మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు…

మహిళల ఆత్మగౌరవానికి ఇందిరమ్మ చీరలు

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్

1వ వార్డు మాదన్నపేట,16 వ వార్డు పర్శనాయక్ తండాలో ఇందిరమ్మ చీరలు పంపిణీ

నర్సంపేట, నేటిధాత్రి:

 

మహిళల ఆత్మగౌరవాన్ని పెంపొందించే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టిందని
మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ అన్నారు.నర్సంపేట పట్టణంలో ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నేటికీ కొనసాగుతోంది. ఈ క్రమంలో నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు మాదన్నపేటలో,16 వ వార్డు పర్శనాయక్ తండాలో మహిళలకు ఇందిరమ్మ చీరలను మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ శుక్రవారం పంపిణీ చేశారు. స్థానిక వార్డు కౌన్సిలర్లు కొత్తకొండ మేఘన శ్యామ్ రాజ్,బానోతు నవీన్ నాయక్ అధ్యక్షతన కార్యక్రమాలు నిర్వహించారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమం, సాధికారతకు పెద్దపీట వేస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు. ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత బస్సు సౌకర్యం, వడ్డీ లేని రుణాలు వంటి పథకాలతో పాటు ఇందిరమ్మ చీరల పంపిణీ ద్వారా మహిళలకు భరోసా కల్పిస్తోందని తెలిపారు.అలాగే ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో అవసరం ఉన్న ప్రాంతాల్లో మహిళా సమాఖ్య భవనాల నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

నర్సంపేట పట్టణంలోని ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరను అందజేసే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.అనంతరం మున్సిపల్ చైర్‌పర్సన్‌ను స్వయం సహాయక సంఘ సభ్యులు, 1వ వార్డు మహిళలు ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు బాణాల ప్రసన్న శ్రీనివాస్, పొన్నాల మనీషా ప్రకాష్, వేల్పుల శ్రీలత, సీఏ దుడేల శ్రీను, బండి స్వరూప, వీవో అధ్యక్షురాలు అలం అరుణ, ములుగూరి మమతా, మున్సిపల్ అధికారులు, స్వయం సహాయక సంఘ సభ్యులు, మహిళలు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version