ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం…

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు తహసిల్దార్ కి వినతి పత్రం

పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్

జైపూర్,నేటి ధాత్రి:

 

 

ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు ప్రభుత్వ స్థలం కేటాయించాలని పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు సికిందర్ సోమవారం జైపూర్ తహసిల్దార్ వనజా రెడ్డికి వినతిపత్రం అందించారు.పౌనూర్ గ్రామంలో 500 పైగా ఎస్సి కమ్యూనిటీకి చెందిన వాళ్లు నివసిస్తున్నారు వారికి కమ్యూనిటీ హాల్ లేక అనేక ఇబ్బందికు గురవుతున్నట్టు పేర్కొన్నారు.ఎస్సీ కమిటీ హాల్ నిర్మాణం చేపట్టడం వల్ల దళిత వర్గాల యువత,మహిళలు,సామాజిక కార్యక్రమాలు నిర్వహించినందుకు తగిన సదుపాయాలు లభిస్తాయని ఇలాంటి కమిటీ హాల్ దళితుల అభివృద్ధికి సామాజికంగా ముందుకు వెళ్లడానికి సహాయపడతాయని అన్నారు.తహసిల్దార్ వనజా రెడ్డి వెంటనే స్పందించి స్థలం కేటాయించే విధంగా కృషి చేయాలని కోరారు.

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే.!

ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్పందించాలి.

ఎమ్మార్పీఎస్ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు నేరెళ్ల ఓదెలు మాదిగ.

చిట్యాల, నేటిధాత్రి :

జయశంకర్ జిల్లా చిట్యాల మండలం నవాబుపేట గ్రామంలో పది సంవత్సరాల క్రితం మాజీ సర్పంచ్ దొంతుల చందర్ హయాములో ఎస్సీ కమ్యూనిటీ హాలు బేస్ మెంట్ లెవల్ పిల్లర్లు పోసి వదిలిపెట్టారు
మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణ రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ హాల్ కోసం శిలాఫలకం 5.10.20.23
తారీకు నాడు వేసినారు సి డి ఎఫ్ నిధులు నుండి పది లక్షల రూపాయలు మంజూరు చేసినారు మరి ఆ రోజు నుండి ఇప్పటివరకు లోపం ఎవరిది అనే విషయాన్ని మీ దృష్టికి తీసుకు వస్తున్నాను అని నేరెళ్ల ఓదెలు మాదిగ అన్నారు ఇప్పటికైనా నవాపేట దళితుల పైన గండ్ర సత్యనారాయణ రావు ఎమ్మెల్యే స్పందించి ఎస్సీ కమ్యూనిటీ హాలు కోసం అధికారులనుపిలిపించుకొని రిఎస్ట్మెంట్ వేసి 20 లక్షల రూపాయల మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే సిసి రోడ్డు నిర్మాణం కూడా కాంటాక్ట్ ను పిలిపించి సిసి రోడ్డు పనులు జరిగే విధంగా చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల సీనియర్ నాయకులు రాజ పోశయ్య. రాజయ్య సురేష్ రాజు రవి రాములు భద్రయ్య రాము దుర్గయ్య లక్ష్మయ్య పోశయ్య కుమారు చేరాలు సూర్యకిరణ్ సాంబయ్య సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version