మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు

మల్గి మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు మాజీ సర్పంచ్ జట్గొండ మారుతి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

న్యాల్కల్ మండలం లోని మల్గి మల్లన్నస్వామి జాతర మహోత్సవంలో భాగంగా మాజీ సర్పంచ్ దంపతులు జట్గొండ మారుతి శిరీష ప్రత్యేక పూజలు చేశారు ఆలయంలో బుధవారం స్వామివారికి అభిషేకం హారతి పూజా కార్యక్రమ నిర్వహించినారు పరిసర గ్రామాలకు చెందిన భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలుచేసి దర్శించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నదనం చేశారు,

రామడుగు అంబేద్కర్ యువజన సంఘం కొత్త కమిటీ ఎన్నిక

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండలం నూతన కమిటీ ఎన్నిక

రామడుగు, నేటిధాత్రి:

 

తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు గజ్జల కాంతం ఆదేశానుసారం జిల్లా అధ్యక్షులు క్యాదాసి ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్లానింగ్ కమిటి చైర్మన్ గజ్జల ఆనందరావు, రాష్ట్ర ఉపాధ్యక్షులు నేరెళ్ల మహేందర్, రాష్ట్ర కార్యదర్శి, మీసాల సాయిలు, జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ స్వరూపల సమక్షంలో చొప్పదండి నియోజకవర్గం రామడుగు మండల తెలంగాణ అంబేద్కర్ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రామడుగు మండల అధ్యక్షులుగా రేణికుంట అశోక్, ఉపాధ్యక్షులుగా జెట్టిపల్లి మురళి, జిల్లాల సురేష్, లింగంపల్లి రవి, మండల ప్రధాన కార్యదర్శిగా ఆరేపెల్లి ప్రశాంత్, కార్యదర్శులుగా గజ్జల సురేష్, మచ్చ మహేష్, పర్లపల్లి తిరుపతి, చిలుముల రమేష్, కోశాధికారి తడగొండ శేఖర్, ప్రచార కార్యదర్శులుగా రేణిగుంట శ్రావణ్, కత్తెరపాక రమేష్, బండపల్లి గోపి, తదితరులను నియమించారు.

సి‌ఎస్సి హెల్త్ టెస్టులు రద్దు చేయాలంటూ కార్మికుల ధర్నా

సి ఎస్ సి సంస్థ హెల్త్ టెస్టులను రద్దు చేయాలి

జీవో నెంబర్ 12 ను సవరించి కార్మికుల వెల్ఫేర్ నుండే సంక్షేమ పథకాలు అందించాలి

భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ

కరీంనగర్, నేటిధాత్రి:

 

తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు జేఏసీగా అనుబంధ సంఘాలతో జేఏసీ రాష్ట్ర పిలుపుమేరకు కరీంనగర్ జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈసందర్భంగా జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశం మాట్లాడుతూ సిఎస్సి హెల్త్ టెస్టులను వెంటనే రద్దు చేయాలని జీవో నెంబర్12 ను సవరించి వెల్ఫేర్ బోర్డు ద్వారానే కార్మికులకు ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కార్మికుల అందరికీ హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, సహజ మరణానికి ఐదు లక్షలు ఇవ్వాలి అక్రమంగా వెల్ఫేర్ బోర్డు నిధులు మూడు వందల నలభై ఆరు కోట్లు ప్రైవేటు భీమా కంపెనీలకు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. వెల్ఫేర్ బోర్డులో పెండింగ్ క్లైములకు వెంటనే నిధులు విడుదల చేసి అరవై సంవత్సరాలు పైబడిన కార్మికునికి ఐదు వేల పెన్షన్ వెంటనే ఇవ్వాలన్నారు. వెల్ఫేర్ బోర్డు అడ్వైజర్ కమిటీని వెంటనే నియమించి 2009 నుండి రెన్యువల్ కానీ పన్నెండు లక్షలకు పైగా ఉన్నా లేబర్ కార్డులను యుద్ధ ప్రాతిపదికన వెంటనే రెన్యువల్ చేయాలని పేర్కొన్నారు. మీసేవలో అధిక డబ్బులు వసూలు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేబర్ అడ్డాల వద్ద మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి అమలు చేయని యెడల డిసెంబర్ 5న చలో హైదరాబాద్ కమిషనరేట్ కార్యాలయం ముట్టడికి కార్మికులందరూ అధిక సంఖ్యలో పాల్గొని మన హక్కులను కాపాడుకోవాలని పిట్టల సమ్మయ్య, ఎడ్ల రమేష్, ఆకుల మల్లేశంలు కార్మికులకు పిలుపునిచ్చారు. ఈధర్నా కార్యక్రమంలో బిఓసి అధ్యక్షులు గందె కొంరయ్య, గౌరవ అధ్యక్షులు కటిక రెడ్డి బుచ్చన్న యాదవ్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేగుల కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు పిట్టల శ్రీనివాస్, కన్నం సదానందం, గోదారి లక్ష్మణ్ పొన్నం సంపత్, పుట్ట మహేష్, అందే పుల్లయ్య, గామినేని సత్యం, బొంకూరి రాములు, ఆకునురి రమేష్, ఎల్లయ్య, మోసం తిరుపతి, చక్రపాణి తదితరులు పాల్గొన్నారు.

పంచాయతీ ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలి

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద

మూడు విడతల్లో పంచాయితీ ఎన్నికలు

బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలి..నోడల్ అధికారులకు ఆదేశాలు

వరంగల్ జిల్లా ప్రతినిధి/నర్సంపేట,నేటిధాత్రి:

రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు పాటిస్తూ గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికలను పకడ్బందీగా, ప్రశాంతంగా, నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు.బుధవారం వరంగల్ కలెక్టరేట్ లో కలెక్టర్ డాక్టర్ సత్య శారద
గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు స్థానాలకు ఎన్నికల నిర్వహణ పై అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డిఆర్ ఓ విజయలక్ష్మి, జెడ్పి సీఈఓ రామిరెడ్డి, డిపిఓ కల్పన లతో కలసి ఆర్డీఓ లు, ప్రత్యేక అధికారులు, నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. నోటిఫికేషన్ విడుదలైనందున జిల్లాలోని 11 మండలాల్లోని 317 గ్రామ పంచాయతీ సర్పంచ్ లు, 2754 వార్డు సభ్యుల ఎన్నికలకు 3 విడతల్లో ఈ నెల 27, 30 మరియు డిసెంబర్ 3 తేదీల్లో నామినేషన్ స్వీకరణ ఉంటుందని, నామినేషన్ పత్రాల స్వీకరణ నుంచి ఎన్నికల నిర్వహణ ప్రక్రియ పూర్తయ్యే వరకు అధికారులు అప్రమత్తంగా ఉంటూ తమకు అప్పగించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. ఎన్నికల హ్యాండ్ బుక్ లోని ప్రతి అంశంపై సంపూర్ణ అవగాహన తెచ్చుకోవాలన్నారు. పొరపాట్లకు ఆస్కారం ఇవ్వవద్దని.. అనుమానాలు ఉంటే ఉన్నతాధికారులను సంప్రదించి నివృత్తి చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

