పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్…

పలు వార్డులల్లో పర్యటించిన మున్సిపల్ చైర్ పర్సన్

నర్సంపేట,నేటిధాత్రి:

 

నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు, 30వ వార్డు, 6వ వార్డుల కౌన్సిలర్లు బాణాల ప్రసన్న-శ్రీనివాస్, మాదాసి రవి, పున్నం నరసింహారెడ్డి,వైస్ చైర్మన్ గంధం నరేందర్ లతో కలిసి మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ గురువారం పర్యటించారు.ఈ సందర్భంగా ఆయా వార్డుల ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు 22వ వార్డు, 30వ వార్డు తోపాటు 6వ వార్డులో పర్యటించి వార్డుల సమస్యలను తెలుసుకుంటూ వాటిని పరిష్కరించడం జరుగుతుందన్నారు.ఎండాకాలంలో నీటి కొరత రాకుండా అవసరమైన దగ్గర బోర్లు వేయించడం జరుగుతుందని, అసంపూర్తిగా ఉన్న మురుగునీటి కాలువలను నిర్మించి వార్డులలో ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు.సీసీ రోడ్ల నిర్మాణాలు చేసి పారిశుధ్య సమస్య లేకుండా నిరంతరం వార్డులలో మున్సిపల్ కార్మిక సిబ్బందితో పరిష్కరిస్తామని పేర్కొన్నారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు సంబంధించిన స్థలంలో ఎమ్మెల్యే మాధవరెడ్డి సహకారంతోటి మినీ ఫంక్షన్ హాల్ నిర్మాణం త్వరలో చేయబట్టబోతున్నామని, అదేవిధంగా వార్డులకు అవసరమైన పనులను ముందుండి చేయించి వార్డుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపడతామని చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్యాంసుందర్, వార్డు ఆఫీసర్స్ చకిలం నాగరాజు, గుగులోతు శ్రీకాంత్, వేమా సూర్యనారాయణ, మున్సిపల్ జవాన్ డేగల కుమార్, బోడ మొగిలి, ఎలక్ట్రిషన్ డిపార్ట్మెంట్ గంట రామిరెడ్డి, వాటెన్ సెక్షన్ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్, వాటర్ లైన్మెన్ రంజిత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్దపెల్లి శ్రీనివాస్, కోల చరణ్, కోల వెంకటేశ్వర్లు, మైబు పాషా, కొప్పు అశోక్, పోతిరెడ్డి నరసింహారెడ్డి, గడ్డం శ్రీనివాస్, ధోని చేరాలు, కుచన రాజు, కొప్పు రాజు, పోగుల ప్రభుదాస్, బాణాల రమేష్, తాండ్ర అశోక్, మడికొండ రంజిత్, బోడ సునీల్, అనపర్తి సతీష్, గడ్డం ప్రవీణ్, అగరపు సారయ్య, తదితరులు పాల్గొన్నారు.

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం…

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్,30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి లకు ఘన సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

https://youtu.be/RsmS54EeUj0?si=qaU9jG1pqADv4jvH

 

*నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతామని చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ హామీ ఇచ్చారు.పట్టణంలోని 30 వార్డులో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పెండెం లక్ష్మీ రామానంద్,అదే వార్డు కౌన్సిలర్ మాదాసి రవి, మహిళా కౌన్సిలర్లు వేల్పుల శ్రీలత బాణాల ప్రసన్న కుమారి లను వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని దళిత వార్డులను మోడల్ వార్డులుగా తీర్చిదిద్దుతానని , వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు.వార్డులలో డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్తు సరఫరా నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తానని , అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ మా తాత పెండెం కట్టయ్య కాలము నుండి నేటి వరకు 30 వ వార్డుతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు.వార్డు ప్రజల అవసరాలు మరియు వార్డు సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని అన్నారు.
నర్సంపేట పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.30 వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి మాట్లాడుతూ వార్డు ప్రజలమంతా ఒక కుటుంబం అని కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు.వార్డులో నీటి సమస్య పట్ల బోర్లు ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయని అవి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి సారంగం ,మాజీ వార్డ్ మెంబర్ కొయ్యడి సంపత్ సీనియర్ నాయకులు దూడల సాంబయ్య,గద్ద సంజీవ, గద్ద శ్రీనివాస్ గద్ద జ్యోతి, నూనె పద్మ, కోమటి సరోజన, జానకమ్మ, గద్ద అఖిల్, నూనె బన్ను, గద్ద నీ ఖిల్, తదితరులు పాల్గొన్నారు.

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా…

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్..

