మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు…

మున్సిపల్ ఎన్నికలు సక్సెస్: అధికారుల సంబరాలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గంలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా ముగిశాయి. ఈ విజయంతో మున్సిపల్ కమిషనర్ జైతురాం నాయక్, ఎమ్మార్వో దశరథ్ సిబ్బందితో కలిసి ఆనందోత్సాహాలతో ఫోటోలు దిగారు. విధులను సమర్థవంతంగా నిర్వహించిన సిబ్బందిని అధికారులు అభినందించారు. అందరి సమిష్టి కృషితోనే ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయని వారు పేర్కొన్నారు.ఈ ఎన్నికలు 2026 ఫిబ్రవరి 17న సాయంత్రం దాకా జరిగాయి.

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు…

ప్రశాంతంగా ముగిసిన మున్సిపల్ ఎన్నికలు

నర్సంపేట మున్సిపాలిటీలో పోలింగ్ 85.21 శాతం

వర్ధన్నపేట మున్సిపాలిటీలో పోలింగ్ 86.23 శాతంగా నమోదు

వరంగల్ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద

నర్సంపేట,నేటిధాత్రి:

 

వరంగల్ జిల్లాలోని నర్సంపేట, వర్ధన్నపేట మున్సిపాలిటీలలో బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ సత్య శారద తెలిపారు.నర్సంపేట మున్సిపాలిటీలోని 30 వార్డులకు సంబంధించిన 60 పోలింగ్ కేంద్రాలలో 85.21 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 40,968 మంది ఓటర్లలో 34,908 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.వర్ధన్నపేట మున్సిపాలిటీలోని 12 వార్డుల పరిధిలో ఉన్న 20 పోలింగ్ కేంద్రాలలో 86.23 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 10,526 మంది ఓటర్లలో 9,077 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారని వెల్లడించారు.
రెండు మున్సిపాలిటీలలోని మొత్తం 80 పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ నుండి వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించినట్లు తెలిపారు. గుర్తించిన ఆరు సమస్యాత్మక పోలింగ్ ప్రాంతాలలో ప్రశాంతంగా పోలింగ్ నిర్వహణకు 17 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించినట్లు చెప్పారు.పోలింగ్ ముగిసిన అనంతరం నర్సంపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రిని కట్టుదిట్టమైన పోలీసు భద్రత మధ్య నర్సంపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్‌కు తరలించారు. అదేవిధంగా వర్ధన్నపేట మున్సిపాలిటీకి చెందిన బ్యాలెట్ బాక్సులు మరియు పోలింగ్ సామగ్రిని సంబంధిత వర్ధన్నపేట మునిసిపల్ కార్యాలయంలోని స్ట్రాంగ్ రూమ్‌కు భద్రతా ఏర్పాట్ల నడుమ సురక్షితంగా చేర్చినట్లు తెలిపారు.ఎన్నికల నిర్వహణలో సహకరించిన ఎన్నికల సిబ్బంది, పోలీసు శాఖ, అధికారులు, ముఖ్యంగా ప్రజాస్వామ్య పండుగలో భాగస్వాములైన ఓటర్లకు జిల్లా ఎన్నికల అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేసేలా అధిక శాతం పోలింగ్ నమోదు కావడం సంతోషకరమని కలెక్టర్ పేర్కొన్నారు.

