జహీరాబాద్‌లో రైతుల కోసం కంది కొనుగోలు కేంద్రం ప్రారంభం

రైతులు కంది పంట కొనుగోలు కేంద్రన్ని సద్వినియోగం చేసుకోవాలి

◆-: డీసీఎంఎస్ ఆధ్వర్యంలో కంది కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఆత్మ కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్. సంగారెడ్డి జిల్లా శాసనసభ పరిది పట్టణంలోని డీసీఎంఎస్ కాంప్లెక్స్ లో మార్క్ ఫెడ్, నాఫెడ్ సౌజన్యంతో డీసీఎంఎస్ పర్యవేక్షణలో సిడిసి చైర్మన్ మొహమ్మద్ ముబిన్, ఆత్మ కమిటీ చైర్మన్ లు కలిసి కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం కందులకు క్వింటాల్ ధర 8 వెయ్యిల రూపాయలు నిర్ణయించిందని, ఈ యొక్క కొనుగోలు కేంద్రం రైతులకు 2 నెలల పాటు అందుబాటులో ఉంటుందని, 12 శాతం తేమతో ఉండాలని అన్నారు. అధికారులు సూచించిన ప్రమాణాలను పాటించి అధిక మట్టిని కలిగి ఉండకూడదని, ఎక్కువ శాతంలో గింజలు రంగు మారకుండా ఉండేవిధంగా రైతులు జాగ్రత్తలు పడాలని, ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించినందున రైతులు ఈ స్వర్ణ అవకాశాన్ని ఒడిసి పట్టుకోవాలని, రైతులు కొనుగోలు కేంద్రానికి పంటను అమ్మిన వెంటనే అధికారులు నేరుగా రైతుల ఖాతాలో డబ్బులను జమ చేస్తారని అన్నారు. కార్యక్రమంలో జహీరాబాద్ వ్యవసాయ సంచాలకులు భిక్షపతి, మండల వ్యవసాయ అధికారి లావణ్య, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు నరేష్ గౌడ్, మార్కెట్ సెక్రెటరీ చంద్రశేఖర్ పాటిల్, సెంటర్ నిర్వాహకులు దత్తు పాటిల్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.

తంగళ్ళపల్లి రైతు పొలం సేఫ్టీ కార్యక్రమం

రైతు పొలం బాట కార్యక్రమం..

తంగళ్ళపల్లి నేటి ధాత్రి….

తంగళ్ళపల్లి. మండలం. గండి లచ్చపేట.గ్రామంలో cess చైర్మన్ .చిక్కల రామారావు చేతుల మీదుగా రైతు పొలం బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ విద్యుత్ నివారణలో భాగంగా విద్యుత్ ప్రమాదాలు జరగకుండా తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రజలకు వివరిస్తూ. సెస్ ఆధ్వర్యంలో నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడం జరుగుతుందని విద్యుత్ అందించడంలో తీసుకోవలసిన చర్యల జాగ్రత్తల గురించి చెప్పడం జరిగిందని సెస్ సిబ్బంది ద్వారానే రైతులు విద్యుత్ మరమ్మతులు చేయించుకోవాలని. వేరే ఇతర వ్యక్తులతో .ట్రాన్స్ఫారంపై కానీ పోల్స్ పై కానీ ఎవరు మరమ్మత్తులు చేయకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ ప్రమాదాలకు గురి కావద్దని విద్యుత్ పై అవగాహన చేస్తూ ప్రజలందరూ విద్యుత్తు వినియోగంపై అప్రమత్తంగా ఉండాలని అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇట్టి కార్యక్రమంలో. సెస్. చైర్మన్. చిక్కాల రామారావు. గండిలచ్చపేట గ్రామ సర్పంచ్ జంగిటి అంజయ్య.ADE. గోపీనాథ్. AE. మధుకర్. విద్యుత్ సిబ్బంది రైతులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

https://netidhatri.com/wp-content/uploads/2025/10/download-2025-10-22T140655.340.wav?_=1

 

రైతు దుర్గయ్య మరణం… తోనిగండ్లలో విషాద ఛాయలు..

రామాయంపేట, అక్టోబర్ 22 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట మండలం తోనిగండ్ల గ్రామానికి చెందిన రైతు పేగుడ దుర్గయ్య (68) మృతి చెందడంతో గ్రామం మొత్తానికి విషాద ఛాయలు అలుముకున్నాయి.
సుమారు 25 రోజుల క్రితం పొలం పనులు ముగించుకుని ఇంటికి వస్తుండగా ఒక్కసారిగా కళ్లుచిరుగి పొలం వద్దనే కుప్పకూలిన దుర్గయ్యను చుట్టుపక్కల రైతులు గమనించారు. వెంటనే స్పందించిన వారు 108 అంబులెన్స్‌కి సమాచారం ఇవ్వగా, అతన్ని రామాయంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైద్యులు పరీక్షించి ఆయనకు రక్తపోటు అత్యధికంగా పెరగడంతో కోమాలోకి వెళ్లినట్లు నిర్ధారించారు. అక్కడి నుండి హైదరాబాద్‌కు తరలించిన కుటుంబ సభ్యులు, మేడ్చల్ సమీపంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. అయితే 26 రోజుల పాటు ప్రాణాలతో పోరాడిన దుర్గయ్య చివరకు బుధవారం తెల్లవారుజామున మృతి చెందారు.
రైతు దుర్గయ్య భార్య లక్ష్మి కూడా సుమారు ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందారు. ముగ్గురు కూతుళ్లను విడిచి వెళ్లిపోయిన దుర్గయ్య మృతితో గ్రామంలో తీవ్ర విషాద వాతావరణం నెలకొంది. కుటుంబ సభ్యుల విలాపాలతో తోనిగండ్ల గ్రామం మునిగిపోయింది.
గ్రామ పెద్దలు, స్థానిక ప్రజలు దుర్గయ్య కుటుంబానికి సానుభూతి తెలిపారు. “ఆయన ఎంతో కష్టపడి వ్యవసాయం చేసేవారు. కుటుంబం కోసం జీవితాంతం శ్రమించారు. ఆయన లేని లోటు భర్తీ చేయలేం” అని గ్రామస్థులు కన్నీటి కణాలతో గుర్తుచేశారు.

