విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య…

విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కృషితో చొప్పదండి నియోజకవర్గం డిగ్రీ కళాశాల మంజూరు

గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు

హర్షం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు

గంగాధర, నేటిధాత్రి:

 

 

కరీంనగర్ జిల్లా గంగాధర మండలంతో పాటు చుట్టుపక్కల మండలాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వచ్చింది. డిగ్రీ విద్య కోసం కరీంనగర్, జగిత్యాల వంటి పట్టణాలకు వెళ్లి చదువుకోవడం వ్యయప్రయాసలతో కూడుకున్నది కావడంతో చాలామంది పేద విద్యార్థులు చదువును ఇంటర్మీడియట్ తోనే ఆపేస్తున్నారు. చొప్పదండి నియోజకవర్గంలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి వస్తుందన్న సదుద్దేశంతో మేడిపల్లి సత్యం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వరకు ఈసమస్య తీసుకువెళ్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించారు. గంగాధరలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తుండడంతో విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గురువారం గంగాధర మండలం మధురానగర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల మంజూరైన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు.

మా “అబ్బాయి పెళ్లికి రండి”..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-21T190916.442.wav?_=1

 

 

మా “అబ్బాయి పెళ్లికి రండి”.

“నిహాంత్” పెళ్లి వేడుకకు హజరై వదూవరులను దీవించండి.

“సిఎం రేవంత్ రెడ్డి”ని కలిసి శుభలేఖ అందజేసిన “సుభాష్ రెడ్డి”.

వివాహానికి తప్పకుండా హజరై వదూవరులను ఆశీర్వదించాలని విజ్ఞప్తి.

తన కుమారుడు “నిహాంత్” పెళ్ళి శుభలేఖ “సిఎం”కు అందజేసిన “సుబాష్ రెడ్డి”.

 

“నేటిధాత్రి”,హైదరాబాద్.
మా అబ్బాయి నిహాంత్ పెళ్లికి రండి. వచ్చి మీ అమూల్యమైన ఆశీర్వనాలు అందించి దీవించండి. ప్రముఖ పారిశ్రామిక, రియల్ వ్యాపారి, మానవతా వాది, సామాజిక వేత్త తిమ్మయ్య గారి సుభాష్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవారం కలిశారు. నవంబర్ 7 న తేదీన సుభాష్ రెడ్డి కుమారుడు నిహంత్ పెళ్లి వేడుక జరగనున్నది.

 

CM Revanth invited to Nihant’s wedding

తన కుమారుడి పెళ్ళికి హజరై నూతన వదూవరులను ఆశీర్వదించాలని కోరుతూ పెళ్ళి శుభలేఖను సిఎం. రేవంత్ రెడ్డికి అందించి సుబాష్ రెడ్డి ఆహ్వానం పలికారు.

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

డిసిసి కాంగ్రెస్ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని అథర్ గౌరి విజ్ఞప్తి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మరియు మునిసిపాలిటీ మాజీ ప్రతినిధి కౌన్సిలర్ ముహమ్మద్ అథర్ గౌరి, కాంగ్రెస్ పార్టీ హైకమాండ్, కాంగ్రెస్ పార్టీ అఖిల భారత అధ్యక్షుడు మల్లికా అర్జున్ ఖర్గే, రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నామినేట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి విద్యావంతులైన పేద ప్రజలకు సేవ చేయాలనే తపన ఉన్న నాయకుడు, సంగారెడ్డి జిల్లా ప్రజా సమస్యలను పరిష్కరించే నాయకుడు అని, డాక్టర్ ఉజ్వల్ రెడ్డి సంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేశారని, ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తున్నారని, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసే నాయకుడని ఆయన అన్నారు. సంగారెడ్డి జిల్లా డిసిసి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని నామినేట్ చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్…

సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే జిఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మునిసిపాలిటీ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 50 కోట్ల రూపాయల ప్రత్యేక నిధులను మంజూరు చేసిన సందర్భంగా మంగళవారం భూపాలపల్లి అంబేద్కర్ విగ్రహం దగ్గర కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరై సీఎం రేవంత్ రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ భూపాలపల్లిని ఒక ఆధునిక మునిసిపాలిటీగా తీర్చిదిద్దేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు అని ఈ నిధులతో రోడ్లు, కాలువలు, తాగునీటి సౌకర్యాలు, పట్టణ సౌందర్య వృద్ధికి, జయశంకర్ జంక్షన్, అంబేద్కర్ జంక్షన్, ఆర్టీసీ బస్టాండ్ జంక్షన్, హనుమాన్ జంక్షన్ వెడల్పు,పలు అభివృద్ధి పనులు అమృత్సర్ స్కీం కింద 23 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపారు. అదేవిధంగా భూపాలపల్లి పట్టణ కేంద్రంలో అంబేద్కర్ భవనానికి ఐదు కోట్ల రూపాయలు, గిరిజన భవనానికి కోటి రూపాయలు వెచ్చించామని తెలిపారు.ఈ నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఇస్లావత్ దేవన్, పి.సి.సి సభ్యులు చల్లూరి మధు పిప్పాల రాజేందర్ ముంజల రవీందర్ అప్పం కిషన్ మున్సిపల్ మాజీ కౌన్సిలర్స్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు..

తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ పిలుపు మేరకు బీసీ బంద్‌కు బిఆర్ఎస్ పార్టీ మద్దతు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ మండలాల అధ్యక్షులు ,నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు బీసీ రిజర్వేషన్ల అమలుకు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి పట్టణంలో మోటార్ సైకిళ్ళ పై తిరుగుతూ బంద్ కు సహకరించాల్సిందిగా దుకాణ దారులను వ్యాపారస్తులను కోరడంతో తమ తమ దుకాణాలను మూసి వేసి బంద్ కు మద్దతు తెలిపారు అనంతరం తహసీల్దార్ కార్యాలయానికి ర్యాలీగా వెళ్లి మెమోరాండం సమర్పించారు

ఈ సందర్భంగా బిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి ప్రభుత్వం బీసీ వర్గాలను మోసం చేసిందని తీవ్రంగా విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత తానే కోర్టులో కేసులు వేయించి స్టే తెచ్చుకున్న తీరు ప్రజలను మోసం చేసే దానికి నిదర్శనమని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ తీరుపై

బీసీ జేఏసీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న బంద్‌లో భాగంగా పట్టణంలోని బస్ స్టాండ్ వద్ద నిరసన తెలిపారు .ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ మండల పార్టీ అధ్యక్షులు తట్టు నారాయణ ,కోహీర్ మండల పార్టీ అధ్యక్షులు నర్సిములు ,ఝరసంఘం మండల పార్టీ అధ్యక్షులు వెంకటేశం ,జహీరాబాద్ మండల బిసి సెల్ అధ్యక్షులు అమీత్ కుమార్ బిసి మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీ లు నాయకులు షికారి గోపాల్,బరూర్ దత్తాత్రి , శంకర్ సాగర్, రాజు శంకర్ బిసి జేఏసీ నాయకులు పెద్దగొల్ల నారాయణ కొండా పురం నర్సిములు విశ్వనాధ్ బిసి మైనారిటీ నాయకులు ఇమ్రాన్ బిసి సంఘాల నాయకులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-18T132744.714.wav?_=2

 

టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో నిరసన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ నియోజకవర్గం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ టీఆర్పీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జ్ జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో, 42% బీసీలకు రావాల్సిన రిజర్వేషన్ రాకుండా అడ్డుకున్న బీసీల మరియు తెలంగాణ ద్రోహి అయిన మాధవరెడ్డి దిష్టిబొమ్మను తగలబెట్టడం జరిగింది. ఈ సందర్భంగా జ్యోతి పందాలు మాట్లాడుతూ మనకు స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలకు పైబడిన కూడా ఈ కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తూ వచ్చింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కూడా కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని జ్యోతి పండాల్ అన్నారు. బీసీల ఓట్ల కోసం రేవంత్ రెడ్డి నామమాత్రంగా జీవో ని రిలీజ్ చేసి మళ్లీ వాళ్ల వర్గానికి సంబంధించిన వ్యక్తి హైకోర్టులో కేసు వేసి బీసీల రిజర్వేషన్ అడ్డుకోవడం చూస్తుంటే కాంగ్రెస్ పార్టీకి గాని రేవంత్ రెడ్డి కి గాని ఎంత చతుర శుద్ధి ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతుందని జ్యోతి పండగ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో ఆదిల్, మెహిన్ పటేల్, మహమ్మద్ ఆసీస్, షోహెద్, మహమ్మద్ ఒకే, ఇక్రమ్, మహమ్మద్ మోసిన్, మహమ్మద్ జాకీర్, మహమ్మద్ ముజ్జు, మహమ్మద్ కుతుబుద్ధిన్, మహమ్మద్ రిజ్వాన్, విజయ లక్ష్మీ, బిస్మిల్లా, అంజమ్మ, స్వీటీ, అంజన్న, కళావతి, రజిత. తదితరులు పాల్గొన్నారు

