బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస..

బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింస

జహీరాబాద్ నేటి ధాత్రి:

మూడు రోజుల క్రితం నల్గొండ జిల్లా టిప్పర్తి మండలం లో బిసి మహిళా నామినేషన్ వేసినందుకు ఆమె భర్తని కిడ్నాప్ చేసి కొట్టి హింసించి మూత్రం తాగించిన చర్యను నిరసిస్తూ టిఆర్పి పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జి జ్యోతి పండాల్ ఆధ్వర్యంలో టిఆర్పి పార్టీ నాయకులు సంగారెడ్డి జిల్లా సీనియర్ నాయకుడు నరసింహ, ఉమ్మడి మెదక్ జిల్లా సోషల్ మీడియా ఇంచార్జ్ హనుమంతు,

సంగారెడ్డి జిల్లా కార్యదర్శి వరప్రసాద్, సచిన్, మొగుడంపల్లి మండల్ శీను, మొడంపల్లి మండల్ ప్రధాన కార్యదర్శి లతీఫ్ మరియు రాము మరియు తదితరులు పోలీస్ స్టేషన్ లో కాంగ్రెస్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరియు వారి అనుచరుల పైన ఫిర్యాదు చేయడం జరిగింది.ఈ సందర్భంగా జ్యోతి పండాల్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి కాంగ్రెస్ నాయకుల తీరుపై వారి వ్యవహార శైలిపై ఎప్పటికప్పుడు ఖండిస్తూ రావడం జరిగిందని, కాంగ్రెస్ నాయకులు నాయకుల్లాగా కాకుండా దౌర్జన్యంతో రౌడీయిజం చేస్తున్నారని, అదే వైఖరితో మహిళల పట్ల కూడా అలాగే ప్రవర్తిస్తున్నారని జ్యోతి పండాల్ మండిపడ్డారు.లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మహిళల ఓట్ల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల సాధికారత కోసం కృషి చేస్తుందని కాంగ్రెస్ నాయకులు గర్వంగా చెప్పుకున్నారు, మరి మినిస్టర్ ఓదా లో ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక బీసీ మహిళ నామినేషన్ వేస్తే వారి అనుచరులు ఆమె భర్తని హింసించడం చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి మహిళల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అన్న విషయం ప్రజలు గమనించాలి.రాష్ట్రంలో బీసీల పైన ఎక్కడికక్కడ బెదిరింపులు కిడ్నాప్లు జరుగుతుంటే ఎలక్షన్ కమిషన్ పొలిటికల్ ప్రాక్టీస్ మానిటరింగ్ చేయకుండా ఏం చేస్తుందని. అలాగే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి వైఖరితో ప్రవర్తిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలని జ్యోతి పండాల్ ప్రశ్నించడం జరిగింది.
ఇతర పార్టీలైన బిజెపి, టిఆర్ఎస్, కాంగ్రెస్లో ఉన్న బీసీలకు రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగిన తీన్మార్ మల్లన్న గారిని ఆశ్రయిస్తున్నారు. వేరే పార్టీలో ఉన్న బీసీలకు మద్దతు మరియు న్యాయం జరగాలన్న కేవలం టిఆర్పి పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారు మరియు టిఆర్పి పార్టీతోనే సాధ్యమవుతుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.

సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు..

 సోషల్ మీడియా ఫేమ్ కోసం రెచ్చిపోయిన మహిళలు.. అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి..

 

ముగ్గురు మహిళలు సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం దారుణానికి ఒడిగట్టారు. ఇద్దరు అమ్మాయిల్నికిడ్నాప్ చేసి విచక్షణా రహితంగా కొట్టారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

సోషల్ మీడియాలో పాపులర్ అవ్వడం కోసం కొంతమంది దారుణాలకు పాల్పడుతున్నారు. రీల్స్ పిచ్చిలో ప్రాణాలు పోగొట్టుకోవటమో.. ఇతరుల ప్రాణాలు తీయటమో చేస్తున్నారు. తాజాగా, మధ్య ప్రదేశ్‌లో అత్యంత కిరాతకమైన సంఘటన చోటుచేసుకుంది. కొంతమంది మహిళలు రెచ్చిపోయి ప్రవర్తించారు. సోషల్ మీడియాలో ఫేమ్ తెచ్చుకోవటం కోసం అమ్మాయిల్ని కిడ్నాప్ చేశారు. అనంతరం ఆ అమ్మాయిలపై విచక్షణా రహితంగా దాడి చేశారు. దీన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. చేసిన పాపం పండి ఆ నిందితురాళ్లు జైలు పాలయ్యారు.
సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే.. జబల్‌పూర్, గ్వారీఘాట్ పోలీస్ స్టేషన్ పరిధికి చెందిన ముగ్గురు మహిళలు ఓ గ్రూపుగా మారి నేరాలకు పాల్పడుతున్నారు. వారిపై పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయి. కొద్దిరోజుల క్రితం ఈ ముగ్గురు మహిళలు ఇద్దరు యువతుల్ని కత్తితో బెదిరించి కిడ్నాప్ చేశారు. తర్వాత వారిని నిర్మానుష ప్రదేశానికి తీసుకెళ్లారు. ముగ్గురూ కలిసి అమ్మాయిల్ని దారుణంగా కొట్టారు. దాడిని మొత్తం వీడియో తీసి సోషల్ మీడియాలో సైతం పోస్టు చేశారు.ఆ వీడియో కాస్తా వైరల్‌గా మారింది. దీంతో ఓ బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. తనపై దాడి చేసిన మహిళలపై కేసు పెట్టింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ముగ్గురు నిందితురాళ్లను అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో పాపులర్ అవ్వటం కోసం ఆ ముగ్గురు మహిళలు ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వారు తరచుగా అమ్మాయిల్ని కిడ్నాప్ చేసి దాడులకు పాల్పడుతున్నట్లు వెల్లడైంది. పోలీసులు ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.

గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్…

గ్యాంగ్ రేప్ నిందితులపై పోలీస్ కాల్పులు.. ముగ్గురు అరెస్ట్

 

గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. ఈ తెల్లవారుజామున పారిపోతున్న వాళ్లపై పోలీసులు కాల్పులు జరిపి అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు.

ఇంటర్నెట్ డెస్క్: తమిళనాడులోని కోయంబత్తూరు గ్యాంగ్ రేప్ కేసులో నిందితులు అరెస్ట్ అయ్యారు. విమానాశ్రయం సమీపంలో ఆదివారం మహిళా కళాశాల విద్యార్థినిని కిడ్నాప్ చేసి లైంగికంగా వేధించినందుకు ఈ ముగ్గురు వ్యక్తులను ఇవాళ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఉదయం(మంగళవారం) తెల్లవారుజామున పోలీసులు.. నిందితుల జాడ తెల్సుకొని వారిని పట్టుకునేందుకు వారు ఉన్న ప్రాంతానికి వెళ్లారు. పోలీసుల జాడ కనిపెట్టిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు.. పారిపోతున్న నిందితుల కాళ్ల మీద కాల్పులు జరపాల్సి వచ్చింది. అనంతరం తవాసి, కార్తీక్, కాళీశ్వరన్ లను అదుపులోకి తీసుకుని, అనంతరం చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version