నకిలీ విత్తనాల పుణ్యమా అంటూ లక్షల్లో నష్టపోయిన రైతన్న…

నకిలీ విత్తనాల పుణ్యమా అంటూ లక్షల్లో నష్టపోయిన రైతన్న…

నకిలీ విత్తనాలతో నష్టాల్లో కూరుకుపోయిన రైతన్న…

నకిలీ మొక్కజొన్న విత్తనాలతో అన్నదాతకు నష్టాలు…

https://netidhatri.com/wp-content/uploads/2025/07/download-73.wav?_=2

నేటి ధాత్రి -మహబూబాబాద్ -బయ్యారం:-

అధిక దిగుబడి వస్తుందని,వ్యవసాయం లాభసాటిగా మారుతుందని భావించిన రైతన్నకు వ్యాపారులు నకిలీ విత్తనాలను అంటగడుతూ మోసం చేస్తున్నారు.పంట ఏపుగా వస్తుందని భావించి దుకాణదారుడు విక్రయించిన విత్తనాలు 40 రోజులు దాటిన పంట ఎదుగుదలలో మార్పు రాకపోవడంతో రైతన్న ఆవేదన చెందుతున్నారు.పెరిగిన మొక్క ఒక్కొక్కటిగా కళ్ళముందే చనిపోవడంతో రైతు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.బాధిత రైతు కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా,బయ్యారం మండలం, గంధంపల్లి గ్రామానికి చెందిన నాయిని వెంకన్న ఏడు ఎకరాల భూమి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు.మొక్కజొన్న పంట సాగు నిమిత్తం మదీనా ట్రేడర్స్ వద్ద నుండి పైనియర్ కంపెనీకి చెందిన విత్తనాలను కొనుగోలు చేశారు.

Fake corn seeds.

నాటిన విత్తనాలు 40 రోజులు దాటినప్పటికీ ఎదుగుదల రాకపోవడంతో రైతు కన్నీటి పర్యంతమైనారు.భార్య పుస్తెలతాడు తాకట్టు పెట్టి తెచ్చిన డబ్బులతో విత్తనాలు కొనుగోలు చేసిన రైతుకు మొక్కలు ఒక్కొక్కటిగా చనిపోవడంతో భార్య, భర్తలు పంట చేలో కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.తన అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని కాలం చెల్లిన విత్తనాలను అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నారని రైతు వాపోయాడు.తనకు కాలం చెల్లిన నకిలీ విత్తనాలను విక్రయించి,మోసం చేసిన సదరు మదిన ట్రేడర్స్ వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని కౌలు రైతు వెంకన్న డిమాండ్ చేశారు.నష్టపోయిన మొక్కజొన్న పంటకు నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే తమకు చావే శరణ్యమని రైతు వాపోయాడు.నకిలీ విత్తనాలను అంటగడుతూ రైతును నిండా ముంచి, పంట నష్టానికి కారకుడైన సదరు వ్యాపారస్తుడిపై ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలని రైతులు,రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

కురిసిన వాన మెరిసిన రైతు.

కురిసిన వాన మెరిసిన రైతు….

◆: రైతుల మొహంలో ఆనందం…..!

జహీరాబాద్ నేటి ధాత్రి:

జహీరాబాద్: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని ఆయా మండల,పరిధిలో ఎట్టకేలకు పది పదిహేను రోజుల తరువాత వర్షం కురవటంతో రైతులు ఆనందంతో ఉన్నారని, అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా కూడా అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు కురుస్తున్నాయి. రైతులు అనందంతో రైతులు తమ తమ పోలాలల్లో ఆయా ఖరీఫ్ సీజన్ పంటలు పత్తి మొక్కజొన్న, సోయా,మినుము, పెసర పంటలు వేసి వారం నుండి రెండు వారాలు అవుతుంది. వర్షం మాత్రమే
అలికిన సనిపి లాగానే అంతా అంతా మాత్రమేనని నాటి నుండి వర్షం కురువకపోవడంతో పంటలు అంతంతగా మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు పడుతు న్న వర్షాలతో రైతులకు మేలు కలుగుతుంది. అంతే కాకుండా కొంతమంది రైతులు ఎప్పుడు, ఎప్పుడు పత్తి మరియు సోయా తదితర పంటలు వేయడా నికి భూమిని కూడా సిద్ధంగా ఉంచారు. ఇప్పుడు వర్షాలు కురువడంతో రైతులు లక్షలలో పెట్టుబడి పెట్టి వర్షం కోసం చాలా వేచి చూడవలసిన అవసరం రావడమే కాకుండా వర్షాలు కురుస్తున్న నేల రైతుల మొహంలో చిరునవ్వులు పట్టరాని సంతోషం రైతులను కలిగించేసింది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది.

పామాయిల్ సాగు రైతును రాజును చేస్తోంది

భద్రాద్రి కొత్తగూడెం హార్టికల్చర్ అధికారి కిషోర్
డివిజన్ అధికారి రాధాకృష్ణ

చర్ల నేటి ధాత్రి:

చర్ల మండలం దానవాయిపేట గ్రామంలో ఆయిల్ ఫెడ్ అధికారుల ఆధ్వర్యంలో పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ చేశారు
మెగా ప్లాంటేషన్ డే సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హార్టీ కల్చర్ అధికారి కిశోర్ మరియు డివిజన్ అధికారి రాధాకృష్ణ పిలుపుమేరకు ఆయిల్ ఫెడ్ అధికారులు చర్ల మండలంలోని రైతులకు పూర్తి సబ్సిడీ పై పామ్ ఆయిల్ మొక్కల పంపిణీ మరియు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు చర్ల మండలంలో దాదాపు 300 ఎకరాలు సాగు లో ఉండగా విస్తీర్ణం భారీగా పెంచేందుకు ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ లను వినియోగించుకోవాలని ఆయిల్ ఫెడ్ అధికారులు పిలుపునిచ్చారు మొక్కలకే కాకుండా డ్రిప్ ఇరిగేషన్ పరికరాల పై కూడా సబ్సిడీ వస్తుందనీ తెలియజేశారు అంతే కాకుండా ఎకరానికి రూ 4200 రూపాయలు చొప్పున ప్రోత్సాహకం ఇవ్వటం జరుగుతుంది అంతర్గత పంటలపై అదనపు ఆదాయం పొందే అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ అధికారులు వికాస్ సత్యనారాయణపురం ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎమ్ శ్రీనివాసరాజు ఆదర్శ రైతు సాగి శ్రీనివాసరాజు మరియు రైతులు చలపతి వెంకటేశ్వర్లు గ్రామస్తులు తదితరులు   పాల్గొన్నారు

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం.

