చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని.

చదువుకి దూరం అవుతున్నాడని తెలుసుకొని సైకిల్ సహాయం చేసిన రవి

జహీరాబాద్ నేటి ధాత్రి:

చిలేమామిడి గ్రామం లోని పిచ్చకుంట్ల నాగరాజు అనే విద్యార్థి zphs జీర్లపల్లి పాఠశాలలో 6th class చదువుతున్నాడు నాగరాజు తండ్రి మరణించాడు తల్లి డబ్బులు లేక ఇంటి దగ్గరనే పిల్లల్ని ఉంచింది విషయం తెలుసుకున్న CRP చిరంజీవి చిలేమామిడి గ్రామం కి వెళ్లి పిల్లల్ని ZPHS జీర్లపల్లి స్కూల్ లో జాయిన్ చేయడం జరిగింది స్కూల్ కి రావడానికి ఇబ్బంది అవుతుంది అని తెలుసుకొని ఝరాసంగం రవి కి తెలియజేయగా వెంటనే విద్యార్థి కి సైకిల్ సహాయం చేయడం జరిగింది.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి.

ఉపాధి హామీ కార్మికుల వేతన బకాయిలు విడుదల చేయాలి…

నేటి ధాత్రి -గార్ల :-

మండల పరిధిలోని గార్ల,ముల్కనూర్, చిన్నకిష్టపురం,పెద్దకిష్టాపురం, సత్యనారాయణపురం, శేరిపురం,మర్రిగూడెం, పుల్లూరు,పోచారం, గోపాలపురం, పినిరెడ్డిగూడెం, సీతంపేట,మద్దివంచ, రాంపురం తదితర గ్రామపంచాయతీలలో పనిచేసిన ఉపాధి హామీ కూలీలకు చెల్లించాల్సిన వేతన బకాయిలను తక్షణమే చెల్లించాలని ఉపాధి హామీ పథకం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.అసౌకర్యాల నడుమ మండుటెండల్లో చెమట చిందించి పనిచేసిన కార్మికులకు 15 రోజులకు ఒకసారి వేతనాలు చెల్లించే విధానాన్ని పాలకులు స్వస్తి పలికారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పనులు చేసి నెలలు గడుస్తున్నప్పటికీ వేతనాలు ఇవ్వకపోతే కూలీలు ఏమి తిని బ్రతుకుతారని ప్రశ్నిస్తున్నారు. వేతనాలు అందక అనేక కుటుంబాలు సుదుల ప్రాంతాలకు వలస వెళ్లే పరిస్థితి దాపురించిందని వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి పెండింగ్ వేతనాలు చెల్లించాలని లేనిపక్షంలో ప్రజలు సరైన సమయంలో పాలకులకు గుణపాఠం చెబుతారని ప్రజాసంఘాల నేతలు హెచ్చరిస్తున్నారు..

కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన.!

ఘనంగా కాంగ్రెస్ మండల పార్టీ యువజన అధ్యక్షుని జన్మదిన వేడుకలు

పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే గండ్ర సత్యనారా యణ రావు

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల యువజ న కాంగ్రెస్ అధ్యక్షుడు సాధు నాగరాజు జన్మదినం సంద ర్భంగా భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు నాగరాజుకు శాలువా కప్పి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగరాజు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు మరె న్నో జరుపుకోవాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యా లతో ఉండాలని కోరారు.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ.

సి ఆర్ నగర్ లో ఉచిత వైద్య శిబిరం నిర్వహణ

భూపాలపల్లి నేటిధాత్రి

మున్సిపాలిటీ పరిధిలోని సి ఆర్ నగర్ లో భూపాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. వార్డు ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులను పంపిణీ చేశారు. అనంతరం
సీజనల్ వ్యాధుల పై అవగాహన కల్పించారు
ఈ కార్యక్రమంలో డాక్టర్ శారద, వి బృందా. శ్రీదేవి ఏఎన్.ఎంలు రమ, కరుణ,ఆశ వర్కర్లు స్వరూప,అరుణ తదితరులు పాల్గొన్నారు.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన.

రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం.. ఇందిరమ్మ పాలన

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

బిఆర్ఎస్ బిజెపి నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికలు

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ప్రజా ప్రభుత్వం అని.. నేడు రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఇందిరమ్మ పాలన నడుస్తుందని
ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు.
దుగ్గొండి మండలం గుడ్డేలుగులపల్లి గ్రామం నుంచి బిఆర్ఎస్,బిజెపి పార్టీలకు చెందిన 9 కుటుంబాలు ఆయా పార్టీలకు రాజీనామా చేసి మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్ గౌడ్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్యే
దొంతి మాధవ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరగా పార్టీ కండువాలు కప్పి స్వాగతించారు.ప్రభుత్వం అవలంబిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులైన ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరికలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.తనను నమ్మివచ్చిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటానని,ప్రజా ప్రభుత్వ ప్రతి సంక్షేమ పథకాన్ని నర్సంపేట నియోజకవర్గంలో అర్హుడైన ప్రతి లబ్ధిదారుడికి అందే వరకు కృషి చేస్తానని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హామీ ఇచ్చారు.పార్టీలో చేరిన వారిలో ఏడ్డే బాపూరావు, పేరం రాజు,వేల్పుల అశోక్, వేల్పుల నాగరాజు, వేల్పుల సిద్దు,తౌట్ రెడ్డి రాజిరెడ్డి, కొమాండ్ల రాజేందర్, నల్ల సంజీవ, మంద కుమారస్వామి ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చెన్నూరు కిరణ్ రెడ్డి,మండల కోశాధికారి జంగిలి రవి,గుడ్డెలుగులపల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు జంగిలి నగేష్,తొర్రూరు నర్సయ్య, జంగిలి రాజు, జంగిలి రమేష్,తొర్రూర్ రవి, తొర్రుర్ రామన్న, గుండెకారి సునీల్, , పిఎసిఎస్ దుగ్గొండి మాజీ డైరెక్టర్ పొగాకు మోహన్ తదితరులు పాల్గొన్నారు.

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ..

బీసీ బాలికల హాస్టల్ కు వాటర్ ఫిల్టర్ బహుకరణ

శాయంపేట నేటిధాత్రి:

శాయంపేట మండల కేంద్రం లోని వెనుకబడిన తరగతుల బాలికల హాస్టల్ కు శాయం పేటకు చెందిన క్రీస్తు శేషులు బాసని శంకరయ్య జ్ఞాపకార్థం ఆయన కుమారులు వినయ భూషణ్ శైలేష్ కుమార్ వాటర్ ఫిల్టర్ ను బహుకరిం చారు. ఈ మేరకు శంకరయ్య సోదరుడు బాసని సుబ్రహ్మ ణ్యం మంగళవారం హాస్టల్ కు వెళ్లి 25 వేల విలువగల వాటర్ ఫిల్టర్ ను హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ సుష్మాకు అందజేసి ఫిట్టింగ్ చేయించి హాస్టల్ బాలికలకు పరిశుభ్రమైన తాగునీరు కోసం చర్యలు తీసుకున్నారు. ఈ సంద ర్భంగా హాస్టల్ బాలికలు వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి హాస్టల్ సిబ్బంది పాల్గొన్నారు.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన.

