కుట్రలతో సేవా కార్యక్రమాలను ఆపలేరు: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్…

కుట్రలతో సేవా కార్యక్రమాలను ఆపలేరు: హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్
​నల్లగండ్ల చౌరస్తాలో చలివేంద్రం ప్రారంభం
​బాటసారులకు మజ్జిగ పంపిణీ చేసిన హోప్ సభ్యులు

శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-

తనపై ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజా సేవా కార్యక్రమాలను ఆపే ప్రసక్తే లేదని హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల చౌరస్తాలో హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వాహనదారులకు, బాటసారులకు స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు.అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వేసవిలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల దృష్ట్యా ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్రజల్లో తనకు పెరుగుతున్న ఆదరణను చూసి సహించలేక కొందరు పనిగట్టుకుని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి కుట్రల వల్ల తన సేవా సంకల్పం మరింత బలపడుతుందే తప్ప వెనకడుగు వేసేది లేదని తేల్చి చెప్పారు. రానున్న రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలు విస్తృతంగా చేపడతామని ఆయన ప్రకటించారు. ప్రతి ఒక్కరూ ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, అధికంగా మంచి నీళ్లు తాగాలని కోరారు.​ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు శేఖర్, మల్లేష్, మారం ప్రసాద్, షర్ఫుద్దీన్ మరియు స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

బాలవికాస్ ఆధ్వర్యంలో 90 రోజులు జలదానం అంబలి కార్యక్రమం…

బాలవికాస్ ఆధ్వర్యంలో 90 రోజులు జలదానం అంబలి కార్యక్రమం

నేటి దాత్రి నాగర్ కర్నూల్ జిల్లా

నాగర్ కర్నూల్ జిల్లా రాంనగర్ కాలనీలో బాలవికాస్ ఆధ్వర్యంలో ఎండాకాలం 90 రోజులు మంచినీరు అంబలి ప్రజలకుఅందిస్తామని బాలవికాస్ గ్రూప్ సభ్యులు తెలియజేశారు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ పదో వార్డు మాజీ కౌన్సిలర్ బాదం సునీత నరేందర్ విచ్చేసి ఓపెనింగ్ చేశారు ఈ సందర్భంగా బాదం సునీత మాట్లాడుతూ నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రం కాబట్టి చుట్టుపక్క గ్రామ ప్రజలు ఏదో ఒక పని ప్రతిరోజు జిల్లాకు వస్తుంటారు వారికి ఎండాకాలం దృశ్య మంచినీరు అంబలి స్వచ్ఛందంగా అందిస్తున్నందుకు బాలవికాస్ గ్రూప్ సభ్యులకు అభినందనలు తెలియజేశారు వారికి తన వంతు సహాయంగా ఈ అవసరం ఉన్న చేస్తానని బాలవికాస్ సభ్యులకు హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమానికి బాలవికాస్ కళ్యాణి గ్రూప్ సభ్యులు పదో వార్డు ప్రజలు పాల్గొన్నారు

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు…

డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు

చెన్నూరు సిఐ బన్సీలాల్

మంచిర్యాల,నేటి ధాత్రి:

రామగుండం పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు రోడ్డు భద్రతపై డ్రైవర్లకు అరైవ్ అలైవ్ అవగాహన కార్యక్రమం చెన్నూరు సిఐ బన్సిలాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్,జైపూర్ ఏసీపీ వెంకటేశ్వరులు సందర్శించి డ్రైవర్లను ఉద్దేశించి మాట్లాడారు. రోడ్డు ప్రమాదాలను నివారించడంలో స్పష్టమైన చూపు అత్యంత ముఖ్యమని,ప్రతి డ్రైవర్ సమయానుకూలంగా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.అదేవిదంగా ప్రతి ఒక్కరు ట్రాఫిక్ రూల్స్ పాటించవలసిన నిబంధనలను వారికి వివరించారు.ఈ శిబిరంలో సుమారు 150 మంది ఆటో,టాక్సీ డ్రైవర్లు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు.వీరిలో 24 మందికి ఉచితంగా కళ్లద్దాలు అందించగా,5 మందిని కంటి శస్త్రచికిత్స కోసం ఎంపిక చేసి పంపించారు.

గాంధీ చౌక్‌లో “చలి వేంద్రం” ప్రారంభం

వేసవిలో ప్రజలకు చల్లని తాగునీటి సదుపాయం.గాంధీ చౌక్ వద్ద డీసీపీ భాస్కర్,ఏసీపీ వెంకటేశ్వరులు సమక్షంలో చెన్నూర్ పట్టణ పోలీసులు చలి వేంద్రం ను ప్రారంభించారు.వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని చుట్టు ప్రజలకు తాగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ప్రజలు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.ఈ కార్యక్రమంలో చెన్నూర్ పట్టణ ఎస్సై లు శ్యాంపటేల్, సుబ్బారావు,పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version