రైతును రాజు చేయడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం

◆: జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి…!

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

 

 

కాంగ్రెస్ అంటేనే రైతుల ప్రభుత్వం అని జహీరాబాద్ రాష్ట్ర నాయకులు ఉజ్వల్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని సమయానికి ఎరువులు అందుబాటులో ఉండడం పంటలు వేసే సమయంలో రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాలో జమ చేయడం రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వడం అనేది కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి సాధ్యమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వంలో 18 నెలలు రైతులకు ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిందని తెలిపారు రైతు రుణమాఫీ ఉచిత విద్యుత్ 200 యూనిట్లు మహిళలకు ఉ చిత బస్సు సౌకర్యం గ్యాస్ సబ్సిడీ రైతు భరోసా బీసీ కమిషనర్ ఏర్పాటు కులగణన రైతు కమీషన్ ఏర్పాటు విద్య కమీషన్ ఏర్పాటు విద్యా కమిషన్ ఏర్పాటు వైశ్య కార్పొరేషన్ రైతు కూలీలకు రైతు భరోసా సన్న వడ్లకు 500 బోనస్ ఇలాంటి అనేక పథకాలు చేపట్టిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ అని తెలిపారు.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి.

రైతుకు బాకీ ఉన్న రూ.19 వేలు చెల్లించాలి

నర్సంపేట నేటిధాత్రి:

 

రైతు భరోసా పథకం కింద ప్రతి ఎకరాకు సంవత్సరానికి 15 వేల రూపాయల చొప్పున చెల్లిస్తామని మాట తప్పిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రైతులకు బాకీ ఉన్న రైతు భరోసా రూపాయలు వెంటనే ఇవ్వాలని ఆయా రైతులకు అందించాలని బిఆర్ఎస్ పార్టీ నర్సంపేట మండల అధ్యక్షుడు నామాల సత్యనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ మండల ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా నామాల సత్యనారాయణ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన తరువాత రైతు భరోసా ఎకరాకు రూ 15 వేలు ఇస్తాం అని చెప్పి ఇవ్వకుండా రైతులకు ఎకరాకు రూ 19 వేలు బాకీ ఉన్నదని అట్టి రూపాయలు వెంటనే ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టి అధికారంలోకి వచ్చిన తరువాత
2023 – 24 రబీ లో ఒక్కో ఎకరాకు రూ,2500/- ఇవ్వకుండా మొత్తం
మొత్తం నాలుగు సీజన్లకు కలిపి ఒక ఎకరా ఉన్న రైతు కు రైతు భరోసా రూ.పంతొమ్మిది వేల రూపాయలు బాకీ ఉన్నారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహారాములు, క్లస్టర్ ఇన్చార్జి లు మోతే జై పాల్ రెడ్డి,మోతే పద్మ నాభా రెడ్డి,కోడారి రవి,మోటురి రవి,కందుల రాజి రెడ్డి,సంగెం శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న.

కరుణించు వరుణ దేవా…

వరుణుడి కోసం రైతుల ఎదురుచూపులు…

వరుణుడి రాక కోసం పడిగాపులు కాస్తున్న రైతన్న…

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి-చెరువులు,కాలువలు,కుంటలు అడుగంటిపోయినాయి…

నేటి ధాత్రి గార్ల:

జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినప్పటికీ నైరుతి రుతుపవనాలు ఆలస్యంతో మూడు వారాలైన ఒక్క వర్షం పడకపోవడంతో ఖరీఫ్ సీజన్ వెనక్కి వెళ్తుంది. ఖరీఫ్ లో వ్యవసాయ పనులు ప్రారంభానికి సరైన వర్షాలు లేవు. జూన్ నెల ప్రారంభమై 20 రోజులు దాటిన ఎండలు మండిపోతున్నాయి. రోజువారి ఉష్ణోగ్రత 35 డిగ్రీలు పైబడి నమోదు అవుతున్నాయి. చిన్నపాటి వర్షాలు కురిసిన మండుతున్న ఎండలతో వ్యవసాయ పనులు ప్రారంభానికి ఏ మాత్రం అనుకూలంగా లేవని రైతులు చెబుతున్నారు. తొలకరి చినుకులు కురుస్తాయని ఉద్దేశంతో పది రోజుల కిందట వరి దుక్కులు ప్రారంభించారు. మొక్కజొన్న, పత్తి పంటలు వేసుకున్నారు. మొలకలు వచ్చినప్పటికీ ఎండకు పంట అంతా ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు.

అధిక ఉష్ణోగ్రతలతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో చెరువులు, కాలువలు, కుంటలు అడుగంటిపోయినాయి. నీటి చుక్క కరువైంది. వరుణుడు ముఖం చాటేయడంతో ఎండలు దంచి కొడుతున్నాయి. ముందస్తు తొలకరి జల్లులకు విత్తనాలు వెతుకున్న అన్నదాతలు ఆందోళనలకు గురవుతున్నారు. బోర్లు, మోటార్లు ఉన్న రైతులు పొలాలకు తడిపేందుకు ప్రయత్నం చేస్తుంటే, ఏ సౌకర్యం లేని రైతులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షం కురిస్తేనే పంటలకు ప్రాణం అన్నట్లుగా పరిస్థితులు మారినాయి. మబ్బులు కనిపిస్తున్న, వాన మాత్రం పడకపోవడంతో పొలాల్లో మొలకెత్తిన విత్తనాలు ఎండిపోతున్నాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే రాష్ట్ర ప్రభుత్వం రైతులకు వరి, పచ్చి రొట్ట విత్తనాలు పంపిణీ చేసింది. ఖరీఫ్ సాగు వేయడానికి రైతులు సిద్ధంగా ఉన్న వర్షాలు ఎప్పుడు పడతాయా? అని ఆశతో ఎదురుచూస్తున్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియను పరిశీలించిన ఏడిఏ