బాలాజీ టెక్నో స్కూల్ లో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మండలం లక్నేపల్లిలోని బాలాజీ టెక్నో స్కూల్లో ఎన్.సి.సి పదవ బెటాలియన్ ఆదేశాల మేరకు సోషల్ సర్వీస్ అండ్ కమ్యూనిటీ డెవలప్మెంట్ లో భాగంగా ఎన్.సి.సి థర్డ్ ఆఫీసర్ యం.డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రపంచ యువజన నైపుణ్య దినోత్సవం నిర్వహించారు. పాఠశాల ప్రిన్సిపాల్ పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ యువతకు నైపుణ్యాలు చాలా అవసరమని, నైపుణ్యాలతోటే భవిష్యత్తులో ఉన్నతమైన స్థానాన్ని చేరుకోవచ్చని తెలిపారు. విద్యార్థులు పాఠశాల దశ నుండే చదువుతో పాటుగా వివిధ రంగాల్లో నైపుణ్యాలను నేర్చుకోవాలని సూచించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు యువతలో నైపుణ్యాలను పెంపొందించడానికి రాజీవ్ యువ వికాసం లాంటి అనేక సంక్షేమ పథకాలను అందించేందుకుఅనేక కార్యక్రమాలను, నైపుణ్య శిబిరాలను నిర్వహిస్తున్నాయని, వాటిని యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. విద్యార్థులు నైపుణ్యాల యొక్క ప్రాముఖ్యతను, ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం- 2025 యొక్క ఉద్దేశం గురించి వివరించారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు భవాని చంద్,రమేష్,నరసింహారెడ్డి, కృష్ణవేణి,అనిత,హేమలత, ఉపాధ్యాయులు,విద్యార్థులు పాల్గొన్నారు.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం.

బాలాజీ ఇంటిగ్రేటెడ్ అక్షరలో ఘనంగా వన మహోత్సవ కార్యక్రమం

నర్సంపేట,నేటిధాత్రి:

బాలాజీ విద్యాసంస్థల్లో ఒక్కటైన అక్షర ద స్కూల్, బిట్స్ స్కూల్లో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమం పురస్కరించుకొని మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు.

Dr. A. Rajendra Prasad Reddy, Head of Balaji Educational.

బాలాజీ విద్యాసంస్థల అధినేత డాక్టర్ ఏ. రాజేంద్ర ప్రసాద్ రెడ్డి, ట్రెజరర్ డాక్టర్ వనజ పాల్గొని వన మహోత్సవం సందర్భంగా విద్యార్థులు గ్రీన్ కలర్ దుస్తులు ధరించి ఇంటి వద్ద నుండి తీసుకొచ్చిన మొక్కలను పాఠశాల ఆవరణలో పిల్లలతో మొక్కలు నాటించారు.ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు మొక్కలు ఎంతో దోహదపడతాయని ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని తెలిపారు.అనంతరం వన మహోత్సవం పై డ్రాయింగ్ కాంపిటీషన్ నిర్వహించారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.ఈ కార్యక్రమంలో విద్యా సంస్థల సెక్రటరీ డాక్టర్ రాజేశ్వర్ రెడ్డి,బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ ప్రిన్సిపల్ జ్యోతి,అక్షర స్కూల్ ప్రిన్సిపల్ జి. భవాని,ఉపాధ్యాయ బృందం,విద్యార్థులు పాల్గొన్నారు.

కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్.

తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా పోలేపాక జనార్ధన్

ములుగు జిల్లా, నేటిధాత్రి

ములుగు జిల్లా పత్తిపల్లి గ్రామస్తుడైన పోలేపాక జనార్దన్ చిన్నప్పటినుండి గురుకులంలో చదువుకుంటూ కబడ్డీలో రాణిస్తూ చాలా రోజులుగా ములుగు జిల్లా కబడ్డీ అసోసియేషన్ లో సెక్రెటరీ గ ఉంటూ అదనంగా జనార్ధన్ కు తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ గ ఎన్నిక కావడం జరిగింది. పోలెపాక జనార్దన్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో నాకు బాధ్యతలు అప్పగించినందుకు అదేవిధంగా దీనికి ప్రత్యక్షంగా తెలంగాణ రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కాసాని వీరేశం అదేవిధంగా రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్ సెక్రెటరీ మరియు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఇండియన్ కబడ్డీ ప్లేయర్ కబడ్డీ రథసారథి మహేందర్ కి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన..

