సంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడి ప్రకటన పెండింగ్

33 జిల్లాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్ల ప్రకటన

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

 

తెలంగాణ కాంగ్రెస్ కమిటీ రాష్ట్రంలోని 33 జిల్లాల జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల పేర్లను ప్రకటించింది, కానీ సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరును ఇంకా ప్రకటించలేదు మరియు దానిని పెండింగ్‌లో ఉంచారు. సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడి పేరు ప్రకటించకపోవడంతో, పార్టీ క్యాడర్ అపరిశుభ్రంగా మారింది మరియు ఆలస్యానికి గల కారణాలు చర్చనీయాంశమవుతున్నాయి. ప్రస్తుత జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మలా జాగారెడ్డి, పని దినాన సిట్టింగ్ తెలంగాణ కాంగ్రెస్ కమిటీ సభ్యురాలు మరియు తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ చైర్‌పర్సన్ జగారెడ్డి భార్య, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగడానికి ఆసక్తి చూపలేదు. జహీరాబాద్‌కు చెందిన డాక్టర్ ఉజ్వల్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి బలమైన పోటీదారుగా నిలిచారు. ఆయనకు జిల్లాలోని చాలా మంది సీనియర్ నాయకుల మద్దతు ఉందని ఆయన నియామకం ఖాయమని సాధారణంగా భావించారని చెబుతున్నారు. ఆరోగ్య మంత్రి దామోదర్ రాజ్ నరసింహ కూడా ఉజ్వల్ రెడ్డి పట్ల మెతక వైఖరిని కలిగి ఉన్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆ నాయకుడు తన వాదనను సమర్పించకపోవడంతో, ఉజ్వల్ రెడ్డి పేరు ఖచ్చితంగా ఉందని భావించారు, కానీ సరైన సమయంలో, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గ నాయకులు తమ వాదనను సమర్పించారు మరియు ఇక్కడ విషయం సంక్లిష్టంగా మారింది మరియు ప్రకటన నిలిపివేయబడింది. నారాయణఖేడ్ సీనియర్ నాయకుడు తన మద్దతుదారుడిని అధ్యక్షుడిని చేయాలని పట్టుబడుతున్నారని చెబుతారు. డాక్టర్ ఉజ్వల్ రెడ్డి ఒక ఎన్నారై పార్టీలో చురుకుగా ఉన్నారు. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుండి తనకు మద్దతు లభించిందని ఆయన పేర్కొన్నారు డాక్టర్ ఉజ్వల్ రెడ్డిని వెంటనే జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ప్రకటించాలని ఆయన మద్దతుదారులు కాంగ్రెస్ ఉన్నత నాయకత్వం నుండి డిమాండ్ చేస్తున్నారు.

అక్రమ కేసు లకు భయపడేది లేదు…

అక్రమ కేసు లకు భయపడేది లేదు

గుండాల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్

గుండాల,నేటిదాత్రి:

 

మణుగూరు పట్టణం లో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బిఆర్ఎస్ భవనం అని పిలవబడే కార్యాలయం పైన జరిపిన దాడిని కండిస్తూ బిఆర్ఎస్ మండల నాయకులు మాట్లాడిన మాటలు చాలా హాస్యాస్పదం గా ఉన్నాయని గుండాల మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు దార అశోక్ అన్నారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సహాయ సహకారాలతో కాంగ్రెస్ పార్టీ జెండాపై గెలిచి తర్వాత వారి స్వలాభం కోసం గులాబీ కండువా కప్పుకుని తల్లి పాలు తాగి రొమ్ము మీద తన్నిన మాదిరి నీ గెలుపుకి కారణమయిన కాంగ్రెస్ పార్టీ కి సంబందించిన కార్యాలయాన్ని కబ్జా చేసి బిఆర్ఎస్ భవన్ గా మార్చుకున్న మీ నాయకుడా ఈ దాడిని ఖండించేది. ఏ అధికారం లేని నాడు కూడా మా పార్టీ కార్యాలయం మాకు కావాలని పోరాడిన ఘనత మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులకే సొంతం, అధికారం ఉన్నా లేకున్నా ఆ భవనం కాంగ్రెస్ పార్టీ కి మాత్రమే సొంతం, అయిదేండ్లుగా మా భవనాన్ని మాకు లేకుండా చేసి మా ఓపిక ను పరీక్షించిన మీకు మా కాంగ్రెస్ పార్టీ శ్రేణులం అంతా కలిసి బుద్ధి చెప్పే కార్యక్రమం నిర్వహించాం, మీకు నిజంగా చిత్త శుద్ధి ఉంటే వారి కార్యాలయాన్ని నాడు కబ్జా చేసుండకపోతే నేడు ఈ పరిస్థితి మనకు రాకుండేది గా అని మీ నాయకుడ్ని ప్రశ్నించండి అని మొదట ఆజ్యం పోసిందే మీ నాయకుడు కదా అని ప్రశ్నిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎలాంటి కేసులకు భయపడేది లేదని మా భవనాన్ని మేము స్వాదీన పర్చుకోవడం కూడా నేరమేనా అని ప్రశ్నించారు.ఈ కార్యక్రమం లో యూత్ కాంగ్రెస్ ఉప అధ్యక్షులు బొబ్బిలి పవన్ కళ్యాణ్, యువజన నాయకులు వాజీద్ పాషా, ఇస్రార్, బొంగు చంద్రశేఖర్, పల్లపు రాజేష్ సోషల్ మీడియా నాయకులు మండలోజు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా …

మాజీ ఎమ్మెల్యే పైచేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు ధర్నా .