Panchayat Elections

ఎన్నికల విధులు ఎంతో కీలకమైనవని, ఎక్కడా ఏ చిన్న పొరపాటు జరగకుండా అన్ని జాగ్రత్తలతో సమర్థవంతంగా నిర్వర్తించాలని అన్నారు. ఎన్నికల విధుల పట్ల నిర్లక్ష్యానికి తావిస్తే కఠిన చర్యలకు గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభాలకు గురిచేసే విధంగా నగదు, మద్యం, పంపిణీపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించాలని, ఇతర వస్తువుల సీజ్ చేసిన సందర్భాలలో అన్ని బృందాలు సమన్వయం చేసుకోవాలని సూచించినారు. , జిల్లాలోని చెక్ పోస్టులలో వాహనాల తనిఖీలు నిష్పక్షపాతంగా, పకడ్బంధీగా జరిగేలా చూడాలని అన్నారు. నోడల్ అధికారులు ప్రతి రోజు రిపోర్ట్ లు నిర్ణిత ఫార్మాట్ లో సమర్పిచాలని తెలిపారు.జిల్లాలో మాన్ పవర్ మేనేజ్మెంట్, బ్యాలెట్ బాక్సుల మేనేజ్మెంట్, ట్రాన్స్‌పోర్ట్ మేనేజ్మెంట్, శిక్షణా కార్యక్రమాల నిర్వహణ, మెటీరియల్ మేనేజ్మెంట్, ఎక్స్‌పెండిచర్ మానిటరింగ్, మీడియా కమ్యూనికేషన్, హెల్ప్‌లైన్ & కంప్లైంట్స్ రెడ్రెస్సల్, తదితర విభాగాల వారీగా నోడల్ అధికారులను నియమించామని,జిల్లాలో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా,నిష్పక్షపాతంగా ఎలాంటి అంతరాయం లేకుండా జరిగేందుకు నోడల్ అధికారులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. ప్రజల్లో నమ్మకాన్ని పెంచేలా ఎన్నికల నిర్వహణ జరగాలి. శాంతియుత, స్వేచ్ఛాత్మక మరియు పారదర్శక ఎన్నికలకై ప్రతి ఒక్కరు కృషి చేయాలని స్పష్టం చేశారు.మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులో ఉన్నందున అందరూ పాటించాల్సిన నిబంధనలను గుర్తుచేశారు.అధికారులు, సిబ్బంది సమన్వయంతో ముందుకు సాగుతూ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. జిల్లా ప్రజలందరూ ఎన్నికల నియమావళిని పాటించి, శాంతియుత వాతావరణంలో ఓటు హక్కును వినియోగించు కోవాలని అన్నారు.ఈ సమావేశం లో ఆర్డీఓలు సుమా రెడ్డి, ఉమారాణి, ఎన్నికల ప్రత్యేక అధికారులు,నోడల్ అధికారులు, రిటర్నింగ్ అధికారులు ఎంపిడివోలు, ఎంపిఓ లు తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్ వైద్యం కోసం లక్ష రూపాయల సహాయం

కార్తీక్ వైద్య ఖర్చులకు లక్ష అందజేత

రామడుగు, నేటిధాత్రి:

కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రుద్రారం గ్రామానికి చెందిన పేద యువకుడు కార్తీక్ అనారోగ్యం పాలవగా, మెరుగైన వైద్యం కోసం సుమారు ఐదు లక్షలు అవసరమని వైద్యులు తెలిపారు. దీంతో కార్తీక్ కుటుంబం తమ నిరుపేద ఆర్థిక పరిస్థితి కారణంగా ఆందోళన చెందారు.​ ఈవిషయాన్ని కుటుంబ సభ్యుల ద్వారా తెలుసుకున్న స్థానిక తాజా మాజీ ఎంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ తక్షణమే స్పందించి, కార్తీక్‌కు సహాయం అందించడానికి దాతల సహకారం కోరారు. ​గుర్రం దేవిక రాజశేఖర్ చేసిన విజ్ఞప్తికి స్థానిక దాతలు, ప్రజలు ఉదారంగా స్పందించి తమ వంతు సహాయం అందించారు. ​దాతల నుంచి మొత్తంగా ఒక్క లక్ష రూపాయాలు విరాళంగా సమకూరింది.​ ఈవిరాళాన్ని రామడుగు మండల విద్యాశాఖాధికారి రంగనాథ శర్మ చేతుల మీదుగా కార్తీక్ కుటుంబసభ్యులకు అందజేశారు.​ ఈసందర్భంగా మాజీ ఏంపిటిసి గుర్రం దేవిక రాజశేఖర్ మాట్లాడుతూ మానవత్వంతో స్పందించి కార్తీక్ వైద్య ఖర్చుల కోసం విరాళాలు అందించిన దాతలందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈసహాయం కార్తీక్ త్వరగా కోలుకోవడానికి ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈకార్యక్రమంలో రమేష్, పి.డి,అనపురం తిరుపతి, తడగొండ రాజు, నాగం చంద్రమోహన్, చిలుముల శ్రీను, లక్ష్మణ్, నరసింహచారి, రాజమల్లయ్య, జనార్ధన్, సాయిలు, కరుణాకర్, తదితరులు పాల్గొన్నారు.