వనపర్తిలో ఎమ్మెల్యే కృషితో మిగిలిపోయిన రోడ్ల విస్తరణ పనులు ప్రారంభం

వనపర్తి నేటిదాత్రి ,

వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్డు పాన్ గల్ కొత్తకోట రోడ్డులో నిలిచి పోయిన రోడ్ల విస్తరణ పనులు స్థానిక ఎమ్మెల్యే ప్రజల కోరిక మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్నందుకు ప్రజలు హర్షం
వ్యక్తం చేస్తున్నారు ఎంతో కాలం గా కర్నూల్ రోడ్ పా న్ గల్ కొత్తకోటరోడ్డు విస్తరణకు నోచుకోకపోవడంతో రోడ్డు కటింగ్ పెండింగ్ లో ఉంచినట్లు ప్రచారంలో ఉంది . వనపర్తి ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి కర్నూల్ రోడ్ పానగల్ రోడ్డు విస్తరణలో నష్టపోయే బాధితులను స్వయంగా కలిసి వారి అభిప్రాయాలు తీసుకున్నారు . కర్నూల్ రోడ్ లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎస్ ఎల్ ఎన్ రమేష్ తన భవనాన్ని స్వచ్ఛందంగా కూలగొట్టుటకు ముందుకు వచ్చినందుకు ఎమ్మెల్యే మెగా రెడ్డి అభినందించారు . భవిష్యత్తు తరాలను దృష్టిలో ఉంచుకొని వివేకానంద రాజావారి పాలిటెక్నిక్ కళాశాల రోడ్డు నుండి మరి కుంట వరకు పానగల్ రోడ్డు కొత్తకోట రోడ్డు వెడల్పు పనులు చేయిస్తున్నందుకు ఎమ్మెల్యే మేఘారెడ్డికి ప్రజలు కృతజ్ఞతలు తెలుపుతునారు వనపర్తి లో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వనపర్తి లో రోడ్ల విస్తరణ పనులు త్వరగా పూర్తి చేయించాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు ఎం ఏ ఫాదర్ పాషా ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి జిల్లా కలెక్టర్ మున్సిపల్ ఆర్ అండ్ బి అధికారులకు విజ్ఞప్తి చేశారు ఈ మేరకు రోడ్ల విస్తరణ పనులు చేయిస్తున్న వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి జిల్లా అధికారులకుఒక ప్రకటన లో కృతజ్ఞతలు తెలిపారు

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన.

వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన ఎమ్మెల్యే జీఎస్సార్

గణపురం నేటి ధాత్రి

గణపురం మండలంలో పర్యటించారు. రూ.52 లక్షలతో వివిధ గ్రామాలల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ముందుగా ధర్మారావుపేట గ్రామంలో ఎమ్మెల్యే యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.10 లక్షలతో గ్రామంలోని శివాలయం ప్రహరీ గోడ నిర్మాణ పనులు పూర్తి చేయగా, ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం బసవరాజుపల్లి గ్రామంలో యంజీఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులు, రూ.12 లక్షలతో నూతన అంగన్వాడి భవన నిర్మాణ పనులకు శంకుస్థాపనలు చేశారు. గొల్లపల్లి గ్రామంలో రూ.10 లక్షలతో పంచాయతీరాజ్ రోడ్డు నుండి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. భూపాలపల్లి నియోజకవర్గంలో అన్ని గ్రామాల సమగ్రాభివృద్దే తన ధ్యేయమని ఎమ్మెల్యే అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులు చేసి, రాష్ట్రంలోనే భూపాలపల్లి నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమాలల్లో ఎమ్మెల్యే వెంట పలువురు అధికారులు, ఎంపీడీవో ఎల్ భాస్కర్ మండల అధ్యక్షుడు జిల్లా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ రేపాక రాజేందర్ సొసైటీ చైర్మన్ కన్నెబోయిన కుమార్ యాదవ్ ఎంపీటీసీ భవిత సుధాకర్ గ్రామ కమిటీ అధ్యక్షుడు కట్ల మల్లయ్య భాస్కరరావు చింతకుంట్ల శ్రీను పైసా మొగిలి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన.