చిట్యాల, నేటిధాత్రి :

 

 

అధికార పార్టీ కాంగ్రెస్ నాయకులే ఇసుక రవాణా అసలు దొంగలు అని బీఆర్ఎస్ పార్టీ చిట్యాల మండల అధ్యక్షుడు అల్లం రవీందర్, మాజీ జెడటిసి గొర్రె సాగర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ టేకుమట్ల మండల అధ్యక్షుడు కోటగిరి సతీష్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి , ఆయన సతీమణి గండ్ర జ్యోతి లపై చేసిన అనుచిత వాఖ్యలను ఖండిస్తూ, టేకుమట్ల మండలం బీఆర్ఎస్ నాయకుల అరెస్టును నిరసిస్తూ, ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ శనివారం మండల కేంద్రంలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. అక్రమ ఇసుక రవాణా అదుపు చేయవలసిన నాయకులే.. అడ్డగోలుగా, అర్ధరాత్రిలుగా, అడ్డు అదుపు లేకుండా ఇతర జిల్లాలకు తరలిస్తున్నారన్నారు. మళ్లీ ఏం ఎరగనట్టు కాంగ్రెస్ నాయకులే రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఏంటని మండిపడ్డారు. దయ్యాలు వేదాలు వల్లినట్లు సొంత పార్టీ దొంగలే ఇసుకను తరలించుకుపోతుంటే ప్రతిపక్షం పైన నోరు కాంగ్రెస్ నాయకులు నోరు జారడం సరికాదన్నారు. గ్రూపు రాజకీయాలతో గుడులు, బడులు పేరులమీదుగా రాత్రింబవళ్లు అక్రమ ఇసుక రవాణాను తరలిస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదా అని దుయ్యబట్టారు. అభివృద్ధి పైన ధ్యాస లేక ప్రతిపక్ష పాత్రులైన గండ్ర దంపతుల పైన బురద జల్లే రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి అక్రమ ఇసుక రవాణాలను అరికట్టాలని, దీనికి భూపాలపల్లి ఎమ్మెల్యే బాధ్యత వహించాల్సి వస్తుందని డిమాండ్ చేశారు. లేనియెడల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాలు, రాస్తారోకోలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ చిట్యాల వర్కింగ్ ప్రెసిడెంట్ పిట్ట సురేష్ బాబు, ఉపాధ్యక్షులు కాట్రేవుల కుమార్, పార్టీ మండల ప్రధానకార్యదర్శి ఏరుకొండ రాజేందర్ గౌడ్, మడికొండ రవీందర్రావు, చిలుమల రమణాచారి, బైరం,భద్రయ్య, ఏలేటి రాజు, పర్లపెల్లి భద్రయ్య, కొండ కృష్ణఏరుకొండ రఘు, పీసరి సురేష్, పోశాల రాజు, చిలుమల రాజేష్, బుర్ర నాగరాజ్, శ్రీశైలం, ప్రభాకర్, రమేష్, వల్లబోజుల న దాని రేష్, జంగ లక్ష్మన్ అరవింద్ బోళ్ల చందు, ఏలేటి వెంకన్న, , రమేష్ తదితర బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్.

బిజెపి నాయకుల ముందస్తు అరెస్ట్
కాంగ్రెస్ యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నించిన బిజెపి నాయకులు
అక్రమ అరెస్టులను ఖండించిన బిజెపి నాయకులు

నేటిధాత్రి ఐనవోలు :-

 

వర్ధన్న పేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న జనహిత పాదయాత్రను అడ్డుకోవడానికి వెళుతున్న ఐనవోలు మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మాదాసు ప్రణయ్ పొన్నాల రాజు , బిజెపి యువమోర్చా మండల అధ్యక్షులు పులిసాగర్ గౌడ్, కట్కూరి రమేష్ లను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు ప్రణయ్ మాట్లాడుతూ బూటకపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి హామీలను నెరవేర్చకుండా ప్రజల దృష్టిని మరల్చడానికి జనహిత పాదయాత్ర పేరుతో జనాలను ముంచే పాదయాత్ర చేస్తూ కాలం వెళ్లిబుచ్చే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని తెలియజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలని ప్రభుత్వంను ప్రశ్నించేందుకు శాంతియుతంగా వెళ్తున్న తమను ఐనవోలు పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బిజెపి నాయకులు తీవ్రంగా ఖండించారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version