మహాదేవపూర్ గ్రామ కార్యదర్శికి వినతి పత్రం *
*వికలాంగులకు 6000 వృద్ధులు ఒంటరి మహిళలు వితంతులకు 4000
*కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాటలు నిలబెట్టుకోవాలి
*ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ *
మహాదేవపూర్ సెప్టెంబర్ 20 నేటి ధాత్రి *
జయశంకర్ భూపాలపల్లి జిల్లా
మహాదేవపూర్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ముట్టడి చేయడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు బెల్లంపల్లి సురేష్ మాదిగ అన్నారు ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని వికలాంగులు 6000 వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలకు 4000 రూపాయలు ఫించను పెంచి వాళ్ళని ఆదుకోవాలని లేకపోతే స్థానిక ఎలక్షన్లో వృద్ధులు ఒంటరి మహిళలు వికలాంగుల సత్తా ఏంటో చూపించడానికి సిద్ధంగా ఉన్నారని మండిపడ్డారు అదే విధంగా విహెచ్పిఎస్ మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో మా బాధలు పట్టించుకునే నాయకుడు లేడని మందకృష్ణ మాదిగ లేకుంటే తమ పరిస్థితి అద్వానమని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను అమలు చేయాలని లేకపోతే రానున్న రోజుల్లో గడ్డు పరిస్థితులు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు బెల్లంపల్లి సురేష్ మాదిగ వికలాంగుల మండల అధ్యక్షులు వీరగంటి సమ్మయ్య వికలాంగుల మండల ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్లు వికలాంగుల టౌన్ అధ్యక్షులు మీర్జా ముస్తాక్ వైస్ ప్రెసిడెంట్ అంజలి ఎమ్మార్పీఎస్ గ్రామ శాఖ నాయకులు కొలుగురి శ్రీకాంత్ చింతకుంట్ల సాయి చింతకుంట్ల రాము తదితరులు పాల్గొన్నారు