టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్..

టాస్క్ ఫోర్స్ సిబ్బందికి అమర హాస్పిటల్ లో మెగా మెడికల్ చెకప్

తిరుపతి(నేటి ధాత్రి) జూలై 26:

ఎర్రచందనం అక్రమ రవాణా నిరోధక టాస్క్ ఫోర్స్ (ఆర్ఎస్ఏఎస్టీఎఫ్) సిబ్బందికి అమర హాస్పిటల్ లో శనివారం మెగా మెడికల్ చెకప్ ప్రారంభమయ్యింది. ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్త ఉత్తర్వులు మేరకు, టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు గారి పర్యవేక్షణలో టాస్క్ ఫోర్స్ లోని పోలీసులు, అటవీ శాఖ ఉద్యోగులతో పాటు అవుట్ సోర్సింగ్ సిబ్బందికి పూర్తి స్థాయి మెడికల్ చెకప్ లు చేపట్టారు. శనివారం ప్రారంభమైన ఈ కార్యక్రమానికి టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ. శ్రీనివాస్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ గౌరినేని రమాదేవి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారుఈ సందర్భంగా

ఎస్పీ పీ శ్రీనివాస్ మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బందికి వార్షిక మెడికల్ చెకప్ చేయడానికి ఈ ఏడాది అమర హాస్పిటల్ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. టాస్క్ ఫోర్స్ సిబ్బంది యావన్మందికి రెండు రోజులు పాటు మెడికల్ చెకప్ చేస్తున్నారని తెలిపారు. అమర ఎండీ రమాదేవి మాట్లాడుతూ టాస్క్ ఫోర్స్ సిబ్బంది పట్ల తనకు ప్రత్యేక గౌరవం ఉందని అన్నారు. పుష్ప సినిమాలో ఉన్నది సినిమా హీరో అయితే, రియల్ హీరోలు టాస్క్ ఫోర్స్ సిబ్బందే నని కొనియాడారు. మున్ముందు అవసరమైన ఇతర చికిత్సలు కూడా అందజేస్తామని చెప్పారు. అమర చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ ఆరోగ్యం గా ఉండటమే జీవితంలో నిజమైన విజయం సాధించడమని తెలిపారు. మెడికల్ చెకప్ లో భాగంగా రక్త పరీక్షలు, బీపీ, ఈసీజీ లాంటి టెస్ట్ లు చేశారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు జి. బాలిరెడ్డి. వీ. శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ జె. శ్రీనివాస్, ఆర్ఐలు కృపానంద, సాయి గిరిధర్, సీఐ సురేష్ కుమార్, ఎస్ఐ రఫీ, ఇంకా ఆర్ఎస్ఐలు, ఇతర సిబ్బందితో పాటు హాస్పిటల్ జీఎం ఆనంద్, సీఈఓ భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version