నర్సంపేట నేటిధాత్రి:

 

దుగ్గొండి మండలం వెంకటాపూర్, మల్లంపల్లి గ్రామాలలో జరుగుతున్న ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ, రైతు భరోసా కొత్త దరఖాస్తులను నర్సంపేట ఏడిఏ దామోదర్ రెడ్డి పర్యవేక్షించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ రిజిస్ట్రేషన్ అనేది కేంద్ర ప్రభుత్వం ప్రతీ రైతుకు ఒక యూనిక్ ఐడిని ఇస్తుంది.అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుకు దీనిని అనుసంధానం చేయడం జరుగుతుందన్నారు.పీఎం కిసాన్ లబ్ధిదారాలకు తదుపరి విడత లబ్ది పొందుటకు ప్రామాణికoగా ఫార్మర్ రిజిస్ట్రీలొ నమోదు తప్పనిసరి చేస్తూ కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసిందని పేర్కొన్నారు.రైతులందరు ఫార్మర్ రిజిస్ట్రీలో త్వరితగతిన నమోదు చేసుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఏఓ
మాధవి, ఏఈఓ వైజయంతి,రాజేష్ లు పాల్గొన్నారు.

రైతు భరోసా పథకం.

రైతు భరోసా పథకం

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ఝరాసంగం మండల ఆయా గ్రామాల ప్రజలకు
కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు ధరఖాస్తు పెట్టుకోవడానికి .చివరి తేదీ 20 జూన్ 2025 శుక్రవారం.(వ్యవసాయ పెట్టుబడి సహాయం పథకం వానాకాలం 2025-26)
05.06.2025 వరకు కొత్తగా వచ్చిన పట్టాదారు పాస్ పుస్తకం గల రైతులు దరఖాస్తు పెట్టుకోవడానికి అవసరమైన పత్రాలు:
1. పట్టాదారు పాస్ పుస్తకం లేదా డిజిటల్ సంతకం అయినా జిరాక్స్ 2. ఆధార్ కార్డు జిరాక్స్. 3. బ్యాంకు సేవింగ్ ఖాతా జిరాక్స్. 4. పూర్తిగా నింపబడిన దరఖాస్తు ఫారం.
ఈ పత్రాలను మీ క్లస్టర్ అధికారి అయిన వ్యవసాయ విస్తీర్ణ అధికారి గారికి సమర్పించాలి.
గమనిక 1 : 05.06.2025 నాటికి భూ భారతి (ధరణి) పోర్టల్ లో ఉన్న పట్టాదారుల డేటా రైతు భరోసా పథకం కింద అర్హులైన రైతులకు సాయం అందించేందుకు భూమి పరిపాలన ప్రధాన కమిషనర్ (CCLA) నుండి పొందబడింది. డిజిటల్ సంతకం అయినా రైతులు అర్హులు.
గమనిక 2: గతంలో రైతు బంధు పొందిన రైతులు మళ్లీ దరఖాస్తు చేయవలసిన అవసరం లేదు హారి
వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించగలరు

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ.

ప్రతి రైతుకు రైతు భరోసా అందజేస్తాం జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి:

 

జిల్లాలో ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు
పాత రైతులతో పాటు కొత్త రైతులకు కూడా రైతు భరోసా ను ఎలాంటి పరిమితులు విధించకుండా అందించాలని ప్రభుత్వం నిర్మించినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు వ్యవసాయ శాఖ అధికారులకు మార్గదర్శకాలు జారీ చేశారు ఈ నెల 20వ తేదీ వరకు నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి రైతు భరోసా అందజేస్తామని ఆయన తెలిపారు
వానకాలం 2025 రైతు భరోసా నిధుల పంపిణీపై మండలాల వారీగా వివరాలు

జూన్ 18, 2025 నాటికి…
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో వానకాలం – 2025కు సంబంధించిన రైతు భరోసా నిధుల పంపిణీ విజయవంతంగా కొనసాగుతోంది. మొత్తం 282 గ్రామాల నుంచి 1,24,397 మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్దిపొందేందుకు అర్హులుగా గుర్తించబడ్డారు. ఇందుకోసం 143,99,06,145 రూపాయల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేయడానికి చర్యలు తీసుకోగా, అందులో 114,50,67,074 రూపాయలు ఖజానా ద్వారా పంపిణీకి సంబంధించి నమోదయ్యారు. కాగా ఇప్పటి వరకు 90,837 మంది రైతులకు 72,30,42,624 రూపాయల నిధులు విజయవంతంగా జమయ్యాయి.
ఈ కార్యక్రమం రైతు సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలకు నిదర్శనమని, వ్యవసాయ అధికారులు మరియు బ్యాంకర్లు సమన్వయంతో ఈ పంపిణీ సమర్థవంతంగా కొనసాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.

రైతన్న మళ్ళీ మోసపోతే గోస పడతారు.