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…

వరంగల్ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలువనున్న సీఎం

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ కు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి రానున్నారు.ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి వరంగల్ రాక ఖరారు అయ్యింది.ఐతే వరంగల్ జిల్లా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తల్లి కాంతమ్మ ఈ నెల 4 అనారోగంతో మరణించిన విషయం తెలిసిందే.కాగా సీఎం రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని ఫోన్ ద్వారా అదే రోజు పరామర్శించారు.ఈ నేపథ్యంలో 15 న కాంతమ్మ పెద్దకర్మ కార్యక్రమం హన్మకొండలో ఏర్పాటు చేయనున్నారు.ఐతే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని స్వయంగా పరామర్శించేందుకు గాను ఈ నెల 15 న ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి వరంగల్ కు వస్తున్నట్లు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం అధికార ప్రతినిధులు ఒక ప్రకటన విడుదల చేశారు.

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం…

కాంగ్రెస్ వ్యవహారం – బీసీలకు అన్యయం.

వెల్దండ/ నేటి ధాత్రి :

 

బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు విధానంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసత్యాలతో, అబద్ధాలతో కాలయాపన చేస్తూ వచ్చింది అని వెల్దండ మండల బిఆర్ఎస్ పార్టీ యూత్ అధ్యక్షుడు జంగిలి యాదగిరి ఆరోపించారు. ఈ రోజు పత్రికా సమావేశంలో మాట్లాడుతూ.. చట్టబద్ధమైన రిజర్వేషన్లు కల్పించవలసి వచ్చినప్పుడు న్యాయ నిపుణలతో సలహాలు సూచనలు తీసుకొని ప్రజలకు హామీలు ఇవ్వాలి.కోర్టులో 42% బీసీ కోటా నిలబడదు అని తెలిసినా కూడా తమ రాజకీయ లబ్దికోసం దుందుడుకు తనంతో, దూకుడు వ్యవహారంతో బీసీలకు స్థానిక ఎన్నికల్లో 42 శాతం కల్పిస్తామని అమలు కాని హామీలు ఇచ్చి, ప్రజాస్వామ్యాన్ని, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి వ్యవహార శైలి చూస్తే ఆయన ప్రజల కోసం ముఖ్యమంత్రి కాలేదు, ప్రజలను మోసం చేయడానికి ముఖ్యమంత్రి అయినట్టు అర్థమవుతుంది. స్థానిక ఎలక్షన్లు జరగకపోవడంతో గ్రామాలలో అభివృద్ధి ఎప్పుడో అటకెక్కింది, దానితో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజల సమస్యలు ఎవరికి చెప్పాలో అర్ధం కావడం లేదు. కాబట్టి ఇలాంటి అసమర్థ ముఖ్యమంత్రితో తెలంగాణకు మరింత అన్యాయం జరిగే అవకాశం ఉంది.కావున బీసీ ప్రజలారా ఇకనైనా మేల్కోనండి రేవంత్ రెడ్డి కుట్రా రాజకీయాలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలనీ కోరారు.

ఎన్నికల వాయిదా ప్రక్రియపై బీసీల నిరసన…

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-10T134943.130.wav?_=3

 

ఎన్నికల వాయిదా ప్రక్రియపై బీసీల నిరసన

నర్సంపేట,నేటిధాత్రి:

 

