హైదరాబాద్‌లో మూడు రోడ్లు – ముప్పుతిప్పలు..

హైదరాబాద్‌లో మూడు రోడ్లు – ముప్పుతిప్పలు.. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ జామ్.!

 

హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్యలు అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగుల సమయమంతా రోడ్ల పాలవుతోంది. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ నిత్యం ఇదే పరిస్థితి నెలకొంటోంది. దీంతో తీవ్రంగా ఉన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం శాశ్వత చర్యలు తీసుకోవాలని ఐటీ ఉద్యోగులు కోరుతున్నారు.

 నగరంలో ఐటీ ఉద్యోగుల విలువైన సమయం రోడ్ల పాలవుతోంది. ఐటీ కారిడార్‌కు వస్తున్న ఉద్యోగులు ట్రాఫిక్ జామ్‌లతో నిత్యం నరకం అనుభవిస్తున్నారు. కారిడార్‌కు చేరుకునే మూడు రోడ్లలోనూ సోమవారం నుంచి శుక్రవారం వరకు ఇదే పరిస్థితి ఉంటోంది. దీంతో ఏ మార్గంలో వెళ్లాలన్నా ట్రాఫిక్ చిక్కులు తప్పట్లేదు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్‌లోనే వాహనాలను నెట్టుకుంటూ ముందుకు వెళ్లాల్సి వస్తోంది. రహదారుల విస్తరణ జరగకపోవడం, ప్రత్యామ్నాయ మార్గాలుగా అంతర్గత రహదారులు అందుబాటులో లేకపోవడమే ఇందుకు కారణమవుతోంది. నగరం నలుమూలల నుంచి ఐటీ కారిడార్‌కు వచ్చే ఉద్యోగుల సంఖ్య భారీగా ఉంటోంది.కారిడార్ మీదుగా వెళ్లే మూడు ప్రధాన రహదారులే వీరికి ఆధారం. గచ్చిబౌలి ఔటర్‌రింగు రోడ్డు చౌరస్తా నుంచి కొండాపూర్, కొత్తగూడ మీదుగా హఫీజ్‌పేట వరకు ఉన్న పాత ముంబయి హైవే, రాయదుర్గం బయోడైవర్సిటీ నుంచి మైండ్‌స్పేస్ జంక్షన్, సైబర్ టవర్స్, హైటెక్ సిటీ, శిల్పారామం మీదుగా కేపీహెచ్బీ-జేఎన్టీయూ వరకు, కొత్తగూడ-కొండాపూర్ చౌరస్తా నుంచి హైటెక్స్ కూడలి, సైబర్ టవర్స్ మీదుగా మాదాపూర్-జూబ్లీహిల్స్ వరకు ఉన్న ఈ రోడ్ల మీదే వీరు ప్రయాణించాల్సి వస్తోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు ఐటీ కారిడార్‌లో రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్ నరకం అంటే ఏమిటో కళ్లముందు కనిపిస్తుంది. అడుగులో అడుగు వేసినట్లుగా కదిలే వాహనాలతో గంటల తరబడి రోడ్లమీదే గడపాల్సి వస్తోంది.

రాహుల్ సిప్లిగంజ్ వివాహం

గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ వివాహం: బీజేపీ నేత శుభాకాంక్షలు

జహీరాబాద్ నేటి ధాత్రి:

 

ప్రముఖ గాయకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్లోని గచ్చిబౌలిలో తన ప్రియురాలు హరిణ్య రెడ్డిని వివాహం చేసుకున్నారు. ఈ వివాహ వేడుకకు సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ పట్టణ అధ్యక్షులు పూల సంతోష్ హాజరై నూతన వధూవరులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సంఘటన రాహుల్ సిప్లిగంజ్ వ్యక్తిగత జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టాన్ని సూచిస్తుంది.

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం…

హైదరాబాద్‌లో డ్రగ్స్ పార్టీ… భారీగా డ్రగ్స్ స్వాధీనం

 

హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్, నవంబర్ 4: సైబరాబాద్‌లో డ్రగ్స్ పార్టీని (Drugs Party) ఎస్‌వోటీ పోలీసులు (SOT Police) భగ్నం చేశారు. గచ్చిబౌలి టీఎన్జీవో కాలనీలో ఎస్ఎం లగ్జరి గెస్ట్ రూమ్, కో లివింగ్ గెస్ట్ రూమ్‌లో జరుగుతున్న డ్రగ్ పార్టీపై పోలీసులు దాడి చేశారు. డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 12 మందిని ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేవారు. హైదరాబాద్ యువకులకు కర్ణాటక నుంచి డ్రగ్స్ తెచ్చి అమ్ముతున్న స్మగ్లర్‌ను అరెస్ట్ చేశారు. డ్రగ్స్ సప్లై చేస్తున్న గుత్తా తేజ కృష్ణతో పాటు నైజీరియన్‌ను అదుపులోకి తీసుకున్నారు. డ్రగ్స్ పార్టీలో ఎండీఎంఏతో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఆరుగురు డ్రగ్స్ పెడ్లర్స్‌తో పాటు ఆరుగురు కన్జ్యూమర్స్‌ను ఎస్‌వోటీ పోలీసులు అరెస్ట్ చేశారు.

కాంగ్రెస్ లో భారీగా చేరికలు

కాంగ్రెస్ లో భారీగా చేరికలు
గచ్చిబౌలి డివిజన్ కు చెందిన పలు పార్టీల నాయకులు స్వచ్ఛందంగా కాంగ్రెస్ సభ్యత్వ స్వీకరణ

శేరిలింగంపల్లి, నేటిధాత్రి 

కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై స్వయంగా పార్టీ సభ్యత్వం స్వీకరిస్తున్నారని రాష్ట్ర ఎంబిసీ చైర్మన్ జెరిపేటి జైపాల అన్నారు. శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నాయకులు సురేందర్, హనుమంత్ ల ఆధ్వర్యంలో గచ్చిబౌలి డివిజన్ కు చెందిన వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా జైపాల్ మాట్లాడుతూ… కాంగ్రెస్ అందిస్తున్న ప్రజాపాలనను మెచ్చి ప్రజలు స్వయంగా పార్టీలో చేరుతున్నారన్నారు. వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు భారీగా చేరడం చూస్తేనే అర్థమవుతుంది ప్రభుత్వ పని తీరు అన్నారు. భవిష్యత్తు కాంగ్రెస్ పార్టీదే అని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు రామచంద్ర రాజు, హనుమంతు, శ్రీనివాస్, భీమ్ రాజ్, నవీన్, విజయ్, పవన్, శివ తదితరులు పాల్గొన్నారు.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version