దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం…

దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతాం

మున్సిపల్ చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్

చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్,30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి లకు ఘన సన్మానం

నర్సంపేట,నేటిధాత్రి:

 

*నర్సంపేట మున్సిపల్ పరిధిలోని దళితవార్డులను మోడల్ వార్డు లుగా తీర్చిదిద్దుతామని చైర్మన్ పెండెం శ్రీ లక్ష్మీ రామానంద్ హామీ ఇచ్చారు.పట్టణంలోని 30 వార్డులో రిటైర్డ్ ప్రొఫెసర్ డాక్టర్ గద్ద వెంకటేశ్వర్లు అధ్యక్షతన నూతనంగా చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన పెండెం లక్ష్మీ రామానంద్,అదే వార్డు కౌన్సిలర్ మాదాసి రవి, మహిళా కౌన్సిలర్లు వేల్పుల శ్రీలత బాణాల ప్రసన్న కుమారి లను వార్డు ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా చైర్మన్ శ్రీలక్ష్మి రామానంద్ మాట్లాడుతూ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో మున్సిపాలిటీ పరిధిలోని దళిత వార్డులను మోడల్ వార్డులుగా తీర్చిదిద్దుతానని , వేసవి కాలంలో త్రాగునీటి సమస్య లేకుండా చూస్తామన్నారు.వార్డులలో డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్తు సరఫరా నీటి సరఫరాకు ఎలాంటి అంతరాయం లేకుండా ఏర్పాటు చేస్తానని , అర్హులైన వారికి దశలవారీగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం జరుగుతుందని ప్రజలకు హామీ ఇచ్చారు.పీసీసీ సభ్యులు పెండెం రామానంద్ మాట్లాడుతూ మా తాత పెండెం కట్టయ్య కాలము నుండి నేటి వరకు 30 వ వార్డుతో విడదీయరాని సంబంధం ఉందని అన్నారు.వార్డు ప్రజల అవసరాలు మరియు వార్డు సమస్యలను పరిష్కరించడానికి అందుబాటులో ఉంటానని అన్నారు.
నర్సంపేట పట్టణ ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ,కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవకాశాన్ని అదృష్టంగా భావిస్తున్నామని పేర్కొన్నారు.30 వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి మాట్లాడుతూ వార్డు ప్రజలమంతా ఒక కుటుంబం అని కుటుంబంలో ఎవరికి ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉంటానని అన్నారు.వార్డులో నీటి సమస్య పట్ల బోర్లు ఏర్పాటు చేయాలని, డ్రైనేజ్ కాలువలు సిసి రోడ్ల నిర్మాణం వంటి పనులు ఉన్నాయని అవి త్వరలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో నర్సంపేట కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు నాగేల్లి సారంగం ,మాజీ వార్డ్ మెంబర్ కొయ్యడి సంపత్ సీనియర్ నాయకులు దూడల సాంబయ్య,గద్ద సంజీవ, గద్ద శ్రీనివాస్ గద్ద జ్యోతి, నూనె పద్మ, కోమటి సరోజన, జానకమ్మ, గద్ద అఖిల్, నూనె బన్ను, గద్ద నీ ఖిల్, తదితరులు పాల్గొన్నారు.

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా…

భేషజాలం లేకుండా పట్టణ ప్రజలకు సంక్షేమ ఫలాలు అందిస్తా

మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్..

బాధ్యతలు చేపట్టిన మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్

నర్సంపేట,నేటిధాత్రి:

 

