కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి…

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి

నర్సంపేట,నేటిధాత్రి:

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి వార్డు ప్రజలను కోరారు. నర్సంపేట పట్టణంలోని 30వ వార్డులో “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” 99 రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం నిర్వహించిన వార్డు సభలో 30వ వార్డు కౌన్సిలర్ మాదాసి రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వార్డు ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గౌరవ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలో, నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి సహకారంతో పట్టణంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలోని ఇందిరమ్మ పాలనలో అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా కృషి జరుగుతోందని పేర్కొన్నారు.వార్డు సభలో మహిళలు తమ ప్రాంతంలో ఉన్న బెల్ట్ షాపులను తొలగించాలని వినతిపత్రం సమర్పించగా, వాటి తొలగింపుకు సంబంధిత అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటానని కౌన్సిలర్ హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధికారులు, డివిజన్ ఆర్‌పి, మున్సిపల్ జవాన్, ఆశా వర్కర్లు, అంగన్‌వాడీ టీచర్లు, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

చంద్రయ్యపల్లి సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్.

దుగ్గొండి,నేటిధాత్రి:

రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్ అన్నారు.ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల పాటు నిర్వహిస్తున్న కార్యక్రమాలలో భాగంగా దుగ్గొండి మండలం పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచ్ల అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించారు. మండలంలో నిర్వహించిన పలు గ్రామసభల్లో ఎంపీడీవో లెక్కల అరుంధతి, ఎమ్మార్వో సమ్మక్క, ఎంపీఓ శ్రీధర్ గౌడ్, మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు, తో పాటు పలువురు అధికారులు గ్రామ సభలో పాల్గొన్నారు. దుగ్గొండి మండలంలోని చంద్రాయపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక గ్రామసభ సర్పంచ్ ఆరేల్లి లతవీరేశం గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గ్యాస్ సిలిండర్ల సబ్సిడీ బ్యాంక్ ఖాతల్లో పడటం లేవని పలువురు ప్రజలు ఆరోపించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్స్ ప్రభుత్వం అందించాలని కలెక్టర్ కు తెలుపుతూ తీర్మానం చేసుకున్నారు.గ్రామంలో అభివృద్ధి కోసం వార్డు సభ్యులు అధికారుల సమన్వయంతో పార్టీలకతీతంగా గ్రామాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని సర్పంచ్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజేష్, గ్రామ స్పెషల్ ఆఫీసర్ రాహుల్, ఉప సర్పంచ్ బొమ్మినేని సుధాకర్ రెడ్డి, వార్డు సభ్యులు కక్కెర్ల సారంగం,స్వరూప, అంగన్వాడి టీచర్, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు.

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి..

ప్రజా పాలన–ప్రగతి ప్రణాళికలో ప్రజలు భాగస్వామ్యం కావాలి

10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన “99 రోజుల ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక” కార్యక్రమంలో ప్రజలు చురుకుగా భాగస్వామ్యం కావాలని 10వ వార్డు కౌన్సిలర్ హన్మకొండ శ్రీధర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా 10వ వార్డు పరిధిలోని పోచమ్మ ఆలయం వద్ద వార్డు సభ నిర్వహించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ మాట్లాడుతూ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నేరుగా ప్రజల వద్దకు చేర్చడం, ప్రజా సమస్యలను అధికారులు దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడం కోసం వార్డు సభలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని తెలిపారు. ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ద్వారా ప్రజలు అభివృద్ధిలో భాగస్వాములు అవుతారని పేర్కొన్నారు.
వార్డులో డ్రైనేజ్ సమస్యలు, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తానని తెలిపారు.వార్డు అభివృద్ధి కోసం ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉందని, చెట్లను పెంచుతూ పరిశుభ్రమైన వాతావరణాన్ని ఏర్పరచుకోవాలని సూచించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని చెప్పారు.అనంతరం వార్డు ప్రజలతో వివిధ సమస్యలపై చర్చించి, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కాటం భాస్కర్, డీఎల్పీఓ రాజీవ్ కుమార్, వార్డు ఆఫీసర్ మహమ్మద్ రహీం పాషా, పల్లె దవాఖాన డాక్టర్ భావన, విద్యుత్ లైన్‌మన్ రాజు, ఆర్‌పి సువర్ణ, బీసీ హాస్టల్ వార్డెన్ భాస్కర్, వార్డు సభ్యులు కొలువుల వెంకట్, అరెపెల్లి బాబు, లక్క రాజు, ఆవుల శ్రీకాంత్, పున్నం రాజు, ఎడెల్లి అశోక్, మామిడాల సదాలక్ష్మి, ఉదయగిరి నాగమణి, సరిత తదితరులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి…

ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

26వ డివిజన్ కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్

నర్సంపేట,నేటిధాత్రి:

నర్సంపేట పట్టణంలోని 26వ డివిజన్‌లో ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా నేడు నిర్వహించిన వార్డు సభలో 26వ డివిజన్ కౌన్సిలర్ మండల శ్రీదేవి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల నుండి దరఖాస్తులను స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.అనంతరం కౌన్సిలర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అందుకు తమ పూర్తి సహకారం ఉంటుందని తెలిపారు. వార్డులో అభివృద్ధి కార్యక్రమాలు నిరంతరం విడతలవారీగా కొనసాగుతాయని చెప్పారు. ఆసరా పెన్షన్లు, ఇందిరమ్మ గృహాలు మరియు ఇతర సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ప్రయోజనాలు అందేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె. భాస్కర్, వార్డ్ ఆఫీసర్ ఎ. స్వామి, ఆనంద్, ఆర్.పీ. అనురాధ, వార్డు ముఖ్యులు నాడెం సాంబయ్య, గుండెబోయిన శివ, కోటి, దోనాల రవి, బండి వేణు, అడుప రాంబాబు, నీరటి రంజిత్, నాడెం రామకృష్ణ, మార్త శంకర్, మార్త సాంబయ్య, మనగాని సాంబయ్య, కాంతల జనార్దన్ రెడ్డి, నాసం వీరస్వామి, దోమ నిర్మల, మనగాని స్వప్న, కవిత మాధురి తదితర లబ్ధిదారులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక…

ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రగతి ప్రణాళిక

మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్

నర్సంపేట,నేటిధాత్రి:

తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నర్సంపేట మున్సిపాలిటీ 25వ వార్డులో గురువారం వార్డు సభ నిర్వహించారు. స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ చైర్‌పర్సన్ పెండెం శ్రీలక్ష్మీ రామానంద్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వార్డు ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి సహకారంతో నర్సంపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా చేరేలా, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యేలా ఈ ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.వార్డుల్లో డ్రైనేజ్, మట్టి రోడ్లు, మంచినీటి సరఫరా, వీధి దీపాలు, పరిశుభ్రత వంటి మౌలిక వసతుల సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. వార్డులో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అనంతరం వార్డు ప్రజల నుంచి పలు సమస్యలపై దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ చైర్మన్ ఎర్ర యాకుబ్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ కటా ప్రభాకర్, వార్డు ముఖ్యులు కీసర నరేందర్, కీసర వెంకటేశ్వర్లు, కాటా అఖిల్, కీసరి రాజీవ్, నల్గొండ వంశీ, స్వామిశెట్టి శేఖర్, శోభన్ బాబు, చీకటి శివమణి, మున్సిపల్ అధికారులు, వార్డు ఆఫీసర్, ఎస్‌ఎల్‌ఎఫ్ ఆర్పీలు, మహిళా సంఘాల సభ్యులు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు, వార్డు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version