ఈ నెలలో పెరగాల్సిన స్థానిక సంస్థలు ఎన్నికలు రెడ్డి జాగరణ ఆధ్వర్యంలో హైకోర్టులో పిటిషన్ వేసిన నేపద్యంలో హైకోర్టు స్టే విధించడం పట్ల ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఈ సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో
నర్సంపేట డివిజన్ ప్రధాన కార్యదర్శి సామ్రాజ మల్లేశం అధ్యక్షతన నర్సంపేట పట్టణంలోని సర్దార్ సర్వాయి పాపన్న సెంటర్ వద్ద నిరసన వ్యక్తం చేశారు.బీసీ సంక్షేమ సంఘం వరంగల్ జిల్లా అధ్యక్షులు సోల్తి సారయ్య గౌడ్ మాట్లాడుతూ 42 శాతం రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి కాంగ్రెస్ ప్రభుత్వం స్టే తేవడం అనేది అగ్రవర్ణాల కుట్రగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. అగ్రవర్ణాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు బీసీలుగా ఏనాడు కూడా దానిని వ్యతిరేకించి స్టేలకు, కోర్టులకు వెళ్లలేదని తెలిపారు.మా ఓట్లు మీకు అవసరంకాబట్టే ఇలాంటి కుట్ర పన్నుతున్నారని తస్మాత్ జాగ్రత్త అని అగ్రవర్ణాలను సోల్తి సారయ్య హెచ్చరించారు.హై కోర్టు స్టే పట్ల సీఎం రేవంత్ రెడ్డి స్పందించకపోతే బీ.సీ నేత ఆర్ కృష్ణయ్య పిలుపుమేరకు బందులో భాగస్వాములమవుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నీలాలపూర్ నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోల్తి రవి,నర్సంపేట పట్టణ అధ్యక్షుడు గండు రవి,ఉపాధ్యక్షుడు చీర వెంకట్ నారాయణ,జిల్లా యువ నాయకులు బైరి నాగరాజు, సోల్తి అనిల్,సోల్తి పెద్ద సాంబయ్య,సోల్తి చిన్న సాంబయ్య
అఖిల్,అనీష్,రాజు,రమేష్,సంపత్ సతీష్ ,రాంబాబు, కే సాంబయ్య తదితరులు తెలిపారు.

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి …

బెస్ట్ అవైలబుల్ స్కీం బకాయిలు తక్షణమే విడుదల చేయాలి

ఎస్ఎఫ్ఐ నాయకుల డిమాండ్

పరకాల నేటిధాత్రి

 

Vaibhavalaxmi Shopping Mall


ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ముఖ్య కార్యకర్తల సమావేశం మడికొండ ప్రశాంత్ మండల అధ్యక్షుడు అధ్యక్షతన నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు బొచ్చు కళ్యాణ్ హాజరయ్యారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బెస్ట్ అవైలబుల్ పాఠశాలకు మూడేళ్లగా బకాయిలు చెల్లించకపోవడం వల్ల విద్యార్థి తల్లిదండ్రులకు పాఠశాలలు లేఖలు రాశారు దీనివల్ల పాఠశాలలో చదువుతున్న 23 వేల మంది దళిత విద్యార్థులు 7వేల మంది గిరిజన విద్యార్థులు చదువు దూరమయ్యే పరిస్థితి ఉందన్నారు 154 కోట్ల బకాయిలను తక్షణమే విడుదల చేయాలన్నారు.గత ఆరు నెలలుగా విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్రమైన ఇబ్బందులకు గురవుతున్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే బకాయిలు విడుదల చేయాలని లేదంటే రాబోయే రోజుల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తల్లిదండ్రులతో మరియు విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని అన్నారు.ఈ కార్యక్రమంలో మహేష్,విజయ్,అన్వేష్,రాకేష్,కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..

 బీజేపీ, కాంగ్రెస్ తెలంగాణకు శత్రువులే..  హరీశ్‌రావు షాకింగ్ కామెంట్స్

అన్ని రకాల వస్తువుల ధరలు పెంచి ప్రజలను పీడించింది బీజేపీ ప్రభుత్వం కాదా అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. జీఎస్టీ రేట్లు పెంచింది మోదీ ప్రభుత్వమేనని.. మళ్లీ ఇప్పుడు రేట్లు తగ్గించినట్లు డ్రామాలు ఆడుతోంది కూడా బీజేపీనేనని విమర్శించారు. ఎన్నికలు రాగానే చారానా తగ్గించుడు, ఎన్నికలు అయిపోగానే రూపాయి పెంచుతూ.. ప్రజలను ప్లాన్డ్‌గా మోసం చేస్తున్నారని హరీశ్‌రావు ధ్వజమెత్తారు.

 ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)లపై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు (Harish Rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. చోటా భాయ్, బడే భాయ్ ఇద్దరిదీ ఒకే తీరని విమర్శించారు. తెలంగాణ ప్రజలను మోసగించడంలో, దోచుకోవడంలో కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) రెండు పార్టీలు దొందూ దొందేనని ఆరోపించారు. ఒక పార్టీది మోస చరిత్ర, మరొక పార్టీది ద్రోహ చరిత్ర అని ఆక్షేపించారు. బీజేపీ, కాంగ్రెస్ రెండు పార్టీలు తెలంగాణకు శత్రువులే.. తెలంగాణ పాలిట శకునిలేనని ఆరోపించారు. కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు మోదీ ప్రభుత్వం గుండు సున్నా ఇచ్చిందని ఫైర్ అయ్యారు. తెలంగాణలో 8 ఎంపీలను గెలిపించారన్న కృతజ్ఞత కూడా బీజేపీకి లేదని ధ్వజమెత్తారు. ఇవాళ(ఆదివారం) జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు హైదరాబాద్‌లో హరీశ్‌రావు సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి హరీశ్‌రావు.

మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక…

మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక

ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

భూపాలపల్లి నేటిధాత్రి

బహుజన చైతన్యానికీ, మహిళా శక్తికి చాకలి ఐలమ్మ ప్రతీక అని, వివక్షను ఎదురిస్తూ సాగిన నాటి చాకలి ఐలమ్మ పోరాట స్పూర్తి, తెలంగాణ సాధన ఉద్యమంలో ఇమిడి ఉన్నదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. చాకలి ఐలమ్మ 130వ జయంతి సందర్భంగా భూపాలపల్లి కలెక్టరేట్ లోని ఐడీవోసీ సమావేశ మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన చాకలి ఐలమ్మ జయంతి వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తో కలిసి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యే చాకలి ఐలమ్మ చిత్రపటం వద్ద పూలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తరువాత తెలంగాణ పోరాట యోధులను సమున్నత రీతిలో స్మరించుకున్నట్లు తెలిపారు. సబ్బండ కులాలు, మహిళల అభ్యున్నతి కోసం ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు దేశానికి ఆదర్శవంతంగా నిలుస్తున్నాయన్నారు. చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల హక్కుల కోసం భూస్వాముల అక్రమాలకు వ్యతిరేకంగా పోరాడి, బహుజన ఆత్మగౌరవానికి, మహిళా చైతన్యానికి మార్గం చూపారన్నారు. ఆమె ఆశయ సాధనకు ప్రతీ ఒక్కరూ కృషి చేయాలన్నారు.
భూపాలపల్లి బస్టాండ్. భూపాలపల్లి బస్టాండ్ ఎదురుగా ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద రజక సంఘం నేతల ఆధ్వర్యంలో నిర్వహించిన జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అనంతరం చాకలి ఐలమ్మ విగ్రహానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెంట పలువురు రజక కులస్తులు, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు

పాట్నాలో జరిగిన CWC సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-25T150112.860.wav?_=4

 

పాట్నాలో జరిగిన CWC సమావేశానికి హాజరైన రాష్ట్ర ముఖ్యమంత్రి

◆:- రాష్ట్ర ఆరోగ్య మంత్రితో కలిసి డాక్టర్ ఉజ్వల్ రెడ్డి హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆరోగ్య మంత్రి శ్రీ దామోదర్ రాజ నరసింహ, జహీరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ నాయకుడు డాక్టర్ ఉజ్వల్ రెడ్డితో కలిసి ఈరోజు బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశానికి హాజరైన తర్వాత హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు తిరిగి వస్తున్నట్లు చూడవచ్చు.

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )..

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-24T143753.341.wav?_=5

 

ఆపత్కాలంలో ఆపన్న హస్తం ముఖ్యమంత్రి సహాయ నిధి( సి ఎం ఆర్ ఎఫ్ )

