కుక్క,పాము,తేలు కాటు మందులను అందుబాటులో ఉంచాలి…
వైద్యులు, సిబ్బంది సమయపాలన పాటించాలి…
వైద్యులు స్థానికంగా ఉండి వైద్యం అందించాలి…
సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహనా కల్పించాలి…
అన్ని రకాల రక్త పరీక్షలు పి హెచ్ సి లోనిర్వహించాలి…
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి…
నేటి ధాత్రి -గార్ల:-
కుక్క,పాము,తేలు కాటు మందులను ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచాలని తద్వారా సకాలంలో వైద్యం సహాయం ప్రాణాలను కాపాడుతుందని ప్రగతిశీల యువజన సంఘం పివైయల్ రాష్ట్ర నాయకులు సిహెచ్ గణేష్ అన్నారు.ప్రభుత్వ వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉండాలని,సీజనల్ వ్యాధులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ పివైఎల్ ఆధ్వర్యంలో శనివారం ముల్కనూర్ పిహెచ్ సి ఎదుట నిరసన తెలిపారు.అనంతరం డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని వైద్యాధికారి డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ కు అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రజలకు ముందస్తుగా అవగాహన కల్పించాలని డిమాండ్ చేశారు.వ్యవసాయ పనులు ముమ్మరంగా ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు విష సర్పాల ప్రమాదం పొంచి ఉన్నదని అందుకు అవసరమైన వ్యాక్సిన్ లను అందుబాటులో ఉంచాలని,దోమతెరలు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు.మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో వైద్యుల సమక్షంలో హెల్త్ క్యాంపులు నిర్వహించి అవసరమైన మందులను పంపిణీ చేయాలని కోరారు.ఈ నిరసన కార్యక్రమంలో పివైఎల్ మండల అధ్యక్ష,కార్యదర్శులు కూసిని బాబురావు, గుడిచుట్టూ శంకర్, కొండల్, రమేష్, కొండల్ రావు, మాన్య, సక్రు తదితరులు పాల్గొన్నారు.