సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరా

సింగరేణి కార్మికులకు ఔషధాల సరఫరాలో యాజమాన్యం విఫలం…

ఏఐటియుసి డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

 

మందమర్రి ఏరియాలోని రామకృష్ణాపూర్ సింగరేణి ఏరియా ఆసుపత్రిలో సింగరేణి కార్మికులకు, అధికారులకు సరఫరా చేసే ఔషధాలు సరఫరా చేయడంలో యాజమాన్యం విఫలం చెందిందని ఏఐటియుసి యూనియన్ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి ముస్కే సమ్మయ్య, కేంద్ర కార్యదర్శి అక్బర్ అలీ, శ్రీరాంపూర్ బ్రాంచ్ కార్యదర్శి షేక్ బాజీ సైదా, మందమర్రి బ్రాంచ్ కార్యదర్శి సలేంద్ర సత్యనారాయణ లు అన్నారు. కార్మికులకు ఔషధాల కొరత తీవ్రంగా ఉందని సోమవారం రామకృష్ణాపూర్ ఏరియా ఆసుపత్రి డివైసిఎంఓ డాక్టర్ ప్రసన్న కుమార్ కు వినతి పత్రం అందించారు. అనంతరం వారు మాట్లాడారు. సింగరేణి సంస్థ వేలకోట్ల లాభాలు అర్జిస్తూ కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు, పదవి విరమణ కార్మికులకు దీర్ఘకాలిక వ్యాధుల యొక్క ఔషధాలను గత రెండు నెలలుగా పూర్తిస్థాయిలో సరఫరా చేయలేకపోతుందని, కార్మికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని యాజమాన్యం వెంటనే స్పందించి ఔషధాలను పూర్తిస్థాయిలో సరఫరా చేయాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరుతున్నామని అన్నారు. యాజమాన్యం స్పందించకుంటే గుర్తింపు కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బ్రాంచ్ ఉపాధ్యక్షులు ఇప్పకాయల లింగయ్య, మందమర్రి బ్రాంచ్ ఉపాధ్యక్షులు సుదర్శన్, భట్టు, సంపత్, అప్రోజ్ ఖాన్, రమేష్, సురేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన.

ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం కోసం సాయల్ టెస్ట్ నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం లో మరో ముందడుగు

కొత్తగూడ,నేటిధాత్రి:

 

 

మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి కొత్తగూడ మండల ప్రజల చిరకాల కోరిక.. త్వరలో తీరానున్న పెద్ద ఆసుపత్రి కల..!!తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులుడాక్టర్ అనసూయ సీతక్క
ప్రత్యేక దృష్టితో ఉమ్మడి కొత్తగూడ ప్రజల కోసం 30 పడకల ఆసుపత్రి మంజూరు చేసిన సంగతి విధితమే
శనివారం రోజు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు వజ్జ సారయ్య ఆధ్వర్యంలో..ముప్పై పడకల ఆసుపత్రి నిర్మాణం లో భాగంగా సాయల్ టెస్ట్ నిర్వహించడం జరిగింది…
ఈ కార్యక్రమం లో.. డిసిసి సభ్యులు వీరనేని వెంకటేశ్వరరావు, కాంగ్రెస్ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య, ఉపాధ్యక్షులు వెలుదండి వేణు, మండల నాయకులు వజ్జ బాలరాజు,హలవత్ సురేష్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సిరిగిరి సురేష్, నాయకులు కందుల సందీప్, రవి, తదితరులు పాల్గొన్నారు,.,

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన.!

ప్రభుత్వ యునాని వైద్యశాలను సందర్శించిన రీజనల్ డిప్యూటీ డైరెక్టర్

నేటిధాత్రి ఐనవోలు :-

 

 

 

ఐనవోలులోని ప్రభుత్వ యునాని వైద్యశాల నీ సందర్శించిన రిజినల్ డిప్యూటీ డైరెక్టర్ వరంగల్ (RDD) డాక్టర్. ప్రమీల దేవి సందర్శించారు. జూన్ 21 న జరిగే
అంతర్జాతీయ యోగ దినోత్సవ
దశబ్ది వేడుకలు – 2025 దినోత్సవాన్ని పురస్కరించుకొని 25 రోజుల పాటు నిర్వహించేలా యోగ దశబ్ది వేడుకల ప్రణాళికను రూపొందినట్లు ఐనవోలు యునాని ఆసుపత్రి డాక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు.ఈ మేరకు ఆరోగ్య మందిరాలు, వైద్య సబ్బంది, అంగన్వాడీ టీచర్లు,పిల్లలు,పెద్దలు,
గురువారం సన్నాహక సమావేశం నిర్వహించారు,ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఈ ఏడాది ‘ యోగ ఫర్ వన్ ఎర్త్, వన్ హెల్త్ ‘అనే నినాదంతో యోగ తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ భాను ప్రకాష్, ఫార్మాసిస్ట్ శంకర్, యోగ శిక్షకులు అర్చన, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం.

విరాజ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

ముత్తారం నేటి ధాత్రి:

ముత్తారం మండలం పోతారం గ్రామం లో శ్రీ విరాజ్ హస్పిటల్ పేద్దపల్లి అద్వర్యం లో ఉచ్చిత వైద్య శిబిరం నిర్వయించారు
ఈ వైద్య శిబిరం లో డాక్టర్ రాజ్ కుమార్ దంత వైద్యులు ( మేనేజింగ్ డైరేక్టర్ ) డాక్టర్ చంద్రకుమార్ జనరల్ పిజిషన్
సదానందం మేనేజ్ మేంట్
రాజు మేనేజ్ మేంట్ మరియు మార్కేటింగ్ పాల్గోని గ్రామస్తులకు వైద్య పరిక్షలు నిర్వయించి ఉచితంగా మందులు పంపిణి చేసారు వైద్యులను మాజీ సర్పంచ్ నేత్తేట్ల మహేందర్ మరియు గ్రామస్తులు షాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమం లో వైద్య సిబ్బందీ గ్రామస్తులు యూత్ సబ్యులు పాల్గోన్నారు

ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ ఏరియా ఆసుపత్రి ని సందర్శించిన ఎమ్మెల్యే మాణిక్ రావు.

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

జహీరాబాద్ శాసనసభ్యులు కోనింటి మాణిక్ రావు ఏరియా ఆసుపత్రి ని సందర్శించి* ఆసుపత్రిలో ప్రతి విభాగాన్ని తనిఖీ చేశారు.ఈ సందర్భంగా ప్రతి విభాగంలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలను మరియు అందుతున్న సేవల గురించి అడిగి తెలుసుకున్నారు.

MLA Manik Rao

 

 

అనంతరం సూపరెండింట్ డాక్టర్ శ్రీధర్ ,డాక్టర్ గిరి, ఇతర వైద్యులు & స్టాఫ్ తో మాట్లాడుతూ హాస్పిటల్ కు వచ్చే రోగులకు ప్రతి విభాగంలో స్టాప్ అంకితభావంతో సేవలందించాలని వచ్చే నెలలో తిరిగి ప్రతి విభాగంతో సమావేశం అవుతా అని అన్నారు.ఎమ్మెల్యే గారి తో పాటుగా సీనియర్ నాయకులు నామ రవికిరణ్ ,మాజి పట్టణ అధ్యక్షులు మొహియుద్దీన్ ,బండి మోహన్, తదితరులు ఉన్నారు .

ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు.