◆:- తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

జహీరాబాద్ : పట్టణంలోని ఆదర్శనగర్ కాలనీ యన్.గిరిధర్ రెడ్డి నివాసంలో బుధవారం జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన 19 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్( సి ఎం ఆర్ ఎఫ్ ) చెక్కులను తెలంగాణ రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ శ్రేణులతో కలిసి అందజేశారు.
-:లబ్ధిదారులు:- రాజు మైకలి-47,500/- ఎండీ సోహైల్ షా-25,000/- అబ్దుల్ నబీ-27,000/- కళ్యాణ్ ఉమాదేవి-60,000/- దామావతి-60,000/- వోతి శ్రీనివాస్-29,500/- ఎస్ మహేష్ కుమార్-60,000/- దోమల రమేష్-60,000/- పర్వీన్ బేగం-35,000/- చౌహాన్ రవీందర్-50,000/- బేగరి దశరథ్-50,000/- బి.నవాబ్ మియా-24,000/- ఎండీ షాబుద్దీన్-60,000/- ఎదిగి దత్త గౌడ్-30,000/- ఎన్ అశ్వని-30,500/- ఎన్ అశ్వని-30,500/- పవార్ రేణుకా బాయి-20,000/- మంగలి సురేష్-60,000/- తలారి బిక్షపతి-55,000/- మొత్తం = 1,053,500/- ఈ సందర్భంగా యన్.గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధి పేదలకు వరమని అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఆర్థిక భరోసా కల్పిస్తూ ఆదుకుంటుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం పేదల వైద్యానికి పెద్దపీట వేస్తూ రాజీవ్ ఆరోగ్యశ్రీని బలోపేతం చేసి ఈ పథకం ద్వారా మరిన్ని వ్యాధులకు ఉచిత చికిత్సను అందుబాటులోకి తీసుకువచ్చిందని వివరించారు.ఈ సహాయ నిధి చెక్కుల మంజూరు కై కృషి చేసిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర రాజనర్సింహ గారికి,సెట్విన్ చైర్మన్ యన్.గిరిధర్ రెడ్డి,డా౹౹సిద్దం.ఉజ్వల్ రెడ్డి చెక్కులు పొందిన లబ్దిదారులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ రాంలింగా రెడ్డి,సిడిసి చైర్మన్ ముబీన్,మండల అధ్యక్షులు నర్సింహారెడ్డి,మాజీ వైస్ యం.పి.పి వి.రాములు,డిసిసి ఉపాధ్యక్షుడు ముల్తాని,మైనార్టీ సెల్ అసెంబ్లీ అధ్యక్షుడు జమిలాలోద్దిన్,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు భీమయ్య నర్సింహారెడ్డి,ప్రతాప్ రెడ్డి హర్షవర్ధన్ రెడ్డి,కిరణ్ గౌడ్ జగదీశ్వర్ రెడ్డి మల్లికార్జున్ నర్సింహులు ఇమామ్ పటేల్,హన్మంత్ రెడ్డి బర్కత్ మరియు కౌన్సిలర్లు మాజీ సర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు లబ్దిదారులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ…

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T130338.591.wav?_=6

కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులు పంపిణీ

మందమర్రి నేటి ధాత్రి

మందమర్రి బి1 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 82 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి,షాది ముభారక్ చెక్కులను పంపిణీ చేసిన కార్మిక మైనింగ్ ఉపాధి శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి.

వివేక్ కామెంట్స్

గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో అక్రమ కేసులు,అక్రమ అరెస్ట్ లతో కేసీఆర్ రాచరిక పాలన సాగించిండు.

60 వేల కోట్లు అప్పును 8 లక్షల కోట్ల అప్పుల రాష్ట్రంగా కేసీఆర్ మార్చిండు.

8 లక్షల కోట్ల అప్పు కు 5 వేల కోట్ల వడ్డీని కాంగ్రెస్ ప్రభుత్వం చెల్లిస్తుంది.

కేసీఆర్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలతో తెలంగాణ రాష్ట్ర ఖజానా ఖాళీ అయింది.

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది.

గత ప్రభుత్వంలో బి ఆర్ ఎస్ లీడర్ల కే డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను కేటాయించారు.

అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశాను.

9 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సన్న బియ్యానికి పంపిణీ చేస్తున్నాం.

 

గత పది యేండ్ల లో ఒక్క రేషన్ కార్డు,డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వలేదు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక 17 లక్షల రేషన్ కార్డులు ఇచ్చాం.

కొత్త గనులు రావాలి..కొత్త గనులపై సీఎం మంచి నిర్ణయం తీసుకున్నారు.

వి ఆర్ ఎస్ ప్రభుత్వం సింగరేణి బొగ్గు గనుల ఆక్షన్ లో పాల్గొనకుండా చేసింది

దీంతో ఈ ప్రాంత ప్రజలు ఉద్యోగాలు కోల్పోవడం జరిగింది.

గతం లో మందమర్రి ప్రాంతంలో రోడ్లు, డ్రైనేజీలు అధ్వానంగా ఉండేవి.

కానీ నేను వచ్చాక 50 కోట్ల రూపాయల తో అభివృద్ధి పను జరుగుతున్నాయి

కమిషన్ల కోసమే గత ప్రభుత్వం పెద్ద పెద్ద కట్టడాలు నిర్మించింది.

అమృత్ స్కిం తో మందమర్రి ప్రజల కు శాశ్వత మంచినీటి సౌకర్యం కలుగుతుంది.

42 వేల కోట్ల రూపాయల తో మిషన్ భగీరథ పథకాన్నీ తీసుకు వచ్చి ఒక్క ఇంటికి చుక్క త్రాగు నీరు అందించలేదు.

మిషన్ భగీరథ పథకం అట్టర్ ఫ్లాప్ ప్రాజెక్ట్.