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తి పరిహారం భరోసా

నారాయణపూర్ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తాం

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

గంగాధర, నేటిధాత్రి:

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామ నిర్వాసితులకు పూర్తిస్థాయిలో పరిహారం అందజేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం తెలిపారు. గంగాధర రైతు వేదికలో మంగపేట గ్రామానికి చెందిన నారాయణపూర్ నిర్వాసితులకు పరిహారం చెక్కులను అందజేశారు. ఈసందర్భంగా చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ గంగాధర మండలం నారాయణపూర్ రిజర్వాయర్ కు సంబంధించిన పనులు ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి హాయంలోనే డెబ్బై శాతం పనులు పూర్తయినట్లు గుర్తు చేశారు. ఆతర్వాత జరిగిన పరిణామాలతో అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ పార్టీ నిర్వాసితులను పట్టించుకున్న పాపాన పోలేదు, వారికి ఒక్క రూపాయి పరిహారం ఇవ్వలేదు, రిజర్వాయర్లో తట్టెడు మట్టిని కూడా తీయలేదని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తాను నారాయణపూర్ గ్రామాన్ని సందర్శించిన సమయంలో నిర్వాసితులకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఇచ్చిన హామీని మర్చిపోకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లి ఇరవై మూడున్నర కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని మంగపేట, నారాయణపూర్, చర్లపల్లి, ఇస్తారిపల్లి గ్రామాల్లో నిన్ను కోల్పోయిన ప్రతి ఒక్కరికి నష్టపరిహారం అందజేస్తామని ఈసందర్భంగా భరోసా ఇచ్చారు.

మొగుళ్లపల్లిలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

* ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవం 76వ భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించిన అంబేద్కర్ యువజన సంఘం*

భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నేషనల్ అవార్డు గ్రహీత & అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్

మొగుళ్లపల్లి నేటి దాత్రి

 

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద
76వ భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా
అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షులు మంగళపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి
నివాళులర్పించారు అనంతరం మంగళపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ భారత రాజ్యాంగనీ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయడం వల్ల నిరుపేదలైన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఓసి లో ఉన్న నిరుపేదలకు న్యాయం జరిగే విధంగా రాజ్యాంగని రాయడం జరిగింది 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కును కల్పించి ప్రజాస్వామ్యంలో మనిషిగా గుర్తించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి పౌరులు అందరు సమాన హక్కు కల్పించింది కుల మతాలకు అతీతంగా సమాజంలో ఉన్న మానవులంతా ఒకటేనని రాసినటువంటి గొప్ప వ్యక్తి ఆరోజు రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాయకుండా ఉండి ఉంటే భారత దేశంలోని ప్రజలు ఈ విధంగా ఉండేవారు కాదన్నారు ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా నాయకులు బండారి రాజు, అంబేద్కర్ యువజన సంఘం గ్రామ శాఖ అధ్యక్షులు బండారి కుమార్ తదితరులు పాల్గొన్నారు

స్వతంత్ర అభ్యర్థిగా గీత పోటీ

సూర్యనాయక్ తండా గ్రామ ప్రజలకు సేవలు చేయడమే నా లక్ష్యం

ఇండిపెండెంట్ సర్పంచ్‌గా పోటీకి సిద్ధం: జర్పుల గీత

శాయంపేట నేటిధాత్రి:

 

శాయంపేట మండలం సూర్య నాయక్ తండా గ్రామంలో గ్రామ పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా సూర్య నాయక్ తండాకు ఎస్టీ మహిళా రిజర్వ్ కావడంతో సర్పంచ్ పదవికి ఇండిపెం డెంట్ గా పోటీ చేయునట్లు జర్పులగీత ప్రకటించారు. గ్రామ ప్రజలకు సేవ చేయాలనే ధ్యేయంతో సర్పంచ్ పదవికి పోటీ చేయాలని నిర్ణయించి నట్లు తెలిపారు. గ్రామ అభి వృద్ధి, పారదర్శక పాలన, సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం ఇవే తన ప్రాధా న్యతలు అని పేర్కొన్నారు గ్రామానికి అవసరమైన ప్రతీ పనిని సాధించేందుకు కృషి చేస్తాను అని చెప్పారు. నిరంతర ప్రజా సేవ చేయడం తన బాధ్యత అని హామీ ఇచ్చారు. ప్రజల హృదయా లలో నిలవడమే నా లక్ష్యం అంటూ ప్రజల ఆశీర్వాదం కోరారు. గ్రామ ప్రజల అభి మానం, సహకారమే తమ విజయం నిర్ణయిస్తుందని అన్నారు.

సీజనల్ వ్యాధులపై అవగాహన శిబిరం

సీజనల్ వ్యాధులపై
జాగ్రత్తలు పాటించాలి

నిజాంపేట: నేటి ధాత్రి

 

సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు పాటించాలని కార్యదర్శి ప్రశాంత్ అన్నారు. నిజాంపేట మండలం రజక్ పల్లి గ్రామంలో బుధవారం ఏఎన్ఎం అరుణ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గోరువెచ్చటి నీటిని త్రాగాలని సూచించారు. ఈ వైద్య శిబిరంలో బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు.

చిట్యాల పోలీసుల చేత తిరిగొచ్చిన మొబైల్

పోగొట్టుకున్న మొబైల్ ను భాదితునికి అందజేసిన ఎస్సై హేమలత.

చిట్యాల, నేటిదాత్రి

 

చిట్యాల మండలంలోని ఏలేటి రామయ్య పల్లె గ్రామానికి చెందిన మర్రి రమేష్ సంవత్సరం క్రితం మార్గమధ్యంలో తన శామ్సంగ్ మొబైల్ ఫోన్ పోగొట్టుకోగా చిట్యాల పోలీసులు రికవరీ చేసిబుధవారం రోజున బాధితునికి అందజేశారు.
బాధితుడు చిట్యాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, చిట్యాల ఎస్ఐ ఆదేశాల మేరకు కానిస్టేబుల్ లాల్ సింగ్ అట్టి మొబైల్ ఫోన్ల వివరాలను సీఈఐఆర్ పోర్టల్‌లో నమోదు చేశారు. ఆ ఫోన్ గుర్తించి, చిట్యాల ఎస్సై హేమ లత బాధితులడి తిరిగి అందజేశారు.
తమ పోగొట్టుకున్న మొబైల్ ఫోన్లను తిరిగి ఇప్పించినందుకు బాధితులు చిట్యాల ఎస్సైహేమలత కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