కోటగుళ్లలో జిల్లా ఆస్పత్రి సూపరింటెండెంట్ దంపతుల పూజలు

గోశాల నిర్వహణకు రూ. 56వేల వితరణ

గణపురం నేటి ధాత్రి

 

 

గణపురం మండల కేంద్రంలో కాకతీయుల కళాక్షేత్రం శ్రీ భవాని సహిత గణపేశ్వరాలయం కోటగుళ్ళ లో ఆదివారం సుబ్రహ్మణ్య షష్టి పర్వదినాన్ని పురస్కరించుకొని భూపాలపల్లి జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరు నవీన్ కుమార్ సుమతి దంపతులు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు జూలపల్లి నాగరాజు వారిని సాదరంగా ఆహ్వానించి గణపతి, నందీశ్వరుడు, గణపేశ్వరునికి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం గోశాల నిర్వహణలో భాగంగా పనిచేస్తున్న పానిగంటి గణేష్ కు వేతనం కింద రూ 56 వేలను అందజేశారు. ఈ సందర్భంగా గోశాల గోమాతలకు నవీన్ కుమార్ సుమతి దంపతులు పండ్లను
అందజేశారు. అనంతరం డాక్టర్ దంపతులను శాలువాలు పూలమాలలతో ఘనంగా సన్మానించారు. గోశాల నిర్వహణకు వేతనాన్ని అందజేసిన నవీన్ కుమార్ సుమతి దంపతులకు కోటగుళ్లు పరిరక్షణ కమిటీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

బంధన్ హాస్పిటల్లో దారుణం.

కడుపు నొప్పని వస్తే, కాటికి పంపిన బంధన్ హాస్పిటల్ వైద్యం.

బంధన్ హాస్పిటల్ నిర్లక్ష్యం ఖరీదు నిండు ప్రాణం బలి.

హనుమకొండ బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించి వరంగల్ కి చెందిన మహేందర్ అనే వ్యక్తి మృతి.

అనుభవం లేని డాక్టర్లు వైద్యం చేయడం వల్లే మహేందర్ రావు మృతి చెందినట్లు ఆరోపిస్తూ బంధువుల ఆందోళన.

హాస్పిటల్ లోనికి ఎవరిని అనుమతించని పోలీసులు. మృతుడి బంధువులు, పలువురిని హాస్పిటల్ లోనే ఉంచి తాళాలేసిన యాజమాన్యం.

మృతుడికి ముగ్గురు ఆడపిల్లలు, న్యాయం చేయాలని బంధువుల డిమాండ్.

గతంలో కూడా బంధన్ హాస్పిటల్ లో వైద్యం వికటించిన వైనం..

గతంలో వచ్చిన ఫిర్యాదులపై స్పందించి ఉంటే ఈ మృతి జరిగేది కాదంటూ పలువురి ఆవేదన

చోద్యం చూస్తున్న “వైద్యాధికారులు”.! ఇప్పటికైనా వైద్యాధికారులు స్పందించేనా..?

*బంధన్ హాస్పిటల్ పై చర్యలకు వెనకాడుతున్న హనుమకొండ వైద్యశాఖ అధికారులు?.

ఇంకెంతమంది ప్రాణాలు పోవాలి? అపెండిక్స్ ఆపరేషన్ లు సైతం చేయరాని ఇలాంటి హాస్పటల్ ను సీజ్ చేయాలని బాధితుల డిమాండ్.

“బంధన్ ఆసుపత్రి” వెనక ఉన్న రాజకీయ నాయకులు ఎవరు?

నలుగురు డాక్టర్లు కలిసి కోట్లు పెట్టి హాస్పిటల్ లు కట్టడం.., పేద ప్రజల నుండి డబ్బులు వసూలు చేయడమేనా వీళ్ళ టార్గెట్?

నాణ్యమైన వైద్యం అందివ్వడం చేతకాదా.. డబ్బుల సంపాదనే వీళ్ళ ప్రధాన ఎజెండా?

వరంగల్ నేటిధాత్రి:

అమ్మ జన్మనిస్తే.. ఏదైనా ప్రాణాపాయ స్థితి ఏర్పడితే దాని నుంచి కాపాడి.. పునర్జన్మనిచ్చే దేవుళ్లుగా వైద్యులను ఆరాధిస్తుంటారు. అలా గొప్పగా కీర్తించబడే పవిత్రమైన వైద్య వృత్తికి కొందరు డాక్టర్లు అపఖ్యాతి తీసుకొస్తున్నారు. ఈ కోవకు చెందినవారే హనుమకొండలోని బంధన్ ఆసుపత్రి వైద్యులు అని బాధితులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే ఆదివారం నాడు, వరంగల్ నగరం రంగశాయిపేట కు చెందిన మహేందర్ రావు అనే వ్యక్తి కడుపునొప్పితో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు హన్మకొండలోని బంధన్ హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. కడుపు నొప్పితో బాధపడుతున్న వ్యక్తిని అందుబాటులో ఉన్న అనుభవం లేని డి ఫార్మా,, బిఏఎంఎస్ చేసిన డాక్టర్లు పరిశీలించి ట్రీట్మెంట్ చేయడం వల్ల వ్యక్తి మృతి చెందారని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. మహేందర్ రావుకు గతంలోనే గుండెకు సంబంధించి వైద్యం జరిగింది అది దృష్టిలో పెట్టుకొని గుండె కు సంబంధించిన డాక్టర్ను పిలవండి అని కుటుంబ సభ్యులు తెలిపిన కానీ, బంధన్ హాస్పిటల్ వాళ్ళు ఈ రోజు ఆదివారం గుండెకు సంబంధించి డాక్టర్ రారు, మేము చూసుకుంటాం అని, కనీసం జనరల్ అనస్థీషియా డాక్టర్ లేకుండానే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు. గ్యాస్ట్రిక్ సమస్య, కడుపునొప్పి, ఉబ్బసంతో బాధపడుతున్న వ్యక్తి హాస్పిటల్ కు నడుచుకుంటూ వచ్చి హాస్పిటల్లో అడ్మిట్ అయి, డిశ్చార్జ్ కూడా రాసిన డాక్టర్లు, మరి ఏమైందో, ఏమో కానీ అచ్చిరాని వైద్యం చేసి మంచిగున్న వ్యక్తిని నిర్లక్ష్యంగా ప్రాణాలు బలిగొన్నారు అని మృతుడి కుమార్తె మీడియాతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. పేషెంట్ కు అల్ట్రా సౌండ్ స్కానింగ్ కొరకు నడుచుకుంటూ బయటికి తీసుకువెళ్లాల్సిన అవసరం ఏమి వచ్చింది అని ప్రశ్నిస్తున్నారు బంధువులు.

