కమ్మ,రెడ్డి కలిసిపోదాం..తెలంగాణను ఏలుదాం?

`ఏపికి చెందిన నాయకుల రహస్య సమావేశాలు?

`తెలంగాణలో రాజకీయ పరిస్థితులు అనుకూలంగా మలుచుకుందాం?

`తెలంగాణలో ఆధిపత్య రాజకీయాలు సాగుతున్నాయి!

`తెలంగాణ ప్రజల దృష్టి అటువైపు వున్నప్పుడే మనం తేరుకుందాం?

`ఐక్యతగా నిలబడి సాధించుకుందాం?

`తెలంగాణలో ఏపి సెటిలర్లు 67 లక్షలున్నట్లు అంచనా!

`హైదరాబాదులో 33 లక్షలున్నట్లు తెలుస్తోంది.

`ఖమ్మం, నిజామాబాద్‌, నల్గొండ, వరంగల్‌ లలో 34 లక్షల మంది వున్నారు.

`64 స్థానాలలో కీలక భూమిక పోషించొచ్చు.

`సమైక్య రాష్ట్రమే అవసరం లేదు.

`రెండు రాష్ట్రాలున్న ఇబ్బంది వచ్చేదేమీ లేదు.

`రెండు రాష్ట్రాలు మనవే కావాలి!

`క్రియాశీల పాత్ర పోషించే స్థాయిలో వున్నాం!

`ఇప్పటికైనా మేలుకుందాం?

`లేకుంటే ఎప్పటికైనా పరాయివాళ్లే అంటారు?

`ఇదే సరైన సమయం.. పాగా వేద్దాం?

`ఏపి రాజకీయాలనే శాసిస్తున్నాం!

`తెలంగాణ రాజకీయాలను ఎప్పటికైనా వశం చేసుకుంటాం?

`ఇప్పటి నుంచి మొదలు పెడితే ఎక్కువ కాలం కూడా పట్టదు!

`ఏపి మీడియాను ఎగదోద్దాం?

