వినాయక ఫీలింగ్ స్టేషన్లో లక్కీ డ్రా…

వినాయక ఫీలింగ్ స్టేషన్లో లక్కీ డ్రా
* ముగ్గురు విజేతలకి బహుమతులు
మహాదేవపూర్ నవంబర్ 10(నేటి ధాత్రి)

 

జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలం సూరారం గ్రామ పరిధిలోని శ్రీవినాయక ఫీలింగ్ స్టేషన్ లో ఆదివారం రోజున లక్కీ డ్రా తీయడం జరిగింది. సూరారం గ్రామానికి చెందిన నూతనంగా ప్రారంభించిన వినాయక ఫీలింగ్ స్టేషన్ లో వినియోగదారులకు సత్సంబంధాలు మెరుగుపడే విధంగా ఒక వినూత్న ఆలోచనతో వినియోగదారుల ఆదరాభిమానాలు చోరకొనేలా లక్కీ డ్రా నిర్వహించారు. ఈ లక్కీ డ్రా లో యాజమాన్యంతో పాటు ప్రజల ఆధ్వర్యంలో లక్కీ డ్రా నిర్వహించగా మొదటి బహుమతి ఒక గ్రామ్ బంగారం ను సూరారం గ్రామానికి చెందిన సోదరి మల్లయ్య గెలుపొందాడు, రెండో బహుమతి ఆండ్రాయిడ్ మొబైల్ ను రత్న లచ్చిరెడ్డి గెలుపొందాడు, మూడో బహుమతి మిక్సర్ గ్రైండర్ ను రాపెల్లి కోట గ్రామానికి చెందిన చల్ల అనిల్ గెలుపొందాడు. ఈ కార్యక్రమంలో వినియోగదారులు, పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.

పోత్కపల్లి గంజాయి నిందితుడు అరెస్ట్.

పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి రవాణా చేస్తున్న నిందితుడి అరెస్ట్..

4.098 గ్రాముల ఎండు గంజాయి,కారు,మొబైల్ ఫోన్ స్వాదీనం..

ఓదెల(పెద్దపల్లిజిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా జరుగుతుండగా పోలీసులు ఒకరిని అరెస్ట్ చేసి గంజాయి, కారు, మొబైల్ ఫోన్ను , స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఏసీపీ జి.కృష్ణ విలేకరుల సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. హుస్నాబాద్ కు చెందిన కంసాని అరుణ్ అనే 20 ఏళ్ల యువకుడు డ్రైవర్, టైల్స్ వర్క్ పై చేస్తూ డబ్బులు సరిపోక గంజాయి వ్యాపారం వైపు మళ్లాడని ఐ విచారణలో తేలింది. అతడి వద్ద నుంచి 4.098 కిలోల ఎండు గంజాయి, విలువ రూ. 2,04,000/-, ఒక ఎర్టిగా కారు, ఒక మొబైల్ క ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి స్నేహితులు బొల్లెద్దు మహేందర్, చీమల ఆకాష్ అనే ఇద్దరు పరారీలో ఉన్నారని, వారిని , త్వరలోనే అదుపులోకి తీసుకునే చర్యలు కొనసాగుతున్నాయని పోలీసులు తెలిపారు. పోత్కపల్లి శివారులోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ -్య హాల్ ముందు వాహన తనిఖీలు జరుగుతుండగా ఎస్ఐ దీకొండ న్న రమేష్ ఒక కారు అనుమానాస్పదంగా కదులుతున్నట్లు గుర్తించి ఆపగా
నిందితుడు పారిపోవడానికి ప్రయత్నించాడు. వెంటనే అదుపులోకి తీసుకుని విచారించగా గంజాయి రవాణా చేస్తున్నట్లు అంగీకరించాడు. కారు డిక్కీలో గంజాయి ప్యాకెట్లు లభించగా వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఇల్లందు ప్రాంతానికి చెందిన మహేందర్, ఆకాష్ తో పరిచయం పెంచుకున్న అరుణ్, వీరితో కలిసి ఓడిశా రాష్ట్రం నుండి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి హుస్నాబాద్, కరీంనగర్, గోదావరిఖని, పెద్దపల్లి, సుల్తానాబాద్, ఓదెల ప్రాంతాలలో విద్యార్థులు, ఇతరులకు ఎక్కువ ధరకు అమ్ముతూ లాభాలు సంపాదించాడని పోలీసులు తెలిపారు. ఒక కిలో గంజాయిని ఎనిమిది వేల రూపాయలకు కొనుగోలు చేసి, స్థానికంగా యాభై వేల రూపాయలకు అమ్ముతున్నాడని విచారణలో తెలిసింది. గంజాయి పండించినా, తరలించినా, అమ్మినా, వాడినా కఠిన చర్యలు తప్పవని పెద్దపల్లి ఏసీపీ హెచ్చరించారు. ఈ ఆపరేషన్లో సీఐ సుల్తానాబాద్ జి. సుబ్బారెడ్డి, ఎస్ఐ దీకొండ రమేష్, ఏఎస్ఐ రత్నాకర్, పీసీలు రాజు యాదవ్, హరీష్, రాము, శివశంకర్, రాజేందర్, రాజు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. వీరిని ఏసీపీ అభినందించారు. రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, డీసీపీ పి. కరుణాకర్ పర్యవేక్షణలో ఈ చర్య చేపట్టినట్లు అధికారులు వివరించారు.