తీన్మార్ మల్లన్న పై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జీలతో నిరసన

మంచిర్యాల,నేటి ధాత్రి:

మంచిర్యాల పట్టణంలోని ఐబి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహం వద్ద మొన్న తీన్మార్ మల్లన్న పై జరిగిన దాడిని ఖండిస్తూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో మంగళవారం నిరసన వ్యక్తం చేయడం జరిగింది. ఈసందర్భంగా బీసీ నాయకులు గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడుతూ తీన్మార్ మల్లన్న అనుచిత వాక్యాలు చేశాడు.అని చెప్పి తెలంగాణ జాగృతి కార్యకర్తలు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆఫీస్ పై దాడి చేయడాన్ని బీసీ సమాజం పై దాడిగా భావిస్తున్నాం అని అన్నారు.ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం మన సంస్కృతి కాదు మల్లన్న పై దాడికి ఉసిగొలిపిన జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం.తీన్మార్ మల్లన్న పార్టీ పెడితే మా పప్పులు ఏమి ఉడకవని అన్న ఉద్దేశంతో దాడికి పాల్పడిందని భావిస్తున్నట్లు తెలిపారు.ఇలాంటి ఘటన పునరావృత్తం అయితే కలవకుంట్ల కవిత బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదు అని హెచ్చరిస్తున్నాం.తీన్మార్ మల్లన్నకు బీసీ సమాజం అండగా నిలుస్తుందని ఈసందర్భంగా తెలియజేస్తున్నాం.ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, తుల మధుసూదన్ రావు, శాఖ పురం భీమ్సేన్,గజ్జెల్లి వెంకన్న,చంద్రగిరి చంద్రమౌళి, ఆరెంధుల రాజేశం,వేముల అశోక్,శాఖ పురం కోటేశ్వరరావు,కీర్తి బిక్షపతి, అంకం సతీష్,నగునూరి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

దుండగుడిని శిక్షించాలి.

దుండగుడిని శిక్షించాలి
ఎమ్మార్పీఎస్ మెదక్ జిల్లా అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్

నిజాంపేట: నేటి ధాత్రి

కుల్చారం మండలంలో సబ్ స్టేషన్ సమీపంలో పైతారం గ్రామానికి చెందిన కాంగ్రెస్ నేత అనిల్ ను దారుణంగా హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని మెదక్ జిల్లా ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు గరుగుల శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు నిజాంపేట లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో చైతన్య కార్యకర్తగా పేరు తెచ్చుకున్న వ్యక్తిని హత్య చేయడం దారుణమన్నారు. హత్య చేసిన దుండగులను వెంటనే కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విచారణ జరిపి దుండగులను కఠినంగా శిక్షించాలని పేర్కొన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి.

ప్రభుత్వ డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

పరకాల నేటిధాత్రి
పరకాల పట్టణంలోని డిగ్రీ కళాశాల త్వరగా పూర్తి చేయాలని ఎస్ఎఫ్ఐ నాయకులు డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు
బొచ్చు కళ్యాణ్ మాట్లాడుతూ వివిధ గ్రామాల నుండి వచ్చే విద్యార్థులకు చదువుకుందామని
కాలేజీకి వస్తే రూమ్స్ లేక
తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారని,ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాణ్యతగా నిర్మించి త్వరగా పూర్తిచేయలన్నారు.స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వెంటనే స్పందించి కాంట్రాక్టర్ లకు ఆదేశాలిచ్చి త్వరగాతినా బిల్డింగ్ పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ పరకాల మండల అధ్యక్షుడు మడికొండ ప్రశాంత్,పట్టణ అధ్యక్షుడు బొచ్చు ఈశ్వర్,ఎస్ఎఫ్ఐ నాయకులు అరవింద్,మహేష్,విజయ్,అరుణ్,సాయి కృష్ణ పాల్గొన్నారు.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి.

నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని సకాలంలో పూర్తి చేయాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

* నూతన కలెక్టరేట్ భవనాన్ని పరిశీలించిన కలెక్టర్*

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Collector

నూతన సమీకృత కలెక్టరేట్ భవన సముదాయాల నిర్మాణా పనుల్లో వేగం పెంచి గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సంబంధిత అధికారులను ఆదేశించారు.మంగళవారం వరంగల్ లోని పాత ఆజంజాహి మీల్స్ గ్రౌండ్లో నిర్మిస్తున్న నూతన కలెక్టరేట్ భవన సముదాయాలను సందర్శించి పనుల పురోగతిని కలెక్టర్ పరిశీలించారు.ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న కలెక్టరేట్ కార్యాలయాల సముదాయాలలో మూడు అంతస్తుల నిర్మాణాలను,కలెక్టర్ క్వార్టర్స్,అడిషనల్ కలెక్టర్ క్వార్టర్స్ మొదటి, రెండవ అంతస్తులలో

Collector

డిజైన్ ప్రకారం పనులు జరుగుతున్నాయా లేదా అని పరిశీలించారు. స్ట్రక్చరల్ పనులు పూర్తయినందున ఫీనిషింగ్ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని, అవసరమైన సిబ్బందిని వనరులను వియోగించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.రోడ్లు,కాంపౌండ్ వాల్, పైప్ లైన్ తదితర నిర్మాణ పనులను కూడా ఈ సందర్భంగా కలెక్టర్ పరిశీలించి సమర్థ నిర్వహణకు పలు సూచనలు చేశారు.కలెక్టర్ వెంట జిల్లా రెవెన్యూ అధికారి విజయలక్ష్మి,జిల్లా రోడ్ల భవన అధికారి రాజేందర్,డి.ఈ శ్రీధర్,నిర్మాణ సంస్థ జనరల్ మేనేజర్ సందీప్ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ.

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ వసూళ్ల దోపిడీ

యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి

అధికారపార్టీ నాయకుల ఆగడాలకు అడ్డుకట్ట వేస్తాం.

నర్సంపేట,నేటిధాత్రి:

ఇందిరమ్మ ఇండ్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ముఠా వసూళ్ల దోపిడీ చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు.నర్సంపేట పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొన్న మాజీ శాసన సభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం,స్థానిక కాంగ్రెస్ నాయకులపై ఫైర్ అయ్యారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంతో ప్రాధాన్యత కలిగిన వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులు ,ఎమ్మెల్యేలు,నాయకులు ప్రాముఖ్యతను తగ్గించారని పేర్కొన్నారు.నర్సంపేటలో బిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వందల కోట్ల నిధులతో పనులను చేపట్టగా ఆ పాత పనులను మాధవరెడ్డి సొంత కాంట్రాక్ట్ మార్చుకుంటున్నాడని ఆరోపించారు.అలాగే తండాలలో కొన్ని కోట్ల బిటి రోడ్ల పనులు చేపట్టగా వంద శాతం పనులను రద్దుచేసారని ధ్వజమెత్తారు.అలాగే రైతులకు రుణమాఫీ పట్ల ప్రభుత్వానికి అవగాహన లేకపోవడం వల్లనే ఆ రుణ మాఫీ పూర్తికాలేదన్నారు.రాష్ట్రంలో ప్రజలు కోరుకున్న అభివృద్ధి పనులను కాంగ్రెస్ ప్రభుత్వం మార్పు పేరుతో రద్దుచేస్తుందని ఎద్దేవా చేశారు.
జిల్లా వ్యాప్తంగా వాటాల కోసం కాంగ్రెస్ నాయకుల మధ్య కొట్లాట కుక్కల కొట్లాటగా మారిందని, సొంత కాంట్రాక్ట్ పనుల కోసం పాత పనులను రద్దు చేసి, సొంత కాంట్రాక్ట్ కంపెనీకి అగ్రిమెంట్ అయ్యేలా వాటినే కొత్తగా మంజూరు అయ్యాయంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిపై పరోక్షంగా ఆరోపించారు.
రైతుల కోసం యూరియాపై సంబంధిత అధికారులతో ఎప్పుడైన సమీక్షించారా.?అని ఎమ్మెల్యేను ప్రశ్నించారు.కాగా మళ్ళీ పాతరోజులు తెస్తామంటూ చెప్పిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో నేడు రైతులు యూరియా కోసం చెప్పులను లైన్ లో పెట్టే పరిస్థితి తీసుకొచ్చారని ఆరోపించారు.
నర్సంపేట నియోజకవర్గంలో విచ్చలవిడిగా మట్టిదందా చేస్తుంటే రెవిన్యూ అధికారులు దందాలో వాటా దారులుగా ఉన్నారని పేర్కొన్నారు.గత ప్రభుత్వ హాయంలో మంజూరైన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అడ్డుకున్న వివరాలు,ఆయన అనుచరుల అరాచకాలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ప్రజలకు వివరించి ప్రజల తీర్పుతో అధికారపార్టీ నాయకులు ఆగడాలకు అడ్డుకట్ట వేస్తామని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ రాష్ట్ర మాజీ డైరక్టర్ రాయిడి రవీందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ, మాజీ ఎంపీపీ పద్మనాభరెడ్డి ,మాజీ జెడ్పీటీసీ జయ గోపాల్ రెడ్డి , మండల పార్టీ ప్రధాన కార్యదర్శి నరసింహరాములు, మోటూరి రవి,వల్లాల కర్నాకర్,అల్లి రవి,క్లస్టర్ బాధ్యులు,మాజీ సర్పంచ్లు, ఎంపీటీసీలు నాయకులు పాల్గొన్నారు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

