నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం…

నాగూర్లపల్లిలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు-చలివేంద్రం ప్రారంభం

నర్సంపేట, నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. అంబేడ్కర్ యువజన సంఘం అధ్యక్షుడు తనుగుల దేవేందర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి 16వ వార్డు కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ ముఖ్య అతిథిగా హాజరై అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు.అనంతరం అంబేడ్కర్ సెంటర్ వద్ద సాదుల శ్రీనివాస్ (శీను) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని కౌన్సిలర్ ప్రారంభించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బాటసారుల కోసం ఏర్పాటు చేసిన ఈ చలివేంద్రం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ మాచిక నర్సయ్య, మాజీ ఉపసర్పంచ్ తనుగుల రవీందర్, బుర్రి సాగర్, బూరి ఆంజనేయులు, కటస్వామి, ఎలందుల భాస్కర్, తనుగుల రాజు, బుర్రి సునీల్, గుర్రం రవి, జవాజి చంద్రమౌళి, సాదుల ముత్తిలింగం, కరుణాకర్, తనుగుల శ్రీకాంత్, సుధాకర్, తనుగుల అంజి, శివకోటి, బాబు, కొండం జ్యోతి, భాగ్య, అంబేడ్కర్ యువజన సంఘం నాయకులు, గ్రామ పెద్దలు మరియు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఘనంగా మున్సిపాలిటిలో అంబేద్కర్ జయంతి వేడుకలు..

ఘనంగా మున్సిపాలిటిలో అంబేద్కర్ జయంతి వేడుకలు

నర్సంపేట నేటిధాత్రి:

వరంగల్ జిల్లా నర్సంపేట మున్సిపల్ కార్యాలయంలో భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్,మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. సమానత్వం, సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువల స్థాపనలో అంబేద్కర్ చేసిన సేవలను వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

నాగూర్లపల్లిలో అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు చెక్….

నాగూర్లపల్లిలో అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు చెక్

25 కేవీఏ నూతన విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ ప్రారంభించిన కౌన్సిలర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 16వ వార్డు నాగూర్లపల్లిలో నివాసితులు ఎదుర్కొంటున్న అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్యకు పరిష్కారం లభించింది. స్థానిక తపాలా కార్యాలయం సమీపంలో ఏర్పాటు చేసిన 25 కేవీఏ సామర్థ్యం గల నూతన విద్యుత్ మార్పిడి యంత్రాన్ని కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ శుక్రవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ బానోత్ నవీన్ నాయక్ మాట్లాడుతూ, వార్డులో విద్యుత్ వినియోగం పెరగడంతో పాత లైన్లపై భారం పెరిగి తరచూ అల్ప విద్యుత్ ఒత్తిడి సమస్య తలెత్తుతోందని తెలిపారు. ఈ సమస్యను అధిగమించేందుకు 25 కేవీఏ మార్పిడి యంత్రాన్ని ఏర్పాటు చేయించినట్లు చెప్పారు. దీనివల్ల పరిసర ప్రాంతాల గృహాలకు నాణ్యమైన, నిరంతర విద్యుత్ సరఫరా అందుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జూనియర్ లైన్‌మన్ ప్రశాంత్ పాల్గొని విద్యుత్ సరఫరా వ్యవస్థను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో తపాలా పంపిణీదారు పవన్, స్థానిక నాయకులు రాధారపు శ్రీనివాస్, ముప్పారపు గణేష్, తనుగుల బాబు, బండ్ల వెంకటేశ్వర్లు, స్థానిక మహిళలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.వార్డుల్లో డ్రైనేజ్, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం వార్డు ప్రజల నుంచి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు ముఖ్యులు కీసర నరేందర్, కీసర వెంకటేశ్వర్లు, కాటా అఖిల్, కీసరి రాజీవ్, నల్గొండ వంశీ, స్వామిశెట్టి శేఖర్, శోభన్ బాబు, చీకటి శివమణి, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్, ఎస్‌ఎల్‌ఎఫ్ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

విలీన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం…

విలీన గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతాం*

నర్సంపేట మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీలో విలీనమైన గ్రామాలను ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తామని మున్సిపల్ చైర్‌పర్సన్ పెండం శ్రీలక్ష్మీ రామానంద్ తెలిపారు. బుధవారం మున్సిపాలిటీలో విలీనమైన నాగుర్లపల్లి, పర్శునాయక్ తండా 16వ వార్డును మున్సిపల్ యంత్రాంగంతో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక వార్డు కౌన్సిలర్ బానోతు నవీన్ నాయక్‌తో కలిసి గ్రామంలోని డంపింగ్ యార్డ్, బతుకమ్మ ఆడుట స్థలం, పల్లె దవాఖాన, మట్టి రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థను పరిశీలించారు.విలీన గ్రామ ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించి పౌర సేవలను సమర్థవంతంగా అందించేందుకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆమె ఆదేశించారు.

ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు అందించడం, పారిశుధ్యంపై ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయడం, అవసరమైన చోట వీధి దీపాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు.పార్టీలకతీతంగా ఎలాంటి బేషజాలం లేకుండా 16వ వార్డు అభివృద్ధి కోసం అవసరమైన నిధులను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మంజూరు చేయిస్తామని ఆమె హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో వార్డు ముఖ్యులు మేఘ్య నాయక్, శంకర్ నాయక్, క్రాంతి కుమార్, కొర్ర రాహుల్, కొర్ర రాజన్న తదితరులు పాల్గొన్నారు.

మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు…

మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

1వ వార్డు మాదన్నపేట,16 వ వార్డు పర్శనాయక్ తండాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ

నర్సంపేట, నేటిధాత్రి:

 

మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.నర్సంపేట పట్టణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మాదన్నపేటలో,16 వ వార్డు పర్శనాయక్ తండాలో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ శుక్రవారం పంపిణీ చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్లు కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్,బానోతు నవీన్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తోందని తెలిపారు.అలాగే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అవసరం ఉన్న ప్రాంతాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నర్సంపేట పట్టణంలోని ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందజేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌ను స్వయం సహాయక సంఘ సభ్యులు, 1వ వార్డు మహిళలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్, వేల్పుల శ్రీలత, సీఏ దుడేల శ్రీను, బండి స్వరూప, వీవో అధ్యక్షురాలు అలం అరుణ, ములుగూరి మమతా, మున్సిపల్ అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్…

ఆఫ్-సైట్ మాక్ డ్రిల్ అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/NoviIp1TUK4?si=EohsYI-9HsxUTNf_

నర్సంపేట పట్టణంలో మెగా గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ టీఎం అవినాష్, ఓఎం టీమ్ రాజేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆఫ్ సైట్ మాకు డ్రిల్ అవగాహన సదస్సులో ముఖ్యఅతిథిగా నర్సంపేట మున్సిపాలిటీ చైర్ పర్సన్ శ్రీమతి పెండెం శ్రీలక్ష్మీరామానంద్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ
మెగా గ్యాస్ వినియోగం పట్ల అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పరిశ్రమల్లో కర్మాగారంలో పల లేదా గృహ నివాసంలో గ్యాస్ లీకేజీ లాంటి ప్రమాదం లేదా భారీ అగ్నిమాపక ప్రమాదం జరిగినప్పుడు ప్రజలు సమస్యను ఎదుర్కొని ఎలా సురక్షితంగా బయటపడాల్లో ఒక అవగాహన వస్తుందని అన్నారు. ప్రాణ, ఆస్తి నష్టాన్ని కనిష్ట స్థాయికి తగ్గించేందుకు ఇలాంటి మాక్ డ్రిల్స్ ఎంతో ఉపయోగపడతాయని అని అన్నారు. పోలీస్, ఫైర్ సర్వీస్, వైద్య బృందాలు, మరియు రెవెన్యూ శాఖల మధ్య సమన్వయాన్ని మెరుగుపరచడానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్,టౌన్ ఎస్సై గూడ అరుణ్ , మున్సిపల్ కౌన్సిలర్లు ఎలకంటి విజయ్ కుమార్, మాదాసి రవి , పొన్నాల మనీషా-ప్రకాష్ , ములుకల వినోద-సాంబయ్య , కొంపల్లి వీణ-విజేందర్ రెడ్డి, వేల్పుల శ్రీలత,ఇస్లావత్ రామ-గోపి నాయక్ , తదితరులు పాల్గొన్నారు.

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం…

ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తాం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటాం

వార్డు కౌన్సిలరుతో కలిసి వార్డులో పర్యటించిన

చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో గల ప్రజా సమస్యలే ద్యేయంగా పనిచేస్తామని మున్సిపాలిటి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 2వ వార్డులోస్థానిక కౌన్సిలర్ కాంపెల్లి వీణ-విజేందర్ రెడ్డితో కలిసి శుక్రవారం నర్సంపేట మున్సిపాలిటి ఛైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ గుప్తా పర్యటించారు.అనంతరం ఛైర్ పర్సన్ మాట్లాడుతూ నిత్యం అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. ఉదయం వార్డులో పర్యటిస్తున్నప్పుడు తమ దృష్టికి ప్రతి సమస్యను ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో వార్డులను సమగ్ర అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు.అదే విధంగా 2వ వార్డులో వాటర్ సమస్యను గుర్తించడం జరిగిందని పాడైపోయిన బోర్లు అలాగే బావులు రిపేర్ చేయించి నీటిని అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు చేపట్టామని త్వరలోనే బావులు బోర్ల ద్వారా నీటిని అందిస్తామని పేర్కొన్నారు.

వార్డులో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెడతామని వార్డును అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాట భాస్కర్, సానిటేషన్ ఎస్సై శ్యామ్, 3వ వార్డు కౌన్సిలర్ ముత్తినేని వెంకన్న, 4వ వార్డు కౌన్సిలరు బీరం భరత్ రెడ్డి, వాటర్ సప్లై ఇంచార్జ్ కాట శ్రీనివాస్, వార్డు ఆఫీసర్ యుగంధర్, మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కాట ప్రభాకర్, కాంగ్రెస్ పార్టీ నాయకులు వేముల నవీన్, చిదురాల రాంరెడ్డి, దూపటి కుమార్, కేశపాక సాంబయ్య, ఎండీ రజాక్, రహీం, తదితరులు పాల్గొన్నారు.

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా…

వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తా

నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్

కౌన్సిలర్ లతో వార్డుల్లో పర్యటించిన చైర్ పర్సన్ పెండెం

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని వార్డుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 17, 9వ వార్డుల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 17వ వార్డు కౌన్సిలర్ సలావుద్దీన్ అయూబ్ ఖాన్,సంబంధిత అధికారులతో కలిసి తో కలిసి చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లు పర్యటించారు. 17వ వార్డు మరియు 9వ వార్డుల్లో అవసరమైన సీసీ రోడ్డు, సైడు కాలువల నిర్మాణ పనులు చేపట్టి, నీటి సమస్య, పారిశుద్ధ పనులపై ప్రత్యేకమైన దృష్టి పెట్టి వార్డులను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.అర్హులందరికీ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అందించే పథకాలు అందిస్తామని తెలిపారు.వార్డుల్లో ఎక్కడ సమస్య ఉన్న వెంటనే స్పందించి తమదృష్టికి తీసుకువచ్చి సమస్య పరిష్కారానికి కృషి చేయాలని అధికారులకు సిబ్బందికి సూచించారు.