బాలాజీ స్కూల్‌లో సంవిధాన్ దివస్

బాలాజీ టెక్నో స్కూల్ లో సంవిధాన్ దివస్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మండలం లక్నేపల్లి గ్రామంలోని బాలాజీ టెక్నో స్కూల్ (సీబీఎస్ఈ )లో సంవిధాన్ దివస్ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అంబేద్కర్ వేషధారణతో వచ్చి రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలు- ప్రజల బాధ్యత గురించి చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు.బాలాజీ విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ ఏ .రాజేంద్ర ప్రసాద్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ స్వాతంత్య్రానంతరం దేశ పౌరులకు అనుగుణంగా సుపరిపాలన అందించాలనే లక్ష్యంతో 26 నవంబర్ 1949 భారత రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించిందన్నారు. ప్రజలందరికీ న్యాయం ,స్వేచ్ఛ ,సమానత్వం ,సౌబ్రాతృత్వం అందించాలనే రాజ్యాంగ స్ఫూర్తిని ప్రోత్సహించడం నేడు ప్రత్యేకతని ,భారత రాజ్యాంగం యొక్క ప్రాముఖ్యతను మరియు దాని రూపశిల్పి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ చేసిన కృషిని గుర్తు చేస్తుందని తెలిపారు. భారతదేశ ప్రజాస్వామ్య గణతంత్రరాజ్యాంగా మారడానికి పునాదయిందని రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులు, విలువలు, బాధ్యతలపై ప్రజలలో అవగాహన పెంచడం లక్ష్యంగా తోడ్పడుతుందని గుర్తు చేశారు.స్కూల్( సీబీఎస్ఈ) ప్రిన్సిపాల్ పి .రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 125 వ జయంతి సందర్భంగా భారత ప్రభుత్వం 19 నవంబర్ 2015 ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ ద్వారా నవంబర్ 26ని అధికారికంగా రాజ్యాంగ దినోత్సవం గా ప్రకటించారన్నారు.అనంతరం ఎన్.సి.సి పదవ బెటాలియన్ థర్డ్ ఆఫీసర్ ఎం. డి రియాజుద్దీన్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగం- ప్రజల బాధ్యత పై విద్యార్థులకు వ్యాసరచన, క్విజ్ పోటీలు నిర్వహించినారు.ఈకార్యక్రమంలో ఎన్.సి.సి క్యాడెట్లు మరియు ఉపాధ్యాయులు క్రాంతి కుమార్, అనిల్ కుమార్ ,సతీష్ ,అర్లయ్య, చందు, కవిత, సంగీత తదితరులు పాల్గొన్నారు.

రాజ్యాంగ అవతరణ వేడుకలు ఘనంగా

ఘనంగా రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలోని మున్సిపల్ కార్యాలయాలలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుకలు నిర్వహించాలని ఆదేశించిన నేపథ్యంలో రాజ్యాంగ అవతరణ దినోత్సవ వేడుక నిర్వహించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ గద్దె రాజు తెలిపారు. అనంతరం కమిషనర్ గద్దె రాజు మాట్లాడారు. రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపము, ప్రాముఖ్యత, భారతదేశ పౌరులందరూ విధిగా పాటిస్తూ దేశం యొక్క సమగ్రతను పెంపొందించేలా కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ మేనేజర్ సతీష్, రెవెన్యూ ఆఫీసర్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

సుభ్రహ్మణ్య షష్టి ఉత్సవాలు వైభవంగా

వైభవంగా సుబ్రహ్మణ్య స్వామి షష్టి పూజలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

రామకృష్ణాపూర్ పట్టణంలోని కోదండ రామాలయం గుడి ఆవరణలో గల అయ్యప్ప దేవాలయంలో సుబ్రహ్మణ్య షష్టి పూజలు వైభవంగా సాగాయి. అయ్యప్ప దీక్ష పరులు సుబ్రహ్మణ్య స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. గణపతి అభిషేకం, సుబ్రహ్మణ్య స్వామి పూజ అయ్యప్ప పూజ, నాగ దేవత లకు అభిషేకాలు నిర్వహించారు. ఈ మాసంలో శుక్ల పక్ష షష్టి రోజు సుబ్రహ్మణ్య షష్టిని భక్తులు జరుపుకుంటారు. సుబ్రహ్మణ్య షష్టిని స్కంద షష్టి అని కూడా అంటారు.శివ పార్వతుల తనయుడైన సుబ్రహ్మణ్యస్వామి తారకాసురుడిని సంహరించడానికి ఆవిర్భవించినట్లు చరిత్రలు చెబుతున్నాయి. భక్తిశ్రద్ధలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆరాధిస్తే కోరికలు నెరవేరుతాయని అంటారు. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే పెళ్లి కాని వారికి వివాహం జరిగి సత్ సంతాన సౌభాగ్యం కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే జీవితంలోని అనేక సమస్యల నుండి బయటపడొచ్చని వేద పండితులు చెబుతున్నారు. అంబ ప్రసాద్, శరత్ అయ్యగారు, గురు స్వాములు గడ్డం రమేష్,కట్కూరి శ్రీనివాస్,లంక రామస్వామి, నట రాజ్,వెంకటేశ్వర్లు, అమర్నాథ్ రెడ్డి, కన్నె స్వాములు, కత్తి స్వాములు,గంట స్వాములు, గద స్వాములు,భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మహిళలకు ఇందిరమ్మ చీరల పంపిణీ

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ కోహీర్ మండల అధ్యక్షులు శ్రీ పట్లోళ్ల రాంలింగా రెడ్డి ఆధ్వర్యంలో కోహీర్ మండలం దిగ్వాల్ గ్రామంలో స్వయం సహాయక సంఘం మహిళలకు ‘పుట్టింటి సారై’ మాదిరిగా ఆత్మగౌరవంతో కూడిన నాణ్యమైన ఇందిరమ్మ చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, సీనియర్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

జహీరాబాద్‌లో ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం

ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమం – జహీరాబాద్

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాదులో జరిగిన ఇందిరమ్మ మహిళ శక్తి కార్యక్రమంలో ప్రధాన అతిథిగా పాల్గొన్న జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ శేట్కార్ , అలాగే సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండే సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గారు పాల్గొనడం ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.మహిళల సాధికారత, ఆర్థిక స్వావలంబన, ప్రభుత్వం అందిస్తున్న పథకాలపై అవగాహన ఈ కార్యక్రమం ద్వారా మరింత బలంగా ప్రజలకు చేరువైంది. స్థానిక మహిళలతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలు, వారి అవసరాలు తెలుసుకోవడంలో నేతల పాల్గొనడం అభినందనీయం.మన జహీరాబాద్ అభివృద్ధి మహిళల అభివృద్ధి నుంచే ప్రారంభమవుతుంది. ఇదే దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న అడుగులు ప్రజల్లో విశ్వాసాన్ని పెంపొందిస్తున్నాయి,

27 ఏళ్లకే ఉద్యానంలో డాక్టరేట్ సాధించిన మహేష్

హర్టికల్చర్ లో డాక్టరేట్ పొందిన ఊరటి మహేష్

వెంకటాపురం గ్రామస్తుల హర్షం వ్యక్తం

అతిచిన్న వయస్సులో పీహెచ్ డీ పొందిన డాక్టర్ మహేష్.