ఎరువుల డీలర్ పై కేసు నమోదు.

#6 ఏ కేసు నమోదు చేసి యూరియా నిలువల అమ్మకాలు నిలిపివేశారు.

#యూరియా కొరతను డీలర్లు సృష్టిస్తే పీడీ యాక్ట్ తప్పదు.

#ఏడిఏ దామోదర్ రెడ్డి.

నల్లబెల్లి, నేటి ధాత్రి:

యూరియాను కృతిమ కొరత సృష్టిస్తే సంబంధిత డీలర్ పై పీడీ యాక్ట్ కేసు నమోదు చేసి డీలర్ లైసెన్సులను రద్దు చేయడం జరుగుతుందని నర్సంపేట ఏ డి ఏ దామోదర్ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పలు ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేపట్టారు. ఆదివారం రాత్రి యూరియా కోసం మండలంలోని బిల్లా నాయక్ తండా చెందిన రైతులు యూరియా కోసం మండల కేంద్రంలోని కర్ర మల్లారెడ్డి ఫర్టిలైజర్ షాపు వెళ్ళగా యూరియా నిలువలు ఉండంగా లేదని దురుసుగా రైతులపై మాట్లాడడంతో సదరు డీలర్ గోదాం దగ్గరికి వెళ్లి పెట్రోల్ బాటిల్ తీసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి ప్రయత్నించగా విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని రైతులను శాంత పరిచి సమాధానం చెప్పడంతో రైతులు శాంతించగా.

Fertilizer Dealer.

ఈ సంఘటన రాష్ట్ర, జిల్లా వ్యాప్తంగా సంచలనం కాగా అధికారులు స్పందించి కర్ర కృష్ణారెడ్డి డీలర్ల వద్ద ఉన్న ఎరువుల నిలువలపై స్టాక్ రిజిస్టర్ను పరిశీలించి 1000 బస్తాలు ఉండడంతో అట్టి యూరియా నిలువలను అధికారులకు సమాచారం ఇవ్వకుండా అమ్మరాదని సదర్ డీలర్ కర్ర కృష్ణారెడ్డిని హెచ్చరించారు. అనంతరం ఆయనపై 6 ఏ కేసు నమోదు చేయడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. అలాగే మండలంలోని ఏ డీలర్ కూడా యూరియాకు లింకు పెట్టి అమ్మితే చట్ట రిత్యా చర్య తీసుకొని సంబంధిత డీలర్ లైసెన్సును రద్దు చేయబడుతుందని ఆయన పలువురు డీలర్లకు సూచించారు. ఆయన వెంట ఏవో బన్న రజిత, ఏ ఈ ఓ శ్రీకాంత్ రెడ్డి, రైతులు తదితరులు ఉన్నారు.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి.