hospital

పేషంట్ కొరకు కార్డియాలజిస్ట్ డాక్టర్ ను పిలవండి, లేదంటే మేము వేరే హాస్పటల్ కు వెళ్తాము అని, అంబులెన్స్ కూడా తెచ్చుకొని, హాస్పిటల్ దగ్గర దాదాపుగా మూడు గంటలు వేచి ఉన్నా కానీ, సదరు బంధన్ డాక్టర్లు నిర్లక్ష్యంతో అనుభవం లేని డాక్టర్లు ట్రీట్మెంట్ చేయడం ద్వారా వ్యక్తి మృతి చెందిన సంఘటన. దీంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ లో ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసి, తమ తండ్రి మృతికి కారణం అయ్యారు బంధన్ హాస్పిటల్ డాక్టర్లు అని, ఈ హాస్పిటల్ లో ఎలాంటి క్వాలిఫైడ్ డాక్టర్లు అందుబాటులో లేరని, అనుభవం లేని డాక్టర్లు మాత్రమే వైద్యం చేస్తున్నారనీ నడుచుకుంటూ వచ్చిన మా నాన్నని నిర్లక్ష్యంగా వైద్యం చేసి మరణానికి కారకులయ్యారు అని మృతుడి కుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మహేందర్ రావు మృతి విషయం తెలుసుకున్న వెంటనే బంధువులు హుటాహుటిన హాస్పిటల్ కు చేరుకొని ఆందోళన చేశారు. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి బంధువులతో, హాస్పిటల్ యజమాన్యంతో మాట్లాడారు. బంధన్ హాస్పిటల్ బడా బాబులది కావడం దీని వెనుక రాజకీయ నాయకుల అండ ఉండడంతో, సమస్యను మేము పరిష్కరించుకుంటాం అని చెప్పి, విషయం బయటకు రాకుండా మేనేజ్ చేసిన తీరు ఆశ్చర్యం. ఏది ఏమైనా కానీ బంధం హాస్పిటల్ లో సరియైన డాక్టర్లు లేకుండానే వైద్యం చేస్తున్న విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. గతంలో కూడా అనుభవం లేని డాక్టర్లు అపెండిక్స్ ఆపరేషన్ చేసి ఫెయిల్యూర్ అయిన ఘటన మరువకముందే, కడుపు నొప్పితో బాధపడుతున్న మరో వ్యక్తి ఈ హాస్పిటల్ లో జాయిన్ అయి, మృతి చెందిన వార్త నగరంలో కలకలం రేపింది. గతంలోనే అపెండిక్స్ ఫెయిల్యూర్ కు సంబంధించి హాస్పిటల్ నిర్లక్ష్యం వలన తనకు అన్యాయం జరిగిందని ఒక జర్నలిస్ట్ హనుమకొండ వైద్యశాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా, సదరు వైద్య శాఖ అధికారులు కానీ, హనుమకొండ డిఎంహెచ్ఓ సైతం స్పందించకుండా, హాస్పిటల్ పై ఎలాంటి యాక్షన్ కూడా తీసుకోలేదు ఇప్పటివరకు. అప్పుడే వాళ్లు స్పందించి హాస్పిటల్ లో వైద్యులు ఎవరున్నారు? ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు? క్వాలిఫైడ్ డాక్టర్లు ఉన్నారా? లేదా? అనే విషయాన్ని పరిశీలించి చర్యలు తీసుకోవాల్సిన వైద్యశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం గమనార్హం.

గతంలో ఒక జర్నలిస్టుకు చేసిన అపెండిక్స్ ఆపరేషన్ సైతం ఫెయిల్యూర్

Hospital

బంధన్ హాస్పిటల్ వైద్యుల నిర్వాకం వల్ల తాను ప్రాణాపాయ స్థితికి వెళ్లి నెలల పాటు మంచానికి పరిమితం అయ్యానని బాధితుడు జర్నలిస్టు కృష్ణ పేర్కొన్నారు. గత ఏడాది 21 జూలైన అపెండిక్స్ సమస్యతో బంధన్ ఆసుపత్రిలో అడ్మిట్ అయిన జర్నలిస్ట్ కృష్ణకు.. అదే రోజు సాయంత్రం 6 గంటలకు సుమారు నాలుగు గంటల పైనే వైద్యులు ఆపరేషన్ చేశారు.  ఒకరోజు తర్వాత హాస్పిటల్ లో వైద్యం సరిగా లేకపోవడం గ్రహించిన కుటుంబ సభ్యులు.. వైద్యులను అడగగా.. ఎవరూ స్పందించకపోవడంతో.. ఆపరేషన్ వికటించిందని భావించి..జూలై 23 రాత్రి వరంగల్ మెడికవర్ హాస్పటల్ కి వెళ్లారు. అక్కడ వైద్యులు రోగిని చెక్ చేసి పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో వెంటనే హైదరాబాద్ బేగంపేట మెడికోవర్ హాస్పటల్ కి వెళ్లి అడ్మిట్ అయ్యారు. మెడికవర్ ఆస్పత్రికి చేరుకున్న రోగిని చూసిన వైద్యులు ఇన్ఫెక్షన్ ఎక్కువ స్థాయికి చేరుకుందని అబ్జర్వేషన్ లో ఉంచి మరో ఆపరేషన్ చేశారు. దానికి పూర్తిగా అయిన ఖర్చు రూ.14 లక్షలు.. దానికి తోడు ఆరు నెలల పాటు పూర్తి స్థాయిలో రెస్ట్ తీసుకోవాలని వైద్యులు తెలిపారు. ఐతే అంత పెద్దగా కావడానికి కారణం బంధన్ హాస్పటల్ లో జర్నలిస్టు కృష్ణకు 4 గంటల పాటు చేసిన వైద్యంలో

Hospital

జరిగిన తప్పిదమే కారణం అని బాధితుడు కృష్ణ ఆరోపించారు. అయితే బాధితుడు సర్జరీ చేసే సమయంలో రికార్డు అయిన వీడియో ఇవ్వమని పలుమార్లు అడిగిన కూడా బంధన్ హాస్పిటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం ఇస్తూ దాట వేయడంతో బాధితుడు తనపై చాలా ప్రయోగాలు చేశారు అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై గతంలో ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేశారు. తనకు న్యాయం చేయాలని కోరారు. సమాజంలో జరిగే మంచి చెడును విశ్లేషించే పాత్రికేయుడి నైన తనకు సదరు ఆసుపత్రిలో అన్యాయం జరగగా.., ఇక సామాన్యుడి సంగతి ఏమిటని జర్నలిస్ట్ కృష్ణ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, బంధన్ ఆసుపత్రి వెనక ఉన్న రాజకీయ అండదండలను చూసి బెదరకుండా ఆసుపత్రిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం.

కల్వకుర్తి  నేటి ధాత్రి :

 

 

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రి సూపరిండెంట్ డాక్టర్ శివరాం జన్మదినం సందర్బంగా.. శనివారం రోజు ప్రభుత్వ ఆసుపత్రిలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో యువత పాల్గొన్నారు. రక్త దానం చేయండి ప్రాణదాతలు కండి అని చెప్పారు. రక్తదానము మహాదానం మీరు దానం చేసిన రక్తము ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఒక మనిషిని ప్రాణము పోసి ఆ కుటుంబంలో ఆనందము నింపుతుంది. పరోపకార హృదయంతో మీరు చేసిన ఈ కార్యము ఎందరికో ఆదర్శ ప్రదమైనది. సమాజము పట్ల సేవా భావము కలిగిన మీ మంచి మనసుకు హృదయపూర్వకముగా అభినందనలు తెలియజేస్తున్నాము. మీరు చేసిన మానవ సేవ మానవళికి ఆదర్శమన్నారు. ఈ సందర్భంగా కల్వకుర్తి మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ శివరాం శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు యశోద భాయ్, మాజీ కౌన్సిలర్ శానవాజ్ ఖాన్, మాజీ సర్పంచ్ రాములు, ప్రభుత్వ ఆసుపత్రి కమిటీ సభ్యురాలు రేష్మ, దున్న భాస్కర్, యువ నాయకులు పడకంటి వెంకటేష్, దున్న సురేష్, శ్రీశైలం, శివ, ఆసుపత్రి సిబ్బంది శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్.!