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

పార్టీలకతీతంగా ఎలాంటి భేషజాలం లేకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఎన్నికల్లో 30 స్థానాలకు గాను 21 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయఢంకం మోగించి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ,వైస్ చైర్మన్ గా గంధం నరేందర్ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ మున్సిపాలిటిటీ కార్యాలయంలో హట్టహాసంగా పదవిబాధ్యులు చేపట్టారు.ముందుగా నూతన బాధ్యతలు చేపట్టేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ తో పాటు కౌన్సిలర్లకు కమిషనర్ కాటా భాస్కర్ సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్ లు పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి బోకెలతో సత్కరించారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.వార్డుల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు,అధికారుల సహకారంతో పార్టీలకతీతంగా పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేరుస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ గంధం నరేందర్ మాట్లాడుతూ తన వార్డుతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తునని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బత్తిని రాజేందర్,మాదాసి రవి,
వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,
పున్నం నరసింహారెడ్డి బీరం భరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

రౌడీరాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి..

రౌడీరాజకీయం చేస్తున్న ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి

కోడ్ ఉల్లంఘిస్తూ ఎమ్మెల్యే ఎన్నికల ప్రచారం చేస్తున్న ఎమ్మెల్యే

ఓడిపోతామనే భయంతో బీఆర్ఎస్ నాయకులపై దాడులు

దాడిపట్ల మాజీ ఎమ్మెల్యే పెద్ది ఆగ్రహం..బాధితులను పరామర్శ

నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

స్థానిక సంస్థల ఎన్నికలలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలను భయాందోళనకు గురిచేస్తూ రౌడీ రాజకీయం చేస్తున్నారని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే బిఆర్ఎస్ పార్టీ నేత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ గ్రామాలలో ప్రచారం నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే దొంతిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బి ఆర్.ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిని ఖండిస్తునట్లు తెలిపారు. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చెరువుకొమ్ము తండాలో సోమవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పార్టీ నాయకులు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై దాడిచేశారు.తీవ్రంగా గాయపడిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు నర్సంపేట పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా మాజీ ఎమ్మెల్యే పెద్ది పరామర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నర్సంపేట నియోజకవర్గంలోని జరుగుతున్న గ్రామ పంచాయితీ ఎన్నికల్లో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి రౌడీ రాజకీయం చేస్తున్నారని అలాగే ఎన్నికల నియమాలను ఉల్లంఘిస్తూ ఇప్పటికి పలు ప్రాంతాల్లో ఎమ్మెల్యే దొంతి ఎన్ని ప్రచారం నిర్వహిస్తున్నారని ఆరోపించారు.ఎన్నికల ప్రచారాల్లో ఇందిరమ్మ ఇళ్ల ముచ్చట తప్పా అభివృద్ధిపై ఎమ్మెల్యే ఊసెత్తడంలేదన్నారు.ఎన్నికల ప్రచారంలో గిరిజనలకు ఏం అభివృద్ధి చేశారని కాంగ్రెస్ నాయకులను నిలదీయడంతో దాడులకు పాల్పడుతున్నారని పేర్కొన్నారు.

ప్రశ్నించిన గ్రామస్తులపై రౌడిషీట్లు నమోదు చేయాలని పోలీసులకు హుకుంలు జారి చేస్తున్నారని అవేదన వ్యక్తం చేశారు. టిఆర్ఎస్ కార్యకర్తలపై కాంగ్రెస్ నాయకులు సోమవారం రాత్రి దాడి జరిగితే ఇప్పటివరకు ఏ ఒక్క పోలీస్ అధికారి కూడా వెళ్ళలేదని,ఫిర్యాదు ఇస్తేనే పోలీసులు స్పందిస్తారని అని ప్రశ్నించారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి నర్సంపేట రూరల్ మండలంలో ఎన్నికల కోడ్ ఉల్లంఘించి
ప్రచారం చేస్తున్నారని అందుకుగాను పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేయగా నాపైనే కేసు నమోదు చేస్తా అంటున్నారని మండిపడ్డారు.ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల్లో ఓడిపోతున్నామనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని ఇప్పటికే జరిగిన దుగ్గొండి నల్లబెల్లి ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు.చెరువుకొమ్ముతండాలో జరిగిన దాడిలో ఐదుగురు బీఆర్ఎస్ కార్యకర్తలు గాయపడ్డారని ఘటనపై రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల కమీషనర్ కు ఫిర్యాదు చేయనున్నట్లు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ కార్యక్రమంలో ఒడిసిఎంఎస్ చైర్మెన్ రామస్వామి నాయక్,చెన్నారావుపేట మాజీ ఎంపీపీ,మండల పార్టీ అధ్యక్షులు బాల్నే వెంకన్న గౌడ్, నర్సంపేట పట్టణ పార్టీ అధ్యక్షులు నాగెల్లి వెంకటనారాయణ గౌడ్,మాజీ కౌన్సిలర్లు, వార్డు అధ్యక్షులు,పట్టణ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version