గత బిఆర్ఎస్ ప్రభుత్వం పథకాల పేరుతో వేల కోట్లు దోచుకుంది.

మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక..!

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-23T122348.458.wav?_=7

 

మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక..!

◆:- ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన:

◆:- డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ -డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, సెంట్రల్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నియోజకవర్గం తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం సమాజంలోని బలహీన వర్గాలకు, ముఖ్యంగా వెనుకబడిన మరియు ముస్లిం వర్గాల అర్హులైన మహిళలకు ఆర్థిక సహాయం అందించడానికి స్నేహ పథకాలను ప్రవేశపెట్టిందని పార్లమెంటు సభ్యుడు జహీరాబాద్
డాక్టర్ ఉజ్వల్ రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు. ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన పథకం కింద, తెలంగాణ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం బలహీన వర్గాలకు చెందిన నిరుపేదలు, విడాకులు తీసుకున్నవారు, అవివాహితులు మరియు ఒంటరి మహిళలకు రూ. 50,000 ఆర్థిక సహాయం మరియు బరివంత్ అన్నా కా సహారా పథకాన్ని అందించింది.ఫకీర్-ఉల్-దఫ్ పథకం కింద, ముస్లిం వెనుకబడిన తరగతులు మరియు ఇతర వెనుకబడిన తరగతుల మహిళలు సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడానికి మరియు మోపెడ్‌లు మరియు బైక్‌లను కొనుగోలు చేయడానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సంబంధిత పథకాలను పొందేందుకు లబ్ధిదారులకు పూర్తి మార్గదర్శకత్వం అందించడానికి రాజకీయ మరియు ముస్లిం నాయకులు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని మరియు వచ్చే నెల అక్టోబర్ 6 చివరి తేదీ అని ఆయన అన్నారు. ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణకు తెలంగాణ ఏర్పాటు చేయబడిందని ఆయన అన్నారు.మీరు కాంగ్రెస్ ప్రభుత్వ వెబ్‌సైట్ tgobmms.cgg.gov.in ని నమోదు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తును సమర్పించడానికి ఆధార్ కార్డు, ఆహార భద్రతా కార్డు లేదా రేషన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం, తుది ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలని ఆయన అన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టిన ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన మరియు రేవంత్ అన్నా కా సహారా పథకాలు ప్రశంసనీయమైన చొరవ అని ఆయన అభివర్ణించారు. ఈ సందర్భంగా మరికొందరు కూడా హాజరయ్యారు.

తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక…

తెలంగాణ మైనారిటీలకు సీఎం రేవంత్ రెడ్డి గొప్ప కానుక

◆:- కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్

జహీరాబాద్ నేటి ధాత్రి:

ఝరాసంగం మండల నర్సాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఉప్పు సర్పంచ్ గోపాల్ మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మరో చారిత్రాత్మక అడుగు వేసిందన్నారు . శుక్రవారం సచివాలయంలో రెండు కొత్త పథకాలను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులు, వృద్ధులు, ట్రాన్స్ జెండర్ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లాంచనంగా ప్రారంభించారు.

లాంచ్ చేసిన పథకాలు:

ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన వితంతువులు, విడాకులు పొందినవారు, అనాధలు, అవివాహిత మహిళలకు ₹50,000 సాయం.రేవంతన్నా కా సహారా – మిస్కీన్ల కోసం ఫఖీర్, దుదేకుల వర్గాలకు మోపెడ్ వాహనాలు, ఒక్కొక్కరికి రూ.లక్ష గ్రాంట్. రిజిస్ట్రేషన్ల వివరాలు:
ప్రారంభం : 19-09-2025 చివరి తేదీ :06-10-2025 ఆన్లైన్ : TGOBMMS 3 (tgobmms.cgg.gov.in)
ఆఫ్లైన్ దరఖాస్తులు చేసుకోగలరని కోరిన మాజీ ఉపసర్పంచ్ గోపాల్ అన్నారు,

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం…

సింగరేణి కార్మికులకు దసరా బోనస్ ప్రకటించిన ప్రజా ప్రభుత్వం

సీఎం, డిప్యూటీ సీఎం కు ధన్యవాదాలు తెలిపిన ఎమ్మెల్యే జీఎస్సార్

భూపాలపల్లి నేటిధాత్రి

 

 