ఈ కార్యక్రమంలో వార్డు ఆఫీసర్లు కాట శ్రీనివాస్, జూలూరి కావ్య, వాటర్ సప్లై కొల్లూరి రంజిత్, వార్డు జవాన్ మాదాసి భరత్, మాజీ కౌన్సిలరు మేర్గు సాంబయ్య, మాజీ ఎంపీటీసీ పేరం బాబు రావు, జిల్లా మైనార్టీ సెల్ ఉపాధ్యక్షులు మసూద్ భాయ్, 9వ వార్డు అధ్యక్షులు గిరగాని రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ముత్యాల వీరస్వామి, మేరుగు కిరణ్, ఆకుల శ్రీను, దండు నవీన్, బండారు శివ, నామాసు వెంకటేశ్వర్లు, సల్మాన్, సాయి, మున్సిపల్ సిబ్బంది వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్…

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, 30వ వార్డు, 6వ వార్డుల కౌన్సిలర్లు బాణాల ప్రసన్న-శ్రీనివాస్, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 22వ వార్డు, 30వ వార్డు తోపాటు 6వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎండాకాలంలో నీటి కొరత రాకుండా అవసరమైన దగ్గర బోర్లు వేయించడం జరుగుతుందని, అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి పారిశుధ్య సమస్య లేకుండా నిరంతరం వార్డులలో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతోటి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరలో చేయబట్టబోతున్నామని, అదేవిధంగా వార్డులకు అవసరమైన పనులను ముందుండి చేయించి వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, వార్డు ఆఫీసర్స్ చకిలం నాగరాజు, గుగులోతు శ్రీకాంత్, వేమా సూర్యనారాయణ, మున్సిపల్ జవాన్ డేగల కుమార్, బోడ మొగిలి, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ గంట రామిరెడ్డి, వాటెన్ సెక్షన్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, వాటర్ లైన్మెన్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్, కోల వెంకటేశ్వర్లు, మైబు పాషా, కొప్పు అశోక్, పోతిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం శ్రీనివాస్, ధోని చేరాలు, కుచన రాజు, కొప్పు రాజు, పోగుల ప్రభుదాస్, బాణాల రమేష్, తాండ్ర అశోక్, మడికొండ రంజిత్, బోడ సునీల్, అనపర్తి సతీష్, గడ్డం ప్రవీణ్, అగరపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు..

వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి తీవ్ర ఇబ్బందులు

క్లీనింగ్ పట్ల మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 10 వార్డు వివేకానంద కాలనీలో కాల్వలు పూడ్చుకపోయి, మురికి నీరు ఒకే దగ్గర ఉండటం వలన ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ ఆవేదన వ్యక్తం చేశారు.
కాలనీలో మురికి నీరు ఉండటం వలన దుర్గంధం వెదజల్లుతుండడంతో ప్రజలు తీవ్రమైన పడుతుంటే వాటిని శుద్ధి చేసేందుకు గాని 4 రోజుల నుండి మున్సిపాలిటీ జేసిబి అడుగుతుంటే, ఆయిల్ మార్పించాలని దాటవేస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిఅంటున్నారని మున్సిపల్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.మున్సిపాలిటీలో ప్రజా సమస్యల కంటే ముఖ్యమైన పని ఏం ఉంటుందని అధికారులను ప్రశ్నించారు. ఇప్పటికైన అధికారులు స్పందించి ప్రజలకు అవసరైన పనులను నిర్లక్ష్యంగా వ్యవహరించకూడా పనులు చేయాలని శ్రీధర్ డిమాండ్ చేశారు.

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం…

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్,30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి లకు ఘన సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/RsmS54EeUj0?si=qaU9jG1pqADv4jvH

 

*నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతామని చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ హామీ ఇచ్చారు.పట్టణంలోని 30 వార్డులో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పెండెం లక్ష్మీ రామానంద్,అదే వార్డు కౌన్సిలర్ మాదాసి రవి, మహిళా కౌన్సిలర్లు వేల్పుల శ్రీలత బాణాల ప్రసన్న కుమారి లను వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని దళిత వార్డులను మోడల్ వార్డులుగా తీర్చిదిద్దుతానని , వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు.వార్డులలో డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్తు సరఫరా నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తానని , అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ మా తాత పెండెం కట్టయ్య కాలము నుండి నేటి వరకు 30 వ వార్డుతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు.వార్డు ప్రజల అవసరాలు మరియు వార్డు సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని అన్నారు.
నర్సంపేట పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.30 వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి మాట్లాడుతూ వార్డు ప్రజలమంతా ఒక కుటుంబం అని కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు.వార్డులో నీటి సమస్య పట్ల బోర్లు ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయని అవి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి సారంగం ,మాజీ వార్డ్ మెంబర్ కొయ్యడి సంపత్ సీనియర్ నాయకులు దూడల సాంబయ్య,గద్ద సంజీవ, గద్ద శ్రీనివాస్ గద్ద జ్యోతి, నూనె పద్మ, కోమటి సరోజన, జానకమ్మ, గద్ద అఖిల్, నూనె బన్ను, గద్ద నీ ఖిల్, తదితరులు పాల్గొన్నారు.

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా…

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్..