వర్ధన్నపేట ఏరియా హాస్పటల్ ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్…

డ్యూటీకి డుమ్మా కొట్టిన 15 మంది డ్యూటీ డాక్టర్లు…

డాక్టర్లు,నర్సుల హాజరు రిజిస్టర్ ని పరిశీలించిన కలెక్టర్…

బయోమెట్రిక్,హాజరు బుక్ పంపించాలని సూపర్డెంట్ ని హెచ్చరించిన కలెక్టర్…

రోగులకు తగు సౌకర్యాలు ఏర్పాటు చేయాలని తెలిపిన కలెక్టర్…

వర్దన్నపేట (నేటిదాత్రి):

 

 

వర్ధన్నపేట ప్రభుత్వ ఏరియా దవాఖాన ని జిల్లా కలెక్టర్ సత్య శారదా ఆకస్మికంగా తనిఖీ చేశారు. కలెక్టర్ హాస్పటల్ ల్లో విజిట్ చేసే సమయానికి ఈ రోజు డ్యూటీలో ఉండాల్సిన 15 మంది డాక్టర్లు హాజరుకాకపోవడంతో ఆగ్రహించిన కలెక్టర్ పూర్తి వివరాలు బయోమెట్రిక్ ,హాజరు రిజిష్టర్ తో వివరాలు జిల్లా కార్యాలయానికి పంపి,హాజరు కానీ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని తెలిపిన జిల్లా కలెక్టర్, హాస్పటల్ పరిసరాల్లో రోగులకు అందాల్సిన సేవలు పై అడిగి తెలుసుకుని తాగునీరు ఏర్పాటు చేయాలని మరియు ఒపీ వద్ద ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు…
హాస్పటల్లో డ్యూటీ చేస్తున్న నర్సులు హాజరు రిజిష్టర్ ని పరిశీలించి చికిత్సకు హాస్పటల్ వస్తున్న వారిపట్ల మర్యాదగా ఉండాలని రోగులకు సేవ చేస్తూ తగు గుర్తింపు తెచ్చ

పాపాల రోహిణి..సీజ్‌ కాలేదెందుకని!?

`కాపాడుతున్న అదృశ్య శక్తి ఎవరు?

`సీఎం. రేవంత్‌ రెడ్డి ఆదేశాలు దిక్కరిస్తున్నదెవరు?

`‘‘సిఐడి’’ విచారణలో తేలిన నిజం.

Rohini super speciality hospital hanamkonda

`రోహిణిని ముట్టుకునే ధైర్యం లేదా!మూసేసే శక్తి లేదా!?

`అలాంటప్పుడు జాబితాలో ఎందుకు చేర్చారు!

`చిన్నా చితకా ఆసుపత్రులు మూసేసి, రోహిణి ని ఎందుకు వదిలేశారు!

`ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతరు చేస్తున్నారా?

`మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా?

`ధైర్యం చాలడం లేదని చెబుతున్నారా?

`అవినీతికి పాల్పడిన ఆసుపత్రులు మూసి, రోహిణి వైపు ఎందుకు చూడడం లేదు?

`వైద్య ఆరోగ్య శాఖ పెద్దల సమాధానం అర్థం లేనిది.

`‘‘డిహెచ్‌’’ ను అడిగితే ‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లకు ఆదేశాలిచ్చామంటారు.

`‘‘డిఎంఅండ్‌హెచ్‌ఓ’’ లు ‘‘కలెక్టర్‌’’ ఆదేశాలు కావాలంటారు.

`ఈ తికమక వ్యవహారం ఒక్క రోహిణికే ఎందుకు?

`ప్రభుత్వమే భయపడిపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి?

`‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’ నిధులను దుర్వినియోగంపై ‘‘సిఐడి’’ విచారణ ఎందుకు వేసినట్లు?

`‘‘సిఐడి’’ విచారణ చేసి ఆసుపత్రుల లిస్ట్‌ ఇచ్చిన తర్వాత మీన మేషాలెందుకు?

`ఆది నుంచి రోహిణి వివాదాలే! అక్రమాలే!!

`సరైన ‘‘ఫైర్‌ సేఫ్టీ’’ లేక ఏం జరిగిందో తెలుసు.

`‘‘కాలం చెల్లిన మందుల అమ్మకాలతో’’ పట్టుపడిన వైనం తెలుసు.

`ఇప్పుడు ‘‘సిఎంఆర్‌ఎఫ్‌’’. నిధుల గోల్‌మాల్‌ చూస్తున్నాం.

`రోహిణి సీజ్‌ కాకుండా అడ్డుపడుతున్నదెవరు?

`ఎందుకు జాప్యం చేస్తున్నారు?

`కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నదెవరు?

