ఝరాసంగం సర్పంచ్ అభ్యర్థి బాలరాజ్ ఆర్, వినోద నామినేషన్ దాఖలు
జహీరాబాద్ నేటి ధాత్రి:
ఝరాసంగం మండల గ్రామ బిఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా బాలరాజ్ ఆర్, వినోద నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి నామినేషన్ వేశారు.మాజీ ఎంపీపీ బొగ్గుల సంగమేశ్వర్, తాజా మాజీ సర్పంచ్ బొగ్గుల జగదీశ్వర్ సహాయ సహాకారాలతో ఝరాసంగం గ్రామాన్ని అభివృద్ధి చేయడం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం తమ లక్ష్యమని నాయకులు తెలిపారు. ప్రజలు అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్తామని బాలరాజ్ ఆర్, వినోద వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు,బిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