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

పార్టీలకతీతంగా ఎలాంటి భేషజాలం లేకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఎన్నికల్లో 30 స్థానాలకు గాను 21 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయఢంకం మోగించి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ,వైస్ చైర్మన్ గా గంధం నరేందర్ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ మున్సిపాలిటిటీ కార్యాలయంలో హట్టహాసంగా పదవిబాధ్యులు చేపట్టారు.ముందుగా నూతన బాధ్యతలు చేపట్టేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ తో పాటు కౌన్సిలర్లకు కమిషనర్ కాటా భాస్కర్ సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్ లు పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి బోకెలతో సత్కరించారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.వార్డుల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు,అధికారుల సహకారంతో పార్టీలకతీతంగా పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేరుస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ గంధం నరేందర్ మాట్లాడుతూ తన వార్డుతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తునని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బత్తిని రాజేందర్,మాదాసి రవి,
వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,
పున్నం నరసింహారెడ్డి బీరం భరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి…

మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా వేతనాలు చెల్లించాలి

మున్సిపాలిటీ కమిషనర్ కు వినతి పత్రం

10 వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్.

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులుగా గుర్తించి, మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలతో పాటు చెల్లించాలని 10 వార్డ్ కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ అన్నారు.విలీన గ్రామాల కార్మికులతో కలిసి మున్సిపల్ కమిషనర్ గురువారం వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 2025 ఫిబ్రవరి 6 తేదీన 8 గ్రామ పంచాయతీలను విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం జరిగిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నాటి నుండి నర్సంపేట మున్సిపాలిటీ విలీనమైన 8 గ్రామల కార్మికులు 36 మంది గత సంవత్సర కాలంగా నర్సంపేట మున్సిపాలిటీలో పనిచేస్తున్నారు, విలీనం చేసిన 8 గ్రామల కార్మికులకు మున్సిపాలిటీ కార్మికులకు చెల్లిస్తున్న 16,600 వేతనాన్ని చెల్లించపోవడం దారుణమని అన్నారు.గత సంవత్సరకాలంగా చేస్తున్నది మున్సిపాలిటీ పని అయినప్పటికీ మున్సిపాలిటీ కార్మికులగా గుర్తించకుండా పంచాయతీ కార్మికులకు చెల్లిస్తున్న వేతనాలు చెల్లించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ సమస్యను పరిష్కరించాలని 36 మంది కార్మికులు అనేకసార్లు మున్సిపల్ కమిషనర్ కు విన్నవించిన పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వివరించడం సరికాదన్నారు.కొంతమంది మున్సిపాలిటీ అధికారులు మీకు జీతాలు పెంచే ప్రయత్నం చేస్తానని కార్మికుల దగ్గర నుండి డబ్బులు వసూలు చేసి అవినీతికి పాల్పడడం సిగ్గుమాలిన చర్యఅని ఎద్దేవా చేశారు.ఇప్పటికైనా విలీన గ్రామాల కార్మికులను మున్సిపాలిటీ కార్మికులతో సమానంగా పనిచేస్తున్నటువంటి కార్మికులకు 16600 జీతాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీ కార్మికుల సౌకర్యాలు అమలు చేయకపోతే ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కార్మికులు ఎండీ యాకుబ్, నర్రా కృష్ణ,కొర్ర వీరన్న,నల్ల మహేందర్, ముత్తినేని రమేష్,పోలబోయిన శ్రీను,బొల్ల పరాశరములు,కల్వచర్ల రమణాచారి, జెట్టబోయిన మల్లయ్య కుమ్మరి రాజు తదితరులు పాల్గొన్నారు.

నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్…

నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్ పర్సన్ గా పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

వైస్ చైర్మన్ గా గంధం నరేందర్

అట్టహాసంగా ప్రమాణస్వీకార మహోత్సవం

మోడల్ నర్సంపేటగా అభివృద్ధి చేస్తా..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

అందరి సహకారంతో అభివృద్ధి చేస్తా..

ఛైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట మున్సిపాలిటీ ఛైర్పర్సన్ గా 25 వ వార్డు కౌన్సిలర్ పెండెం శ్రీలక్ష్మి, వైస్ చైర్మన్ గా 7 వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ లు ప్రమాణ స్వీకారం చేశారు. ఛైర్ పర్సన్ వైస్ చైర్మెన్ లను కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవంగా
ఎన్నుకున్నట్లుగా రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికల ఆథరైజ్డ్ అధికారి, నర్సంపేట ఆర్డీవో పోలం ఉమారాణి ధ్రువీకరించారు. నూతనంగా ఎన్నికైన ఛైర్పర్సన్, వైస్ చైర్మన్, పాలకవర్గానికి నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపాలిటీ 30 స్థానాల్లో 21 సీట్లు గెలుచుకొని అధికార కాంగ్రెస్ పార్టీ పూర్తి సంఖ్య బలంతో ఛైర్ పర్సన్, వైస్ చైర్మన్ పదవులు దక్కించుకుంది. అంతకు ముందు పాలకవర్గ సభ్యులచే నర్సంపేట రెవెన్యూ డివిజనల్ అధికారి ఉమారాణి, మున్సిపల్ కమిషనర్ భాస్కర్ నూతన పాలక వర్గ సభ్యులచేత ప్రమాణ స్వీకారం చేయించారు.అనంతరం శాలువాలు పూల బొకేతో ఘనంగా సన్మానించారు.