ప్రజావాణి దరఖాస్తులు వెంటనే పరిష్కరించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

వరంగల్ జిల్లా ప్రతినిధి,నేటిధాత్రి:*

Dr. Satya Sarada.

ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ త్వరగా పరిష్కరించాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు.జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, అదనపు కలెక్టర్ జి సంధ్యారాణి , జడ్పీ సీఈవో రామ్ రెడ్డి, డిఆర్డిఓ కౌసల్యాదేవి,ఆర్డీవోలు వరంగల్ సత్యపాల్ రెడ్డి, నర్సంపేట ఉమారాణి ,హౌసింగ్ పీడీ గణపతి పాల్గొని ప్రజలనుండి దరఖాస్తులు స్వీకరించారు.ఈ ప్రజావాణిలో మొత్తం 150 దరఖాస్తులు రాగా ఎక్కువగా రెవెన్యూ శాఖకు సంబంధించినవి 58, పిడి హౌసింగ్ 25, జి డబ్ల్యూ ఎం సి 13 దరఖాస్తులు రాగా, మిగతా శాఖలకు సంబందించిన దరఖాస్తులు 54 స్వీకరించామని కలెక్టర్ తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో స్వీకరీంచిన దరఖాస్తులను ప్రాధాన్యతా క్రమంలో పరిశీలించి సకాలంలో పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,డిసిఓ నీరజ, డిబిసిడివో పుష్పలత, కలెక్టరేట్ పరిపాలన అధికారి విశ్వప్రసాద్ వరంగల్, ఖిలా వరంగల్ తహసిల్దార్లు ఇక్బాల్,నాగేశ్వర్ రావు, సంబంధిత శాఖల అధికారులు మరియు ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి.

పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా మాదాసి రవి ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా మాదాసి రవి మాట్లాడుతూ పట్టణంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.రాబోయే మున్సిపల్ ఎన్నికలలో పూర్తి స్థాయిలో సీట్లు గెలిపించేందుకు భాధ్యత వహిస్తానని పేర్కొన్నారు. నర్సంపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నాకు అవకాశం కల్పించిన నర్సంపేట శాసన సభ్యులు దొంతి మాధవరెడ్డి, టిపీసీసీ సభ్యులు, పట్టణ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..

గంజాయి డ్రగ్స్ కు బానిస అవ్వద్దు..
• ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి..
• గ్రామాల్లో కళాజాత అవగాహన

నిజాంపేట: నేటి ధాత్రి

యువత గంజాయి ,డ్రగ్స్ కు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సాంస్కృతిక కళాసారథి బృందం గ్రామాల్లో అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ మేరకు నిజాంపేట మండలం చల్మెడ గ్రామంలో మంగళవారం గ్రామస్తులకు పాటలు రూపంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జిల్లా కలెక్టర్, పౌర సంబంధాల శాఖ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో ప్రభుత్వ పథకాలతో పాటు, యువత చెడు మార్గం పెంచుకోవద్దని దానిపై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. బడిబాట కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ బడులలో ఒక పిల్లలను పంపించాలన్నారు. ప్రభుత్వ బడుల ఆవశ్యకతను ప్రజలకు పాటల రూపంలో వివరించడం జరిగిందన్నారు. కార్యక్రమంలో టీం కోఆర్డినేటర్ శివోల్లా కృష్ణ, రామారావు, ఎల్లయ్య నరసయ్య, సిద్ధులు ఎల్లయ్య, శేఖర్, విజయలక్ష్మి, మాధవి లు ఉన్నారు.

error: Content is protected !!
Exit mobile version