సంతోషం వ్యక్తపరిచిన తల్లిదండ్రులు.

నర్సంపేట,నేటిధాత్రి:

ఉద్యానవన రంగంలో విశేష ప్రతిభ కనబరచి అతిచిన్న వయసులో డాక్టరేట్ పట్టా సాధించి అందరిమన్ననలు పొందాడు వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గ దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామవాసి.వివరాల్లోకి వెళితే..దుగ్గొండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన,మహమ్మదపురం వ్యవసాయ సహకార సొసైటి చైర్మన్ ఊరటి సునీత మైపాల్ రెడ్డిల కుమారుడు డాక్టర్ ఊరటీ మహేష్ ఆయన తల్లిదండ్రులు వ్యవసాయ కుటుంబం కావడంతో వారికష్టంతో చదువుపై మక్కువ పెంచుకున్నాడు.చిన్ననాటి నుండే ఉన్నత చదువుల వైపుకు అడుగువేసి వ్యవసాయ ఉద్యానవన రంగం నుండి పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశాడు.అనంతరం పిహెచ్ డి చేసేందుకు గాను మొదటి ప్రయత్నంలోనే సీటు సాధించిన యువ విద్యావేత్త పిహెచ్డి పూర్తి చేసి డాక్టరేట్ పట్టానందుకున్నాడు.

డాక్టరేట్ ప్రదానం చేస్తున్న డాక్టర్ వైయస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ

 

ఈ యువ విద్యావేత్త 27 ఏళ్లకే డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీ నుండి హార్టికల్చర్‌లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పిహెచ్డి) లో పట్టా పొందేందుకు గాను పరిశోధన మార్గదర్శకులు డాక్టర్ కె.ఎం. యువరాజ్ ఆధ్వర్యంలో స్వాలో రూట్ (డికాల్పిస్ హామిల్టోనీ) పరిశోధన అంశంతో జన్యు వైవిధ్యం మరియు విలువ పెంపుపై అధ్యయనాలు పూర్తి చేశాడు. ఈ యువ విద్యావేత్త. 2016–2020 విద్యా సంవత్సరంలో కొండాలక్ష్మణ బాపూజీ తెలంగాణ రాష్ట్ర హార్టికల్చరల్ యూనివర్సిటీలో బి.ఎస్‌.సి హార్టికల్చర్ లో తన ప్రతిభ తో 7.98 ఓ.జీ.పి.ఏ సాధించాడు. అనంతరం 2020–2022 కాలంలో కేరళ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ఎం.ఎస్‌.సి హార్టికల్చర్ పూర్తి చేసి ఓ జీ పి ఏ 8.95 సాధించాడు. 2022–2025 లో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చరల్ యూనివర్సిటీలో పీహెచ్.డి పూర్తి చేసి ఓ జీ పి ఏ 9.37 సాధించాడు.తన పరిశోధనలో స్వాలో రూట్ ఒక ఔషధ మొక్కగా ఉండడంతో జన్యు వైవిధ్యం, విలువ పెంపు అవకాశాలను లోతుగా అధ్యయనం చేసి శభాష్ అనిపించాడు. ఈ పరిశోధన ఉద్యాన ఉత్పత్తుల వినియోగం మరియు మార్కెట్ విలువ పెంపులో కొత్త మార్గాలను చూపనుందని విశ్వవిద్యాలయ అధ్యాపకులు మహేష్ ప్రతిభకు మంత్రముగ్ధులయ్యారు.
విద్యాభ్యాసం చేస్తూనే డాక్టర్ మహేష్
విద్యా ప్రయాణంలో దేశీయ, అంతర్జాతీయ సదస్సుల్లో పేపర్లను ప్రజెంట్ చేసి అనేక అవార్డులను సొంతం చేసుకున్నాడు.

డాక్టర్ ఊరటి మహేష్ ఫైల్ ఫోటో

పరిశోధన మరియు శాస్త్రీయ ప్రజెంటేషన్లలో తమ ప్రతిభను నిరూపించాడు. అచ్చిన వయసులోనే డాక్టర్ సాధించడంతో దుగ్గొండి మండల వివిధ శాఖల అధికారులు మండల ప్రజా ప్రతినిధులు గ్రామస్తులు కుటుంబ సభ్యులు వర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు జరుపుకున్నారు.
సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు అని డాక్టర్ ఊరటీ మహేష్ ప్రస్తుత యువతకు సందేశం పంపారు.భవిష్యత్తులో పరిశోధన, బోధన,మరియు ఉద్యాన రంగ అభివృద్ధిలో సేవలను కొనసాగించాలనే ఆలోచనతో మహేష్ ముందుకెళ్తానన్నారు.చిత్తశుద్ధి, సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

డాక్టరేట్ పొందడం గర్వంగా ఉన్నది..తల్లిదండ్రులు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన మా కుమారుడు డాక్టర్ మహేష్ తన కష్టాన్ని చూస్తూ ఉన్నత చదువులు చదివి నేడు ఉద్యానవన రంగంలో డాక్టరేట్ పొందడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు ఊరటి సునీత మైపాల్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.

‘‘కవిత’’ మీద కనికరం.. నాయకులకు ‘‘సంకటం’’!

-కవిత ఆరోపణలు బీఆర్‌ఎస్‌ పెద్దలకు కనిపించడం లేదా?

`కౌంటర్‌ అటాక్‌ ఎందుకు చేయడం లేదు?

`కేవలం కేసీఆర్‌ కూతురు కావడం ఇంకా వరమేనా?

`సాక్షాత్తు కేసీఆర్‌ నే కవిత టార్గెట్‌ చేస్తోంది?

`మిషన్‌ భగీరద మీద ఆరోపణలు చేస్తోంది?

`కాళేశ్వరం లో అవినీతి జరిగిందంటోంది?

`జిల్లాల పర్యటనలో బీఆర్‌ఎస్‌ నాయకులనే టార్గెట్‌ చేస్తోంది?

`నాయకులంతా అవినీతి పరులైతే పార్టీ బతికి బట్ట కడుతుందా?

`పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఒక్క మాట కూడా కవిత మాట్లాడడం లేదు?

`పార్టీకి పని చేస్తున్నవారిని టార్గెట్‌ చేస్తున్నారు?

`ఉద్యమ కాలం నుంచి పార్టీ కి సేవ చేస్తున్నవారిపై ఆరోపణలు గుప్పిస్తున్నారు?

`జనం బాటలో ప్రభుత్వాన్ని పల్లెతు మాట అనడం లేదు?

`బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం ఎందుకు స్పందించడం లేదు?

`కవిత కు బీఆర్‌ఎస్‌ అదినాయకత్వం భయపడుతోందా?

`కవిత ఆరోపణలు పార్టీకి తీరని నష్టమే?

`ఉపేక్షిస్తే మొదటికే మోసమే?లేవకుండా మునగడం ఖాయమే?

`‘‘కవిత’’ వ్యాఖ్యలు ఇప్పటి వరకు ప్రజలెవరు పట్టించుకోవడం లేదు?

హైదరాబాద్‌, నేటిధాత్రి:                      చిన్నపిల్లాడు చీపురు పుల్లతో కొట్టిననాడే వద్దని చెప్పకపోతే రోకలి బండతో కొట్టే రోజు కూడా రావొచ్చు. ఎమ్మెల్సీ దేవనపల్లి కవిత చేస్తున్నది కూడా అదే. ఆమె పదే పదే తలుపు చెక్కతో కొడుతుంటే బిఆర్‌ఎస్‌ నాయకులు దెబ్బలు ఓర్చుకుంటున్నట్లే వుంది. బిఆర్‌ఎస్‌ నాయకులను కవిత అన్నన్ని మాటలు అంటుంటే ఎవరు ఎందుకు స్పందించడం లేదనే ప్రశ్న సమాజం నుంచి కూడా ఉత్పన్నమయ్యే రోజు వస్తుంది.. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. కాన్సర్‌ కణితికి వెంటనే చికిత్స చేయకపోతే ఒళ్లంతా పాకుతుంది. ప్రాణం హరిస్తుంది. ఇక్కడ పార్టీకూడా అంతే. ఎందుకంటే ఆమె టార్గెట్‌ చేస్తున్న నాయకులంతా ఎవరో చిన్నా చితకా నాయకులు కాదు. అడ్రస్‌ లేని వాళ్లు కాదు. ఉద్యమకారులు. తెలంగాణకోసం పోరాటం చేసిన వాళ్లు. పార్టీ కోసం ఇటుక రాళ్లై మోస్తున్నారు. భుజాలు నొప్పి పెట్టేలా పార్టీ జెండాలను మోసిన వారు. పార్టీ కోసం అనేక ఇబ్బందులు,సమస్యలు, కేసులు ఎదుర్కొన్నవారు. పార్టీ కోసం అహర్నిషలు పని చేస్తున్న వారు. పార్టీయే ప్రాణంగా రాజకీయాలు చేస్తున్న వారు. అన్నింటికన్నా ముఖ్యంగా కేసిఆర్‌ను దేవుడుగా కొలుస్తున్నవారు. అలాంటి నాయకులను ఏరి కోరి ఎంచుకొని కవిత విమర్శలు చేస్తున్నారు. ఆరోపణలు గుప్పిస్తున్నారు. రెచ్చగొడుతున్నారు. వారిని ప్రజల్లో పలుచన చేయాలని చూస్తున్నారు. వ్యక్తిగతంగా మారిపై బురద జల్లుతున్నారు. కడుక్కోండి అని సవాలు చేస్తున్నారు. పెద్ద సారు కూతురు కదా! అని నాయకులు ఓపిక పడుతుంటే మరింత రెచ్చగొడుతున్నారు. వాళ్లు నిజంగానే నోరు తెరిస్తే కవిత రాజకీయం ఏమౌతుందో ఆమె రాజకీయం ఏమౌతుందో అర్దం కాదు. ఏ నాయకులకైనా సహనం కొంత వరకే వుంటుంది. అయినా కవిత పార్టీ నాయకులపై ఆరోపణలు చేస్తున్నానని అనుకుంటున్నారు. కాని నేరుగా కేసిఆర్‌పైనే అస్త్రాలు సంధిస్తున్నారు. పిల్లలు తప్పు చేస్తే ఎవరైనా తర్వాత తండ్రి పెంపకం గురించి మాట్లాడుకుంటారు. కుటుంబం మీదనే నిందలేస్తారు. ఇప్పుడు కవిత చేసే విమర్శలు కూడా నేరుగా కేసిఆర్‌కే తగిలేలా చేస్తున్నారు. ఆమె తెలిసి మాట్లాడుతున్నారో..తెలియక మాట్లాడుతున్నారో తెలియదు. సమాజంలో రెచ్చగొట్టే వాళ్లు అనేక మంది వుంటారు. చిచ్చులు పెట్టే వారు వుంటారు. వారి మాటలు నమ్మితే మోసపోయేది మా మాటలు విన్నవాళ్లే అనేది కవితకుతెలియంది కాదు. ఒక వేళ కవిత ఇన్ని రకాల విమర్శలు చేసి, ఆరోపణలు చేసి పార్టీని భ్రష్టు పట్టించాలని చూస్తుంటే ఇంకా ఓపిక పడుతున్నారు. ఒక్కసారి వాళ్లుంతా నోరు తెరిచినా చివరికి అవి కూడా కేసిఆర్‌కే తగులుతాయి. ఆ విషయాన్ని ఆమె మర్చిపోతోంది. తాను కేవలం నాయకులను మాత్రమే టార్గెట్‌ చేస్తున్నానన్న భ్రమల్లో వున్నట్లున్నారు. బిఆర్‌ఎస్‌ నాయకుల ఓపిక నషించి కవితనపై కేసుల విషయం ప్రస్తావిస్తే, కవిత కడిగిన ముత్యం అని కేసిఆర్‌ చెప్పిన మాటకూడా అబద్దమని తేలుతుంది. అంతిమంగా తన తండ్రి, పార్టీ అద్యక్షుడు కేసిఆర్‌కే అప్రదిష్ట వస్తుంది. పార్టీ ఓడిపోయినా, కేసిఆర్‌ ఇమేజ్‌ను ఎవరూ చెరపలేకపోయారు. ప్రజల్లో కేసిఆర్‌కు వున్న ఆదరణ తగ్గించలేకపోయారు. కేసిఆర్‌ను ఇంకా తెలంగాణ సమాజం తెలంగాణ పిత అనే గౌరవిస్తోంది. కాని కవిత నాయకులను టార్గెట్‌ చేసి తన తండ్రిని దృతరాష్ట్రున్ని చేస్తోంది. పార్టీ నాయకులపై చేస్తున్న విమర్శలు కేసిఆర్‌కు తగిలేలా చేస్తున్నారు. తెలంగాణలో వైఎస్‌ షర్మిల పార్టీ పెట్టి తెలంగాణలో యాత్ర చేస్తూ కేసిఆర్‌ను విమర్శించారు. అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ప్రతిపక్ష నాయకుడుగా వుంటూ తెలంగాణతో నీకేం సంబందం షర్మిలా? అని ప్రశ్నించారు. తెలంగాణలో మేం మేం విమర్శించుకుంటాం. తెలంగాణ రాజకీయాలు మాట్లాడడానికి నువ్వెవరు? అని రేవంత్‌ రెడ్డి నిలదీశారు. కొట్టుకున్నా,తిట్టుకున్నా మేమంతా ఒక్కటే..