ఒకటి కాదు. రెండు కాదు..ఒకసారి కాదు. రెండు సార్లు కాదు..అనేకసార్లు హన్మకొండలో వున్న రోహిణీ ఆసుపత్రి మీద ఆరోపణలున్నాయి. వివాదాలు చెలరేగాయి. మోసాలు, ద్రోహాలు, పాపాలు చేసినట్లు రుజువులు కూడా అయ్యాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఆసుపత్రుల అడ్డగోలు సంపాదనలు, సిఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల కుంభకోణాలపై సిఐడి చేత విచారణలు చేపట్టాయి…దర్యాప్తులు కూడా చేయించాయి. అందులోనూ రోహిణీ ఆసుపత్రి పేరు జాబితాలో వుంది. ఈ ఆసుపత్రిలో సిఎంఆర్‌ఎఫ్‌ రీఎంబర్స్‌ మెంటులో పెద్దఎత్తున అక్రమ లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. లెక్కలు తేల్చారు. ముఖ్యమంత్రి సహాయ చెక్కుల నిధుల గోల్‌మాల్‌కు పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి పాల్పిడినట్లు తేలింది. రాష్ట్రంలో ముఖ్యమంత్రి సహాయ నిధి నిధుల విషయంలో 28 ఆసుపత్రులు తప్పుడు, అనుమానాస్పద బిల్లులు సమర్పించి, కోట్ల రూపాయల నిధులను కొట్టేసినట్లు సిఐడి విచారణలో వెల్లడైంది. అందులో ప్రముఖ హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి కూడా వుంది. క్రిమినల్‌ ఎస్టాబ్లిష్‌ మెంట్‌ యాక్ట్‌`2010 ప్రకారం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటున్నారు. ఆయా ఆసుపత్రుల రిజిస్ట్రేషన్లు రద్దు చేస్తున్నారు. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో ఆసుపత్రులను సీజ్‌ చేశారు. కాని హన్మకొండలోని రోహిణీ ఆసుపత్రి వైపు వైద్యశాఖ ఉన్నతాదికారులు కన్నెత్తిచూడడం లేదు. సిఐడి జరిపిన విచారణలో పెద్దఎత్తున రోహిణీ ఆసుపత్రి సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల వ్యవహారంలో పెద్దఎత్తున నిధుల గోల్‌మాల్‌కు పాల్పడినట్లు తేలినా, ఎందుకు అధికారులు స్పందించడంలేదు. అలసత్వం ఎందుకు చేస్తున్నారు. రోహిణీని సీజ్‌ చేయడంలో ఎందుకు ముందు,వెనుకాడుతున్నారు. రోహిణీ ఎన్ని పాపాలు చేసుకుంటూ పోతున్నా జిల్లా అదికార యంత్రాంగం పట్టించుకోదా? నేరాలు రుజువైనా చర్యలు తీసుకోకుండా ఊరుకుంటారా? వెంటనే ఆ ఆసుపత్రులను రిజిస్ట్రేషన్‌ రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలను జిల్లా అదికారులు దిక్కరిస్తున్నారా? ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఆదేశాలను కూడా అదికారులు బేఖాతరు చేస్తున్నారా? రోహిణీ చేస్తున్న మోసాలు చూసి చూడనట్లు వదిలేద్దామనుకుంటున్నారా? ప్రజల ప్రాణాలు తోడేస్తున్నా, ప్రభుత్వ నిధులు కాజేస్తున్నా పట్టించుకోరా? రోహిణీ ఆసుపత్రిపై ఎన్ని వివాదాల చుట్టుముట్టినా ఇప్పటి వరకు వదిలేశారు. ఇప్పుడు సిఐడి దర్యాప్తు రిపోర్టును కూడా పక్కన పెడతారా? లేదా జాబితా నుంచి రోహిణీ ఆసుపత్రి పేరు తొలగిస్తారా? ఏం చేయాలనుకంటున్నారు? ఇలా రోహిణీలాంటి ఆసుపత్రులు బరితెగించి ప్రభుత్వ సొమ్మును కోట్లలో మెక్కుతుంటే కూడా వదిలేయాలనుకుంటున్నారా? రాష్ట్ర ప్రభుత్వం చేయించిన దర్యాప్తును చెత్తబుట్టకు పరిమితం చేస్తారా? అలాంటప్పుడు వ్యవస్దలెందుకు? విచారణలెందుకు? ఆ దర్యాప్తులెందుకు? నివేదికలు ఎందుకు? ఆసుపత్రులు ఎన్ని తప్పులు చేసినా వదిలేసినప్పుడు, ప్రభుత్వం అనవసరంగా వాటిపై నిఘాలు పెట్టడం ఎందుకు? ప్రజల పన్నులతో వ్యవస్దలను నిర్మాణం చేయడమెందుకు? ప్రాణాలు పోయాల్సిన రోహిణీ లాంటి ఆసుపత్రిలో ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలౌతున్నప్పుడు చూసీ, చూడనట్లు వదిలేశారు. గతంలో అనేక తప్పుల మీద తప్పులు చేసినా ఉపేక్షిస్తూనేపోయారు. ఇప్పటికే అనేకసార్లు ప్రజా సంఘాలు రోహిణీ మీద చర్యలు తీసుకోవాలంటూ ధర్నాలు, నిరసలు చేపట్టారు. అప్పుడూ చర్యలు తీసుకున్నది లేదు. ఇప్పుడు సాక్ష్యాత్తు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టిన విచారణలో రోహణీ ఆసుపత్రి దోషి అని తేలింది. నిదుల గోల్‌ మాల్‌ చేసినట్లు వెల్లడైంది. అయినా అదికారుల్లో చలనం లేదు. కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. రోహిణీ ఆసుపత్రి సీజ్‌ చేయడానికి అదికారులు ధైర్యం చేయడంలేదు. ప్రభుత్వానికన్నా పెద్ద వ్యక్తులు ఎవరైనా వున్నారా? వాళ్లేమైనా ప్రభుత్వ అధికారులను ఆపుతున్నారా? తప్పుల మీద తప్పులు, నేరాల మీద నేరాలు చేస్తూ పోతోంది. ఇవన్నీ వాస్తవాలు కాదా? రోహిణీ మరింత దోపిడీకి వైద్య వర్గాలు సహకరిస్తున్నట్లు కాదా? రోహిణీ ఆసుపత్రిని ముట్టుకునే ధైర్యం ఎవరూ చేయడం లేదు. ఆ ఆసుపత్రి వైపు వెళ్లేందుకు అదికారులు కుంటి సాకులు చెబుతున్నారు. అంటే అధికారులు కూడా తప్పులు చేసి వుండాలి. లేకుంటే ఆసుపత్రి వర్గాలకు భయపడుతూనైనా వుండాలి. ఇందులో ఏది నిజమో అధికారులే చెప్పాలి. రోహిణీని ముట్టుకునే శక్తి లేనప్పుడు ఆ ఆసుపత్రిని జాబితాలో ఎందుకు చేర్చారు? చిన్నా చితకా ఆసుపత్రులను హడావుడిగా రాత్రికి రాత్రి మూసేశారు. రోహిణీ ఆసుపత్రి వైపు కన్నెత్తి చూడాలంటే అదికారులు భయపడుతున్నారు. అధికారులు మామూళ్ల మత్తులో వదిలేస్తున్నారా? లేక ధైర్యం చాలడం లేదని చేతులెత్తేస్తున్నారా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అవినీతికి పాల్పడిన తర్వాత ఎంత పెద్ద ఆసుపత్రి అయితే ఏమిటి? దాని వెనక ఎంత పెద్దవాళ్లు వుంటే ఏమిటి? అదికారులు తమ కర్తవ్యాన్ని నిర్వర్తించడంపోవడం విచారకరం. ఇక్కడ విచిత్రమైన విషయమేమిటంటే రోహిణీ ఆసుపత్రిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని డైరక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ను ప్రశ్నిస్తే, డిఎంఅండ్‌హెచ్‌ఓలకు ఆదేశాలు జారీ చేశామని చెబుతున్నారు. డిఎంఅండ్‌హెచ్‌వోలతో మాట్లాడితే కలెక్టర్‌ ఆదేశాలు ఇంకా రాలేదని తప్పుదోవ పట్టిస్తున్నారు. ప్రభుత్వమే ఆ ఆసుపత్రుల లైసెన్సులు రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఎక్కడా కలెక్టర్‌ దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించలేదు. సిఐడి నివేదికలో ఏమైనా పొరపాట్లు వున్నాయా? తేల్చమని కలెక్టర్లను కోరలేదు. అలాంటప్పుడు ఆసుపత్రులను సీజ్‌ చేయడానికి కలెక్టర్‌ ఎందుకు? కలెక్టర్‌ను ఎందుకు బద్‌నాం చేస్తున్నారు? అది కూడా సరే అనుకున్నా, కలెక్టర్‌ దృష్టికి జిల్లా వైద్యాధికారులు తీసుకెళ్లారా? అంటే అదీ లేదు. కాని కలెక్టర్‌ పేరు చెప్పి జాప్యం చేస్తున్నారు. ఇలాంటి తికమక వ్యవహారాలు ఒక్క రోహిణీకే ఎందుకు? తెలంగాణలో ఇప్పటి వరకు సీజ్‌ చేసిన ఏ ఆసుపత్రి విషయంలో అదికారులు ఇలా మీన మేషాలు లెక్కించలేదు. కనీసం ఆయా ఆసుపత్రులకు వారం రోజులకన్నా ఎక్కువ గడువు ఇవ్వలేదు. కాని రోహిణీకి మాత్రమే ఈ మినహాయింపు ఎందుకు అన్నది అందరూ అడుగుతున్న ప్రశ్న. ప్రభుత్వ వైద్యాదికారులే ఆసుపత్రి వర్గాలకు భయపడుతుంటే, సామాన్యులకు న్యాయంచేసేదెవరు? సామాన్యులకు అండగా నిలిచేదెవరు? ఆది నుంచి రోహిణీ విషయంలో అన్నీ వివాదాలే. గతంలో ఫైర్‌ సేప్టీలేకపోవడంతో ఆసుపత్రిలో ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఆసుపత్రిలో మంటలు చెలరేగి రోగులుకూడా చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి సంఘటనలు జరగడం దురదృష్టకరం. అంటే ఆసుపత్రి యాజమాన్యం ఎంత నిర్లక్ష్యంగా వుందో ఆ సంఘటనతో తేలిపోయింది. అప్పుడే ఆసుపత్రి మీద చర్యలు తీసుకోవాల్సి వుంది. కాని అప్పుడూ అదికారులు ధైర్యం చేయలేదు. కనీసం ఆసుపత్రికి నోటీసులు కూడా జారీచేయలేదు. తర్వాత అదే ఆసుపత్రిలో కాలం చెల్లిన మందులను మెడికల్‌ షాపుల ద్వారా రోగులకు అంటగడుతూ వచ్చారు. ఆ విషయంలో కూడా రోహిణీ ఆసుపత్రిలో అక్రమ సంపాదన పైత్యం వెలుగు చూసింది. అదే ఆసుపత్రిలో వైద్యానికి వచ్చిన రోగులకు గడువు ముగిసిపోయిన, కాలం చెల్లిన మందులను అదే ఆసుపత్రి వైద్యానికి ఇస్తే ఏం జరగుతుందో తెలియందా? అంత దుర్మార్గానికి ఒడిగట్టిన ఆసుపత్రిపై ప్రభుత్వ వర్గాలకు ప్రేమ ఎందుకు? అధికారులకు ఆసుపత్రి మీద మమకారమెందుకు? ఏ ఆసుపత్రిలోనైనా ఇంత దుర్మార్గం వుంటుందా? వైద్యానికి వచ్చిన రోగులకు పాడైపోయిన మందుల చేత వైద్యం చేసే ఆసుపత్రులు ప్రపంచంలో ఎక్కడైనా వుంటాయా? ఆ ఆసుపత్రికి రోగులంటే ఎంత నిర్లక్ష్యమో! ఇక్కడే తేలిపోయింది. పట్టుబడిరది. అయినా చర్యలు తీసుకున్నది లేదు. ఆసుపత్రిని సీజ్‌ చేసిందిలేదు. ఇప్పుడు కూడా ఆసపత్రిపై చర్యలు తీసుకుంటారన్ననమ్మకం లేదని ప్రజా సంఘాలు అంటున్నాయి. సిఎంఆర్‌ఎఫ్‌ నిధుల గోల్‌ మాల్‌ జరిగిందని తెలిసి ప్రభుత్వం వేసిన సిఐడి విచారణకు క్రెడిబిలిటీ లేనట్లేనా? రోహిణీ ఆసుపత్రికి మినహాయింపు ఇచ్చినట్లేనా? రోహిణీ ఎన్ని పొరపాట్లు చేసినా అదికారులు ఉపేక్షించుకుంటూ పోతూనే వుంటారా? ఎవరు సమాధానం చెబుతారు?