రైతన్న మళ్ళీ మోసపోతే గోస పడతారు

స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవేస్తున్న ప్రభుత్వం

శాయంపేట నేటిధాత్రి:

shine junior college


శాయంపేట మండలం మైలా రం గ్రామంలో మండల పిఏసి యస్ వైస్ చైర్మన్ దూదిపాల తిరుపతి రెడ్డి మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల కోసం రైతులకు రైతు భరోసా ఎరవే స్తున్న ప్రభుత్వం. 18 నెలలు కాంగ్రెస్ పాలన వ్యవసాయం దారుణంగా దెబ్బతిన్నది రైతులు సాగునీరు లేక రైతు బంధు పెట్టుబడి పైసలు లేక పండించిన ధాన్యం కొనక ఉచిత ఎరువులు జాడలేక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఇబ్బందులు పడ్డారు కాంగ్రెస్ అధికారంలో ఉండి ఈరోజు వరకు దాదాపు 600 పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గత ప్రభుత్వం లో రోజు లాగా బతికిన రైతు నేడు గోస బడుతూ చస్తూ బతుకుతున్నాడు ఈ పరిస్థితి ముఖ్య కారణం రేవంత్ రెడ్డి రైతులను పట్టించుకోకపోవడం రైతుబంధు లాంటి పథకాన్ని ఆపేసి రైతు భరోసా తీసుకొస్తా మని కాలయాపన చేయడమే స్థానిక సంస్థల ఎన్నికల్లో రైతు భరోసా పైసలకు ఆశపడి రైతులు మరోసారి కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటు వేస్తే మళ్ళీ గోస పడే పరిస్థితి ఏర్పడతా యని రైతులు భావిస్తున్నారు ఇలాంటి క్లిష్ట సమయంలో రైతు భరోసా ప్లాన్ పని చేస్తుందో లేదో చూడాలి!

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు.

రైతు భరోసా పథకంకు అర్హులైన వారు పేర్లు నమోదు చేసుకోవాలి…

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

shine junior college

ఈనెల 5వ తేదీకి ముందు పట్టా పాస్ పుస్తకాలు పొంది ఉండి, రైతు భరోసా పథకంలో పేరు నమోదు కాని రైతులందరూ వారి పట్టాదారు పాస్ పుస్తకం, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా పుస్తకం తో సంబంధిత రైతు వేదికలో వ్యవసాయ విస్తరణాధికారి వద్ద పేరు నమోదు చేసుకోవాలని క్యాతనపల్లి మున్సిపాలిటీ లోని ఐదవ వార్డ్ అమరవాది లో ఏర్పాటు చేసిన భూభారతి కార్యక్రమంలో మందమర్రి ఎమ్మార్వో సతీష్ కుమార్ తెలిపారు. రైతు కార్డ్ తీసుకోనీ వారు కూడా సంబధిత అధికారులను కలిసి తీసుకోవాలని కోరారు. భూ సమస్యలన్నింటినీ సామరస్యంగా పరిష్కరించేలా చొరవ తీసుకోవాలని బత్తుల వేణు ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు
దాంక రమేష్ ,రోడ్డ రమేష్
క్యాతం పురుషోత్తం,రొడ్డ మల్లేష్, వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు.

రైతుకు చుక్కలు చూపిస్తున్న కౌలుదారుడు…

రైతు కుటుంబంపై విచక్షణరహితంగా భౌతిక దాడులు..

మహిళా రైతుపై భౌతిక దాడి చేస్తే చర్యలు ఉండవా..?

మహిళల రక్షణ పట్ల కొత్త చట్టాలు తెస్తున్న ప్రభుత్వం… తుంగలో తొక్కుతున్న అధికారులు..

పలుమార్లు కేసులు పెట్టిన బాధితులు… దాడికి పాల్పడ్డ వారికి అండగా పోలీసులు..?

కోర్టు ఆదేశాలను ధిక్కరించి… నిర్లక్ష్యపు ధోరణిలో పోలీసులు..?

భూమి కొనుగోలుకు సాక్షులు వీరే.. ప్రస్తుతం దాడులు చేసేది వీరే..

ప్రాణాలు తీసిన దిక్కులేని స్థితిలో బాధిత రైతు కుటుంబం..

కోర్టు ఉత్తర్వుల ప్రకారం భూమి కొనుగోలు రిజిస్ట్రేషన్, భూమి అగ్రిమెంటు ప్రకారం న్యాయం చేయాలని బాధిత రైతు కుటుంబం ఆవేదన..

ఇరువురి ఫిర్యాదుల మేరకు కేసు నమోదు.. సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదు.. ఎస్సై రాజేష్ రెడ్డి..

నర్సంపేట నేటిధాత్రి:

తన వ్యవసాయ భూమిని మరో వ్యక్తికి అమ్ముకొని కౌలుదారు అవతారమెత్తిన ఒక వ్యక్తి పక్కనే ఉన్న ఒక రైతు కుటుంబానికి చుక్కలు చూపిస్తున్నాడు.తన సొంత భూమి ఉన్నప్పుడు పక్కనే ఉన్న రైతుతో సన్నిహితంగా ఉంటూ పక్కలో ఇప్పుడు బల్లెంల మారాడు.తనకున్న వ్యవసాయ భూమిని మరొక వ్యక్తికి అమ్ముకొని అదే భూమిని కౌలుకు చేస్తూ పక్కనే అన్న రైతు కుటుంబంపై భౌతికదాడులకు తెగబడుతున్నాడు. కౌలుదారు కొనుగోలు చేసిన వ్యక్తి ఆయనను పక్కనే అన్న రైతు కుటుంబంపై ఒసిగొలుపుతూ అంటిఅంటకుండా వ్యవహరిస్తున్నాడు.నిత్యం కౌలుడారుడు చేసే దౌర్జన్యాలు,భౌతిక దాడుల పట్ల పోలీస్ స్టేషన్ వెళ్తే పట్టించుకోవడం మాట దేవుడెరుగు గాని బాధిత రైతు కుటుంబాన్ని బైండోవర్ చేసి ముప్పుతిప్పలు పెడుతున్న పరిస్థితి నెలకొన్నది.కోర్టు ఉత్తర్వులు తెచ్చిన కూడా అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదు.ఈ వ్యవహారం మొత్తం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలంలో జరుగుతున్నది.