పార్టీలకతీతంగా ఎలాంటి భేషజాలం లేకుండా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణ ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందిస్తామని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మి రామానంద్ స్పష్టం చేశారు.ఇటీవల జరిగిన మున్సిపాలిటీ కౌన్సిలర్ల ఎన్నికల్లో 30 స్థానాలకు గాను 21 మంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కౌన్సిలర్లుగా విజయఢంకం మోగించి మున్సిపాలిటీ పీఠం కైవసం చేసుకున్నారు.ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ చైర్ పర్సన్ గా పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ ,వైస్ చైర్మన్ గా గంధం నరేందర్ ఎన్నికయ్యారు.ఈ నేపథ్యంలో శుక్రవారం నూతనంగా ఎన్నికైన
మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ మున్సిపాలిటిటీ కార్యాలయంలో హట్టహాసంగా పదవిబాధ్యులు చేపట్టారు.ముందుగా నూతన బాధ్యతలు చేపట్టేందుకు మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్,వైస్ చైర్మన్ గంధం నరేందర్ తో పాటు కౌన్సిలర్లకు కమిషనర్ కాటా భాస్కర్ సిబ్బందితో కలిసి స్వాగతం పలికారు.వేద పండితుల మంత్రోచ్ఛారణ మధ్య మున్సిపల్ చైర్ పర్సన్ ,వైస్ చైర్మన్ లు పదవీ బాధ్యతలు చేపట్టారు.ఈ సందర్భంగా శాలువాలతో సన్మానించి బోకెలతో సత్కరించారు.అనంతరం మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ మాట్లాడుతూ నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణాన్ని మోడల్ సిటీగా తీర్చిదిద్దుతానని పేర్కొన్నారు.వార్డుల అభివృద్ధి కోసం కౌన్సిలర్లు,అధికారుల సహకారంతో పార్టీలకతీతంగా పట్టణ ప్రజలకు సంక్షేమ పథకాలు చేరవేరుస్తానని మున్సిపల్ చైర్ పర్సన్ పెండెం శ్రీలక్ష్మీరామానంద్ హామీ ఇచ్చారు.వైస్ చైర్మన్ గంధం నరేందర్ మాట్లాడుతూ తన వార్డుతో పాటు పట్టణ అభివృద్ధికి కృషి చేస్తునని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో కౌన్సిలర్స్ బత్తిని రాజేందర్,మాదాసి రవి,
వేముల సంధ్య సాంబయ్య గౌడ్,ఎలకంటి విజయ్ కుమార్,కొత్తకొండ మేఘన,కొంపల్లి వీణ,ముత్తినేని వెంకన్న,పొన్నాల మనిషా, చీకటి స్వరూప,ఇస్లావత్ రామ గోపి,భూక్య మత్రు రాథోడ్,ఏపూరి శ్రీనివాస్ రెడ్డి,అయూబ్ ఖాన్,శ్రీ రామోజీ రోజారాణి,బాణాల ప్రసన్న,వేల్పుల శ్రీలత,ములకల వినోద,
పున్నం నరసింహారెడ్డి బీరం భరత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా కాంగ్రెస్ నాయకురాలు, పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

ఎన్నికల నియమావాలిని కుంగాలా తొక్కిన జహీరాబాద్ ఎన్నికల అధికారులు…

ఎన్నికల నియమావాలిని కుంగాలా తొక్కిన జహీరాబాద్ ఎన్నికల అధికారులు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు మాణిక్ రావు, చింత ప్రభాకర్, సునీతా లక్ష్మారెడ్డి డీసీఎంస్ చైర్మన్ శివకుమార్, ఎన్నికల ఇంచార్జీ దేవీప్రసాద్ నాయకులతో కల్సి అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారికి (ARO) ఫిర్యాదు.అలాగే జిల్లా కలెక్టర్ కు మరియు ప్రధాన ఎన్నికల అధికారులకు కూడా దరఖాస్తు రూపంలో ఫిర్యాదు చేసారు.ఎన్నికల నియామవాలి ప్రకారం రాష్ట్రం మొత్తంలో గెలచిన అభ్యర్థుల పేరులో తెలుగు అక్షరాలా ప్రకారం అభ్యర్థి పేరులోని మొదటి అక్షరం చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించాలి కానీ జహీరాబాద్ మున్సిపాలిటీలో అధికారులు మాత్రం రాష్ట్రా ప్రభుత్వనికి తలోగ్గి అధికార పార్టీ నాయకులు చెప్పినట్టుగా అభ్యర్థి పేరులోని మెదటి అక్షరం కాకుండా రాజకీయ పార్టీ పేరులోని మొదటి అక్షరంతో చైర్మన్, వాయిస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన కౌన్సిలర్ అభ్యర్థుల పేర్లు మొదటగా పిలిచి ఎన్నికలు నిర్వహించారు.ఇదే విషయంలో ఎన్నికల నియామవాలి ప్రకారం మీదటగా బిఆర్ఎస్ పార్టీ కి చెందిన కౌన్సిలర్ అభ్యర్థి అయినా” కట స్రవంతి ” పేరును అధికారులు మొదటగా చైర్మన్ కొరకు పేరును ప్రతిపథటించాలి కానీ అధికారులు మాత్రం ఎన్నికల నియమావాలిని ఉల్లాగించి అధికార పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి అయినా యూనుస్ పెరు ను మొదటగా చైర్మన్ అభ్యర్థి గా ప్రతిపదించి ఎన్నికలు నిర్వహించి అధికార పార్టీకి చెందిన అభ్యర్థి చైర్మన్ గా చేశారు అని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లు తెలిపారు.ఇదే విషయంలో అవసరం అయితే న్యాయపరంగా కూడా మందుకు వెళ్తాము అని చెప్పారు.