సోమవారం హైదరాబాద్ లోని రాష్ట్ర సచివాలయంలో సింగరేణి 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను దసరా పండుగ సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం బోనస్ ను ప్రకటించింది. లాభాల్లో 34 శాతం కార్మికులకు పంచింది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క విలేకరుల సమావేశంలో తెలిపారు. కాగా, సింగరేణి లాభం మొత్తం రూ.2360 కోట్లు. అందులో కార్మికుల వాటా మొత్తం రూ. 819 కోట్లు. ఒక్కో కార్మికునికి రూ.1,95,610 ఇవ్వనున్నారు. ఈసారి కాంట్రాక్టు కార్మికులకూ రూ.5,500 చొప్పున బోనస్ను చెల్లించనున్నారు. దీంతో, భూపాలపల్లిలో 5,500 కార్మికులకు ప్రయోజనం కలుగుతుంది. కాంట్రాక్ట్ కార్మికులకు బోనస్ ఇవ్వడం దేశ చరిత్రలోనే ఇదే తొలిసారి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి ఎమ్మెల్యే సత్యనారాయణ రావు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క లను వేరువేరుగా కలిసి పుష్పగుచ్చం అందించి ధన్యవాదాలు తెలిపారు.

మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..

మాజీ డీఎస్పీ నళిని సంచలన పోస్టు.. అసలు విషయమిదే..

 

 

మాజీ డీఎస్పీ నళిని సోషల్ మీడియా మాధ్యమం ఫేస్ బుక్‌లో సంచలన పోస్టు చేశారు. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు.

 

మాజీ డీఎస్పీ నళిని (Former DSP Nalini) సోషల్ మీడియా మాధ్యమం ఫేస్‌బుక్‌లో సంచలన పోస్టు చేశారు. తన అనారోగ్యంపై మరణ వాంగ్మూలం అంటూ ఆమె పోస్ట్ చేశారు. తెలంగాణ ఉద్యమ పోరాటం వల్ల తనకు నిలువెల్లా గాయాలే అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ నొప్పిని భరిస్తూనే 12 ఏళ్ల అజ్ఞాత వాసంలో ఉన్నానని వాపోయారు. మహర్షి దయానందుని దయవల్ల ఆధ్యాత్మిక మార్గం ఎంచుకుని, అందులోనే వేద యజ్ఞ పరిరక్షణ సమితి స్థాపకురాలుగా ఎదిగానని ఉద్ఘాటించారు మాజీ డీఎస్పీ నళిని.

తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి తనకు సహాయం చేస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేశారు. ఆరు నెలల తర్వాత తన పిటిషన్ పొజిషన్ కనుక్కుంటే చెత్త బుట్ట పాలైందని తెలిసిందని అన్నారు. తన ఆఫీస్ కాపీని మళ్లీ స్కాన్ చేసి పంపానని తెలిపారు. ఆ విషయంపై ఇప్పటి వరకు స్పందన లేదని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా మీడియాకు మాజీ డీఎస్పీ నళిని ఓ విజ్ఞప్తి చేశారు. తాను చనిపోయిన తర్వాత ఎవరూ కూడా సస్పెండెడ్ ఆఫీసర్ అని రాయవద్దని….రిజైన్డ్ ఆఫీసర్, కవయిత్రి, యజ్ఞ బ్రహ్మ అని తనను సంభోదించాలని అంటూ పోస్ట్ చేశారు. అయితే నళిని ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఆరా తీస్తున్నారు.

మహాదేవపూర్ గ్రామ కార్యదర్శికి వినతి పత్రం…

 

https://netidhatri.com/wp-content/uploads/2025/09/download-2025-09-20T124815.541.wav?_=8

 

మహాదేవపూర్ గ్రామ కార్యదర్శికి వినతి పత్రం *

*వికలాంగులకు 6000 వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులకు 4000
*కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి

*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ *
మహాదేవపూర్ సెప్టెంబర్ 20 నేటి ధాత్రి *

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడి చేయడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వికలాంగులు 6000 వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఫించను పెంచి వాళ్ళని ఆదుకోవాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగుల సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు అదే విధంగా విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మా బాధలు పట్టించుకునే నాయకుడు లేడని మందకృష్ణ మాదిగ లేకుంటే తమ పరిస్థితి అద్వానమని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను అమలు చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య వికలాంగుల మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు వికలాంగుల టౌన్ అధ్యక్షులు మీర్జా ముస్తాక్ వైస్ ప్రెసిడెంట్ అంజలి ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ నాయకులు కొలుగురి శ్రీకాంత్ చింతకుంట్ల సాయి చింతకుంట్ల రాము తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version