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే…

మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా ఈనెల 11న పబ్లిక్ హాలిడే

◆-::జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

సంగారెడ్డి జిల్లా: రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు 2026 సందర్భంగా ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్చగా వినియోగించుకునేందుకు జిల్లాలో ఎన్నికలు నిర్వహించనున్న మున్సిపాలిటీల పరిధిలో ఫిబ్రవరి 11న పబ్లిక్ హాలిడే ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11న ఎన్నికలు జరగనున్న సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, ఆందోల్–జోగిపేట, ఇస్నాపూర్, ఇంద్రేశం, గడ్డపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీల పరిధిలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థలు, ప్రభుత్వ–ప్రైవేటు సంస్థలు, వ్యాపార సంస్థలకు ఈ పబ్లిక్ హాలిడే వర్తిస్తుందని కలెక్టర్ స్పష్టం చేశారు. అదేవిధంగా, సంబంధిత మున్సిపాలిటీల పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలు మరియు వ్యాపార సంస్థల్లో (ఫర్ములు) పనిచేస్తున్న ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్, 1881 ప్రకారం వేతనంతో కూడిన సెలవు మంజూరు చేయాలని యాజమాన్యాలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. ఎన్నికల పోలింగ్ నిర్వహణకు వినియోగించే అన్ని ప్రభుత్వ భవనాలు, విద్యా సంస్థలకు ఫిబ్రవరి 10 (మంగళవారం) నాడు కూడా సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. అలాగే, ఓట్ల లెక్కింపు కోసం వినియోగించే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థల భవనాలకు లెక్కింపుకు ముందు రోజు ఫిబ్రవరి 12 (గురువారం) మరియు లెక్కింపు రోజు ఫిబ్రవరి 13 (శుక్రవారం) రెండు రోజుల పాటు లోకల్ హాలిడే వర్తిస్తుందని తెలిపారు. ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ప్రావీణ్య కోరారు.

ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

ప్రజాసేవ చేసేందుకు అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తా…

11వ వార్డ్ బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్

రామకృష్ణాపూర్,నేటిధాత్రి:

 

ప్రజా సేవ చేస్తూ, 11వ వార్డ్ అభివృద్ధికి కృషి చేస్తూ నిత్యం ప్రజల్లో ఉంటానని బీజేపీ పార్టీ బలపరిచిన కౌన్సిలర్ అభ్యర్థి గడ్డం సంపత్ గౌడ్ మున్సిపాలిటీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శివాజీ నగర్ ఏరియాలో ప్రచారం నిర్వహిస్తూ ఓటర్లకు తెలియజేస్తున్నారు. ఒక్క అవకాశం ఇచ్చి కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు లోని సమస్యలను పరిష్కరిస్తానని గడపగడపకు తిరుగుతూ ఓటర్లను ఓటు అభ్యర్థిస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈనెల 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికలలో కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని 11వ వార్డు ప్రజలను, ఓటర్లను కోరుతున్నారు.

రోడ్లు, డ్రైనేజీలు, మౌలిక వసతులు కల్పిస్తానని హామీ ఇస్తూ, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ, ప్రజలకు ఏ ఆపద వచ్చినా నిత్యం అందుబాటులో ఉంటానని ప్రచారం చేస్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు

జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లాలో రెండవ సాధారణ మున్సిపల్ ఎన్నికలు – 2026 నిర్వహణ నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్‌లో 24×7 హెల్ప్‌డెస్క్ ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఈ హెల్ప్‌డెస్క్ ద్వారా ఎన్నికలకు సంబంధించిన ఫిర్యాదులు, సందేహాలు, సూచనలు స్వీకరించబడతాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి జిల్లా యంత్రాంగానికి వచ్చే ఫిర్యాదులను మూడు రోజులలోపు పరిష్కరించి, వాటి నివేదికలను ఎన్నికల సంఘానికి పంపనున్నట్లు తెలిపారు.
ఈ హెల్ప్‌డెస్క్‌కు సంబంధించిన సెల్ నంబర్: 9030632608 కాగా, ఇది 24 గంటల పాటు ప్రజలకు అందుబాటులో ఉంటుందని తెలిపారు.
హెల్ప్‌డెస్క్ నిర్వహణకు కింది సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.
ఎస్.కే. అమ్జద్ అహ్మద్ అబ్బాస్, నాయబ్ తహసీల్దార్ (ఎన్నికలు) & హెచ్ సూపరింటెండెంట్
ఎస్. సువర్ణ – ఐటీ సెల్ (ఎన్నికలు)
పి. నవీన్ – సీనియర్ అసిస్టెంట్,
ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినట్లయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version