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

క్యాతనపల్లి మున్సిపాలిటీ కోరం లేక ఎన్నిక వాయిదా…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

క్యాతనపల్లి మున్సిపాలిటీ లో చైర్ పర్సన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్ల ప్రమాణస్వీకారం కోరం లేక వాయిదా పడింది. నిర్దేశించిన సమయానికి మునిసిపాలిటీ కార్యాలయానికి 22 మంది కౌన్సిలర్లు ఎవరూ రాకపోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు కోరం వాయిదా వేస్తున్నట్లు మందమర్రి ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు. నేడు మళ్లీ 11 గంటల ప్రాంతంలో కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాలు ఉంటాయని, కౌన్సిలర్ లు అందరూ సకాలంలో విచ్చేసి ఎన్నికలకు హాజరు కావాల్సిందిగా ఎమ్మార్వో కోరారు. దీంతో మున్సిపాలిటీ కార్యాలయం ముందు బిఆర్ఎస్, సిపిఐ, కాంగ్రెస్ శ్రేణుల పోటా పోటీగా నినాదాలు చేయడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. బిఆర్ఎస్,సిపిఐ కలిపి 14 కౌన్సిలర్ సీట్లు గెలుపొందగా కౌన్సిలర్లను ప్రమాణస్వీకారానికి తీసుకొస్తున్న సందర్భంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కౌన్సిలర్లతో పాటు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రావడాన్ని మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ డిసిసి అధ్యక్షులు రఘునాథరెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్, ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య లను పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. మున్సిపాలిటీ కార్యాలయం ముందు కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

 

పరిస్థితులు అదుపుతప్పుతున్నాయని గమనించిన పోలీస్ యంత్రాంగం, ఎన్నికల అధికారులు మున్సిపాలిటీ కౌన్సిలర్ల ప్రమాణస్వీకారాన్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో మున్సిపాలిటీ కార్యాలయం ప్రాంతంలో అల్లరి సద్దుమణిగింది. నేడు ఎన్నిక జరిగే సమయంలో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎన్నికల సంఘానికి, జిల్లా కలెక్టర్ కు సమాచారం అందిస్తామని ఎమ్మార్వో, ఎన్నికల అధికారి సతీష్ కుమార్ తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక…

మున్సిపల్ చైర్మన్ గా బుర్ర కొమురయ్య ఎన్నిక

వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్

భూపాలపల్లి నేటిధాత్రి

 

రెండవ సాధారణ మున్సిపాలిటీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థులు17 సిపిఐ1 మొత్తం 18 మంది కౌన్సిలర్ల గెలుపొందడం జరిగింది ఆర్డిఓ హరికృష్ణ మున్సిపల్ కమిషనర్ జోన ఆధ్వర్యంలో గెలిచిన కౌన్సిలర్ సభ్యులు అందరూ ప్రమాణస్వీకారం చేయడం జరిగింది అనంతరం 2వార్డ్ కౌన్సిలర్ సభ్యుడు బుర్ర కొమురయ్యను ఏకగ్రీవంగా భూపాలపల్లి పురపాలక సంఘం చైర్మన్ గా ఎన్నుకున్నారు అలాగే వైస్ చైర్మన్గా 15వ వార్డు కౌన్సిలర్ అంబాల శ్రీనివాసులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ కార్యక్రమంలో ఎక్సెప్షన్ నెంబర్ ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ పట్టణ అధ్యక్షుల దేవన్ కౌన్సిలర్లు పాల్గొన్నారు

