మామండూరులో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం, 2 స్మగ్లర్లు అరెస్టు

*మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలు స్వాధీనం..

*ఇద్దరు స్మగ్లర్లు అరెస్టు..

తిరుపతి(నేటిధాత్రి)నవంబర్ 27:

 

తిరుపతి జిల్లా మామండూరు పరిధిలో 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని, ఇద్దరు స్మగ్లర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. టాస్క్ ఫోర్స్ హెడ్ ఎల్. సుబ్బారాయుడు కార్యాచరణ మేరకు టాస్క్ ఫోర్స్ ఎస్పీ పీ.శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏఎస్పీ జె. కులశేఖర్ పర్యవేక్షణలో డీఎస్పీ ఎండీ షరీఫ్ మార్గ నిర్దేశకత్వంలో రైల్వే కోడూరు సబ్ కంట్రోల్ ఆర్ఐ కృపానందకు చెందిన ఆర్ఎస్ఐ కె.అల్లీభాషా టీమ్ స్థానిక ఎఫ్వీఓ జాన్ శామ్యూల్ తో కలసి బుధవారం రేణిగుంట మండలం మామండూరు నుంచి కూంబింగ్ చేపట్టారు. గురువారం తెల్లవారుజామున కాకిరేవులపెంట వద్ద ఇద్దరు వ్యక్తులు కనిపించారు. వారు టాస్క్ ఫోర్స్ సిబ్బంది ని చూసి పారిపోయే ప్రయత్నం చేశారు. అయితే టాస్క్ ఫోర్స్ సిబ్బంది వారిని వెంబడించి పట్టుకున్నారు. వారిని మామండూరు స్థానికులుగా గుర్తించారు. వారిని విచారించి, పరిసరాల్లో వేటుకగా ఆ ప్రాంతంలో దాచి ఉన్న 20ఎర్రచందనం దుంగలు కనుగొన్నారు. అరెస్టయిన వారితో పాటు ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ ఫోర్స్ పోలీసు స్టేషన్ కు తరలించారు. డీఎస్పీ వీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ జె శ్రీనివాస్ వీరిని విచారించారు. తరువాత ఎస్ఐ రఫీ కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version