మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

మాఫియా నేత కామాక్షమ్మ ఇంటిని కూల్చివేసిన స్థానికులు

 

నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు.

 నెల్లూరులో సీపీఎం నేత హత్య కేసులో ప్రధాన నిందితురాలు, గంజాయి మాఫియా నేత కామాక్షమ్మకు చెందిన ఐదు ఇళ్లను మంగళవారం స్థానికులు నేలమట్టం చేశారు. నేరస్తులను పెంచి పోషించడంతోపాటు గంజాయి మాఫియా నడుపుతూ.. కామాక్షమ్మ తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిందని ఈ సందర్భంగా స్థానికులు మండిపడ్డారు. తమ పిల్లలకు గంజాయి అలవాటు చేసి.. వారి జీవితాలతో చెలగాటం ఆడిందని వారు వాపోయారు. ఇదేమిటని ప్రశ్నించిన వారిపై ఆమె అనుచరులు తీవ్రంగా దాడి చేయడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెంచలయ్య హత్య కేసులో కామాక్షమ్మతోపాటు ఇతర నిందితులను కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.
స్థానిక ఆర్డీటీ కాలనీలో కూల్చివేసిన ఇళ్లలో కామాక్షమ్మ తన తల్లి సోదరులతో నివాసం ఉంటుంది. ఈ కాలనీలోని నివాసాలను కేంద్రంగా చేసుకుని ఆమె పలు అరాచకాలకు పాల్పడిందని స్థానికులు వివరించారు. సీపీఎం నేత పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితులంతా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులేనని స్థానికులు వివరిస్తున్నారు. కొన్ని ఏళ్లుగా కామాక్షమ్మతోపాటు ఆమె అనుచరులు ఇక్కడే ఉంటూ.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని తెలిపారు. అంతేకాకుండా వీరంతా.. యువతకు గంజాయి అలవాటు చేసి తమ నేర సామ్రాజ్యాన్ని విస్తరించారని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో కామాక్షమ్మ, ఆమె మరిదితోపాటు పలువురు అనుచరులపై వివిధ నేరాల కింద పోలీసులు కేసులు నమోదు చేశారని స్థానికులు వివరించారు. ఎన్నో ఏళ్లుగా ఆమె చేస్తున్న అరాచకాలు భరిస్తున్నామని పేర్కొన్నారు. ఇటీవల ఆమెను పోలీసులు అరెస్ట్ చేశారు. దాంతో స్థానికులు, సీపీఏం నేతల ఆగ్రహం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. దాంతో కామాక్షమ్మతోపాటు అమె బంధువులు, అనుచరుల నివాసాలను స్థానికులు కూలగొట్టారు

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version