 

మున్సిపల్ శాఖ అధికారులు,వివిధ శాఖల అధికారులు, పోలీసులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు నాయకులు, పట్టణ ప్రజల ఆనందాలతో నర్సంపేట మున్సిపాలిటీ కోలాహలంగా మారింది. ఈ నేపథ్యంలో మున్సిపాలిటీ చైర్ పర్సన్, వైస్ చైర్మన్ వార్డు కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం అట్టహాసంగా సాగింది. ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నర్సంపేట పట్టణాన్ని మౌలిక వసతులతో పాటు అభివృద్ధి పథకాలతో మోడల్ పట్టణంగా అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పట్ల సంక్షేమ పథకాల అభివృద్ధిపై విశ్వాసంతో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న నమ్మకంతో పట్టణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వారి విశ్వాసాన్ని వమ్ము చేయకుండా ఎలాంటి పక్షపాత వైఖరి లేకుండా పార్టీలకతీతంగా నర్సంపేట పట్టణాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే మాధవరెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఏర్పడ్డాక మూడు పర్యాయాలు ఎన్నికలు జరిగిన నేపథ్యంలో రెండు సార్లు కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రజలు పట్టంకట్టారని పేర్కొన్నారు. పట్టణ ప్రజలకు మౌలిక వసతులతో పాటు సంక్షేమ అభివృద్ధిని విశ్వాసంతో పూర్తిస్థాయిలో చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.
మున్సిపల్ చైర్ పర్సన్ అభ్యర్థిగా 25 వ వార్డు కౌన్సి లర్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ నామినేషన్ వేయగా 30 వార్డు కౌన్సిలర్ మాదాసి రవి ప్రతిపాదించగా నాలుగవ వార్డు కౌన్సిలర్ బీరం భరత్ రెడ్డి బలపరిచారు. వైస్ చైర్మన్ గా 7 వ వార్డు కౌన్సిలర్ గంధం నరేందర్ నామినేషన్ దాఖలు చేయగా 24వ వార్డు కౌన్సిలర్ బత్తిని రాజేందర్ ప్రతిపాదించగా 6 వ వార్డు పొన్నం నరసింహారెడ్డి బలపరిచారు. చైర్మన్ వైస్ చైర్మన్ ల పోటీకి ఎవరు లేకపోవడంతో వారి ఎన్నికైనట్లు ఎన్నికల అధికారిని ఆర్డిఓ ఉమారాణి ప్రకటన చేశారు.

*మోడల్ నర్సంపేటగా తీర్చిదిద్దుతాం..

నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మోడల్ నర్సంపేట గా తీర్చిదిద్దుతానని ఛైర్ పర్సన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ పట్టణ ప్రజలకు హామీ ఇచ్చారు. పట్టణంలోని అన్ని వార్డులలో గెలుపొందిన ప్రజా ప్రతినిధులతో సమన్వయంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తామన్నారు. ఇటీవల విలీనమైన గ్రామపంచాయతీలను పట్టణ స్థాయిలోనే అభివృద్ధి చేయడమే ఎమ్మెల్యే మాధవరెడ్డి లక్ష్యం అని చెప్పారు. గతంలో కంటే ఇప్పుడు పట్టణ ప్రజల అభివృద్ధికి భారం పెరిగిందని ప్రజా ప్రతినిధులు అధికారులు ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.

 

తన చైర్మన్ పదవికి పూర్తిస్థాయిలో సహకరించిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డికి, వార్డు కౌన్సిలర్లకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,రాయిడి కీర్తి దుష్యంత్ రెడ్డి,బానోతు నవీన్ నాయక్,బూస శిరీష,దొమ్మాటి రమ్య సంతోష్ గౌడ్,శివరాత్రి స్వామి,మండల శ్రీదేవి,

హనుమకొండ శ్రీధర్,జూలూరి రోజా రాణి గౌడ్,దొంగల రజిత తో పాటు నర్సంపేట ఎమ్మార్వో రవిచంద్ర రెడ్డి పలువురు అధికారులు పాల్గొన్నారు.అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నర్సంపేట పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, నాయకులు,ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు…

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ 85.21 శాతం

వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు

వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.

గెలుపు బాటలో స్వతంత్ర అభ్యర్థి గంప లిఖిత…

గెలుపు బాటలో స్వతంత్ర అభ్యర్థి గంప లిఖిత

ప్రజాసేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో..

మామ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో 26 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లిఖిత రామకృష్ణ గౌడ్