మధ్యలోకి రావడానికి నువ్వెవరు? అని అన్నారు. అలాంటిది కవితనే ఇప్పుడు నేరుగా పార్టీ నాయకులను విమర్శిస్తూ పోతే అది కేసిఆర్‌కు నమర్దా కాదా? ఆయన పరువుకు భంగం వాటిల్లదా? పార్టీ వుంటే ఎంత? పోతే ఎంత? అన్నప్పుడే పార్టీ నాయకుడు కేసిఆర్‌ గ్రహిస్తే పరిస్దితి ఇంత దూరం వచ్చేదేమీ కాదేమో? తెలంగాణ ప్రజలు కేసిఆర్‌ పాలనను, కాంగ్రెస్‌ పాలనను పోల్చుకుంటూ తింటే తిన్నారేమో? నీళ్లైంతే ఇచ్చారు. రైతులను ఆదుకున్నారు. కాళేశ్వరం కట్టి, రైతులను బతికించారని అంటుంటే ఆ మాటలు కవితకు వినిపించడం లేదా? కేసిఆర్‌ దేవుడు అంటూ తెలంగాణ సమాజం చెప్పుకుంటున్న మాటలు కవిత చెవిని చేరడం లేదా? తెలంగాణ ఉద్యమానికి కేసిఆర్‌తో తొలి అడుగు వేసిన హరీష్‌రావు మొదటి నుంచి ఉద్యమంలో లేరని కవిత చెబితే జనం నమ్ముతారా? అసలు తెలంగాణ ఉద్యమం మొదలైనప్పుడు కవిత వున్నారా? కవిత తెలంగాణ ఉద్యమానికి ఎప్పుడొచ్చారన్నది చరిత్రలో లేదా? కవిత చెప్పే మాటలనే జనం నమ్ముతారనుకోవడం కవిత భ్రమ. ప్రపంచంలోనే ఎక్కడా సాధ్యం కానటువంటి ప్రాజెక్టు నిర్మాణం కాళేశ్వరం. అలాంటి కాళేశ్వరం నిర్మాణం కోసం హరీష్‌రావు ప్రాజెక్టు వద్ద ఎన్ని నిద్రలు చేశారో కవితకుతెలియదా? ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో పగలు పరిశీలించేందుకే వెళ్లని మంత్రులు దేశంలో అనేక మంది వున్నారు. కాని హరీష్‌ రావు ఒక్కరు మాత్రమే పగలు రాత్రి అనే తేడాలేకుండా పనులు పర్యవేక్షించారు. సమీక్షించారు. రాత్రులు అక్కడే నిద్రలు చేశారు. ఒక యజ్ఞంలా కాళేశ్వరం నిర్మాణం కోసం కష్టపడ్డారు. ఆ కష్టాన్ని చూసి అప్పటి గవర్నర్‌ హరీష్‌రావును ఏకంగా కాళేశ్వరరావు అని కీర్తించారు. ఆఖరకు పిసి ఘోష్‌ కమిటీ కూడా కాళేశ్వరంలో అవినీతిని గుర్తించలేకపోయింది. కాని కవిత మాత్రం లేనిపోని రాద్దాంతం చేస్తోంది. తెలంగాణ సమాజమంతా కాళేశ్వరం వల్లనే తాము బతుకుతున్నామని చెబుతుంటే కవిత కాంగ్రెస్‌ కళ్లతో చూస్తోంది. కేవలం పార్టీ మీద ఆదిపత్యం కోసం ప్రయత్నం చేసి ఆఖరుకు బైటకు వెళ్లేదాకా తెచ్చుకున్నది. అయినా కవిత తన సొంత బలం మీద రాజకీయాలు చేయాలనుకుంటే ప్రస్తుతం పాలనలో వున్న కాంగ్రెస్‌ పార్టీ మీద మాట్లాడాలి. ఆరుగ్యారెంటీల మీద మాట్లాడాలి. ఆరు గ్యారెంటీ అమలు కోసం ఉద్యమాలు చేయాలి…కేటిఆర్‌, హరీష్‌రావులు క్షేత్రస్దాయిలో వుండాలని ఉచిత సలహాలు ఇస్తూనే, వారినే టార్గెట్‌ చేసి విమర్శలు చేస్తూ పోతే కవితను చూడడానికే కాదు, కవిత మాటలు వినడానికి కూడా జనం ఆసక్తి చూపరు. అందుకే ఈ మధ్య కవిత జనం బాటకు జనాలు రావడం లేదు. పలిచినా ఎవరూ రావడం లేదని జాగృతి నాయకులు, నేరుగా కవితకే చెబుతున్న సంబాషణలు వైరల్‌ అయ్యాయి. సరిగ్గా పన్నెండేళ్ల క్రితం తెలంగాణలో సాగు లేదు. నీరు లేదు. తినడానికి తిండి లేదు. ఊళ్లలో జనం లేరు. వలసలతో ఊరంగా వల్లకాడులా వుండేది. ఏ ఇంటిని చూసినా ఇళ్లకు తాళముండేది. వలసలు పోయిన ఇండ్ల ముందు పొక్కిలి వుండేది. ఊర్లలో నిర్మాణుష్యం తాండవించేది. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే తెలంగాణ రూపు రేఖలే మారిపోయాయి. మిషన్‌కాకతీయతో చెరువులు నిండడంతోనే సాగుమొదలైంది. కాలేశ్వరం నిర్మాణంతో తెలంగాణ కళకళలాడిరది. ఒకప్పుడు తిండికేడ్చిన తెలంగాణ రైతు దేశానికి అన్నం పెట్టేంత ఎదిగాడు. కాలు మీద కాలేసుకొని సాగు చేసుకుంటున్నాడు. సరిగ్గా పన్నెండేళ్ల కింద పగలు చూద్దామన్నా కరంటు లేదు. రాత్రి వెలుగు లేని రోజులు తెలంగాణ చూసింది. అలాంటిది ఆరు నెలల్లో తెలంగాణ వెలుగులు విరజిమ్ముతూ మెరిసిపోయింది. అలాంటి ప్రగతిని ఈతరం తెలంగాణ చూస్తుందని కలలో కూడా ఎవరూ అనుకోలేదు. ప్రపంచంలో ఇంత శీఘ్రమైన ప్రగతి జపాన్‌లో కూడా జరగలేదు. అలాంటి బిఆర్‌ఎస్‌ పాలన అనుకున్నంత ప్రగతి జరగలేదని కవిత చెప్పడమంటే కళ్లుండి చూడలేని తనమే.. రాజకీయ కుళ్లును కంటి నిండా పెట్టుకోవడమే? కవిత సొంత పార్టీ పెట్టుకొని రాజకీయం చేసి, ఎదిగితే ఎవరూ కాదనరు. ఎవరి అండా లేకుండా నాయకురాలిగా రాణిస్తే అందరూ సంతోషిస్తారు? కాని హరీష్‌రావు లాంటి నాయకుల మీద నిత్యం విషం చిమ్ముతూ పోతుంటే జనమే మెచ్చరు. బిఆర్‌ఎస్‌లో నాయకులు కార్యకర్తలందరూ కేసిఆర్‌కు కొడుకులు, కూతుళ్ల లాంటి వారే! కేసిఆర్‌ను కొలిచేది వాళ్లే. పార్టీని కాపాడుకునేదివాళ్లే..కేసిఆర్‌ను మళ్లీ గెలిపించుకునేది కూడా వాళ్లే. కవిత ఒక్కరి కళ్లకు వెలుగు కనిపించపోతే, తెలంగాణ చీకటైపోయినట్లు కాదు. తెలంగాణ రాజకీయాలకు కవితకు లేదు చోటు!!