పూర్తి వివరాల్లోకి వెళ్ళితే…. చెన్నారావుపేట ఉప్పరపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబ సభ్యులు సామల శాంత సాంబయ్య దంపతులు అదే గ్రామం నుండి ముదిగొండ వైపు వెళ్లే కంకర రోడ్డుకు సుమారు 3 ఎకరాల వ్యవసాయ భూమిని గత రెండు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసి వ్యవసాయం చేసుకుంటున్నారు.రోడ్డుకు ఉన్న వీరి భూమి కింది మొదటి బాగాన చీమల కర్ణాకర్ సంబంధించిన ఎకరం వ్యవసాయ భూమి ఉన్నది.అలాగే కర్ణాకర్ కింద భాగాన కావటి ముత్యాలు అనే రైతు ఎకరం భూమి ఉన్నది.ఈ ముగ్గురు రైతులు సాంబయ్య,కర్ణాకర్,ముత్యాలు వ్యవసాయ భూములకు నీటి సౌకర్యం కోసం పొత్తుల భావి సాంబయ్య,కర్ణాకర్ ల భూముల్లో ఉన్నది. ఐతే కావటి ముత్యాలు తన ఇంటి అవసరాల నిమిత్తం ఆ ఎకరం అమ్మకానికి నిర్ణయించుకున్నాడు.ముందుగా చీమల కర్ణాకర్ అనే రైతును భూమి అమ్మకం పట్ల తెలుపగా నేను కొనుగోలు చేయనని తేల్చి చెప్పేశారు.అనంతరం సామల శాంత సాంబయ్య రైతును అమ్మకం పట్ల అడుగగా వారు కొనుగోలు చేసేందుకు ఒప్పుకున్నారు.గ్రామ పెద్దల సమక్షంలో ఎకరాకు రూ.7 లక్షల 60 వేలకు మాట్లాడుకొని బయాన ఇచ్చి అగ్రిమెంట్ రాసుకున్నారు.మరల కొద్ది రోజుల తర్వాత చీమల కర్ణాకర్ ఆ భూమిని నేను కూడా తీసుకుంటామని పెద్దనుషుల సమక్షంలో మాట్లాడుకున్నారు.అనంతరం ముత్యాలుకు సంబంధించిన సర్వే నంబర్ 399 గల ఎకరం భూమి సామల శాంత సాంబయ్య,చీమల కర్ణాకర్ అదే రేటు ప్రకారంగా ఒక్కొక్కరు 20 గంటల చొప్పున కొనుగోలు చేసుకున్నారు.ఐతే ఇద్దరి భూమి సమాన ఓకె విధంగా ఉండేందుకు గాను కర్ణాకర్ కు సంబంధించిన 20 గంటల భూమిని సామల సాంబయ్యకు కేటాయించిన కర్ణాకర్.. ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల 2018 లో కొనుగోలు చేసిన ఎకరం భూమిని తనే తీసుకొని వ్యవసాయం చేసుకుంటున్నారు.ల్యాండ్ రిజిస్ట్రేషన్ చేసే క్రమంలో డాక్యుమెంట్ ప్రకారం సర్వే నంబర్ 399 తో చేర్చి వారి ఒప్పందంలో భాగంగా కర్ణాకర్ కు గల 20 గంటల భూమిని సాంబయ్యకు మారుస్తూ తూర్పున భూమి కొనుగోలు చేసిన సాంబయ్య భూమి ,ఉత్తరము రెడ్డబోయిన సాయిలు,పడమర చీమల కర్ణాకర్,దక్షణం వైపు వాగు ఉన్నట్లుగా హద్దులు నిర్ణయిస్తూ భూమిని సాంబయ్యకు రిజిస్ట్రేషన్ చేస్తూ కర్ణాకర్ సాక్షిగా ఉన్నారు.మొత్తం భూమిని వారివారి ఒప్పందాల ప్రకారం కావటి ముత్యాలు వద్ద ఇద్దరి పొత్తుల కొనుగోలు చేసిన ఒక ఎకరం భూమిని కర్ణాకర్ తన భూమితో కలిపి 1 ఎకరం 20 గంటల భూమిని సాగుచేసుకుంటున్నాడు.అలాగే సామల సాంబయ్య తన 3 ఎకరాల భూమితో పాటు అగ్రిమెంట్ కర్ణాకర్ తో కుదుర్చుకున్న 20 గంటల భూమితో కలిసి గత ఏడేండ్లుగా సాగు చేసుకుంటున్నాడు.అలాగే వాటాల ప్రకారంగా వ్యవసాయ బావిని వాడుకుంటున్నారు.గత సంవత్సరం నర క్రితం చీమల కర్ణాకర్ తన ఎకరం 20 గంటల భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారికి అమ్మకం చేశారు.పక్కనే ఉన్న లావన్ పట్టా భూమి గల వాగును దారి కోసం తన అధీనంలోకి తీసుకుందామని విక్రయదారులు కర్ణాకర్ తో ప్లాన్ చేయగా అది కాస్త బెడిసికొట్టింది.పైన రోడ్డు బాగం నుండి ఉన్న రైతు సామల శాంత సాంబయ్యను అడుగగా వారు ఒప్పుకోలేదు.ఎలాగైనా సాంబయ్య భూమి నుండి తన భూమిలోకి దారి తీసుకోవాలని కర్ణాకర్ ను నగేష్ ఒత్తిడి తెచ్చినట్లు తెలిసింది.ఐతే అదే భూమిని నగేష్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి అమ్మకం చేసిన కర్ణాకర్ కు కౌలుకు ఇచ్చాడు.దీంతో సాంబయ్య భూమిలో నుండి ఎలాగైనా దారి పొందాలని భావించిన క్రయ విక్రయ దారులు రంగం సిద్ధం చేసుకున్నారు.ఈ నేపథ్యంలో భూమిని విక్రయించిన చీమల కర్ణాకర్.

