శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..

శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి వైద్యుల సేవలతో కోలుకున్నా బాలుడు..

రామాయంపేట, అక్టోబర్ 15 నేటి ధాత్రి (మెదక్)

 

రామాయంపేట పట్టణంలోని శ్రీరాజరాజేశ్వర పిల్లల ఆసుపత్రి,కంటి ఆసుపత్రి వైద్యులు మరోసారి తమ వైద్య నైపుణ్యాన్ని చాటుకున్నారు.జ్వరంతో బాధపడుతూ,ప్రమాదకరంగా ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గిన గజ్వేల్ మండలం లింగారెడ్డి పల్లి గ్రామానికి చెందిన రిత్విక్ నందన్ 7 సంవత్సరాల బాలుడిని విజయవంతంగా చికిత్స చేసి ఆరోగ్యవంతుడిగా మార్చారు. తీవ్ర జ్వరంతో ఆసుపత్రిలో చేరిన బాలుడి పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉండగా, పీడియాట్రిషియన్ డాక్టర్ ప్రదీప్ రావు పర్యవేక్షణలో వైద్య బృందం ప్రత్యేక చికిత్సా విధానాలతో సేవలు అందించారు.వైద్యుల కృషి ఫలితంగా బాలుడి ప్లేట్లెట్స్ కౌంట్ సాధారణ స్థాయికి చేరుకుంది.ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడటంతో శుక్రవారం బాలుడిని డిశ్చార్జి చేశారు.ఈ సందర్భంగా బాలుడి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడికి ఉత్తమ వైద్యం అందించి ప్రాణం కాపాడిన డాక్టర్ ప్రదీప్ రావు మరియు ఆసుపత్రి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.పట్టణ ప్రజలు మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో శ్రీరాజరాజేశ్వర ఆసుపత్రి అందిస్తున్న వైద్య సేవలు ఇటువంటి నిబద్ధత కలిగిన వైద్యులు రామాయంపేటకు గర్వకారణమని ప్రశంసించారు.

మ్యాచ్‌లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ….

మ్యాచ్‌లో గాయపడ్డ సాయి సుదర్శన్.. హెల్త్ అప్‌డేట్ ఇచ్చిన బీసీసీఐ

 

వెస్టిండీస్‌తో మ్యాచ్ సందర్భంగా టీమిండియా ప్లేయర్ సాయి సుదర్శన్ గాయపడ్డాడు. అతడి గాయం తీవ్రమైనది కాదని బీసీసీఐ తాజాగా హెల్త్ అప్‌డేట్ ఇచ్చింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది.

ఇంటర్నెట్ డెస్క్: వెస్టిండీస్ రెండో టెస్టులో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ టీమిండియా క్రికెటర్ సాయి సుదర్శన్ ఆరోగ్యంపై బీసీసీఐ తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడు ప్రస్తుతం బాగానే ఉన్నాడని పేర్కొంది. రెండో రోజున విండీస్ ఓపెనర్ జాన్ క్యాంప్‌బెల్ కొట్టిన బంతిని సాయి సుదర్శన్ అద్భుత రీతిలో అందుకుని అతడిని పెవిలియన్ బాట పట్టించాడు. ఈ క్రమంలో చేతికి కాస్త పెద్ద దెబ్బతగలడంతో తట్టుకోలేకపోయిన అతడు వెంటనే మైదానాన్ని వీడాడు. అతడి స్థానంలో దేవదూత్ పడిక్కల్ సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన విషయం తెలిసిందే (Sai Sudarshan BCCI Health Update).
విండీస్‌తో తాజా చివరి టెస్టు మూడో రోజున కూడా సాయి సుదర్శన్ బరిలోకి దిగలేదు. ఈ నేపథ్యంలో అతడు ఆరోగ్యంపై బీసీసీఐ కీలక అప్‌డేట్ ఇచ్చింది. అతడి గాయం తీవ్రమైనది కాదని తెలిపింది. ప్రస్తుతం అతడు బాగానే ఉన్నాడని తెలిపింది. తమ మెడికల్ టీమ్ అతడి ఆరోగ్యాన్ని నిశితంగా పరిశీలిస్తోందని పేర్కొంది. ఇక ప్రస్తుత టెస్టులో గడ్డు పరిస్థితిలో పడిపోయిన ఫాలో ఆన్ ముప్పును ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే.
ఇక రెండో టెస్టు తొలి రోజున సాయి సుదర్శన్ ఆట తీరుతో జనాల విమర్శలకు గట్టిగా బదులిచ్చారు. 87 పరుగులతో నిలకడైన ఆటతో రాణించాడు. అయితే, వైస్ కెప్టెన్ జోమెల్ వారికన్ వేసిన బంతిలో బ్యాక్ ఫుట్ షాట్‌కు ప్రయత్నించి ఎల్‌బీడబ్ల్యూగా ఔటయ్యాడు.
Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version