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

కలెక్టర్ ప్రభుత్వ ఆసుపత్రి తనిఖీ

బాలానగర్ /నేటి ధాత్రి

 

మహబూబ్ నగర్ జిల్లా బాలానగర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని సోమవారం కలెక్టర్ విజయేందిర బోయి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో సిబ్బంది కొరతపై ఆరా తీశారు. సిబ్బంది సమయపాలన పాటించి ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల మర్యాదగా ప్రవర్తించి రోగులకు ఉచిత వైద్యం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యురాలు నేహా ఫరీద్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఏర్పాటు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కూలింగ్ వాటర్ ఫ్రిడ్జ్ ఏర్పాటు

ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ పరమేశ్వర్ రెడ్డి

ఏఎస్ రావు నగర్ నేటి ధాత్రి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లానేటిధాత్రి:

 

ఎఎస్ రావు నగర్ డివిజన్ లోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో ఏ ఎస్ రావు నగర్ డివిజన్ అధ్యక్షులు కేశెట్టి ప్రసాద్ తల్లి గారి జ్ఞాపకార్థం ఏర్పాటుచేసిన వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి ప్రారంభించారు వారు ఈ యొక్క కార్యక్రమంలో మాట్లాడుతూ
ఆరోగ్య కేంద్రంలో వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేయడంతో రోగులకు, ఆస్పత్రిలో పని చేసే సిబ్బందికి వేసవిలో దాహార్తిని తీర్చేందుకుఉపయోగపడుతుందని అన్నారు
వాటర్ కూలింగ్ ఫ్రిడ్జ్ ను ఏర్పాటు చేసినందుకు కేశెట్టి ప్రసాద్ ను ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి అభినందించారు.
కార్యక్రమంలో కో ఆర్డినేటర్ రాజేంద్రన్, కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్, సీనియర్ నాయకులు అజిజ్, సుంకు శ్రీకాంత్ రెడ్డి, పెద్ది నాగరాజు, పెద్ది శ్రీను, తాడూరి అనిల్ కుమార్, భద్రగామ నరసింహ, మామిడి శ్రీనివాస్, పూర్ణ యాదవ్, మల్లారెడ్డి,శ్రీహరి, సత్యనారాయణ, తాడూరి ఉష రాణి,భవాని, సునీత, సంధ్య, మాదవి, మీనా, రాణి,మరియ తదితరులు  పాల్గొన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి.

ప్రభుత్వ ఆసుపత్రిలో ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఆకస్మిక తనిఖీ

సమయానికి హాజరుకాని సిబ్బంది పై చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారికి ఆదేశాలు

 

పాలకుర్తి నేటిధాత్రి

 

పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి శనివారం ఆకస్మికంగా సందర్శించారు. ఆసుపత్రిలోని పరిస్థితిని నేరుగా పరిశీలించిన వారు అక్కడి నిర్వహణ, సిబ్బంది హాజరు, ఔషధాల లభ్యత వంటి అంశాలను సమీక్షించారు. ఈ సందర్భంగా వారు ఆసుపత్రిలో కొంతమంది వైద్యులు, సిబ్బంది విధుల్లో హాజరు కాని పరిస్థితిని గమనించారు. ప్రజలకు సేవ చేయాల్సిన వారే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించటం పట్ల ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే జిల్లా వైద్యాధికారికి డిఎం అండ్ హెచ్ ఓ కి ఫోన్ చేసి, డ్యూటీలో గైర్హాజరైన సిబ్బంది పై తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడే విధంగా ప్రభుత్వ వైద్య సిబ్బంది వ్యవహరించటం సరికాదు. సమయానికి విధులకు హాజరు కావడం ప్రతి ఉద్యోగి బాధ్యత. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తప్పవు అని ఎమ్మెల్యే ఘాటుగా హెచ్చరించారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడి, అందిస్తున్న సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే, అవసరమైన ఔషధాల సరఫరా, శానిటేషన్ మెరుగుపరచాలని అధికారులకు సూచించారు. అలాగే, మాతా-శిశు విభాగాన్ని కూడా పరిశీలించి, ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ తనిఖీలో వారితో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, మండల అధికారులు కూడా పాల్గొన్నారు. ఆసుపత్రిలో సిబ్బంది హాజరు, పనితీరు పట్ల ప్రజల్లో దీర్ఘకాలంగా ఉన్న అసంతృప్తికి ఈ ఆకస్మిక తనిఖీ ఓ సందేశంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన DMHO.

ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన డి ఎం హెచ్ ఓ

 

పాలకుర్తి నేటిధాత్రి

 

జనగామ జిల్లా వైద్యాధికారి డాక్టర్ కె. మల్లికార్జున రావు బుధవారం పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు.

అనంతరం వారు మాట్లాడుతూ వైద్యులు ఎల్లప్పుడూ రోగులకు అందుబాటులో ఉండాలని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో ప్రసవాల సంఖ్య పెంచాలన్నారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకు వెళ్లి ప్రత్యేకంగా కలిసి ఆరోగ్య సూచనలు అందించాలని కోరారు. ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీల సంఖ్య పెంచాలని తల్లి శిశువు మరణాలను తగ్గించాలని అన్నారు. కుక్కకాటు,పాము కాటు, తేలు కాటు కు మందులు అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. వేసవిలో ఎండ దెబ్బకు గురి కాకుండా ప్రతి సెంటర్ లో ఓఆర్ఎస్ ప్యాకెట్లు, అలాగే మందులు అందుబాటు లో ఉండాలని ఆసుపత్రి సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో పీహెచ్ సి ఇన్చార్జి డాక్టర్ సిద్ధార్థ రెడ్డి, హాస్పిటల్ సిబ్బంది, తదితరులు ఉన్నారు.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం.

