్రతి సోమవారం జిల్లా ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మండల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
బీసీల రిజర్వేషన్ 42 శాతనికి పెంచడం బీసీ ప్రజలకి ఒక గొప్ప వరమని నవాబుపేట్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ చరిత్రలోనే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా అత్యధికంగా ఉన్న బీసీ ప్రజల కోసం వారి యొక్క ఉద్యోగాల్లో గానీ స్థానిక సంస్థల పదవుల్లో గానీ ఉన్నత స్థానం కల్పించాలనే సదుద్దేశంతో 42 శాతం రిజర్వేషన్ ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు సహచర మంత్రులకు బీసీ సంక్షేమం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. గడిచిన గత పది సంవత్సరాలలో ఏనాడు కూడా బి ఆర్ యస్ పార్టీ, బీసీల గురించి ఆలోచించ లేదు కదా వారికీ కనీస విలువ కూడా ఇవ్వలేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి కొద్ది రోజులలోనే బీసీ ల పట్ల చూపించిన గౌరవానికి ఎల్లపుడు పార్టీ కి రుణపడి ఉంటామని తెలియజేస్తూ రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేసారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు జూలకంటి శ్రీధర్, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
We use cookies on our website to give you the most relevant experience by remembering your preferences and repeat visits. By clicking “Accept All”, you consent to the use of ALL the cookies. However, you may visit "Cookie Settings" to provide a controlled consent.
This website uses cookies to improve your experience while you navigate through the website. Out of these, the cookies that are categorized as necessary are stored on your browser as they are essential for the working of basic functionalities of the website. We also use third-party cookies that help us analyze and understand how you use this website. These cookies will be stored in your browser only with your consent. You also have the option to opt-out of these cookies. But opting out of some of these cookies may affect your browsing experience.
Necessary cookies are absolutely essential for the website to function properly. These cookies ensure basic functionalities and security features of the website, anonymously.
Cookie
Duration
Description
cookielawinfo-checkbox-analytics
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Analytics".
cookielawinfo-checkbox-functional
11 months
The cookie is set by GDPR cookie consent to record the user consent for the cookies in the category "Functional".
cookielawinfo-checkbox-necessary
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookies is used to store the user consent for the cookies in the category "Necessary".
cookielawinfo-checkbox-others
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Other.
cookielawinfo-checkbox-performance
11 months
This cookie is set by GDPR Cookie Consent plugin. The cookie is used to store the user consent for the cookies in the category "Performance".
viewed_cookie_policy
11 months
The cookie is set by the GDPR Cookie Consent plugin and is used to store whether or not user has consented to the use of cookies. It does not store any personal data.
Functional cookies help to perform certain functionalities like sharing the content of the website on social media platforms, collect feedbacks, and other third-party features.
Performance cookies are used to understand and analyze the key performance indexes of the website which helps in delivering a better user experience for the visitors.
Analytical cookies are used to understand how visitors interact with the website. These cookies help provide information on metrics the number of visitors, bounce rate, traffic source, etc.
Advertisement cookies are used to provide visitors with relevant ads and marketing campaigns. These cookies track visitors across websites and collect information to provide customized ads.