`తెలంగాణ రాజకీయాల దృష్టి మళ్ళించి మనం బలపడదాం!                            తెలంగాణ ఏ రాకీయ పరిస్దితుల్లో వుందో చెప్పడానికి కమ్మ, రెడ్డి కలిసి పోదామా? అన్న చర్చలోనే తెలిపిపోతోంది. సరిగ్గా తెలంగాణలో రాజకీయ గందరగోళం సాగుతోంది. బిఆర్‌ఎస్‌ మీద కాంగ్రెస్‌ ప్రభుత్వం పెద్దఎత్తున కేసులు నమోదు చేసింది. అందులో ఏ ఒక్క కేసులోనైనా బిఆర్‌ఎస్‌ నాయకులకు వ్యతిరేకంగా తీర్పులు వచ్చినా ఆ పార్టీకి కొంత గడ్డుకాలమే. అలాంటి పరిస్దితి వస్తే మాత్రం సీమాంద్ర మీడియాకు సంక్రాంతి పెండుగే. తెలంగాణ విఫల రాష్ట్రమని ఎలా రుజువు చేయాలనేదానిపైనే ఆ ప్రాంత మీడియా కాచుకొని కూర్చున్నది. ఏపికి చెందిన రాజకీయాలపై కేసిఆర్‌ అప్పుడప్పుడు కొన్ని మాటలు చెప్పడం చూస్తూనే వుంటాం. కళ్లు మనవే, వేలు మనదే పొడిచేది మనోడే..పొడిపించే వాడు మాత్రం పక్కొడే అంటుంటారు. ఇది కొంత కాలం పోతే నిజమయ్యే అవకాశం కళ్లముందు కనిపిస్తోంది. తెలంగాణలో ఆదిప్యత రాజకీయాలు, కేసిఆర్‌ కుటుంబంలో కలహాలు, బిసి రాజకీయంలో లుకలుకలు. ఇలా గందరగోళ రాజకీయాలున్న సమయంలోనే సీమాంద్రకు చెందిన ప్రజల ఆలోచనలు మార్చాలి. ఏపికి చెందిన పార్టీల వైపు వారి దృష్టి మళ్లించాలి. అప్పుడు పాగా వేయడం చాల సులువు అనే ఆలోచనకు ఏపికి చెందిన రెండు కులాల నాయకులు లోతుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణ మీద మళ్లీ కుట్రలు మొదలయ్యాయి. కాకపోతే సమైక్య వాదం పక్కన పెట్టి, రెండు రాష్ట్రాలను ఏలుదామన్న ఆలోచనలు మొదలయ్యాయి. రెండు రాష్ట్రాలను కలపడం ఇప్పట్లో సాద్యం కాదు. ఆ పని చేయాలని చూస్తే మళ్లీ తెలంగాణ వాదం తెరపైకి వస్తే తట్టుకోలేం. అందవల్ల రెండు రాష్ట్రాలను తమ గుప్పిట్లో పెట్టుకుంటే చాలు. రెండు రాష్ట్రాలను ఏలితే మేలు అనే నిర్ణయానికి కొంత మంది సీమాంద్రకు చెందిన రెండుకులాల నేతలు ఏకాభిప్రాయానికి వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. పైగా కొంత మంది ముఖ్య నాయకులు, వ్యాపార వేత్తలు కలిసి సంయుక్త సమావేశం రహస్యంగా నిర్వహించినట్లు తెలుస్తోంది. ఎక్కడా సమైక్య వాదమన్న మాట రాకుండా జాగ్రత్త పడుతూనే తెలంగాణను రాజకీయంగా వశం చేసుకోవాలన్న కుయుక్తులు పన్నుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఎంత గొప్పగా చెప్పుకున్నా, అమరావతితోపాటు, ఏపిలో రియల్‌ బూమ్‌ కనిపించడం లేదు. అమరావతిని ఎంతగా అభివృద్ది చేయాలన్నా కాలం కలిసి రావడం లేదు. ఏళ్లుగా ఎదురుచూసి మొదలు పెట్టిన పోలవరం ఇంకో దశాబ్ధం గడిచినా పూర్తవుతుందన్న నమ్మకం లేదు. కొత్తగా సాగునీటి ప్రాజెక్టులేవైనా సరే తెలంగాణ నుంచి వ్యతిరేకత తప్పడం లేదు. అందువల్ల ఏపిలో వాతావరణ అననుకూలతలే ఎక్కువ. వ్యవసాయం, మత్స్య రంగాలు తప్ప మరో పారిశ్రామిక ప్రగతి జరిగే పరిస్దితి కనిపించడం లేదు. ఐటి రంగం కూడా విస్తరించే అవకాశాలు