30 పడకల హాస్పటల్ పై స్పందించని మంత్రి పొన్నం

 

నేటిధాత్రి:హన్మకొండ

 

పైడిపెల్లి పృథ్విరాజ్ గౌడ్ సంస్థగత సిద్ధిపేట జిల్లా కౌన్సిల్ మెంబర్

భారతీయ జనతా పార్టీ భీమదేవరపల్లి మండల శాఖ ఆధ్వర్యంలో
గత బిఆర్ఎస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు కూడా 30 పడకల హాస్పటల్ గురించి అనేక సార్లు ఉద్యమాలు నిరాహార దీక్షలు చేపట్టి కరోనా సమయం లో మండలం లో అంబులెన్సు లేకపోతే పోరాడి ఆ ప్రభుత్వం పై ఒత్తిడి తీసుకొచ్చి అంబులెన్సు తెచ్చింది బీజేపీ భీమదేవరపల్లి మండల శాఖ అని మరిచిపోవద్దు అని. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కి 15 నెలలు అవుతున్నా భీమదేవరపల్లి మండల ప్రజల కోసం కనీసం 30 పడకల హాస్పటల్ ను కేటాయించాలని భారతీయ జనతా పార్టీ మండల శాఖ ఆధ్వర్యంలో ఈ మధ్యకాలం లో హన్మకొండ సిద్ధిపేట హైవే రోడ్డు పై మండల ప్రజలకు హాస్పటల్ కావాలని ధర్నా కార్యక్రమం చేయడం జరిగినది. అయినా ఇప్పటి వరకు కూడా
ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మరియు హుస్నాబాద్ ఎమ్మెల్యే మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించడం లేదు. మండల పేద బడుగు బలహీన వర్గాలు దాదాపు 50 వేల జనాభా ఉన్నా మండలానికి ఒక ఎండి డాక్టర్ కానీ. ఒక గైనాకలాజిస్ట్ కానీ ఎమర్జెన్సీ డాక్టర్ లేకుండా మండల ప్రజలు అల్లాడిపోతున్నారు

వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం.!

వరంగల్ క్యూర్ వెల్ హాస్పిటల్ లో దారుణం!!

వైద్యం వికటించి బాలింత మృతి

మృతికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతురాలి కుటుంబ సభ్యుల ఆందోళన

ఆసుపత్రి ముందు పెద్ద ఎత్తున మోహరించిన పోలీసులు

ఆసుపత్రి గేటు మూసివేసి ఎవరిని లోపలికి అనుమతించని వైనం.

Hospital

వరంగల్ నేటిధాత్రి.

వరంగల్ ఎంజీఎం సమీపంలోని క్యూర్ వెల్ ప్రసూతి ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది. కాన్పు కోసం క్యూర్ వెల్ ఆసుపత్రికి వచ్చిన మహిళ ప్రాణాలు కోల్పోయిన ఘటన ఆసుపత్రిలో జరిగింది. వివరాలలోకెళితే హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీసర గ్రామానికి చెందిన జినుకల ప్రవళిక (25) నిండు గర్భంతో కాన్పు కోసం ఆదివారం రాత్రి 8 గంటలకు క్యుర్ వెల్ ఆసుపత్రిలో అడ్మిట్ అయింది. గర్భిణీకి అన్ని రకాల పరీక్షలు చేసి సోమవారం ఉదయం 9 గంటలకి డెలివరీ కోసం ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్లారు. 10 గంటలకు ఆపరేషన్ సక్సెస్ అయింది ఆడపిల్ల పుట్టింది తల్లి, బిడ్డ క్షేమంగానే ఉన్నారని కుటుంబ సభ్యులకు వైద్యులు తెలిపారు. అర్థగంట గడవకముందే ప్రవళిక కు తీవ్ర రక్త స్రావం కావడం ప్రారంభమైంది. వెంటనే వైద్యులు మరల ఆపరేషన్ థియేటర్కు తీసుకెళ్లి సుమారు 15 యూనిట్ల రక్తము ఎక్కించడం జరిగింది. అయినను రక్తస్రావం అదుపులోకి రాకపోవడంతో వైద్యులు ప్రవళిక కు గర్భసంచి తొలగిస్తేనే ఎలాంటి ప్రాణాపాయం ఉండదని కుటుంబ సభ్యుల చేత బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. రాత్రి 8 గంటల ప్రాంతంలో కుటుంబ సభ్యులకు చెప్పకుండా అంబులెన్స్ ను రప్పించి ప్రవళికను అనుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించడానికి ఏర్పాట్లు చేశారు. దీంతో భయాందోళనకు గురైన ప్రవళిక సోదరుడు ప్రవీణ్ మా అక్కను చెప్పకుండా ఎక్కడకు తీసుకువెళ్తున్నారని హుటాహుటిగా అంబులెన్స్ వద్దకు పరిగెత్తే క్రమంలో మెట్ల పైనుంచి జారిపడి కాలు విరగడం జరిగింది. అయినా ఆస్పత్రి యాజమాన్యం పట్టించుకోకుండా ప్రవళికను హనుమకొండలోని ఓ ప్రైవేట్ హాస్పటల్ కు తరలించారు. తీరా అక్కడికెళ్లాక ప్రవళిక మరణించిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆందోళనకు గురైన ప్రవళిక భర్త రాజు మరియు తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు క్యూర్ వెల్ ఆస్పత్రి వైద్యులను అడగగా మాకు ఏమీ సంబంధం లేదు అన్నట్లు నిర్లక్ష్యంగా వ్యవహరించారని తెలిపారు. ఖచ్చితంగా ఇది వైద్యుల నిర్లక్ష్యం వల్లనే జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు మాకు సరైన న్యాయం చేయాలని ఆస్పత్రి నందు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వరంగల్ ఏసిపి నందిరం నాయక్ ఆసుపత్రి వద్దకు వచ్చి ఏలాంటి సంఘటనలు జరగకుండా బందోబస్తు చేపట్టారు. ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు ఆసుపత్రి యాజమాన్యంతో చర్చలు చేస్తున్నారు.

Hospital

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం.

హుగ్గెల్లి బస్తీ దవఖానకు పదిహేను వేలు ఆర్థిక సహాయం

జహీరాబాద్. నేటి ధాత్రి:

జహీరాబాద్:బస్తీ దవఖానలో చిన్న చిన్న మరమ్మత్తుల కోసం సీనియర్ జర్నలిస్ట్ షకిల్ అహ్మద్ రూ. 15,000 నగదు అందజేశారు. ఈ మొత్తాన్ని ఏఎన్ఎం బి. రేణుక కు అందించారు, దవఖానకు రంగులు వేయించడం, రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడడం కోసం ఉపయోగించుకోవాలని సూచించారు.ఆరోగ్య సేవలు మెరుగుపరిచే లక్ష్యంతో తాను సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో మరెవరైనా ఆర్థిక సహాయం అవసరమైతే తనను సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్.!

