ఎరువుల షాపులలో ఆకస్మికంగా తనిఖీ
మొగుళ్ళపల్లి ఎస్సై బి అశోక్
మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి.
మొగుళ్ళపల్లి నేటి ధాత్రి:
భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండల కేంద్రంలోని ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం, మొగుళ్ళపల్లి (PACS) వద్ద యూరియా మరియు ఇతర ఎరువుల విక్రయాల పై స్థానిక ఎస్సై బి. అశోక్ , మండల వ్యవసాయ అధికారి పి సురేందర్ రెడ్డి తానిఖీ నిర్వహించడం జరిగింది. తానిఖీలో యూరియా మరియు ఇతర ఎరువుల లభ్యత మరియు నిల్వలకు సంబంధించిన వివరాలు, కొనుగోలు రశీదులు, అమ్మకపు బిల్లులు, స్టాక్ రిజిస్టర్లు, స్టాక్ బోర్డు, ధరల పట్టికలు మొదలగునవి పరిశీలించి తానిఖీ చేయడం జరిగింది. అలాగే ప్రతి రైతుకి వారి యొక్క వ్యవసాయ భూమి విస్తీర్ణాన్ని బట్టి, రాష్ట్ర వ్యవసాయ విశ్వ విద్యాలయం సిఫారసు మేరకే యూరియా మరియు ఇతర ఎరువుల బస్తాలను రైతులకి పంపిణీ చేయాలని సూచించడం జరిగింది. అలాగే, నానో యూరియా మరియు నానో డిఏపి వాడకం, నానో యూరియా వాడడం వల్ల కలిగే లాభాలు మరియు సాంప్రదాయ యూరియాకు ప్రత్యామ్నాయ మార్గాల గురించి రైతులకు సూచించడం జరిగింది.
మొగుళ్ళపల్లి మండల డీలర్లు సూచించబడిన చట్టలకు లోబడి విక్రయాలు జరపవాల్సిందిగా కోరడమైనది, లేని ఎడల సదరు చట్టలలో పొందపరిచిన నియమాలనుసారంగా చట్టరీత్యా చర్యలు తీసుకొనబడుతాయని తెలియపర్చడం జరిగింది ఈ PACS, మొగుళ్ళపల్లి వద్ద 444 బస్తాలు, PACS, మొట్లపల్లి వద్ద 444 బస్తాలు, PACS, ఇస్సిపేట వద్ద 444 బస్తాలు మరియు అగ్రోస్ రైతు సేవా కేంద్రం వద్ద 222 బస్తాలు వచ్చి పంపిణీ చేయడం జరుగుతుంది, కావున రైతులు మీ యొక్క పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ మరియు ఆధార్ కార్డు తో సంబంధిత కేంద్రాలనుండి ఎరువులను పొందగలరు.
ఇట్టి తానిఖీలో CEO A. సాగర్ PACS పంపిణీ సిబ్బంది పాల్గొనడం జరిగింది.