నర్సంపేట,నేటిధాత్రి:*

నర్సంపేట మున్సిపాలిటీలో జరుగుతున్న ఎన్నికలలో 26 వ వార్డు స్వతంత్ర అభ్యర్థి లిఖిత రామకృష్ణ గౌడ్ గెలుపు బాటలో ముందున్నారు. నర్సంపేట పట్టణ లిక్కర్ వ్యాపారవేత్త, వరంగల్ జిల్లా గ్రంధాల సంస్థ మాజీ డైరెక్టర్, గంప రాజేశ్వర్ గౌడ్ చిన్న కోడలు గత వారం రోజులుగా సాగుతున్న స్వతంత్ర అభ్యర్థి విద్యావంతురాలు లిఖిత ఎన్నికల ప్రచారం అవార్డులో ప్రజలకు, యువతకు ఎంతో ఫూర్తిదాయకం కానున్నది. తన మామ రాజేశ్వర్ గౌడ్ సహకారంతో ప్రజా సేవే లక్ష్యంగా ఎన్నికల బరిలో దిగిన గంప లిఖిత ప్రచారంలో దూసుకుపోయారు. వార్డు ప్రజలతో మమేకమై ఆప్యాయంగా పలకరిస్తూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన తన ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. స్థానిక వార్డు యువత,ప్రజలతో కలిసి, గడప గడప ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా స్వతంత్ర అభ్యర్థి గంప లిఖిత రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ 26వ వార్డు ప్రజల సహకారంతో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల బరిలోకి దిగానని తెలిపారు. గతంలో మా కుటుంబం నుండి నా తోటికోడలు గంప సునీత స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొంది.. వార్డు అభివృద్ధికి పూజిస్తాయిలో పనిచేశామని అన్నారు. అదే స్ఫూర్తితో నర్సంపేట పట్టణంలో ఉన్న అన్ని వార్డులలో 26వ వార్డును ఉత్తమ వార్డుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం నుండి వస్తున్న మున్సిపాలిటీ నిదుల నుండి సంక్షేమ ఫలాలు తెచ్చి పేద ప్రజల అభివృద్ధి లక్ష్యంగా కృషి చేస్తానని లిఖిత రామకృష్ణ గౌడ్ పేర్కొన్నారు. వరంగల్ జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ డైరెక్టర్ కంప రాజేశ్వర్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని సంక్షేమ పథకాలను వార్డు ప్రజలకు అందిస్తామని తెలిపారు. సేవా భావంతో ఉన్న తన కుటుంబం స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయగా కౌన్సిలర్ ఆకాశమిచ్చారని అదే స్ఫూర్తితో మా చిన్న కోడలు లిఖిత రామకృష్ణ గౌడ్ ఉంగరం గుర్తుకు ఓటు వేసి ప్రజలు ఆశీర్వదించాలని ఈ సందర్భంగా గంప రాజేశ్వర్ గౌడ్ కోరారు. ఎన్నికల ప్రచారంలో తాజా మాజీ కౌన్సిలర్ కంప సునీత, వార్డు ఎన్నికల ఇన్చార్జి యువకులు, మహిళా యూత్ నాయకులు మహిళలు పాల్గొన్నారు

మహేశ్వరం రూపురేఖలు మార్పిస్తా…

మహేశ్వరం రూపురేఖలు మార్పిస్తా..

14 వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి

జోరుగా ఇంటింట ప్రచారం..విద్యావంతురాలకు స్వాగతం పలికిన ప్రజలు

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట రూరల్ మండలం నుండి మహేశ్వరం గ్రామాన్ని నర్సంపేట మున్సిపల్ పరిధిలో ఇటీవల విలీనమైంది. ఈ నేపథ్యంలో గ్రామీణ ప్రాంతంగా ఉన్న మహేశ్వరం రూపురేఖలకు మార్చి మోడల్ మహేశ్వరంగా అభివృద్ధి చేయిస్తానని 14 వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విద్యావంతురాలు
గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ ఎన్నికలలో భాగంగా 14వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి గుజ్జుల భవాని భాస్కర్ రెడ్డి ఇంటింట ప్రచారం చేపట్టగా అవార్డు ప్రజలు స్వాగతాలు పలికారు. ఈ నేపథ్యంలో వార్డు ప్రజలు ఆమెకు మద్దతు పలుకుతూ ప్రచారంలో పాల్గొన్నారు. సందర్భంగా భవాని మాట్లాడుతూ తమ కుటుంబం రాజకీయ కుటుంబ నేపథ్యంలో వారి సూచనలతో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో మహేశ్వరం గ్రామంలోని ప్రధాన రహదారులు అంతర్గత రోడ్లను, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణాలు చేపట్టి గ్రామంలో ఎలాంటి సమస్యలు లేకుండా పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.కాంగ్రెస్ పార్టీ నాయకులు,మాజీ ప్రజా ప్రతినిధి గుజ్జుల మాధవరెడ్డి పద్మ,మధు,మాధవరెడ్డి,
కాంగ్రెస్ పార్టీ నాయకులు ,కార్యకర్తలు,మహిళలు,వార్డు వాసులు పాల్గొన్నారు.

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

మహేశ్వరంలో వాహనాల తనిఖీలు..

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో జరుగనున్న ఎన్నికల దృశ్య మున్సిపాలిటీ పరిధిలోని నర్సంపేట వరంగల్ ప్రధాన రహదారి మహేశ్వరం వద్ద సంబంధిత ఎన్నికల అధికారి, నెక్కొండ పిఆర్ ఏఈ రాజ్ కుమార్ స్థానిక హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ కాజం అలీ తో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకుగాను వస్తువులు,డబ్బు,మద్యం లాంటివి ఏమైనా సరఫరా చేస్తున్నారా అని వాహనాలల్లో క్షుణ్ణంగా పరిశీలించారు.

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ..

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ

60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో వెడెల్పు పనులు ప్రారంభం

రోడ్డు వెడల్పులో పాల్గొన్న టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి అధికారులు

రోడ్డు వెడల్పు నిర్మాణం పనులు ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్న దుకాణాల యజమాన్యం?

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..ప్రజల డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో
ఏండ్ల తరబడి సమస్యల వలయంలో ఉన్న మాదన్నపేట రోడ్డు వెడల్పుకు మహార్దశ వచ్చింది.రోడ్డు వెడల్పు కోసం సంబంధిత మున్సిపల్, రోడ్ల భవనాల శాఖ అధికారులు మార్కింగ్ వేసిన రోజే… ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కొందరు వ్యాపారులు కోర్టుమెట్లు ఎక్కడ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం?.
వరంగల్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మున్సిపాలిటీ నర్సంపేట కావడం ఇక్కడ అన్ని విధాల వ్యాపారాలు

జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల నర్సంపేట చుట్టూ రూరల్ 8 గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేట పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేట రోడ్డు గతంలో పాత బస్టాండ్ గా
పిలువబడుతున్నది.

ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడం ఇరుకుగా ఉండడంతో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులతో సమీక్ష చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కానీ కొన్ని అనివార్య కారణాల వలన అయితే ఇటీవల

నాగూర్లపల్లె,మాదన్నపేట గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో కలవడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు.అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుండి మాదన్నపేట మీదుగా నల్లబెల్లి మండలం వరకు 10 మీటర్ల తారు రోడ్లు వేసేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.

ఐతే రోడ్డు వెడల్పు లేక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.ఈ రోడ్డు వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండడం మూలంగా బారీ వాహనాలు,ఇతర వాహనాలు నిలవడం వలన అంతరాయం వాటిల్లేది.అలాగే చిన్నపాటి వర్షం పడ్డ ఆ రోడ్డు మొత్తం జలమయం,బురదమయం ఐతుండేది.ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు

చేసేందుకు గాను సోమవారం మున్సిపల్ శాఖ,రోడ్ల భవనాల శాఖ అధికారులు మొత్తం 60 ఫీట్లకు మార్కింగ్ చేశారు.గతంలో రోడ్డుకు మిడిల్ పాయింట్ గా రెండు వైపుల 30 రోడ్డును సరిచేస్తూ బౌండరీలకు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో బ్రాహ్మకుమారి ఆశ్రమం సమీపం నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు కొన్ని వ్యాపార సముదాలను
తొలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.అదే రోడ్డు వాటర్ ప్లాంటు నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల నుండి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే తేలుతుండడంతో ఆ ప్రాంత వ్యాపారస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. 60 ఫీట్ల కుదిరించేందుకుగాను కొందరు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లగా ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారీ కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం.వ్యాపారుల ఎత్తుగడలను తలొగ్గిన అధికారులు వాటర్ ప్లాంట్ నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.కాగా రోడ్డు వెడల్పు కోసం పెద్ద చిన్న అని తేడా లేకుండా పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల రోడ్డు నిర్మాణం చేయాలనిస్తున్నారు.ఈ నేపథ్యంలో ఎలాగైనా రోడ్డు వెడల్పును ఆపేందుకు కొందరు వ్యాపారులు కోర్టు నుండి స్టే తెచ్చుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కేందుకు సమావేశమైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రోడ్డుకు మార్కింగ్ చేసే సమయంలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్న ఒక భవనం నిర్మాణం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్నట్టు గుర్తించడంతో యజమాని మున్సిపాలిటీ అధికారులతో ప్రయత్నం చేయగా ఇండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కమిషనర్ ను సంప్రదిస్తే ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంటు ప్రకారంగా రోడ్డు బౌండరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేస్తున్న రోడ్డు వివిధ రకాల పలుకుబడులతో రోడ్డును కుదించే ప్రయత్నాలు చేయకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాదన్నపేట రోడ్డు పరిధిలోగల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

ప్రారంభమైన రోడ్డు వెడల్పు పనులు..

పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులు బుధవారం ప్రారంభం చేశారు. అయితే రోడ్డు వెడల్పు పనులను ప్రారంభ పనుల నుండి కాకుండా స్మశాన వాటిక సమీప నుండి పనులను ప్రారంభించడంపై అధికారులపై ప్రజలు తీవ్ర నిరాశ ఎదురైతున్నది. ఇప్పటికైనా అందరికీ సమాన న్యాయం జరగాలంటే పూర్తిస్థాయిలో 60 ఫీట్ల వెడల్పు రోడ్డును నిర్మాణం చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ..

మాదన్నపేట రోడ్డుకు మహార్దశ

60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో రోడ్డు వెడెల్పు మార్కింగ్.

రోడ్డు మార్కింగ్ లో పాల్గొన్న టౌన్ ప్లానింగ్, ఆర్ అండ్ బి అధికారులు

రోడ్డు వెడల్పు ఆపేందుకు కోర్టు మెట్లు ఎక్కనున్న దుకాణాల యజమాన్యం?

రోడ్డు వెడల్పు అనేది ప్రశ్నార్థకరమేనా?..

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..ప్రజల డిమాండ్..

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో
ఏండ్ల తరబడి సమస్యల వలయంలో ఉన్న మాదన్నపేట రోడ్డు వెడల్పుకు మహార్దశ వచ్చింది.రోడ్డు వెడల్పు కోసం సంబంధిత మున్సిపల్, రోడ్ల భవనాల శాఖ అధికారులు మార్కింగ్ వేసిన రోజే… ఆ రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని నిలుపుదల చేసేందుకు కొందరు వ్యాపారులు కోర్టుమెట్లు ఎక్కడ ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం?.
వరంగల్ జిల్లాలో అత్యంత ముఖ్యమైన మున్సిపాలిటీ నర్సంపేట కావడం ఇక్కడ అన్ని విధాల వ్యాపారాలు

జోరుగా సాగుతున్నాయి.ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ అప్ గ్రేడ్ చేస్తూ ఇటీవల నర్సంపేట చుట్టూ రూరల్ గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేసి జిల్లాలోని అతిపెద్ద మున్సిపాలిటీగా అవతరించింది. నర్సంపేట పట్టణంలోనీ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మాదన్నపేట రోడ్డు గతంలో పాత బస్టాండ్ గా
పిలువబడుతున్నది. ఈ రోడ్డు ప్రధాన రహదారి కావడం ఇరుకుగా ఉండడంతో గత కెసిఆర్ ప్రభుత్వ హాయంలో ఆనాటి ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆ రోడ్డుకు ఇరువైపులో ఉన్న వ్యాపారస్తులతో సమీక్ష చేసి రోడ్డు వెడల్పు కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.కానీ కొన్ని అనివార్య కారణాల వలన అయితే ఇటీవల నాగూర్లపల్లె,మాదన్నపేట గ్రామాలు నర్సంపేట మున్సిపాలిటీలో కలవడంతో రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు పోలీస్ స్టేషన్ ఎదురుగా నుండి మాదన్నపేట వరకు 60 ఫీట్ల రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేసేందుకు సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పూర్తి చేశారు.

