15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు..

15 వ వార్డులో కాలువలో పేరుకుపోయిన మట్టిని తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు

స్పందించిన మాజీ కౌన్సిలర్ బండారు
వనపర్తి నేటిదాత్రి .

 

వనపర్తి పట్టణంలో 15వ వార్డు శ్రీ రామ టాకీస్ హై స్కూల్ రోడ్ లో కాలువలో మురికి మట్టి పేరుకపోవడంతో వార్డు ప్రజలు మాజీ మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ దృష్టికి తీసుకపోవడంతో స్పందించిన ఆయన మున్సిపల్ కమిషనర్ కు సమాచారం ఇవ్వడంతో శుక్రవారం ఉదయం మున్సిపల్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డి సిబ్బంది బాలరాజు దగ్గరుండి కార్మికులచే మట్టిని జె సి బి తో తీసివేయించారు .ఈ మేరకు మున్సిపల్ మాజీ కౌన్సిలర్ బండారు కృష్ణ మున్సిపల్ కమిషనర్ వెంకటేశ్వర్లకు సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర్ రెడ్డికి 15వ వార్డు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలిపారు

జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్..

జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ప్రెస్ మీట్

సిరిసిల్ల టౌన్:(నేటిధాత్రి)

 

సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జాతీయ మాల మహానాడు సిరిసిల్ల జిల్లా ఆధ్వర్యంలో ఈరోజు
ప్రెస్ క్లబ్ లోని మొన్న జరిగినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ (గవాయ్) దళితడి ఫై దాడి చేసిన ఆర్ఎస్ఎస్ నేత లాయర్ రాకేష్ కిషోర్ కుమార్ ని వెంటనే అరెస్ట్ చేసి చట్ట రీత్యా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాము. అని అంతేకాకుండా మన తెలుగువాడైన దళిత బిడ్డ ఏ.డి.జీ.పి పురణ్ కుమార్ అధికారల ఒత్తిడితో తాను ఎనిమిది పేజీల లేఖ రాసి ఆత్మహత్య చేసుకున్నాడని ఒక దళిత అధికారిని హింసించి పైన ఉన్నటువంటి అగ్రకుల వర్ణాలు అనగదొక్కడానికి చూస్తున్నాయని అలాంటి వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఒక ఐపీఎస్ అధికారిని అగ్రకుల వర్ణ అధికారులు హింసించడం ద్వారా ఒక దళిత తెలుగు బిడ్డ ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం వీరిపై వెంటనే ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని సిరిసిల్ల జిల్లా మాల మహానాడు అధ్యక్షుడు నీరటి శ్రీనివాస్ డిమాండ్ చేశారు.
అంతేకాకుండా ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గుడే బాబు, సిరిసిల్ల జిల్లా దళితనియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ కుమార్, దళిత నాయకులు రామచందర్, పండుగ శేఖర్, బాలరాజు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version