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

డిసిసి అధ్యక్షుడిని కలిసిన ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ భూపాలపల్లి నూతన డీసీసీ అధ్యక్షుడుని మర్యాద పూర్వకంగా కలిసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు అసోసియేషన్ కమిటీ సభ్యులు
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యలయంలో నూతనంగా ఎన్నికైనా డీసీసీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ నీ మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసిన కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ నాయకులు
ఈ కార్యక్రమంలో కాకతీయ కోల్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ అధ్యక్షులు
శిరూప అనిల్, ఉపాధ్యక్షుడు నాగపూర్ సమ్మయ్య గౌడ్ , ఆకుల శ్రీనివాస్ సెక్రెటరీ, రేకుల కుమార్, వెంకటాద్రి, మేనం తిరుపతి, చిర్ర రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు…

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

ఆర్కేపి ఏరియా ఆసుపత్రిలో గేట్ మీటింగ్..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి :

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐఎన్టియుసి, ఏఐటియుసి, సిఐటియు యూనియన్ల ఆధ్వర్యంలో గేట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. సింగరేణిలో ఉద్యోగులకు గ్రాడ్యు టీ ప్రయోజనాలు తగ్గించడం, ట్రేడ్ యూనియన్ హక్కులు కాలరాయడం, సమ్మెలపై ఆంక్షలు విధించడం, 12 గంటల పని విధానాన్ని పెంచడం, భద్రత ప్రమాదాలు పెరగడం, సరైన ప్రక్రియ లేకుండా తొలగింపునకు శ్రీకారం చుట్టడం వంటి పలు అంశాలపై సింగరేణి ముందడుగు వేస్తున్న నేపథ్యంలో జేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందని జేఏసి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టియుసి సెంట్రల్ కమిటీ మెంబర్ మేకల రాజయ్య, ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ నాగేంద్ర బట్టు, సిఐటియు ఫిట్ సెక్రటరీ శ్రీకాంత్ , ఉపాధ్యక్షులు వెంకటస్వామి, రఘు, ప్రసాద్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం…

కార్మిక హక్కులను హరిస్తున్న కేంద్ర ప్రభుత్వం

భూపాలపల్లి నేటిధాత్రి

 

కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించి వేస్తుందని, కార్మికులకు నష్టం కలిగించే నూతనంగా తెచ్చిన నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ లను వెంటనే రద్దు చేయాలని కార్మిక సంఘాల జేఏసీ నేతలు ఏఐటీయూసీ వైస్ ప్రెసిడెంట్ మాతంగి రామచందర్, ఐ ఎన్ టి యు సి బ్రాంచ్ కార్యదర్శి షేకు హుస్సేన్, టీబీజీకేఎస్ బ్రాంచ్ వైస్ ప్రెసిడెంట్ బడి తల సమ్మయ్యలు డిమాండ్ చేశారు. మంగళవారం భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఏఐటీయూసీ కొమురయ్య స్మారక భవన్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో
జేఏసీ నేతలు పాల్గొని మాట్లాడుతూ..
అనేక సంవత్స రాలుగా కార్మిక సంఘాలు పోరాడి సాధించుకున్న
29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా విభజించి కార్మిక హక్కులను కేంద్రం కాలరాస్తుందని అన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు ఊడిగం చేస్తూ కార్మిక సంఘాల ప్రమేయం లేకుండానే కార్మికులకు నష్టం కలిగించే నాలుగు లేబర్ కోడ్ లను ఏర్పాటు చేయడం యావత్ కార్మిక లోకానికి తీరని నష్టమని అన్నారు.బిజెపి అవలంబిస్తున్న కార్మిక ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ సింగరేణి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో 25, 26న దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు బి ఎం ఎస్ తప్ప భారీ ప్రదర్శనలకు ఆందోళనలకు పిలుపునివ్వడం జరిగిందని, అందులో భాగంగా సింగరేణి వ్యాప్తంగా మంగళవారం భూపాలపల్లి ఏరియాలో అన్ని మైన్స్, డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపి అనంతరం నాలుగు కార్మిక వ్యతిరేక కోడ్ ల ప్రతులను దహనం చేశారు. నేడు కార్మిక సంఘాల జాక్ ఆధ్వర్యంలో సింగరేణి వ్యాప్తంగా 26 న జిల్లా కలెక్టర్, ముందు ఉదయం 10 :00 గంటలకు ధర్నా నిర్వహించి, సాయంత్రం 4 గంటల కు జీఎం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి వినతి పత్రాలు అందజేయడం జరుగుతుందని తెలిపారు. 26న జరిగే ఆందోళన పోరాటాలలో కార్మిక సంఘాల నాయకులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఈ సందర్భంగా జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జేఏసీ సంఘాల నాయకులు దేవరకొండ మధు, బాషనపల్లి కుమార్, బి నరేందర్ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version