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి…

◆-: ఆల్ఫాబెట్స్ ఆధారంగా కౌన్సిల్ సభ్యులకు బల్లాల ఏర్పాటు

◆-: చైర్మెన్ ఎన్నిక పూర్తయ్యే వరకు ఎన్నికల కోడ్ అమల్లో

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

మున్సిపల్ చైర్మెన్ ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ జైత్రం నాయక్, డీఎస్పీ సైదా నాయక్ లు తెలిపారు. సోమవారం వారు విలేకర్లతో మాట్లాడుతూ.. మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఉదయం 10 గంటలకు కౌన్సిల్ సభ్యులు మున్సిపల్ కార్యాలయానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. మొదట కౌన్సిల్ సభ్యులందరికీ ప్రమాణం చేయించిన అనంతరం చైర్మెన్, వైస్ చైర్మెన్ ఎన్నిక జరుగుతుందన్నారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా సాగేందుకు అవసరమైన భద్రతా చర్యలను కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు సూచించారు. ఎన్నిక కేంద్రం పరిసరాల్లో అనవసర గుంపులు చేరకుండా చర్యలు తీసుకోవాలని, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ సక్రమంగా నిర్వహించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టామన్నారు. ఎన్నికల సమయంలో విధుల్లో ఉన్న పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండి, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, సమస్యాత్మక పరిస్థితులు ఎదురైతే వెంటనే ఉన్నతాధికారులకు సమాచారం అందించి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సిఐలు శివలింగం, హనుమంతు, ఎస్సై వినయ్ కుమార్, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు…

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో 144 సెక్షన్ అమలు

మున్సిపల్ పరోక్ష ఎన్నికల నేపథ్యంలో కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి నేటిధాత్రి

 

భూపాలపల్లి మున్సిపల్ ఛైర్మన్, వైస్‌ ఛైర్మన్ పరోక్ష ఎన్నికల సందర్భంగా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్ తెలిపారు. ఎన్నికలు ప్రశాంతంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
జిల్లా పరిధిలో 163 బీఎన్ ఎస్ఎస్ (సెక్షన్ 144) అమల్లో ఉండగా, ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమికూడటం, అనుమతి లేకుండా ర్యాలీలు, ఊరేగింపులు, సమావేశాలు నిర్వహించడం నిషేధం. డీజేలు, మైకులు, బాణాసంచా వంటి శబ్ద కాలుష్యానికి కారణమయ్యే కార్యక్రమాలు కూడా నిషేధించబడ్డాయి. ఎన్నికల ప్రక్రియకు భంగం కలిగించే చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మున్సిపల్ పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేందుకు ప్రజలు, ప్రజా ప్రతినిధులు పోలీసు యంత్రాంగానికి సహకరించాలని కోరారు.

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠం పై గులాబీ జెండా….

పొత్తు ధర్మాన్ని వీడని ఎర్ర సూరీలు….

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మంత్రి గడ్డం వివేక్ ఇలాఖలో చక్రం తిప్పి మునిసిపాలిటీ గద్దెపై గులాబీ జెండా ఎగిరేలా ఎర్ర సూరీల తో వ్యూహాలు రచించి విజయం సాధించారు. క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పీఠాన్ని బిఆర్ఎస్ పార్టీ సిపిఐ పార్టీతో కలిసి కైవసం చేసుకుంటున్న నేపథ్యంలో పొత్తు ధర్మాన్ని విస్మరించకుండా ఎర్ర సూరీలు గులాబీ జెండా కు జై కొడుతున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీకి , మంత్రి ఇలాకాలో గులాబీ జెండా ఎగరడం ఒకింత ఆశ్చర్యానికి గురి చేసినప్పటికీ ప్రజా తీర్పును గౌరవించాల్సిందేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. రాష్ట్రం మొత్తంలో అధికార కాంగ్రెస్ పార్టీకి తోడుగా ఉన్న సిపిఐ పార్టీ నాయకులు క్యాతనపల్లిలో అందుకు భిన్నంగా బిఆర్ఎస్ పార్టీతో జతకట్టడంతో అధికారంలోకి వచ్చారు.కాంగ్రెస్ నాయకులు సిపిఐ నాయకులను తీవ్రంగా అవమానించిన నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీతో జతకట్టినట్లు ఏఐటియుసి రాష్ట్ర అధ్యక్షులు సీతారామయ్య, సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలవేన శంకర్, మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్, పట్టణ కార్యదర్శి మిట్టపల్లి శ్రీనివాస్ లు ఎన్నికలకు ముందే స్పష్టం చేశారు. పొత్తు ధర్మాన్ని విస్మరించి ఒకవేళ ప్రస్తుత సందర్భాలలో కాంగ్రెస్ తో జతకడితే క్యాతనపల్లి మునిసిపాలిటీలో సిపిఐ పార్టీకి మునగడ కరవయ్యే అవకాశాలు లేకపోలేదు. ఎర్ర సూరీలకు ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ మునిసిపాలిటీలో గులాబీ జెండా ఎర్ర సూరీలతో కలిసి ఎగురుతోందని ప్రజలంతా భావిస్తున్నారు. అలానే జరగాలని ప్రజలంతా ఓటర్లంతా కోరుకుంటున్నారు. ఎర్ర సూరీలు సైతం పొత్తు ధర్మాన్ని విస్మరించడం లేదని ఇప్పటికే స్పష్టం చేశారు.