అలాగే ఇటీవల స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట నుండి మాదన్నపేట మీదుగా నల్లబెల్లి మండలం వరకు 10 మీటర్ల తారు రోడ్లు వేసేందుకు గాను ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ఐతే రోడ్డు వెడల్పు లేక పోవడంతో నిత్యం ప్రమాదాలు జరుగుతుండేవి.ఈ రోడ్డు వ్యాపార దుకాణాలు ఎక్కువగా ఉండడం మూలంగా బారీ వాహనాలు,ఇతర వాహనాలు నిలవడం వలన అంతరాయం వాటిల్లేది.అలాగే చిన్నపాటి వర్షం పడ్డ ఆ రోడ్డు మొత్తం జలమయం,బురదమయం ఐతుండేది.ఈ నేపథ్యంలో రోడ్డు వెడల్పు
చేసేందుకు గాను సోమవారం మున్సిపల్ శాఖ,రోడ్ల భవనాల శాఖ అధికారులు మొత్తం 60 ఫీట్లకు మార్కింగ్ చేశారు.గతంలో రోడ్డుకుq మిడిల్ పాయింట్ గా రెండు వైపుల 30 రోడ్డును సరిచేస్తూ బౌండరీలకు మార్కింగ్ చేశారు.ఈ క్రమంలో బ్రాహ్మకుమారి ఆశ్రమం సమీపం నుండి పోలీస్ స్టేషన్ వరకు రోడ్డు కొన్ని వ్యాపార సముదాలను
తొలిగించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

అదే రోడ్డు వాటర్ ప్లాంటు నుండి పోలీస్ స్టేషన్ వరకు 50 ఫీట్ల నుండి 40 ఫీట్ల రోడ్డు మాత్రమే తేలుతుండడంతో ఆ ప్రాంత వ్యాపారస్తుల గుండెల్లో గుబులు రేపుతోంది. 60 ఫీట్ల కుదిరించేందుకుగాను కొందరు వ్యాపారస్తులు స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వద్దకు వెళ్లగా ప్రజా ప్రజా ప్రయోజనాల కోసం నిర్మించే రహదారీ కుదించే ప్రసక్తే లేదని తేల్చి చెప్పినట్టు విశ్వసనీయ సమాచారం. ఈ నేపథ్యంలో ఎలాగైనా రోడ్డు వెడల్పును ఆపేందుకు కొందరు వ్యాపారులు కోర్టు నుండి స్టే తెచ్చుకునేందుకు కోర్టు మెట్లు ఎక్కేందుకు సమావేశమైనట్లు అత్యంత విశ్వసనీయ సమాచారం. రోడ్డుకు మార్కింగ్ చేసే సమయంలో ఇప్పుడే నిర్మాణంలో ఉన్న ఒక భవనం నిర్మాణం ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా చేపడుతున్నట్టు గుర్తించడంతో యజమాని మున్సిపాలిటీ అధికారులతో ప్రయత్నం చేయగా ఇండ్ల రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లతో కమిషనర్ ను సంప్రదిస్తే ఇండ్ల ల్యాండ్ డాక్యుమెంటు ప్రకారంగా రోడ్డు బౌండరీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

అందరికీ ఒకే విధమైన న్యాయం జరగాలి..

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని పోలీస్ స్టేషన్ నుండి నాగూర్లపల్లి వరకు 60 ఫీట్ల వెడల్పు రోడ్డు సింగిల్ డివైడర్ తో నిర్మాణం చేస్తున్న రోడ్డు వివిధ రకాల పలుకుబడులతో రోడ్డును కుదించే ప్రయత్నాలు చేయకుండా అందరికీ ఒకే విధమైన న్యాయం జరిగేలా రోడ్డు నిర్మాణం చేపట్టాలని మాదన్నపేట రోడ్డు పరిధిలోగల ప్రజలు ఆరోపిస్తున్నారు. మున్సిపాలిటీ అధికారులు ఎలాంటి ప్రలోభాలకు లోనవకుండా ప్రభుత్వ నిబంధనల మేరకు రోడ్డు నిర్మాణాన్ని చేపట్టాలని పట్టణ ప్రజల డిమాండ్ చేస్తున్నారు.

ముదిరాజ్ సహకార సంఘ భవనం ప్రారంభం

ముదిరాజ్ సహకార సంఘం భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో మాదన్నపేట ముదిరాజ్ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన భవనం రూ.10 లక్షల ప్రభుత్వ నిధులతో నిర్మించగా శుక్రవారం నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రారంభం చేశారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్, పిసిసి సభ్యులు పెండెం రామానంద్,పిఎస్ సిఎస్ చైర్మన్ బొబ్బల రమణారెడ్డి,పట్టణ అధ్యక్షుడు బత్తిని రాజేందర్, మున్సిపల్ ఫోర్ లీడర్ వేముల సాంబయ్య గౌడ్,ఓబీసీ జిల్లా అధ్యక్షులు ఓర్స్ తిరుపతి, నియోజకవర్గ నాయకులు ముదిరాజ్ కుల సంఘం కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version