కనిపించడంలేదు. మరో వైపు ఏసి. సిఎం. చంద్రబాబు నాయుడు కూడా ఖజానా చూస్తే భయమేస్తుందన్నాడు. సంపద సృషించాలని వుంది. ఎవరైనా సలహాలు ఇవ్వండి అని కూడా చెప్పే పరిస్దితి వచ్చింది. కేంద్రంలో కీలక భూమిక పోషిస్తున్నా నిధుల వరద పారడం లేదు. ఏ రకంగా చూసినా ఏపిలో పెట్టుబడులు పెట్టాలన్నా ఎవరూ ముందుకు రావడంలేదు. ఇలాంటి పరిస్దితుల్లో తెలంగాణలో రాజకీయాల్లోపాగా వేయడం తప్ప మరో ప్రత్యామ్నాయం కనిపించడం లేదన్న భావన వారిలో కనిపిస్తోంది. ఎంత లేదన్నా తెలంగాణలో 64 నియోజకవర్గాలలో గెలుపు ఓటములను ప్రభావితం చేసే స్దితిలో ఏపి నుంచి స్దిరపడిన వాళ్లు వున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఎంత మంది సీమాంధ్ర మూలాలున్న వారున్నారనే లెక్కను ఆ ప్రాంతానికి చెందిన వాళ్లు ఓ సంపూర్ణ సర్వే చేసి వివరాలు సేకరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌, రంగారెడ్డి రెండు జిల్లాల్లో సుమారు33 లక్షల మందికి పైగా సీమాంద్ర మూలాలున్న వాళ్లున్నారు. మిగత జిల్లాలైనా ఖమ్మం, నల్లగొండ, వరంగల్‌, నిజామాబాద్‌ జిల్లాలన్నింటిలో కలిపి 34లశ్రీల మంది సీమాంధ్రకు చెందిన వాళ్లున్నారు. ముఖ్యంగా ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో ఎక్కువ మంది వున్నారు. కుటుంబాల పరంగా చూసుకుంటే ఖమ్మం, నిజాబాబాద్‌ జిల్లాల్లో ఎక్కువగా వున్నారు. అందుకే ఖమ్మం జిల్లాలో తెలంగాణ వాదం వున్నప్పటికీ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు ప్రజలు స్దానం కల్పించడం లేదు. సీట్లు ఇవ్వడం లేదు. గతంలో వామపక్షాలు, కాంగ్రెస్‌ ఎక్కువ ప్రభావం చూపేవి. తర్వాత తెలుగుదేశం వచ్చిన తర్వాత ఖమ్మంలో ఎక్కువగా వారి ప్రాభల్యం నడిచింది. ఇప్పుడు తెలుగు దేశం లేకపోవడంతో, కాంగ్రెస్‌కు ఆ ఓటు బ్యాంక్‌ షిఫ్ట అయ్యింది. మళ్లీ తెలుగుదేశం పురుడు పోసుకుంటే, ఆ ఓట్లన్నీ ఆ పార్టీ వైపు మళ్లించొచ్చన్న అభిప్రాయం వ్యక్తమౌతోంది. అందుకే గత రెండేళ్ల కాలంలో ఎన్టీఆర్‌కు చెందిన శత జయంతి ఉత్సవాలు హైదరాబాద్‌, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్కో ఎక్కువగా నిర్వహిస్తూ వచ్చారు. ఎక్కడైతే ఎన్నికలను తీవ్రంగా ప్రభావితం చేసే స్ధానాలున్న చోట అవసరమైతే ఎన్నికల బరిలోకి దిగి ఓటు బ్యాంకును పదిలం చేసుకోవాలని చూస్తున్నారు. అయితే తెలంగాణలో పాగా వేయాలంటే ముందు రెండు కులాల మధ్య రాజకీయాలను పక్కన పెట్టి, పార్టీలకతీతంగా కలిసి పనిచేయాలని అనుకుంటున్నారు. కేసిఆర్‌ వల్ల తెలంగాణకు ఎట్టిపరిస్దితుల్లో వైసిపి రాదు. జనసేనకు పెద్దగా తెలంగాణలో స్కోప్‌ లేదు. ఇక మిగిలింది రెండు కులాల రాజకీయం. కొంత కాలం కలిసి పనిచేస్తే చాలు తెలంగాణలో పాగా వేయడం పెద్ద సమస్య కాదన్న సమాలోచనలు చేసినట్లు తెలిసింది. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో స్దిరపడిన ఏపి మూలాలున్న వారిలో ఇప్పటికీ తెలంగాణ భావన లేదు. ఎందుకంటే నలభై యాభై సంవత్సరాల క్రితం తెలంగాణకు వచ్చి స్ధిరపడినా, వారి కుటుంబ బందాలు, బాంద్యవ్యాలు ఏపితోనే కలిసి వున్నాయి. తెలంగాణ వచ్చిన తర్వాత యువత, ఐటి రంగం విస్తరించిన తర్వాత జరిగిన వివాహాలలో రెండు ప్రాంతాల మద్య వివాహ బందాలు కొన్ని పెరిగాయి. అది 3 నుంచి 7శాతంగా గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు ప్రాంతాల మధ్య వివాహ సంబందాలు కూడా మెరుగుపడుతున్నాయి. ఈ సమయంలో సమైక్యాంధ్ర అనే నినాదం కన్నా, రెండు రాష్ట్రాలలో పాతుకపోవడమే మేలన్న అభిప్రాయం చాలా మందిలో వ్యక్తమౌతోంది. గత ఎన్నికల్లో సీమాంధ్ర మూలాలున్న వాళ్లు రెండు వర్గాలుగా విడిపోయారు. కొంత మంది కాంగ్రెస్‌కు అనుకూలంగా చేశారు. మరి కొంత మంది బిఆర్‌ఎస్‌కు అనులంగా ఓట్లు వేశారు. మెజార్టీ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపే మొగ్గు చూపారు. కాంగ్రెస్‌ను నమ్మడానికి ఆసక్తి చూపలేదు. కాని ఇక్కడ నుంచి ఏపికి వెళ్లి, రెండు చోట్ల ఓట్లు వుండడంతో తెలుగుదేశాన్ని గెలిపించుకున్నారు. ఆ ఓట్లే కూటమి విజయానికి దారులువేసింది. కూటమికి ప్రతిపక్షం లేనంత మెజార్టీని కట్టబెట్టింది. తెలంగాణలో కూడా అదే జరిగితే, కాంగ్రెస్‌కు పూర్తి స్దాయి మద్దతు పలికితే బిఆర్‌ఎస్‌ ఉనికి లేకుండాపోయేది అన్న అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే తెలంగాణ గ్రామీణ ప్రజలు బిఆర్‌ఎస్‌ను కాదనుకున్నారు. కాని హైదరాబాద్‌ ప్రజలు బిఆర్‌ఎస్‌ను గెలిపించారు. అంటే సీమాంధ్ర ప్రజలు కాంగ్రెస్‌ వైపు నిలుస్తారని ఏపికి చెందిన నాయకులు, పారిశ్రామిక వేత్తలు ఊహించుకున్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో ప్రచారం వదిలేశారు. గత ఎన్నికల్లో ఏపికి చెందిన నాయకుల అనుచరులుపెద్దఎత్తున తెలంగాణలో ప్రచారంలోపాలుపంచుకున్నారు. ముఖ్యంగా ఖమ్మం, వరంగల్‌, నిజామాబాద్‌, నల్గొండలలో కాంగ్రెస్‌ నాయకులకు పనిచేశారు. కాని హైదరాబాద్‌లో అర్భన్‌ ప్రజలు బిఆర్‌ఎస్‌వైపు నిలుస్తారని ఊహించలేదు. ఎక్కడైతే నెగ్గుతామనుకున్నారో అక్కడ ఓడిపోయారు. ఎక్కడైతే నెగ్గలేమనుకున్నారో అక్కడ కాంగ్రెస్‌ను గెలిపించారు. ఇకపై అలాంటి తప్పు చేయొద్దు. ఈసారి ఎన్నికలో నిలిచే ప్రయత్నాలను వదలుకోవద్దని నిర్ణయం తీసుకున్నారు. ముందుగా జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో తెలుగుదేశం తరుపున రంగంలోకి దిగితే ఓట్ల లెక్క కూడా పక్కాగా తెలుస్తుంది. అప్పుడు చాప కిందనీరులా హైదరాబాద్‌, రంగారెడ్డిలలో మాత్రమే ప్రచారం మూడేళ్ల ముందు నుంచే మొదలుపెట్టాలనుకుంటున్నారట. ఖమ్మం లాంటి జిల్లాల్లో ప్రత్యేకంగా శద్ద్ర పెట్టాల్సిన అసవరం లేదని తేలింది. హైదరాబాద్‌లోనే అసలైన దృష్టి కేంద్రీకరించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version