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం…

జహీరాబాద్ 28వ వార్డ్ బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ మున్సిపల్ 28వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బొగ్గుల సంతోష్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడిన వెంటనే బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. నాయకులు, మద్దతుదారులు సంతోష్ను అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ, వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సంతోష్ తెలిపారు.

జహీరాబాద్ 23వ వార్డ్ బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం

జహీరాబాద్ మున్సిపల్ 23వ వార్డు కౌన్సిలర్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి భావన గౌడ్ విజయం సాధించారు. ఫలితాలు వెలువడగానే బీజేపీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. నాయకులు, మద్దతుదారులు అభ్యర్థిని అభినందించారు. ప్రజల నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని భావన గౌడ్ తెలిపారు. ఈ విజయం స్థానిక రాజకీయాల్లో బీజేపీకి మరింత బలాన్ని చేకూర్చింది.

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి…

ఒక్కో వార్డు నా బాధ్యతే : మాజీ మంత్రి, ఎంఎల్ఏ మల్లారెడ్డి
* మునిసిపల్ బిఆర్ఎస్ ముఖ్యకార్యకర్తల సమావేశం

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, నేటిధాత్రి :

 

మునిసిపల్ ఎన్నికలో గెలుపే లక్ష్యం ఒక్కో వార్డు నా బాధ్యతని మాజీ మంత్రి, ఎంఎల్ఏ చామకూర మల్లారెడ్డి అన్నారు. మునిసిపల్ ఎన్నికల సందర్బంగా బిఆర్ఎస్ మునిసిపల్ అధ్యక్షులు సరసం మోహన్ రెడ్డి, మల్లేష్ గౌడ్ ల ఆధ్వర్యంలో సోమవారం అలియాబాద్, మూడుచింతలపల్లి మునిసిపల్ ముఖ్యకార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా మల్లారెడ్డి మాట్లాడుతూ గెలుపే లక్షంగా ప్రతి కార్యకర్త పనిచేయాలన్నారు. కాంగ్రెస్ రెండు ఏండ్లు పాలన గడిచిన అంతా ఆగమే ఉందన్నారు. ఆగమైన ఆరు గ్యారంటీకాని ప్రజల్లో ప్రశ్నించి చైతన్యపరచలన్నారు.

ఓటర్లను అక్కర్శించే పనులతో ప్రజల్లోకి వెళ్ళాలని, 13న ఊర్లలో ముగ్గుల పోటీలు, 16న క్రికెట్ మ్యాచ్ లు చేపట్టాలనసూచించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి జహంగీర్, డీసీఎంఎస్ మాజీ వైస్ చైర్మన్ మధుకర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ వెంకటేశం, ఏఎంసి వైస్ చైర్మన్ లు నాగరాజు, శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీలు పల్లె సితారములు గౌడ్, ఎల్లుభాయి, మాజీ జడ్పీటీసీ అనిత, సొసైటీ వైస్ చైర్మన్ ఐలయ్య యాదవ్, మాజీ సర్పంచ్లు, మాజీ ఎంపీటీసీలు, మాజీ డైరెక్టర్లు, బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version