ఆర్మీ చేతికి ఏకే 203.. నిమిషానికి 700 రౌండ్లు..
AK 203 Rifle: ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రీఫైల్స్(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి.
AK-203 ‘షేర్’ రైఫిల్ విశేషాలు
ఏకే 47, ఏకే 56 గన్నుల కంటే ఏకే 203 గన్నులు ఎంతో అధునాతనమైనవి. ఇండియన్ స్మాల్ ఆర్మ్స్ సిస్టమ్ రీఫైల్స్(INSAS)ను ఏకే 203 గన్నులు రీప్లేస్ చేయనున్నాయి. ఇన్‌సాస్‌లో 5.56×45 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటే.. ఏకే 203లో 7.62×39 ఎమ్ఎమ్ క్యాడ్‌రిజ్ ఉంటుంది. ఏకే 203 మ్యాగజైన్‌లో 30 క్యాడ్‌రిజ్‌లు పెట్టుకోవచ్చు. ఇన్‌సాస్ బరువు 4.15కేజీలు ఉంటే.. ఏకే 203 గన్నుల బరువు 3.8 కేజీలు మాత్రమే ఉంటుంది. పొడవు విషయానికి వస్తే.. బట్ స్టాక్ లేకుండా 705 మిల్లీ మీటర్లు ఉంటాయి. ఈ గన్నుల రేంజ్ 800 మీటర్లు. వీటిని ఎల్‌ఓసీ, ఎల్‌ఓఏసీతో పాటు మిగితా సరిహద్దు ప్రాంతాల్లోని సైనికులు వాడనున్నారు.