అదే భూమికి కౌలుదారుగా అవతారమెత్తాడు.గత ఏడు సంవత్సరాలుగా సాగుచేసుకుంటున్న సాంబయ్య కుటుంబంపై దాడులకు పాల్పడటం మొదలుపెట్టారు.మీరు సాగుచేసుకుంటున్న 20 గంటల భూమి మాదే అంటూ 2024 జనవరి నెలలో సామల శాంత సాంబయ్య దంపతులపై దాడి చేసి వ్యవసాయ బావికి సంబంధించిన మోటార్,స్టార్టర్ లను చీమల కర్ణాకర్,అతని సోదరుడు సతీష్ లు ధ్వంసం చేశారు.వెంటనే బాధితులు స్థానిక చెన్నారావుపేట పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.కొద్ది రోజులకే మొక్కజొన్న పంటపై కర్ణాకర్,సతీష్ లు గడ్డిమందు ప్రయోగం చేశారు.మరల బాధితులు శాంత సాంబయ్య దంపతులు పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేశారు.మరుసటి రోజున అదే మొక్కజొన్న పంటను ట్రాక్టర్ తో ఫాల్టర్ కొట్టించి దున్నించి నాపై కర్ణాకర్,సతీష్ లు మహిళా అనే ఇంగీతజ్ఞానం లేకుండా విచక్షణ రహితంగా దాడి చేశారని బాధితురాలు సామల శాంత ఆరోపించారు.ఐనప్పటికీ పోలీస్ స్టేషన్ చేసిన పిర్యాదు మేరకు ఎస్సై,సీఐలు వ్యవసాయ భూమివద్ద విచారణ చేపట్టగా సాక్షులు కూడా తమదే న్యాయం అని పోలీస్ అధికారులకు తెలిపారని వాపోయారు.తీవ్రంగా గాయాలపాలైన మమ్మల్ని ఆస్పత్రికి వెళ్ళనివ్వకుండా మా దాడికి పాల్పడ్డ వారికి సహకరిస్తూ మండల రెవెన్యూ అధికారి వద్ద బైండోవర్ చేయించారని బాధిత రైతు కుటుంబం సభ్యులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.పెద్ద మనుషుల ఒప్పందం,భూమి అగ్రిమెంట్,రిజిస్ట్రేషన్ లో హద్దుల ప్రకారంగా తమకే భూమి చెందుతుందని కోర్టు ద్వారా ఉత్తర్వులు తెచ్చుకొని భూమి సాగుచేసుకుంటున్న క్రమంలో సతీష్ , కర్ణాకర్ లు నానా దుర్భాషలాడుతూ, వెంట్రుకలు పట్టుకుని విచక్షణారహితంగా కొట్టారని మహిళా రైతు సామల శాంత రోదిస్తూ తెలిపారు.ఈ నేపథ్యంలో వారిపై పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేయగా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా మా కుటుంబాన్ని పట్టించుకోవడంలేదని బాధితులు శాంత సాంబయ్యలు అవేదన వ్యక్తం చేశారు.భూమితో వారికి ఎలాంటి సంబంధం లేకున్నా కొనుగోలు చేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నగేష్ సహకారంతో నిత్యం భయాందోళనల కల్పిస్తూ మనోవేదనకు గురిచేస్తున్నారని ఆరోపించారు.మా కుటుంబంపై దాడి చేసిన చీమల సతీష్ ,కర్ణాకర్ లపై పిర్యాదులు చేస్తే భూమి కొనుగోలు చేసిన నగేష్ తో సెటిల్ చేసుకోండని ఎస్సై రాజేష్ రెడ్డి తెలుపుతున్నారని బాధిత రైతు కుటుంబం శాంత సాంబయ్యలు ఆరోపించారు.ఎన్నిసార్లు పిర్యాదు చేసిన కానీ సతీష్ , కర్ణాకర్ లకు అండగా ఉంటూ మా ఫిర్యాదుల పట్ల

తూ తూ మంత్రంగా కేసులు నమోదు చేసి మాపై నిర్లక్ష్యంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని తెలిపారు.మా కుటుంబంపై జరుగుతున్న సంఘటనల పట్ల పోలీస్ కమిషనర్,నరంపేట ఏసిపిలకు పిర్యాదులు చేయనున్నట్లు బాధిత రైతు కుటుంబం సామల శాంత సాంబయ్యలు తెలిపారు.

ఇరువురి ఫిర్యాదులతో కేసులు చేసిన..సివిల్ కేసుల పట్ల నాకు సంబంధం లేదు… చెన్నారావుపేట ఎస్సై రాజేష్ రెడ్డి..

చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన సామల శాంత సాంబయ్య అనే రైతులు,అదే గ్రామానికి చెందిన చీమల కర్ణాకర్,సతీష్ అలాగే నగేష్ అనే వ్యక్తుల మధ్య భూ తగాదాల గొడవలు జరుగుతున్నాయి.ఒకరిపై మరొకరు కేసులు పెట్టుకున్నారు.ఇరు వర్గాలపై కేసులు నమోదు చేసినం అని ఎస్సై రాజేష్ రెడ్డి తెలిపారు.భూ తగాదాలు సివిల్ కేసుల పట్ల నాకు ఎలాంటి సంబంధం లేదని నేటిధాత్రి ప్రతినిధి అడిగిన వివరణకు ఎస్సై రాజేష్ రెడ్డి సమాధానం చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా అందజేయాలి.

నర్సంపేట,నేటిధాత్రి:

 

 

 

 

 

గత సీజయన్ లో రైతు భరోసా ఇవ్వని రైతులకు వెంటనే రైతు బరోసా డబ్భులు ఇవ్వాలని బిఆర్ఎస్ నర్సంపేట మండల పార్టీ అధ్యక్షుడు నామాల సత్యనారాయణ డిమాండ్ చేశారు. మండల పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల సమావేశంలో అధ్యక్షుడు నామాల సత్యనారాయణ మాట్లాడుతూ గతకాలం సీజన్ లో రైతులకు రైతు భరోసా కేవలం 3 ఎకరాలలోపు ఉన్న కొందరు రైతులకు మాత్రమే రైతు భరోసా వేశారని ఇప్పుడు వానాకాలం సీజన్ మొదలు అవుతుందని అన్నారు.గౌరవ తెలంగాణ తోలి ముఖ్యమంత్రి కేసిఆర్ ముఖ్యమంత్రి గా ఉన్న సమయంలో రైతు బందును సమయానికి రైతుల ఖాతాలో వేసి రైతులకు అదుకున్నారని పేర్కొన్నారు. నేడు ముఖ్యమంత్రి ఓక సీజన్ రైతు భరోసా ఇవ్వకుండా మోసం చేశాడని ఆరోపించారు.ఎలాంటి అంక్షలు లేకుండా రైతు భరోసా బాకి ఉన్న రైతులకు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రధాన కార్యదర్శి ఈర్ల నరసింహరాములు,మోతే జైపాల్ రెడ్డి,మోతే పద్మనాభ రెడ్డి,కోమల్ల గోపాల్ రెడ్డి,బండారి రమేష్,మోటూరి రవి,కోడారి రవి,తాల్లపెల్లి రాం ప్రసాద్,భూక్య వీరన్న,కడారి కుమారస్వామి,పెద్ది శ్రీనివాస్ రెడ్డి,వళ్ళల కర్ణకార్,అల్లి రవి,మర్ద నవీన్,సంగెం శ్రీకాంత్,చిప్పు రాజు తదితరులు ఉన్నారు.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలి.

ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలి
మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి

నిజాంపేట నేటి ధాత్రి:

రైతులు ఫార్మర్ రిజిస్ట్రేషన్ సద్వినియోగం చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి సోమలింగారెడ్డి అన్నారు. ఈ మేరకు నిజాంపేట మండల కేంద్రంలో గల రైతు వేదికలో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన రైతు రిజిస్ట్రేషన్ కార్డును సద్వినియోగం చేసుకోవాలన్నారు. దానికి కావాల్సిన ఆధార కార్డు, పట్ట పాస్ బుక్, లింక్ అప్ మొబైల్ నెంబర్ ను వ్యవసాయ విస్తీర్ణ అధికారులకు అందివ్వలన్నారు. ఇప్పటికే గ్రామాల్లో అధికారులు రైతుల నుండి రిజిస్ట్రేషన్లు ప్రారంభించడం జరిగిందన్నారు.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

రైతులు ఫార్మర్ రిజిస్ట్రి పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి

పరకాల క్లస్టర్ ఏఈఓ ఎం.శైలజ

పరకాల నేటిధాత్రి:

 

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు పరకాల క్లస్టర్ పరిధిలోని పరకాల,మాదారం,మల్లక్కపేట గ్రామలకు చెందిన పట్టా బుక్కు ఉన్న ప్రతీ రైతు ఫార్మర్ రిజిస్ట్రీ పోర్టల్లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని పరకాల క్లస్టర్ వ్యవసాయ విస్తరాణాధికారి(ఏఇవో) ఎం.శైలజ తెలిపారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ రైతులకు కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించే పథకాలు, సబ్సిడీలు,బీమా వంటివి ఈ గుర్తింపు కార్డు ద్వారా సులభంగా అందుతాయని,ఆకస్మికంగా వచ్చే ప్రకృతి విపత్తులు,ఇతర అత్యవసర పరిస్థితులలో సహాయం పొందడానికి ఇది ఉపయోగపడుతుందని,ప్రభుత్వం అమలు చేసే వ్యవసాయ పథకాలకు ఈ గుర్తింపు కార్డు ఆధారంగా రైతులకు సాయం అందజేస్తారని అన్నారు.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా రైతు మృతి.

ప్రమాదవశాత్తు ట్రాక్టర్ బోల్తా.. రైతు మృతి

 

తిమ్మాజీపేట/నేటి ధాత్రి :

 

నాగర్ కర్నూల్ జిల్లా బావాజీ పల్లి గ్రామంలో బుధవారం ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి చెందిన సంఘటన గ్రామంలో విషాదం నిలిపింది. గ్రామస్తులకు వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బత్తుల బాలస్వామి (55) సొంత పొలంలో ట్రాక్టర్ సహాయంతో పనులు చేస్తుండగా.. ప్రమాదవశాత్తు బోల్తా పడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య ఓ కూతురు ఓ కుమారుడు ఉన్నారు. గ్రామంలో విషాదం నెలకొంది.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి.

అప్పుల బాధతో పురుగుల మందు తాగి కౌలు రైతు మృతి

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు 40.000 ఆర్థిక సాయం
వీణవంక, ( కరీంనగర్ జిల్లా):నేటి ధాత్రి :

 

 

వీణవంక మండల పరిధిలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన మారుముళ్ల కుమారస్వామి
అనే కౌలు రైతు, అప్పుల బాధతో 21-10 -2015 నాడు పురగుల మందు త్రాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది
తమ స్వంత భూమితో పాటు కొంత భూమి ని కౌలు తీసుకొని అందులో పత్తి,వరి పంటలు సాగు చేయగా అందులో పంట దిగుబడి రాకపోవడం వలన 3 లక్షల వరకు అప్పులు కాగా
తెచ్చిన అప్పు తీర్చే మార్గం లేక
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది.
ఇతనికి ఇద్దరు పిల్లలు, కూతురు,కొడుకు ఉన్నారు. అట్టి కుటుంబాన్ని రైతు స్వరాజ్య వేదిక వారు పరామర్శించి వారి కుటుంబానికి రూరల్ డెవలప్మెంట్ సర్వీసు సొసైటీ వారికి తెలియజేయగా వారు స్పందించి ఆ సంస్థ ద్వారా 40,000 నలభై వేయిల రూపాయల ఆర్థిక సహాయంతో మేకలు కొని ఇవ్వడం జరిగింది.

రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర నాయకులు, బి, కొండల్ రెడ్డి, ముక్క ఐలయ్య సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.
ఈసందర్భంగా ఐలయ్య మాట్లాడుతూ, రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించకపోవడం వల్లనే తగిన ఆదాయం రాక తెచ్చిన అప్పులు తీర్చే మార్గం లేక కలత చెందిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆయన అన్నారు, ప్రభుత్వం ప్రవేశపెట్టిన 194, జి ఓ ల ద్వారా ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు,
6,00,000,రూలు, నష్టపరిహారం చెల్లించాలని, అదేవిధంగా రైతు ఆత్మహత్య కుటుంబాలను త్రిసభ్య కమిటీ ద్వారా గుర్తించి అర్హులైన కుటుంబాలకు, ఎక్స్ గ్రేషియ చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

రైతు ఆత్మహత్య కుటుంబాలకు రైతు స్వరాజ్య వేదిక, ఎల్లప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో కన్నూరి సదానందం రాచపల్లి సమ్మయ్య ఇంజన్ చైతన్యలు పాలుగోన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version