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితునికి అందజేసిన ఎస్పై

పోగొట్టుకున్న మొబైల్ ఫోన్ ను బాధితునికి అందజేసిన ఎస్పై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పిట్టల మహేష్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ మొబైల్ ఫోన్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ను, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ నెంబర్ల ద్వారా ఆతని వివరాలు తెలుసుకొని ఆతని నుండి మొబైల్ ను పోత్కపల్లి ఎస్ఐ రికవరీ చేశారు. మొబైల్ ను ఎస్ఐ పోలీసు స్టేషన్ నందు బాధితునికి అప్పగించారు. మొబైల్ విలువ సుమారు రూ.18,000/- ఉండును. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ ను వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ బాధితునికి అందజేత

-బాధితునికి మొబైల్ ఫోన్ ను అందజేసిన ఎస్పై దీకొండ రమేష్..

ఓదెల(పెద్దపల్లి జిల్లా)నేటిధాత్రి:

 

 

 

 

 

ఓదెల మండలం పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అనిల్ అనే వ్యక్తి మొబైల్ పోగొట్టుకున్నాడు సెంట్రల్ ఎక్యుప్ మెంట్ ఐడెంటిటి రిజిస్టర్ పోర్టల్ (సి ఈ ఐ ఆర్) ద్వారా రికవరి చేసి మొబైల్ ఫోన్ ను బాధితులకు అప్పగించిన ఎస్ ఐ దీకొండ రమేశ్ | పోత్కపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో తమ మొబైల్ ఫోన్ వ్యక్తి యొక్క ఆధార్ కార్డు ను, సంబంధిత మొబైల్ ఫోన్ల ఐ ఎం ఈ ఐ నెంబర్ల ద్వారా ఆతని వివరాలు తెలుసుకొని ఆతని నుండి మొబైల్ ను పోత్కపల్లి ఎస్ఐ రికవరీ చేశారు. మొబైల్ ను ఎస్ఐ పోలీసు స్టేషన్ నందు బాధితునికి అప్పగించారు. మొబైల్ విలువ సుమారు రూ.28,000/- ఉండును. ఈ సందర్భంగా పోత్కపల్లి ఎస్ ఐ మాట్లాడుతూ ప్రజలు ఎవరైనా తమ మొబైల్ పోగొట్టుకున్నట్లయితే వారు సి ఈ ఐ ఆర్ పోర్టల్ ద్వారా నెంబర్ ను వెబ్ సైట్ లోకి వెళ్లి అందులో పూర్తి వివరాలు పొందపర్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి మొబైల్స్ లను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ సి ఈ ఐ ఆర్ అప్లికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు.

పోగొట్టుకున్న మొబైల్ అందజేత.

పోగొట్టుకున్న మొబైల్ అందజేత

నిజాంపేట, నేటి ధాత్రి

 

 

నిజాంపేట మండలం నార్లపూర్ గ్రామానికి చెందిన ఎక్కల సుజాత నెల రోజుల క్రితం తమ గ్రామంలో ఆమె మొబైల్ ఫోన్ను పోగొట్టుకుంది. సీఈఐఆర్ వెబ్సైట్లో నమోదు చేయగా పోగొట్టుకున్న ఫోన్ ఐఎంఈఐ నంబర్ ను ట్రాక్ చేసి బాధితురాలుకి శనివారం ఇంచార్జ్ ఎస్సై సృజన అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మండల వ్యాప్తంగా ఎవరైనా మొబైల్ ఫోన్ను పోగొట్టుకున్నట్లయితే అధైర్య పడకుండా సీఈఐఆర్ అనే వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని లేదా స్థానిక పోలీస్ స్టేషన్లో సంప్రదించారని  పేర్కొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version