వనపర్తి లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ బిసి మాజీ ఎమ్మెల్యేల

పేరు ప్రకటించినందుకు సీఎం ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు

వనపర్తి నెటిదాత్రి:

వనపర్తి జిల్లా కేంద్రంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్ హాస్పిటల్ దివంగత వనపర్తి బీసీ మాజీ ఎమ్మెల్యేలు డాక్టర్ బాలకృష్ణయ్య ఎం జయ రాములు యాదవ్ పేర్లు వనపర్తి లో జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి ప్రకటించినందుకు మాజీ ఎమ్మెల్యే జయ రాముల కుటుంబ సభ్యులు అరవిందు వశిష్ట భరణి అరుణ రోహిణి అల్లుడు రంగస్వామి ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము 40 సంవత్సరాలు నుండి మా కుటుంబ సభ్యులం వనపర్తి లో లేకున్నా అఖిలపక్ష ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సతీష్ యాదవ్ పోరాటం చేసి బీసీ ఎమ్మెల్యేల పేర్లు పెట్టుటకు వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి తీసుకపోయినందుకు అభినందించారు .ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే మెగా రెడ్డికి ఐక్యవేదిక అధ్యక్షులు సతీష్ యాదవ్ కు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకులు కొత్త గొల్ల శంకర్ గౌని కార్డు యాదయ్య బొడ్డుపల్లి సతీష్ నాగవరం వెంకటేష్ పుట్టపాకల బాలు రాములు యాదవ్ రాజేష్ బాబుగౌడ్ నరసింహ తిమ్మన్న ఒక ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు

మెరుగైన వైద్యం అందించాలి.

వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్యం అందించాలి.

ఎం ఎం ఆర్ ఐ, సిటీ స్కానింగ్ ఏర్పాటు చేయాలని ఎం ఎస్ ఎఫ్ డిమాండ్.

చిట్యాల:నేటి ధాత్రి 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో స్టూడెంట్స్ ఫెడరేషన్ భూపాలపల్లి జిల్లా సీనియర్ నాయకులు అంబాల అనిల్ కుమార్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చెయ్యగ ఈ సమావేశంలో పాల్గొన్న అంబాల అనిల్ కుమార్ మాదిగ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాల ప్రజలకు పేద వర్గాల ప్రజలకు బడుగు బలహీన వర్గాల ప్రజలకు దళిత వర్గాల ప్రజలకు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనార్టీ బహుజన వర్గాల ప్రజలకు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న ప్రజలకు అడవి ప్రాంతాల్లో జీవనం కొనసాగిస్తున్న ఆదివాసులకు గోండు కోయ లంబాడి యానాది కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తూ బతుకుతున్న ప్రజలందరికీ వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన వైద్యం అందుబాటులో లేక అనారోగ్య సమస్యలతో బాధపడే పేద వర్గాల ప్రజలకు సరైన మార్గం చూపాలని అంబాల అనిల్ కుమార్ అన్నారు భూపాలపల్లి జిల్లాలో ఉన్న వంద పడకల ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యం అందించకపోవడం సమస్యలకు అనుగుణంగా పరికరాలు లేకపోవడం చాలా బాధాకరమని మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర దూర ప్రాంతానుంచి కనీసం ఆసుపత్రికి రావడానికి కూడా ప్రజల దగ్గర డబ్బులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి రోగులను ఎంజీఎం కి తరలించడం చాలా బాధాకరం అని ఆయన అన్నారు గ్రామీణ ప్రాంతాల్లో నుంచి ఇతర ప్రాంతాల్లో నుంచి జిల్లా కేంద్రానికి రావడానికి ఆర్థికంగా డబ్బు లేక తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న ప్రజలు వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మరియు ఇతర హైదరాబాదులో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్స్ వైద్యం కోసం సమస్యను బట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు జిల్లా కేంద్రానికి రావడానికె తీవ్రమైన ఇబ్బంది పడుతున్న ప్రజలు భూపాలపల్లి జిల్లా వంద పడకల హాస్పిటల్ లో సరైన వైద్యం లేక సిటీ స్కానింగ్ ఎమ్మారై స్కానింగ్ మరియు సరైన ఆపరేషన్ థియేటర్ లేక అన్ని సమస్యలకు పరిష్కార మార్గం చూపడానికి తక్షణమే జిల్లా కేంద్రంలో ఉన్నా వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేయాలని ప్రతి సమస్యకు పరిష్కార మార్గం ఉండే విధంగా ప్రభుత్వం మరియు ప్రభుత్వ రంగంలో పనిచేస్తున్న అధికారులు తక్షణమే స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిని డెవలప్మెంట్ చేసి జిల్లాలో ఉన్న ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లకుండా ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజలకున్న సమస్యలు పరిష్కరించి ప్రజలకు న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని జిల్లా అధికారులను జిల్లా కలెక్టర్ ని హాస్పటల్ సూపర్డెంట్ ని జిల్లా డిఎంహెచ్వో ని మరియు జిల్లాలో ఉన్న వైద్యాధికారులను కోరుతున్నాము, వారం పది రోజుల్లో సమస్యలకు పరిష్కార మార్గం చూపకపోతే రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఆసుపత్రి ముందు సమస్యలను ఉద్దేశించి కలెక్టరేట్ ముందు సమస్యలు పరిష్కరించేదాకా ధర్నాలు చేపడతామని సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు పోరాటం చేస్తామని పిలుపునిస్తున్నాము అని అన్నారు, అనిల్ కుమార్ఈ కార్యక్రమంలో ఎమ్మెస్ ఎఫ్ మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు రాజేందర్ నాగరాజు రాజకుమార్ గణేష్ రాజు రణధీర్ రామంజు లక్ష్మీ సాయి మరియు తదితర మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్ నాయకులు పాల్గొన్నారు.

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్లనునియమించాలి

జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇచ్చిన ఎమ్మార్పీఎస్ టీజీ నాయకులు

చిట్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ల నియమించాలని ఎమ్మార్పీఎస్ టీజీ జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాదిగ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కీ వినతి పత్రం ఇవ్వడం జరిగింది
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఎలుకటి రాజయ్య మాట్లాడుతూ గతంలో చిట్యాల హాస్పిటల్లో అనేక డెలివరీ కేసులు అత్యవసర కేసులకు చికిత్స అందించేవారు. అటువంటి హాస్పిటల్ నేడు దయనీయ పరిస్థితిలో ఉందని మొత్తంగా 18 మంది డాక్టర్లు ఉండవలసిన ఆస్పత్రిలో ప్రస్తుతానికి ఆరుగురు డాక్టర్లతో తూతూ మంత్రంగా వైద్య సేవలని అందిస్తున్నారని దుయ్యబట్టారు …. గైనిక్,, అనస్తీసియా,, పీడియాట్రిక్ డిపార్ట్మెంటులో ఇద్దరేసి డాక్టర్ల చొప్పున ఉంటూ వైద్యాన్ని అందించాల్సి ఉండగా వైద్యుల కొరత వల్ల అనేక ఎమర్జెన్సీ కేసులు ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు భూపాలపల్లి పరకాల హనుమకొండ వంటి పట్టణాలకు వెళ్లే క్రమంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు… కొన్నిసార్లు సమయానికి వైద్యం అందక ప్రాణాలను సైతం కోల్పోతున్నారు… గత ఆరు నెలల నుండి పరిస్థితి పూర్తి అధ్వానంగా మారింది.. ఈ విషయాన్ని స్థానిక ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ఎందుకు పట్టించుకోవడం లేదో అర్థం కావట్లేదని, పేద ప్రజల ఆరోగ్యం అంటే ఆయనకు లెక్కే లేకుండా పోతుందని మండి పడ్డారు.వెంటనే జిల్లా కలెక్టర్ నిరుపేద రోగుల పరిస్థితుల దృష్ట్యా చిట్యాల హాస్పిటల్ కు పూర్తి స్థాయిలో గైనిక్,, అనస్తీషియా,, పీడియాట్రిక్ డాక్టర్లను నియమించాలని ఆయన కోరడం జరిగింది. లేనట్లయితే చిట్యాల హాస్పిటల్ ముందు పెద్దఎత్తున ధర్నా నిర్వహిస్థామని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి శాస్త్రాల తిరుపతి శీలపాక హరీష్ మంత్రి రాజబాబు మాదిగ తదితరులు పాల్గొన్నారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version